Wednesday, 29 April 2026

Blog

తిరుపతి

యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొన్న ప్రేమ వ్యవహారం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 09: పెళ్లకూరు మండలం, కానూరు గ్రామానికి చెందిన బత్తల చందు (23) అనే యువకుడు ప్రేమ వ్యవహారంలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతుని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కానూరు గ్రామానికి చెందిన బత్తల చందు, గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ క్రమంలోనే చందు మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ కుమారుడి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని, దీని వెనుక ఉన్న అసలు నిజాలు బయటపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహం వద్ద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న దృశ్యం చూపరులను కలిచివేసింది. ఈ ఘటనపై మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు. చందు మృతికి గల కారణాలపై లోతైన విచారణ జరిపి, బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

తిరుపతి

బీసీల సింహ గర్జన గోడపత్రిక ఆవిష్కరణ

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 09: శ్రీకాళహస్తి స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో సోమవారం నాడు బీసీవై పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి బీసీల సింహ గర్జన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హిమబిందు మాట్లాడుతూ. ఈ నెల 22వ తేదీన విజయవాడ వేదికగా జరిగే బీసీల సింహగర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీసీవై పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ హిమబిందు పిలుపునిచ్చారు. స్వాతంత్రం సిద్ధించి 79 ఏళ్ళు గడుస్తున్నా బీసీలు ఇప్పటికీ రాజ్యాధికారానికి ఆమడ దూరంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీలది అదే పరిస్థితని బడుగుల్లో ఐక్యత లేకపోవడం వల్లే అగ్రవర్ణాలు నానాటికీ అణచివేతకు గురి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బడుగులు మేల్కొని రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని సింహ గర్జన-చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వంకా రమణయ్య, రామచంద్రయ్య, ఈశ్వర్, సునీల్, సురేష్, రఘు, గురవయ్య, బాలకృష్ణ, రామయ్య, మురగయ్య, చెంచయ్య, బత్తెయ్య తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

నకిలీగాళ్లను నమ్మి మోసపోకండి- శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 09: శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానానికి సంబందించి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు https://devdham.com ద్వారా నకిలీ వెబ్‌సైట్ ను సృష్టించి, భక్తులను మోసం చేస్తున్నట్లు దేవస్థానము దృష్టికి వచ్చినదని భక్తులు అప్రమత్తంగా ఉండాలని దేవస్థానంకోరడమైనది. ఈ విషయమై భక్తులు అందరూ అధికారిక వెబ్‌సైట్ మాత్రమే వినియోగించుకొనవలసినదిగా తెలియచేయడమైనది. శ్రీస్వామి అమ్మవార్ల దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, రాహుకేతు పూజా టిక్కెట్స్, వసతి, విరాళాల కోసం కేవలం శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానము అధికారిక వెబ్ సైట్ https://www.aptemples.ap.gov.in ను మాత్రమే సందర్శించాలని భక్తులు సామాజిక మాంద్యమాల ద్వార ప్రకటనలు, దళారుల ద్వార టికెట్లు బుక్ చేసుకోవద్దని మోసగాళ్లను నమ్మి నగదు చెల్లించి మోసపోవద్దని ఈ దేవస్థానముపై నకిలీ వెబ్‌సైట్లు సృష్టించే వారిపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేయడం జరిగిందని భక్తులు తమ వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంకు వివరాలను అపరిచిత వెబ్‌సైట్లలో నమోదు చేయవద్దని ప్రకటన ద్వార ఆలయ నిర్వాహుకులు తెసిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ యువ నాయకులు హరీష్ అధ్యర్యoలో సనాతన పరి రక్ష్మణ పాదయాత్ర

మొదటి రోజు 9-2-2026 న ఆత్మకూరు నుంచి తిరుమల వరకు సనాతన ధర్మ పరిరక్షణ పాదయాత్ర జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యంగా పాదయాత్ర ప్రారంభం అయినది పాదయాత్ర లో భాగంగా మొదటి రోజు నుంచి భక్తి శ్రద్దలతో పాదయాత్ర బయలు దేరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గం జనసేన నాయకులు అక్బర్ బాషా, బాను కిరణ్ గడ్డం వంశీ తోడేటి వెంకటేశ్వర్లు, మర్రిపాడు చిన్న జనసేన పాల్గొన్నారు.

