Wednesday, 29 April 2026

Blog

తిరుపతి

యం.ఈ.ఓ ని సన్మానించిన ఉపాధ్యాయులు బాలు

తొట్టంబేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 11: తొట్టంబేడు మండలంలో దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ కి మండల విద్యాశాఖ అధికారి-2 భాస్కర్ బుధవారం సందర్శించారు.నో బ్యాగ్ డే, ఎఫ్.ఎల్.ఎన్., మధ్యాహ్నభోజన పథకం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు లక్ష్యం తో చదివి ఉన్నతంగా ఎదగాలని తగు సూచనలు ఇచ్చి విద్యార్థులందరికీ స్వీట్లు పంచారు.మండలంలో విద్యా కార్యక్రమాలను బలోపేతం చేస్తున్న ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యంని అభినందించారు. ఈ సందర్భంగా ఈ నెల పదవీ విరమణ అవుతున్న యం.ఈ.ఓ ని పాఠశాల తరపున బాలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సి. ఆర్. పి. ప్రసాద్ పాల్గొన్నారు.

తిరుపతి

పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ కి నివాళులర్పించిన బిజెపి నాయకులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 11: శ్రీకాళహస్తి పట్టణంలో బేరివారి మండపం వద్ద బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ అద్వర్యంలో బుదవారం నాడు మహనీయుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ వర్ధంతి సందర్భంగా – సమర్పణ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటగా కోలా ఆనంద్ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ కి ఘననివాళులర్పించారు. ఈ సందర్బంగా భాజపా నాయకులు మాట్లాడుతూ…. దేశసేవ, త్యాగం, నిజాయితీకి ప్రతీకగా నిలిచిన మహానాయకుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అంత్యోదయ సిద్ధాంతంతో చివరి వ్యక్తి వరకు అభివృద్ధి చేరాలనే ఆశయంతో జీవితాంతం ప్రజల కోసం కృషి చేశారని ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరం నడుచుకోవాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోసీనియర్ నాయకులు గరికపాటి రమేష్ బాబు, చాగణం శైలజ, పట్టణ అధ్యక్షులు హరీష్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కొండేటి గోపాల్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కూనాటి నాగరాజు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ప్రజ్ఞశ్రీ, రూరల్ మండలం అధ్యక్షులు భగీర్తి వెంకటేష్, అమర్నాథ్, ఉమా సింగ్, పుణ్యం ఢిల్లీ కుమార్, రాజనాల, తిరుపాల్ నాయుడు, కందాటి సుధాకర్, చందు రాయల్, రవి రాయల్, కృష్ణా రెడ్డి, శివా యాదవ్, శ్రీకర్ నాయుడు, రాజా, హుకుం సింగ్, రాజా నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

నిత్యాన్నదాన పథకానికి రూ.50,000 విరాళం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 11: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి దేవస్థానముచే నిర్వహించబడుచున్న నిత్యాన్నదాన పథకానికి వైజాగ్ వాస్తవ్యులు శ్రీకాంత్ బూడిరాజు రూ.50,000/- ఆలయ అధికారులకు విరాళంగా అందజేశారు. అనంతరం దాతలకు ఆలయాధికారులు శ్రీ స్వామి, అమ్మవార్ల అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటుచేయించి తీర్ధ, ప్రసాదాలు అందజేయడమైనది.

తిరుపతి

వేదమంత్రాల నడుమ అత్యంత వైభవంగా ముక్కంటి ధ్వజారోహణం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 11: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ధ్వజారోహణ కార్యక్రమం బుదవారం నాడు అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆలయ పండితులు సంప్రదాయ పద్ధతుల్లో ధ్వజారోహణం నిర్వహించగా, భక్తులు “ఓం నమః శివాయ” నినాదాలతో ఆలయాన్ని మార్మోగించడంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, వాహన సేవలు నిర్వహించనున్నట్లు, ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భద్రతా చర్యలు పటిష్టం చేయడంతో పాటు తాగునీరు, ప్రసాద వితరణ, దర్శన సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగినది. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీకాళహస్తికి తరలివస్తుండటంతో ఆలయం భక్తి వాతావరణంతో కళకళలాడుతోంది. ఈ బ్రహ్మోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించడమే కాకుండా శ్రీకాళహస్తి ప్రాంతానికి ప్రత్యేక శోభను తీసుకువస్తున్నాయని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతి

శ్రీపాద సేవకులకు రూ..2,లక్షల దుస్తులు విరాళం

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో శ్రీపాద సేవకులకు ఎస్బిఐ బ్యాంక్ వారు సుమారు రూ.. 2,00,000 విలువగల 200 పంచలు, టీషర్టులను శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట్ సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి చేతుల మీదుగా శ్రీవారి సేవకులకు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈ వో బాపిరెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణ రెడ్డి, ఎస్బీఐ రీజినల్ మేనేజర్ సత్యనారాయణ స్వామి, ఏజీఎం శ్రీనివాసులు రెడ్డి, ఎస్బీఐ మైన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ ఫణి కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

ఘనంగా మిన్నల్ రవి జన్మదిన వేడుకలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 11: శ్రీకాళహస్తి పురపాలక సంఘం మాజీ వైస్ ఛైర్మన్,వన్నెకుల క్షత్రియ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి జన్మదినాన్ని పురస్కరించుకొని బుడవారం నాడు తెలుగు తమ్ముళ్ళు కేక్ కట్ చేసి రవిని దుశ్శాలువాతో సత్కరించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా తెదేపా నాయకులు మాట్లాడుతూ .. మిన్నల్ రవి గత వైసిపి అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు, బిసి వర్గాల ఆత్మీయ సోదరుడు మిన్నల్ రవికి తెలుగు తమ్ముళ్ళు హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతీ ఒక్క కార్యకర్తను తన సొంత కుటుంబ సభ్యులుగా భావించి,అందరిలో ఒకడిగా ఉంటూ, అందరి కోసం తాను అన్నట్లు నిరంతరం పాటు పడే వ్యక్తి అని వారు పేర్కొన్నరు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి,బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు,బీమాల భాస్కర్ ముదిరాజ్, డి.వి.నారాయణ,వజ్రం కిషోర్,చిల్లకూరు మణి,కోట చంద్రశేఖర్,హరి,ముని రెడ్డి,షేక్ మహబూబ్ బాషా,సయ్యద్ చాంద్ బాషా, గాజుల భగత్,పూల శేఖర్,షేక్ ఖాదర్, చందు,గంగనపల్లి రమేష్,కృష్ణమూర్తి, సయ్యద్ ఆదిల్,ప్రభాకర్,సులేమాన్, పోలూరు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ముక్కంటి ఆలయానికి గాజుల వితరణ

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 11: శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పవిత్ర ఉత్సవాల సందర్భంగా ముక్కంటి ఆలయానికి ఏర్పేడు మండల మాజీ అధ్యక్షుడు నైనారు పొన్నారావు సౌజన్యంతో భక్తుల సౌకర్యార్థం బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయానికి వచ్చే మహిళా భక్తులకు అమ్మవారి ప్రసాదంతో పాటు గాజులు, పసుపు, కుంకుమలను పంపిణీ చేసే సంప్రదాయంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషీతా రెడ్డి చేతులమీదుగా ఆలయ కార్యనిర్వహణాధికారి టి. బాపిరెడ్డికి ఈ విరాళం అందజేశారు. ఈ సందర్భంగా బొజ్జల రిషీతా రెడ్డి మాట్లాడుతూ…లోకకల్యాణం కోసం జరిగే ఈ మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగస్వాములు కావడం చాల సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈవో బాపిరెడ్డి ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ధ్వజారోహణంతో ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో రిషీతా రెడ్డితో పాటు నైనారు పొన్నారావు, ఆలయ అధికారులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

తిరుపతి

భగవద్గీతను అర్ధాలతో అద్భుతంగా వివరించిన చిన్నారి ప్రవాసిని

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 11: శ్రీ కాళహస్తీశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా, ధూర్జటి కళా ప్రాంగనంలో ప్రత్యేక భగవద్గీత, శివ రుద్ర పారాయణం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో, శ్రీకాళహస్తి కీ చెందిన చిన్నారి ఏం. ప్రవాసిని భగవద్గీతలోని శ్లోకాలను పఠించి, వాటి అర్థాలను ఆంగ్లంలో చక్కగా వివరించి ప్రేక్షకులను ప్రసన్నముగా, భక్తితో ఆకట్టుకుంది. కార్యక్రమం అనంతరం ఆలయ అధికారుల తరపున శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు సభ్యుడు దండు రాఘవయ్య చిన్నారికి బహుమతి, జ్ఞాపిక, సర్టిఫికెట్, శ్రీ స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు.

