Wednesday, 29 April 2026

Blog

E-పేపర్

మరో అవినీతి పోలీస్ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు

పున్నమి ప్రతినిధి 10 ఫిబ్రవరి 2026 మరో అవినీతి పోలీస్ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు…. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్న వినయ్ మంగళవారం ఏసీబీకి పట్టుబడ్డాడు… ఒక కేసులో అనుకూలంగా ఉండటం కోసం లక్షలు డిమాండ్ చేశాడు ఎస్సై వినయ్.. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించి పక్కా ప్లాన్ తో ఏసీబీకి పట్టించారు… బాధితులనుండి యాభైవేల తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.. విధి నిర్వహణలో తీవ్ర అవినీతికి పాల్పడుతున్న ఎస్సైకి ఏసీబీ రూపంలో గట్టిగానే షాక్ తగిలింది..

E-పేపర్

ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యం… ఇబ్రహీంపట్నం అభివృద్ధి మా బాధ్యత” – ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యం… ఇబ్రహీంపట్నం అభివృద్ధి మా బాధ్యత” – ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ 10 ఫిబ్రవరి 2026 *ఇబ్రహీంపట్నం ప్రజలకు వరంగా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి – పనులను స్వయంగా పర్యవేక్షించిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి* *“నిధుల కొరత ఉండదు… వేగంగా పూర్తి చేయండి” అధికారులకు స్పష్టమైన ఆదేశాలు – రంగన్న* *“ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యం… ఇబ్రహీంపట్నం అభివృద్ధి మా బాధ్యత” – ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి* ఎలక్షన్స్ ప్రచారం ముగిసినావెంటనే ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం రూపురేకలు మారుస్తా అనీ ఇచ్చిన మాట కి కట్టుబడి మన పట్టణం లో జరుగుతున్న అభివృద్ధి పనుల పర్యవేక్షణ లో భాగంగా ఇబ్రహీంపట్నం ప్రజల ఆరోగ్య భద్రతకు కీలకంగా మారనున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి స్వయంగా పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి భవనం నాణ్యత, వసతులు, వార్డులు, అత్యవసర విభాగం, ప్రసూతి కేంద్రం, ల్యాబ్ సౌకర్యాలు వంటి అంశాలపై ప్రత్యేకంగా సమీక్షించిన ఎమ్మెల్యే, “ఇది సాధారణ భవనం కాదు… ఇబ్రహీంపట్నం ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే ఆసుపత్రి” అని స్పష్టం చేశారు. నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, అవసరమైతే అదనపు నిధులు కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పనులు ఆలస్యం కాకుండా వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, ఇంజినీర్లకు కఠినంగా ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రి పూర్తయితే ఇబ్రహీంపట్నం, పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో నగరానికి వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది. ప్రజల ఆరోగ్య సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే రంగారెడ్డి తీసుకుంటున్న చర్యలను స్థానికులు ప్రశంసిస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలులో ఆటో డ్రైవర్ల సంఘం ఆర్థిక సాయం

ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పునమీ ప్రతినిధి) మనుబోలు పట్టణంలో ఆటో డ్రైవర్ నాగరాజు (బుల్లయ్య) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి ఆటో డ్రైవర్ల అసోసియేషన్ తరఫున రూ.12 వేల నగదు సహాయాన్ని సోమవారం రాత్రి అందజేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని పలువురు అభినందించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు, జడ శివకుమార్, ఖాదరవల్లి తదితరులు పాల్గొన్నారు. కుటుంబానికి అండగా నిలిచిన సంఘాన్ని స్థానికులు ప్రశంసించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాష్ట్ర మహిళ అధ్యక్షులు క్రాకటూరు పుష్పాంజలి గడప గడప కార్యక్రమం నిర్వహించారు

ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం వెలగపాడు గ్రామo లో రాష్ట్ర మహిళ అధ్యక్షులు క్రాకటూరు పుష్పాంజలి గడపగడప కార్యక్రమం నిర్వహించారు ఆమె మాట్లాడుతూ పార్టీ గురించి,రాబోవ్ ఎన్నికలు,వివరించారు ఈ కార్యక్రమంలో బీస్పీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెకు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మికులు సిద్ధం కావాలి – గీస బిక్షపతి”

ఈరోజు 10.02.2026 రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మికులకు కార్మిక సోదరులకు సోదరీమణులకు జిల్లాలో అన్ని రంగాలలో పనిచేసే కార్మిక సోదరులారా సిఐటియు అనుబంధ సంస్థ అయిన బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అన్ని మండలాల ప్రజానీకానికి అన్ని గ్రామాల కార్మికులకు పారిశుద్ధ కార్మికులు ఆశా వర్కర్లు అంగన్వాడి ఆటో డ్రైవర్స్ ఫేస్ కాంటాక్ట్ కార్మిక సోదరులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా నమస్కరిస్తూ రైతులకు రైతన్న అనుబంధ వివిధ రంగాలలో పనిచేసే కార్మికులకూ ఈనెల 12 ఫిబ్రవరి రోజున దేశవ్యాప్త సమ్మెకు సంసిద్ధం కావాలని ఈ సమ్మె ప్రజలందరూ మమేకమై పోరాడితేనే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కార్మికుల 1996లో వెల్ఫేర్ బోర్డు సాధించుకోవడం ఆ సాధించిన వెల్ఫేర్ బోర్డులు పోరాడి నియమించుకున్న 29 చట్టాలను ఇప్పుడున్న ప్రభుత్వం బిజెపి కేంద్ర ప్రభుత్వం ఆ 29 చట్టాలను నాలుగు కోడ్ గా విభజించి కార్మికునికి సంఘం పెట్టుకునే విధానం లేకుండా యజమాని ఎలా చెప్తే అలాగే వినేలాగా ఎనిమిది గంటలు ఉన్న పని వేతనాన్ని 12 గంటలు గాని నియమించడం వెలుతురు బోర్డులో ఉన్న డబ్బును సిఎల్సిగా కార్మికుల రక్తం తీస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడడం రైతుకు గిట్టుబాటు ధర కల్పించలేకపోవడం అమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు నియమించకపోవడం పారిశుద్ధ కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వలేకపోవడం ఆశా వర్కర్లకు సరైన బెనిఫిట్ లేకపోవడం అంగన్వాడి ఆయాలకు సరైన వేతనం లేకపోవడం మధ్యాహ్న భోజన కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వలేకపోవడం ఇవన్నీటిమీద రైతులకు స్మార్ట్ మీటర్ పేరుతో రీఛార్జి చేసుకుంటేనే కరెంట్ వచ్చే విధంగా ఆదానే అంబానీ ఎలా చెప్తే అలా చేయడం కరెంటు స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత రీఛార్జి చేసుకుంటేనే రైతులకు కరెంటు ఉత్పత్తి రీఛార్జి చేసుకుంటేనే ఇంట్లో కరెంటు రావడం ఇలాంటి నియమ నిబంధనలు పెడుతూ ప్రజలకు రాబోయే రోజుల్లో అడిగే హక్కు లేకుండా చేయడం ఎన్నో ఇంకెన్ని ఎన్నో నిబంధన చేస్తూ ప్రజలకు కడుపు కొడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి విన్నపించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా బిల్లింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా గీస బిక్షపతిగా పిలుపునివ్వడం జరుగుతుంది కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి

E-పేపర్

సర్పంచులకు సన్మానం గ్రామాల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం… ప్రత్యేక అధికారి సుజాత