E-పేపర్

మీధాని కాలనీలో రూ.1 కోటి 36 లక్షల రూపాయలతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

పున్నమి న్యూస్ ప్రతినిధి 09ఫిబ్రవరి 2026 9640204826 మీధాని కాలనీలో రూ.1 కోటి 36 లక్షల రూపాయలతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి హయత్ నగర్ డివిజన్ పరిధిలోని మీధాని కాలనీలో సుమారు రూ.1 కోటి 36 లక్షల వ్యయంతో చేపట్టిన సమగ్ర అభివృద్ధి పనులు పూర్తికాగా, ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి గారు, డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి గారు కలిసి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ అభివృద్ధి పనులలో భాగంగా భూగర్భ డ్రైనేజ్ సీసీ రోడ్లు పార్క్ అభివృద్ధి పనులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ, మీధాని కాలనీ ప్రజలు చాలా కాలంగా ఎదుర్కొంటున్న డ్రైనేజ్, రోడ్లు మరియు పార్క్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ పనులను ప్రత్యేకంగా మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. ప్రజలకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం మరియు కాలనీలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. గత ఐదు సంవత్సరాలుగా హయత్ నగర్ డివిజన్‌లో ప్రతి కాలనీ సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, డ్రైనేజీలు, వరద నీటి కాలువలు, వీధి దీపాలు, పార్కుల అభివృద్ధి వంటి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటికి శాశ్వత పరిష్కారాలు అందించేందుకు ఎప్పుడూ ముందుంటానని, భవిష్యత్తులో కూడా డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు కృష్ణ, ముస్తఫా, రమేష్ రెడ్డి, మల్లారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, జె. అంజయ్య గౌడ్, గోపాల్ రెడ్డి, తిరుమల్ రెడ్డి, జంగారెడ్డి, జగన్నాథ్, నలేష్ ఏ., వెంకట్ రెడ్డి, ఎం. మహేందర్ రెడ్డి, రామ్ రెడ్డి, సుధీర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మనోజ్ రెడ్డి, బాల శివ రెడ్డి, యుగేందర్ రెడ్డి, కె. వెంకట్ రెడ్డి, నెహ్రూ నాయక్, రవీందర్ రెడ్డి, సోమి రెడ్డి, బాలరాజ్ గౌడ్, సరిత, శోభ, సంద్య, చంద్ర మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు హయత్ నగర్ డివిజన్

E-పేపర్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీలలో 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 11వ తేదీ వరకు.. మరియు ఫలితాల నేపథ్యంలో 13వ తేదీన వైన్స్, బార్లు బంద్

పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా : తెలంగాణ ఇంచార్జ్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీలలో 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 11వ తేదీ వరకు.. మరియు ఫలితాల నేపథ్యంలో 13వ తేదీన వైన్స్, బార్లు బంద్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి సీఐ వెంకట్రావు వేదిస్తున్నాడు అంటూ మహిళా కానిస్టేబుల్ జ్యోతి ఆరోపణలు

ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు పై జ్యోతి అనే మహిళా కానిస్టేబుల్ తీవ్ర ఆరోపణలు చేశారు గతంలో సీతరామాపురం SI శివ క్రిష్ణరెడ్డి సస్పెండ్ వెనుక సీఐ వెంకట్రావు హస్తం ఉందని సీఐ వెంకట్రావు సీతరామాపురం SI కి శివ క్రిష్ణరెడ్డి కీ పాత కక్షలు ఉన్నాయని ఈ నేపథ్యంలో SI ను సస్పెండ్ చేసెందుకు తనకు si కు అక్రమ సంబంధం ఉందని దుష్పచారం చేశారని తాను ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తన వద్ద అక్రమంగా సంతకాలు పెట్టించుకున్నారని తనను ఐదు నెలలుగా ఉదయగిరి సీఐ వెంకట్రావు తీవ్రంగా వేడిస్తున్నాడని దళిత మహిళా అని తెలిసి కూడా తాను అవమానపడేలా మాట్లాడుతున్నరని సీఐ వేధింపులు తట్టుకోలేక నిద్ర మాత్రలు వేసుకుని మీడియా కు తెలిపారు

