Wednesday, 29 April 2026

Blog

తిరుపతి

ముక్కంటీశునికి శ్రీశైల మల్లన్న పట్టువస్త్రాలు

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 10: శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం తరపున శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా నిర్వహించబడింది. శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి (EO) ఎం. శ్రీనివాసరావు మంగళవాయిద్యాలు వేద మంత్రాల నడుమ పట్టువస్త్రాలను తలపై మోసుకుంటూ ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్నారు. ఆయనకు శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బాపి రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా శ్రీశైల దేవస్తాన ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ….శివరాత్రి పర్వదినం సందర్భంగా ఒక ప్రముఖ శైవ క్షేత్రం నుండి మరో క్షేత్రానికి పట్టువస్త్రాలు సమర్పించడం పురాతన ఆచారమని పేర్కొన్నారు. శ్రీశైల దేవస్తానం వారు సమర్పించిన ఈ పట్టువస్త్రాలను స్వామివారికి జరిగే ప్రత్యేక పూజలు మరియు కళ్యాణోత్సవం సమయంలో అలంకరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, వేద పండితులు, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

తిరుపతి

కల్లిపూడిగ్రామస్తుల కష్టానికి తెరదించిన ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి

తొట్టంబేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 10: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. తొట్టంబేడు మండలం, తాటిపర్తి పంచాయతీ పరిధిలోని కల్లిపూడి గ్రామానికి సమీపంలో ఉన్న తెలుగు గంగ సెవెంత్ బ్రాంచ్ కాలువపై స్మశానానికి వెళ్లేందుకు నిర్మించిన చిన్న బ్రిడ్జి పూర్తికావడంతో గ్రామస్తుల చిరకాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. గ్రామంలో ఇప్పటివరకు ఎవరైనా మరణిస్తే మృతదేహాన్ని స్మశానానికి తీసుకెళ్లాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కాలువ దాటాల్సిన పరిస్థితి నెలకొని ఉండేది. కాలు జారితే కాలువలో పడే ప్రమాదం ఉండేదని గ్రామస్తులు వాపోయారు. గతంలో ఇదే కాలువ వద్ద జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు వారు తెలిపారు. గత వైసీపీ పాలనలో పట్టించుకోని ప్రజల గోడు గ్రామస్తులు ఈ సమస్యను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని సమస్యను పట్టించుకోకపోవడమే కాకుండా, బ్రిడ్జి నిర్మాణం సాధ్యం కాదంటూ అవహేళన చేసిన సందర్భాలున్నాయని దశాబ్దాలుగా ప్రజలు పోరాడినా, వారి గోడు పాలకులకు వినిపించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో ఇచ్చిన మాట – అధికారంలోకి రాగానే కార్యరూపం దాల్చరన్నారు. గత ఎన్నికల సమయంలో ఇంటింటికి బొజ్జల కార్యక్రమంలో భాగంగా కల్లిపూడి గ్రామస్తులు తమ సమస్యను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా తాము గెలిచిన వెంటనే ఈ బ్రిడ్జిని మొదటి పనిగా పూర్తి చేస్తాం అని హామీ ఇచ్చారని ఆ మాటను ఈరోజు నిలబెట్టుకుంటూ, ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారన్నారు. వర్షాలు, కాలువ ప్రవాహం… అయినా యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి భారీ వర్షాలు, నిండుగా ప్రవహించే తెలుగు గంగ సెవెంత్ బ్రాంచ్ కాలువ కారణంగా పనుల్లో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి మోటార్ల సహాయంతో నీటిని తొలగిస్తూ, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కాంట్రాక్టర్ బ్రిడ్జి పనులను కొనసాగించారని వర్షకాలంలో పనులు చేయడం చాలా కష్టంగా మారిందని కాంట్రాక్టర్ వెల్లడించారు. బ్రిడ్జి బాధ్యత మొత్తం భుజాన వేసుకున్న బొజ్జల రిషితా రెడ్డి బ్రిడ్జి నిర్మాణంలో ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితా రెడ్డి కీలక పాత్ర పోషించారు. కల్లిపూడి గ్రామాన్ని దత్తత తీసుకుని, గ్రామస్తుల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ, సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో నిరంతరం సంప్రదింపులు జరిపి పనులను పర్యవేక్షించారు.రూ. 22.50 లక్షల వ్యయంతో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించి, నేడు ప్రజలకు అంకితం చేశారు.