సర్పంచులకు సన్మానం గ్రామాల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం… ప్రత్యేక అధికారి సుజాత రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, ఫిబ్రవరి 10 , పున్నమి న్యూస్: రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో సర్పంచులకు సోమవారం ప్రత్యేక అధికారి సుజాత ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామాలు దేశ అభివృద్ధికి పట్టుకొమ్మలు అని, గ్రామాల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సర్పంచ్ లకు ప్రత్యేక అధికారి సుజాత తెలిపారు. సర్పంచులకు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. మండలంలో ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నికైన కుర్రవాని తండా గ్రామం ఆంబోతు చంటి కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. త్వరలో సర్పంచ్ లకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమానికి 100% హాజరుకావాలని ఎంపీడీవో బాలశంకర్ తెలిపారు. కుటుంబ సభ్యులు ఎవరు కూడా శిక్షణ కార్యక్రమానికి రావద్దని మహిళా సర్పంచులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను చేర్పించే విషయంలో నూతన సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని గ్రామంలో తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని మండల విద్యాధికారి రాందాస్ విజ్ఞప్తి చేశారు. ఉల్లాస్ పథకంపై కాసేపు చర్చించారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు పై సర్పంచులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని అధికారులు తెలిపారు. సమావేశంలో గ్రామ పంచాయతీలలో తీర్మాన పుస్తకాలు ఎంతమంది సిద్ధం చేశారు అని అడగగా 50 శాతం మంది గ్రామపంచాయతీలో కూడా సిద్ధంగా లేవని తెలిసింది. బండలేమూరు అస్మాత్పూర్ సత్తి తండా గ్రామాలలో ఎంజిఎన్ఆర్జిఎస్ పథకం ద్వారా గ్రామ పంచాయతీ భవనాలు రోడ్లు త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ డీ.ఈ తెలిపారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ మార్చి నెల 15వ తేదీలోపు పూర్తి చేయాలని గుర్తు చేశారు. గ్రామపంచాయతీలో నగదు పుస్తకాన్ని మైంటైన్ చేయాలని మండల అభివృద్ధి అధికారి బాలశంకర్ అన్నారు. గ్రామాల్లో సర్పంచ్లకి పంచాయతీ కార్యదర్శులకు సమన్వయం ముఖ్యమని ఎంపీడీవో చెప్పారు. 15వ ఆర్థిక నిధులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సర్పంచ్లకు తెలిపారు. ఈ కార్యక్రమానికి తాసిల్దారు ఎం.వి.బి ప్రసాద్, సూపరిన్ టెన్ డెంట్ అబ్దుల్ అజీమ్, వ్యవసాయ అధికారి వెంకటేష్, మండల పంచాయతీ అధికారి ఉమారాణి, ఏ.ఈ మల్లారెడ్డి, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి శోభ-విద్యుత్‌ అలంకరణలతో మెరిసిపోతున్న శివాలయం

శ్రీకాళహస్తి: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయం ప్రత్యేక శోభను సంతరించుకుంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయం అంతట రంగురంగుల విద్యుత్‌ అలంకరణల ఏర్పాట్లతో కళకళలాడుతోంది. పట్టణ ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన విద్యుత్ వెలుగులు భక్తులను కనువిందు చేస్తున్నాయి. ఆలయం లోపల కూడా ప్రత్యేక విద్యుత్ అలంకరణలు చేపట్టారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు, రోడ్లకు ఇరువైపులా ఉన్న ఎల్‌ఈడీ దీపాలంకరణలు స్థానిక ప్రజలను భక్తులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫిబ్రవరి 10న అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతున్నాయి. ప్రధానమైన మహాశివరాత్రి పర్వదినం ఫిబ్రవరి 15, 2026న జరగనుంది. 13 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు అలయాధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో లక్షల సంఖ్యలో భక్తులు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని తరిస్తారు.