రాజన్న సిరిసిల్ల

సిరిసిల్ల 19వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొద్దుల శ్రీనివాస్ గెలుపుకోసం జోరుగా ప్రచారం

సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి గారికి అప్పగించిన బాధ్యతలో భాగంగా 19వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బొద్దుల శ్రీనివాస్ గారిని గెలిపించేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. వార్డులోని సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, అభ్యర్థి బొద్దుల శ్రీనివాస్ గారికి ఓటు వేసి గెలిపించాలని నాయకులు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గజ్జల రాజు ఇతర ప్రముఖ కాంగ్రెస్ కార్యకర్తలు, ముఖ్య అతిథులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, కాంగ్రెస్ పార్టీ విజయానికి ఇది నిదర్శనమని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

రాజన్న సిరిసిల్ల

సిరిసిల్ల 28వ వార్డులో జోరుగా BRS అభ్యర్థి అడిచేర్ల రూప సాయికృష్ణ ఇంటింటి ప్రచారం

రాజన్న సిరిసిల్ల జిల్లా/ పున్నమి ప్రతినిధి/ ఫిబ్రవరి సిరిసిల్ల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 28వ వార్డు BRS పార్టీ అభ్యర్థి అడిచేర్ల రూప సాయికృష్ణ గారి తరఫున ఈరోజు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. BRS పార్టీ సీనియర్ నాయకులు, ఇంచార్జ్ అక్కరాజు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రచార కార్యక్రమం కొనసాగింది. ప్రచారం సందర్భంగా నాయకులు వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్థి రూప సాయికృష్ణ గారికి మద్దతు ఇవ్వాలని కోరారు. గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, రానున్న రోజుల్లో చేపట్టబోయే పనులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కంచర్ల రవి గౌడ్, ఆవునూర్ గ్రామ BRS పార్టీ నాయకులు బైరి శ్రీనివాస్ గౌడ్, కనమెని శ్రీనివాస్ రెడ్డి, నేరళ్ళ స్వామి, నక్క దాసరి దేవరాజ్, మంత్రి బాబు, నక్కల రాంరెడ్డి, MD నజీర్, శ్యాగ ఎల్లయ్య, తాలూకా దేవయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని నాయకులు తెలిపారు.

వనపర్తి

సోలిపూర్ ఉన్నత పాఠశాలలో సందర్శించిన హిందీ రిసోర్స్ పర్సన్

*సోలిపూర్ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా ఇన్స్పెక్షన్ టీం* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 09/ 02/2026* *జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సోలిపూర్ ఈరోజు పాఠశాలను జిల్లా ఇన్స్పెక్షన్ టీం సందర్శించడం జరిగింది అందులో ఆరవ తరగతి హిందీ పండితులు కే. వెంకటేష్ గారి బోధన అభ్యసన ప్రక్రియలను సందర్శించడం రికార్డులను తనిఖీ చేయడం పిల్లల్లో ద్విత్వాక్షర, సంయుక్తాక్షరముల పరిచయం, పిల్లలు హిందీ భాషలో ఆత్మ పరిచయం మొదలగు అభ్యసన ప్రక్రియ ద్వారా యాక్టివిటీస్ బోధన పద్ధతి ద్వారా హిందీ సులభంగా నేర్చుకోవచ్చని హిందీ రిసోర్స్ పర్సన్ ఎమ్ ఎన్ విజయ కుమార్ తెలియజేశారు. అలాగే రాబోయే పబ్లిక్ పరీక్షల్లో పదవ తరగతి విద్యార్థులు ఇష్టపడి కష్టపడి హిందీ భాష నైపుణ్యాలను పెంపొందించుకొని, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని వారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.