తిరుపతి

పాత్రికేయుల సౌకర్యార్థం మీడియా పాయింట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫిబ్రవరి 10 – 23, 2026) అత్యంత వైభవంగా రంభమయ్యాయి. ఈ ఉత్సవాల కవరేజీ కోసం వచ్చే పాత్రికేయుల సౌకర్యార్థం దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా పాయింట్‌ను స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మంగళవారం నాడు ఘనంగా ప్రారంభించారు. మీడియా పాయింట్ ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… బ్రహ్మోత్సవాల విశేషాలను, స్వామివారి సేవల సమాచారాన్ని ఎప్పటికప్పుడు భక్తులకు చేరవేయడంలో మీడియా పాత్ర కీలకమని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి అవసరమైన సూచనలు, ఆలయ నిబంధనలను ప్రచారం చేయాలని పాత్రికేయులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి టి. బాపి రెడ్డి, పాలక మండలి సబ్యులు, శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముత్యాలు వేణుగోపాల్, పీఆర్వో ఈశ్వర్, పాత్రికేయులు పాల్గొన్నారు. మీడియావారికి దేవస్థానం వారు కల్పించిన సౌకర్యాలు: విలేకరులు వార్తలు పంపుకోవడానికి వీలుగా ఇంటర్నెట్, ఇతర కమ్యూనికేషన్ సౌకర్యాలను కల్పించారు. బ్రహ్మోత్సవాల షెడ్యూల్, వాహన సేవల వివరాలను అధికారికంగా మీడియా పాయింట్ ద్వారా ఎప్పటికప్పుడు విడుదల చేయనున్నారు.