తిరుపతి

దేవాంగుల మహాపందిరి పనులకు శ్రీకారం చుట్టిన డి.వై.యస్.పి నరసింహమూర్తి

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 09: శ్రీకాళహస్తీశ్వర స్వామి, లోకపావని, జ్ఞానప్రసూనాంబ సమేత వార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం నాడు దేవాంగుల వాహన మండపం వద్ద నిర్మించ తలపెట్టిన హాపందిరి నిర్మాణ పనులను శ్రీకాళహస్తి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి డి.వై.యస్.పి. నరసింహమూర్తి కొబ్బరికాయ కొట్టి వైభవంగా ప్రారంభించారు. పోలీసు అధికారుల ఉదారతకు, వారు అందిస్తున్న సహకారానికి దేవాంగుల ప్రతినిధులు చల్లా జయరామయ్య, పులి రాధాకృష్ణ, కన్నా వెంకటేశ్వర్లు, ఇతర ప్రముఖులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి ఏటా ఈ మహాపందిరిని నిర్మిస్తున్నామని, ఈ ఏడాది కూడా అధికారులు, భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తామని వారు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్న దేవాంగుల కమిటీని అధికారులు ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి వన్ టౌన్, టూ టౌన్, రూరల్, తొట్టంబేడు సర్కిల్ ఇన్‌స్పెక్టరులు, సబ్ ఇన్‌స్పెక్టరులు, దేవాంగుల సామాజిక వర్గానికి చెందిన పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

తిరుపతి

హిరో విశ్వక్ సేన్ ని మహాశివరాత్రికి ఆహ్వానించిన అంజూరు చక్రధర్

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 09: జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలుగు సినీ హీరో విశ్వక్ సెన్ ని మర్యాదపూర్వకంగా కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి, మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడంజరిగినది.

తిరుపతి

దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళాలి- తెదేపా పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 09: శ్రీకాళహస్తి పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్ వైసీపీ కుటిల రాజకీయ ఎత్తుగడలకు ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళాలని పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కులాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతూ అలజడులు సృష్టించాలని చూస్తున్న కొంతమంది జగన్ రెడ్డి లాంటి వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కులం, మతం, ప్రాంతాన్ని వాడుతూ మనమధ్య విభజన తెచ్చి తమ పబ్బం గడుపుకోవాలనుకునే కుతంత్రాలను ప్రజలకు తెలియ పరచి వైసిపి యొక్క అరాచక సంస్కృతిని కూకటి వేళ్ళతో పెకలించి సమూలంగా నాశనం చేయడానికి ప్రతీ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త సైనికుడిలా క్రమశిక్షణతో పనిచేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసినప్పుడు సూచించారని కిషోర్ తెలిపారు. వైసిపి మూకలు చేస్తున్న తప్పులను, పాపాలను కులాలకు ఆపాదించాలనుకుంటే, దానిని ఏ కులమూ ఒప్పుకోదని, స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు వరకు కాపులకు మేలు చేసింది తెలుగుదేశం పార్టీయే అని, తెలుగుదేశం పార్టీ నిరంతరం కాపుల అభ్యున్నతి కోసం కృషి చేస్తోందని, ఇది ఒక నినాదం మాత్రమే కాదు, ఒక చరిత్ర అనే విషయాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు. జగన్ రెడ్డి కానీ, అతని అనుచరులు గాని ఎన్ని రకాలుగా కుట్రలు చేసినా కాపులని, టీడీపీ నుంచి దూరం చేయలేరన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందూ భక్తులంతా పరమ పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదం లడ్డూల్లో కల్తీ నెయ్యి కలపడమే మహా పాపం, మళ్లీ ఆ పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు అసత్య ప్రచారంతో ప్రజల దృష్టి మరల్చడానికి అంబటి, జోగి లాంటి వ్యక్తుల చేత జగన్ వీధి నాటకాలు వేయిస్తున్నాడని, దీనిని ప్రజలు నమ్మరని బూతులు మాట్లాడుతూ, రౌడీయిజం చేస్తూ, మేము అనుకున్నదే ప్రజలు వినాలి, చూడాలి అంటే, చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరని…. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం అని, తోక జాడించే ఆకు రౌడీలను అధః పాతాళానికి తొక్కుతారని హెచ్చరించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.