తూర్పు గోదావరి

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు – డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఎస్సై రామకృష్ణ హెచ్చరిక

తాళ్లపూడి,పున్నమి ప్రతినిధి ఫిబ్రవరి 12: తాళ్లపూడి మండల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్, ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణం (త్రిబుల్ రైడ్), అలాగే మైనర్లు వాహనాలు నడపడం వంటి నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎస్సై టి. రామకృష్ణ యువ ప్రెస్ టీం సభ్యులకు తెలిపారు. ఈ సందర్భంగా తాళ్లపూడి మార్కెట్ ప్రాంతంలో దుకాణాల ఎదుట అడ్డగోలు పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కాకుండా భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం తాగి వాహనం నడిపితే అపరాధ రుసుముతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుందని, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 30 రోజుల వరకు జైలు శిక్ష పడవచ్చని తెలిపారు. ఇటీవల తాళ్లపూడి బస్టాండ్ సమీపంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న ఓ మైనర్ యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు. అదనంగా, అధిక లోడుతో వాహనాలు నడిపితే రూ.20,000 వరకు జరిమానా విధిస్తామని చెప్పారు. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, లైసెన్స్ లేదా ఇన్సూరెన్స్ లేకపోవడం, త్రిబుల్ రైడ్, మద్యం సేవించడం వంటి కేసుల్లో రూ.1,000 నుండి రూ.10,000 వరకు జరిమానాలు విధించబడతాయని ఎస్సై రామకృష్ణ స్పష్టం చేశారు. ప్రజలు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

E-పేపర్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం శేరిగూడలో దొంగ ఓట్ల కలకలం…

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం శేరిగూడలో దొంగ ఓట్ల కలకలం… పున్నమి న్యూస్ ప్రతినిధి 10 ఫిబ్రవరి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ శేరిగూడలో దొంగ ఓట్ల కలకలం! నా ఓటు చోడికి గురైంది మహిళా ఓటర్ నా ఓటు నాకు కావాలంటూ మహిళ ఆందోళన జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తాం : ఓటరు పారిజాత తన ఓటు చోరీకి గురైందని ఆందోళనకు దిగిన శేరిగూడ గ్రామానికి చెందిన మహిళ ఓటరు పారిజాత. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ శేరిగూడలోని 15వ వార్డులో క్యామ పారిజాత అనే మహిళ ఓటును వేరేవాళ్ళు వేశారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.. తన ఓటు ఎవ్వరు వేసారంటూ ఏజెంట్లను నిలదీయగా, అప్పటికే నీయొక్క ఓటు వేసారని చెప్పడంతో ఫోటోలు పారిజాత కంగు తినడం జరిగింది. దీంతో మహిళ అక్కడ ఉన్న అధికారులను నిలదీయడం జరిగింది. మా గ్రామస్తులే ఏజెంట్లుగా ఉంటే, వేరే వ్యక్తులు ఎలా ఓటు వేస్తారని మీడియాతో పారిజాత తెలిపారు. అక్రమంగా తన ఓటు వేరే వాళ్ళు వేయడం తగదని నా ఓటు నాకు కల్పించాలని, అక్రమానికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను కోరారు. జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు…. జిల్లా ఎన్నికల అధికారిని కలిసి దొంగ ఓట్లకు సహకరించిన, పాల్పడిన వారిపై ఫిర్యాదు చేయడం జరుగుతుందని సదర్ మహిళా తెలపడం జరిగింది. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవాలని ఓటర్లు కోరుతున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.