తిరుపతి

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం భక్తకన్నప్ప ధ్వజారోహణతో ప్రారంభం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 10: శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్బముగా మొదటి రోజు శ్రీ భక్తకన్నప్ప స్వామి వారి ద్వజారోహణ కార్యక్రమాన్ని మంగళవారం నాడు ఆలయ వేదం పండితులు శాశ్రోక్తంగ నిర్వహించారు. మానవులు కాదు మాటలుగాని జీవుల సైతం మోక్షమోసిగిన క్షేత్రంగా పేరుగాంచినది శ్రీలాకపాస్తి క్షేత్రం మూగజీవాలైన శ్రీ సాలీడు, కాళ పాము, హస్తి ఎనుగు, అనునిత్యంలు ఆదేవవదే వుడను పూజిస్తు మోక్షపాప్తిని పొందినవి అక్షరం రాని బోయవాడయిన కణ్ణడుని భక్తకన్నప్పగా మార్చినది ఈ క్షేతంలో మణిమంతుడనే యుకుడు విచక్షణ లేకుండా మృగాలను వంపుంతు, అనందిస్తుండేవాడు. అది చూసిన సందకేశ్వరుడు ఏపాపం ఎరుగని మృగాలను నిర్దాక్షణ్యంగా చంపుతున్న మణిమంతుడిని మాసం తింటూ కిరాతుకినిగా అడవిలో తిరుగుత జీవించమని దేవలోకంలో స్థానంలేదని శపింస్తారు. ఆ శాపానికి భయపడిన మణిమంతుడు, తన శాపానికి విమోచనం తెలుపమనగా నందికేశ్వరుడిని వేడుకోనగా అందుకు భూలోకంలో దక్షణ కాశీగా ప్రసిద్ధిచెందిన శ్రీకాళహస్తీశ్వర పుణ్యక్ష త్రంలో వివాహమాడి తద్వారా మీకు తిన్నడనే పుశ్రుడు జన్మిస్తాడు అతడు పరమకిననికి అత్యంత ప్రీతికరమైన భక్తుడుగా పేరుపొందుతాడు అప్పుడు నీ శాపవిమోచన కలుగుతుందిని తెలుపుతాడు. భక్తుడైన మణిమంతుడు శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది తీరాన ఒక యోజన దూరంలో నిసిస్తూ అక్కడ ఒక బోయ యువతిని పెండ్లాడిన ఐదు సంవత్సరాల తరువాత వారికి ఒక మగబిడ్డ సంతానప్రాప్తి కలుగుతుంది. అతడికి తిన్నడు అని పేరు పెట్టడం జరుగుతుంది. అతడు కైలాస శిఖరం పరిసర ప్రాతంలోని అడువులయందు తిరుగుతు, అడవిలోని వాయులింగాన్ని బిల్వపత్రాలతో పూజిస్తు, కందమూలను, మాంసం వంటివి నైవేధ్యంగా పెడుతూ ఉండేవాడు. అతని మూడభక్తికి మునులు అత అడ్డు చెప్పలేక వురుకునేవారు. ఒకనాడు శివార్చనకు మునీంద్రులు వాయి లింగం వద్దరాగా, మునులు, దేవతలు చూస్తుండగా కిరాతకుడైన కడు భక్తిని వారికి తెలయజేప్పేందుకు పరమేశ్వరుడు, ఒక కంటియందు నీరు కారేవిధంగా చేశాడు. ఈ విషయం తెలియని తిన్నడు తన నోటిలోని జలంతో శివలింగాన్ని అదిషేకించి. నైవేద్యం సమర్పించిన తరువాత పరమేశ్వరుని వంటనీరు కారుతున్న దృశ్యాన్ని గమనిస్తాడు తన తప్పిదంచేతన స్వామికి ఇటువంటి ఇబ్బంది కలిగిందని భావించి కన్నుకు కన్నే సమాధనం అని తన వద్దవున్ని బాణంతో తన కన్నుని తీసి శివలింగానికి అమర్చుతాడు. అప్పుడు లింగం కంట నీరు కారడం నిలుస్తుంది. వెంటనే మరో కంటిలోనుంచి నీరుజారడం జరుగుతుంది. కుడు వెనువెంటనే రెండవ కంటిని కూడా పెకళించడానికి ప్రయత్నిస్తుండాగా అదేవదేవుడు ప్రత్యక్షమై తడిని అవుతాడు, తిన్నడి భక్తికి మెచ్చి నీ చరిత్ర విన్నవారికి రచించిన వారికి పాపపరిహరం అవుతుందని వరం ప్రసాదింస్తాడు. ఇది గమనిస్తున్న మునీంద్రులు తిన్నది భక్తికి సంతోషించి ఆశీర్వదిస్తారు. తనకున్న రెండుకన్నులపైతం భగవంశనికి అర్పిందానికి వెనుకాడని భక్తుడు అయినందున అతనికి భక్తకన్నప్ప అని పిలువసాగారు. పరమ శివునికి ఆపరభక్తితో తనక కన్నుని సమర్పించిన కనప్పటికి శ్రీస్వామివారికన్న ముందుగా పూజ చేయడం శ్రీకాళహస్తిలో అదివాయితగా వస్తున్న. ఆచారం శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో ఫిబ్రవరి 10 నుండి 23 వరకు అత్యంత వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వేడుకలను నిర్వహిస్తారు. భకన్నప్ప ద్వాజారోహణంతో ప్రారంభించిన తరువాతే స్వామివారి ధ్వజారోహణం నిర్వహించబడుతుంది. ఈ భక్తకన్న ధ్వజారోహణ కార్యక్రమంలో స్థానిక శాసనసభ సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, భాజపా నాయకులు కోలా ఆనంద్, పాలకమండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, పాలక మండలి సబ్యులు, పోలీసు శాఖ అధికారులు, ఆలయ అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆయాలనికి 40 టన్నుల కూరగాయల విరాళం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 10: ముక్కంటి క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ భక్తుల ఆకలి తీర్చేందుకు నంద్యాలకు చెందిన దాతలు తమ ఉదారతను చాటుకున్నారు. నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ రామన్న అండ్ సన్స్ సంస్థ ప్రతినిధి ప్రసాద్ మంగళవారం నాడు సుమారు 40 టన్నుల వివిధ రకాల తాజా కూరగాయలను దేవస్థాన పాలక మండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్ సమక్షంలో ఆలయాధికారులకు విరాళంగా అందజేశారు. ఈ సందర్బంగా దాత ప్రసాద్ మాట్లాడతూ.. బ్రహ్మోత్సవాల సమయంలో దేశం నలుమూలల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులకు స్వామివారి ప్రసాదం (అన్నదానం) లో ఎటువంటి లోటు రాకూడదనే ఉద్దేశంతో ఈ వితరణ చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం దేవస్థానం వారు దాతలను ఘనంగా సత్కరించి, శ్రీ స్వామి, అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకోసం నంద్యాల నివాసులు చేస్తున్న ఈ సేవను ఆలయ పాలక మండలి సభ్యులు కొనియాడారు.

తిరుపతి

శివాలయానికి రూ..96,000 విలువ చేసే బిస్లరీ బాటిల్స్ వితరణ

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 10: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం వార్షిక శివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఆలయ అధికారుల పిలుపుమేరకు శ్రీకాళహస్తి టెక్సటైల్స్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్, శ్రీకాళహస్తి జైన్ అసోసియేషన్, జూలుగంటి సుబ్బారావు, తెర్ల లక్ష్మీ నరసింహ ప్రకాష్, జూలుగంటి జగదీష్ లు సంయుక్తంగా 96, 000 రూపాయలు విలువ చేసే 300 ml 20,000 బిస్లరీ బాటిల్స్, ఈరోజు బొజ్జల బృందమ్మ ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణ అధికారికి వాకచర్ల గురప్ప శెట్టి చేతులమీదుగా వితరణ చేశారు.

తిరుపతి

అట్టహాసంగా ఆదిదేవుని సంబరాలు…..

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 10: అమృతం కోసం దేవ, దానవులు క్షీరసాగర మధన సంఘటన ఆధారంగా మహా శివరాత్రి బ్రహ్మోత్సావాలకు అకురం ఏర్పడిందని పురాణలు ద్వార తెలుస్తుంది. పాలసముద్ర మధన సమయంలో లక్ష్మిదేవి ఉద్భవించిన ఆమేను శ్రీమహావిష్ణువు వివాహమాడతాడు. కామధేనువుని, ఐరావతాన్ని దేవతాధిపతి దేవేంద్రుడు తీసుకుంటాడు. అమృతం రావటానికి మంరింత సమయం కావడంతో దేవతలు, రాక్షసులు అత్యంత శక్తితో పాలసముద్రాన్ని చిలకగా కాలకూట విషం (హలహలం) ఉద్భవించింది. దీనిని స్వీకరించాడానికి దేవతలలోగాని, రాక్షసులలోగాని ఎవ్వరు ముందుకు రాకపోవడంతో మహాదేవుడు ఆ విషాన్ని తన త్రాగి తన కంఠస్థానంలో నిపుపుకుంటాడు అంద తనే ఆయనకు గరళకంఠుడనే పేరువచ్చింది. విషప్రభాంతో పరమశివుడు మగత నిద్రలోనికి జారుకుంటాడు. పడుకుంటే విషప్రభావం అధికమౌ తుభావించిన దేవత, రాక్షసులు, మునులు, యక్ష, కిన్నేర్లు, గందర్వులు, అందరు కలసి జాగరణ చేస్తారు. ఈ విధానాన్నే మహాశివరాత్రి బ్రహో్మూ త్సావాల అంకురం ఏర్పదని పూర్వికులు చేబుతారు. తొలి పూజ భక్తునికే… మూడ భక్తితో కొలిచిన బోయవాడైన కణ్ణడికి మహేశ్వరుడు మోక్షాన్ని ఇవ్వగా అతడు భక్తకన్నప్పగా ప్రసిద్ధిగాంచాడు. దీంతో తొలిరోజు గురువారం భక్తకన్నప్ప ధ్వజారోహణంతో ఉత్సవాలు మొదలౌతాయి. రెండవ రోజు దేవరాత్రి….. పరమేశ్వరుని మేలుకోలుపుతూ దేవతలు నిర్వహించడమే దేవరాత్రి. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శుక్రవారం స్వామివారి ధ్వజారోహణం జర గుతుంది. స్వామివారి ఆలయ సన్నిధిలోని ధ్వజస్థంభం వద్ద స్వామి, అమ్మవార్ల, ఉత్సవమూర్తులతో పాటు, గణపతి, కూమరస్వామి, భక్తకన్నప్ప, చండికేశ్వరస్వామి లను నాలుగు ప్రక్కల ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. శ్రీస్వామి, అమ్మవార్లను అంబారీలపై ఊరేగిస్తారు. మూడవ రోజు భూతరాత్రి… ఈ కార్యక్రమాన్ని శనివారం భూత, ప్రమథగణాదుల ఆడుతూ, పాడుతు నిర్వహించే కార్యక్రమంల కావడంతో ఈ రాత్రిని భూత రాత్రి ఆ ని పిలుస్తారు. ఉదయం సూర్య ప్రభవాహనం పై, రాత్రి భూత- శుక వాహనాల పై స్వామి, అమ్మవార్ల ఊరేగుతారు. హరిజన సేవాసంఘ ఆధ్వర్య Oలో ఈ కార్యన్ని చేస్తారు. నాలుగో రోజు గంధర్వరాత్రి…. సామిని మేలుకొలుపుతూ నాలుగోరోజు గంధర్వులు వివిధ రకాల విన్యాసాలను ప్రదర్శిస్తారు. స్వామివారిని అనేవ రకాలుగా కీర్తిస్తారు. ఉదయం స్వామి, అమ్మవార్లను రాత్రి రావణ- మయురి వాహనాలపై పురవీధులయందు సంచరించి భక్తులను కటాక్షిస్తారు. ఐదవ రోజు నాగరాత్రి…. ఐదో రోజు నాగులు నాట్యమాడి పరమేశ్వరుని నిద్రలోకి జారనివ్వకుండా ప్రయత్నం చేస్తాయి. స్వామి, అమ్మవార్లను హంస-యాళి వాహనలపై ఉరేగిస్తారు. అరవ రోజు మహాశివరాత్రి…. ఆరోరోజు దేవ, దానవులు, గంధర్వులు, ఋషులు, కిన్నేర, కింపురుషులు కలిసి జాగరణ చేస్తారు. ఈ రాత్రినే మహాశివరాత్రి అంటారు. ఆరోజు ఉదయం నుండి రాత్రి వరకు 10 అభిషేకాలు నిర్వహిస్తారు. ఉదయం ఇంద్రవిమాన వాహనం, రాత్రి నంది, సింహ వాహనాలపై ఊరేగింపు చేపడతారు. ఇక 11వ అభిషేకానికి పరమశివుడు మగత నిద్రనుండు మేల్కోంటాడు. దీనినే లింగోధ్భవ దర్శనం అంటారు. ఏడవ రోజు బ్రహ్మారాత్రి…. భూమిని రథంగా చేసుకుని, సూర్య, చంద్రులను చక్రాలుగా బ్రహ్మాసారథిగా నిర్వహించేదే ఈ రథోత్సవం ఆ రోజు అమ్మవారికి కూడ రథో త్సవం కార్యక్రమాన్ని చేపడతారు. అదే రోజు రాత్రి నారద పుష్కరిణినందు తెప్పొత్సవాన్ని నిర్వహిస్తారు. ఎనిమిదవ రోజు స్కందరాత్రి పరమేశ్వరుని కుమారుడు సుబ్రమణ్య స్వామి, చేపట్టే శ్రీస్వామి, అమ్మవార్ల వివాహాన్నే స్కందరాత్రి అని అంటారు. ఈ రోజు స్వామివారిని గజవాహనంపై అమ్మవారిని సింహవాహనంపై చతుర్మద వీధులయందు ఊరేగిస్తారు. తొమ్మిదవ రోజు దేవరాత్రి…. ఈ ఉత్సవంలో భాగంగా ఆలయంలోని శివకామిని సుందరి సమేత నటరాజస్వామికి ఆలయ ప్రాగణంలో వివాహన్ని జరుపుతారు. పదవ రోజు ఋషిరాత్రి పరమశివుని మేల్కొలపడానికి విచ్చేసిన ఋషులను తిరిగి వారి నివాసాలకు చేర్చే ఉత్సవాన్ని గిరి ప్రదక్షణ, కొడచుట్టు, ఋషిరాత్రి గాను పిలుస్తారు. అనంతరం రాత్రి స్వామి వారు అశ్వవాహనంపై, అమ్మవారు సింహవాహనం పై నాలుగు వీధులయందు విహరిస్తారు. పదకుండవ రోజు దేవరాత్రి. మహాశివరాత్రి బ్రహ్మోత్సావాలలో రెండవ రోజును దేవరాత్రిగా పిలుస్తారు. దీంతో 11వ రోజును దేవరాత్రిగా పిలుస్తారు. ఆదివారం కే డిగం మీద రాత్రి సింహ-కామధేను వాహనాలపై స్వామి, అమ్మవార్లను ఊరేగింపు ఉంటుంది. పన్నేండవ రోజు పల్లకీ సేవ… పరమేశ్వరునితోపాటు పార్వతిదేవి, గంగాదేవిని వేడుకగా పురవీధులయందు పల్లకీలో ఊరేగిస్తారు. పదమూడవరోజు ఏకాంత సేవా బ్రహ్మోత్సవాలు ఏకాంత సేవతో ముగుస్తాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సావాలు జరిగే 12 రోజు ఏకాంత సేవను నిర్వహించరు. ఉత్స వాలు ముగిసిన తరువాత ఏకాంత సేవను నిర్వహి స్తారు.

E-పేపర్

దత్తాత్రేయ కాలనీ, సాయి కాలనీలకు భూగర్భ డ్రైనేజ్ సదుపాయం – అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

పున్నమి ప్రతినిధి 10 ఫిబ్రవరి 2026 దత్తాత్రేయ కాలనీ, సాయి కాలనీలకు భూగర్భ డ్రైనేజ్ సదుపాయం – అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి హయత్ నగర్ డివిజన్ పరిధిలోని దత్తాత్రేయ కాలనీ మరియు సాయి కాలనీలలో ప్రజలు చాలా కాలంగా ఎదుర్కొంటున్న డ్రైనేజ్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి నూతన భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దత్తాత్రేయ కాలనీలో 30.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, సాయి కాలనీలో 19.00 లక్షల రూపాయల వ్యయంతో పనులు చేపట్టడం జరిగింది. ఈ పనులు పూర్తయిన తర్వాత మురుగు నీరు నిల్వ ఉండటం, రోడ్లపైకి రావడం, దుర్వాసన మరియు దోమల సమస్యలు పూర్తిగా తగ్గి కాలనీల్లో పరిశుభ్రమైన వాతావరణం నెలకొననుంది. స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభివృద్ధి పనులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ… “ప్రజల ఆరోగ్యం, సౌకర్యాలే మా ప్రాధాన్యం. డ్రైనేజ్ వంటి ప్రాథమిక సదుపాయాలు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. అందుకే ప్రతి కాలనీకి సమానంగా నిధులు కేటాయిస్తూ మౌలిక వసతులు కల్పిస్తున్నాం. గత ఐదు సంవత్సరాలుగా ప్రజల విశ్వాసంతో ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేశాం. భవిష్యత్తులో కూడా ఇదే వేగంతో పనులు కొనసాగిస్తాం” అని తెలిపారు. కాలనీ వాసులు మాట్లాడుతూ… “మా సమస్యను గుర్తించి వెంటనే పరిష్కారం చూపిన కార్పొరేటర్ కి మా కృతజ్ఞతలు. దత్తాత్రేయ కాలనీ, సాయి కాలనీల్లో డ్రైనేజ్ సదుపాయం రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయన చేస్తున్న అభివృద్ధి పనులకు మేమంతా ఎల్లప్పుడూ అండగా ఉంటాం” అని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో అయ్యా కాలనిలా సంక్షేమ సంఘం సభ్యులు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి భాస్కర్, బీజేపీ నాయకులు బొడ్డుపల్లి జనార్దన్,ఇట్టబోయిన నర్సింహా,శేఖర్ రెడ్డి, శ్రీకాంత్, బాలు, అరుణ్, ప్రేమ్, అఖిల్,భరత్,మరియు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు..

E-పేపర్

ఇబ్రహీంపట్నం శ్రీ కట్టమైసమ్మ తల్లి ఆలయ రూపురేఖలు మారుస్తాం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

పున్నమి న్యూస్ ప్రతినిధి 10 ఫిబ్రవరి 2026 శ్రీ కట్టమైసమ్మ తల్లి ఆలయ రూపురేఖలు మారుస్తాం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అమ్మవారి భక్తులకు నీటి వసతి కోసం బోర్ వేయిస్తాను, ఇక పై భక్తులకు అన్ని సౌకర్యాలు అందిస్తాం ఎమ్మెల్యేమల్ రెడ్డి రంగారెడ్డి మల్ రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం చెరువు కట్ట సుందరికరణ పనులను పరిశీలించారు. కట్టమైసమ్మ* ఆలయం చుట్టూ రూపురేఖలు మారుస్తాం… అమ్మవారి భక్తులకు నీటి వసతి మాత్రమే కాదు, అన్ని సౌకర్యాలను కలిపిస్తాం” అని ఆయన తెలిపారు. చెరువు పరిసరాల సుందరికరణ ఆలయం చుట్టూ అందమైన రూపురేఖలు భక్తులకు అన్ని వసతులు అందించనున్నట్టు ఆయన తెలిపారు చెరువు చుట్టూ చక్కట్టి ఆహ్లాదకరమైనా వాతావరణం ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు..

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అక్కంపేటలో షర్మిలారెడ్డి పర్యటన – ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్రకు ఊపిరి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చట్ట పరిరక్షణ యాత్రలో భాగంగా ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి పర్యటించనున్నట్లు డిసిసి అధ్యక్షుడు నారపు రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పథకం పేదల హక్కుగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బిజెపి ప్రభుత్వం గాంధీ పేరు తొలగించి మార్పులు చేసిందని, దీనిపై కాంగ్రెస్ ఉద్యమిస్తుందని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రజాస్వామ్యకవాదులు, గ్రామీణ ప్రజలు, మేధావులు మహిళలు, యువత పాల్గొనాలని డిసిసి అధ్యక్షుడు నారపు రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.