Thursday, 30 April 2026

Blog

E-పేపర్

ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో విజయం సాధించింది తిరుగు లేని శక్తి భారత్ అండర్ 19 జట్టు

పున్నమి న్యూస్ ప్రతినిధి 06 ఫిబ్రవరి 2026 తిరుగు లేని శక్తి భారత్ అండర్‌ 19 ప్రపంచకప్‌ విజేత భారత్‌ *అండర్ 19 వన్డే ప్రపంచ కప్‌ విజేతగా భారత్‌ నిలిచింది*. *ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో విజయం సాధించింది*. *భారత్‌ నిర్దేశించిన 412 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్‌ తడబడి 311 పరుగులకు ఆలౌటైంది*. ఫాల్కనర్ శతకం వృథా అయింది. *భారత బౌలర్లలో అంబ్రిష్‌ 3, దీపేశ్‌ 2 వికెట్లు తీయగా.. ఖిలాన్‌, కనిష్క్‌, ఆయూష్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ(175) భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు*

E-పేపర్

నెర్రపల్లి ల్ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు నోవా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో…..*

*నెర్రపల్లి ల్ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు నోవా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో…..* *సర్పంచ్ గొడ్డన్ల హేమలత శ్రీ హరి ఉప సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో…* పున్నమి న్యూస్ ప్రతినిధి 06ఫిబ్రవరి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : గ్రామంలో సర్పంచ్ గొడ్డన్ల హేమలత శ్రీ హరి ఉప సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నోవా హాస్పిటల్. డాక్టర్లు .మహేష్. డాక్టర్. అఖిలా డాక్టర్.పర్వదన్. డాక్టర్.సింధు. వారిని పిలిచి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది . ఇట్టి కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవడం జరిగింది . వాళ్లు బిపి షుగర్ టెస్టులు చేశారు..ఇట్టి కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు పద్మ.అరుణ్ యాదవ్. నరసింహ యాదవ్. బాలరాజు. రేణుక. అఖిల. మరియు సెక్రటరీ రాజ్ కుమార్ పాల్గొన్నారు

E-పేపర్

బండరావిరాల సెక్రటరీపై (డీ పీ ఒ) కి సర్పంచ్ ఫిర్యాదు* – *విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారి హామీ

బండరావిరాల సెక్రటరీపై (డీ పీ ఒ) కి సర్పంచ్ ఫిర్యాదు* – *విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారి హామీ** పున్నమి న్యూస్ ప్రతినిధి 06 ఫిబ్రవరి 2026 రంగారెడ్డి జిల్లా ​బండరావిరాల గ్రామ పంచాయతీ సెక్రటరీ పి.నవనీత రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, రాజకీయ పక్షపాతంతో పనిచేస్తున్న సదరు అధికారిణిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) వి. సురేష్ మోహన్ ని కలిసి ఫిర్యాదు చేశారు. ​గ్రామసభ తీర్మానం లేకుండా, ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండానే శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయాన్ని దేవాదాయ శాఖలో కలపాలని సెక్రటరీ ఏకపక్షంగా లేఖ ఇవ్వడంపై సర్పంచ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ నుండి వచ్చిన అభ్యంతరాల నోటీసులపై సంతకం చేసి కూడా, గత నెల రోజులుగా ఆ విషయాన్ని నూతన పాలకవర్గానికి తెలియకుండా దాచిపెట్టి సెక్రటరీ మోసపూరితంగా వ్యవహరించారని( డీపీవో) దృష్టికి తీసుకెళ్లారు. ​ఒక దళిత సర్పంచ్‌కు సహకరించకుండా, రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న సదరు అధికారిణిని వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సర్పంచ్ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన (డి పి ఓ )సురేష్ మోహన్ ఈ వ్యవహారంపై తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశిస్తానని, విచారణలో తప్పు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ తో పాటు, ఉప సర్పంచ్ దూస శంకర్ ముదిరాజ్ మరియు వార్డు సభ్యులు గుండ్ల భవాని-శివ ముదిరాజ్, కన్నె భరత్ యాదవ్, యెడవెల్లి సుష్మిత – రాము గుప్తా, ఏర్పుల హరికృష్ణ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

అర్హులందరికీ అక్రిడిటేషన్ కార్డులు – తొలి విడతలో 551 మంజూరు

అనంతపురం, ఫిబ్రవరి 06 (పున్నమి ప్రతినిధి): జిల్లాలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్ మరియు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ ఓ. ఆనంద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్లో జరిగిన తొలి కమిటీ సమావేశంలో 551 అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేశారు. పత్రికలు, పీరియాడికల్స్‌ను క్రమం తప్పకుండా సమర్పించాలని సూచించారు. నిజాయితీగా విధులు నిర్వహించే వారికి మాత్రమే కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కమిటీ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కుడితిపల్లిలో వెటర్నరీ ఆఫీసర్ సురేష్ ఆధ్వర్యంలో యు ఎఫ్ ఎస్ సర్వే నిర్వహణ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి)కుడితిపల్లిలో గ్రామ సచివాలయ సిబ్బంది వెటర్నరీ ఆఫీసర్ సురేష్ గారి ఆధ్వర్యంలో యు ఎఫ్ ఎస్ (UFS) సర్వేను నిర్వహించారు. ఈ సర్వేలో గ్రామ ప్రజల ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, కుటుంబ వివరాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు సేకరించారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం, గ్రామాభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన డేటాను సిద్ధం చేయడం ఈ సర్వే ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. గ్రామస్తులు పూర్తి సహకారం అందించారు.

అనకాపల్లి

పాయకరావుపేటలో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు… విద్యార్థుల్లో సంస్కార స్ఫూర్తి

అనకాపల్లి జిల్లా ఫిబ్రవరి 6 పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ : పాయకరావుపేట నియోజకవర్గంలో ఆధ్యాత్మిక ప్రవచన చక్రవర్తి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నైతిక విలువలు) బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. హోం మంత్రి వంగలపూడి అనిత గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన విద్యాదీప్తి – సంస్కార స్ఫూర్తి కార్యక్రమంలో చాగంటి గారు నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, గురు–తల్లిదండ్రుల గౌరవం, కష్టపడి చదవడం, దురలవాట్లకు దూరంగా ఉండాలని విద్యార్థులకు హితవు పలికారు. ఈ ప్రవచనాలు విద్యార్థుల్లో కొత్త ఆలోచనలకు, మంచి భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేశాయి.

కడప

ఇంస్టాగ్రామ్ రిల్స్ మోజు మరో ప్రాణం తీసింది…

కడప నగరం రీల్స్ పిచ్చి ప్రాణాంతకంగా మారింది. ద్విచక్ర వాహనంపై విన్యాసాలు చేస్తూ రీల్స్ చిత్రీకరిస్తున్న ముబారక్ (కడప) ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. నిధులతో కలిసి బైక్ పై స్టంట్స్ చేస్తూ మూడు కిలోమీటర్లు వెళ్లిన సమయంలో వాహనం అదుపుతప్పి కింద పడింది. ఈ ఘటనలో ముబారక్ వృత్తి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. నగరంలో బైక్ స్టంట్స్ తో భయాందోళన సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

“సీమ ఎత్తిపోతల సాధనే ధ్యేయం – కాకాణి”

పున్నమి ప్రతినిధి, SPSR నెల్లూరు | ఫిబ్రవరి 4, 2026: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండల కేంద్రం, భోగసముద్రంలో మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు యూరియా సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని వాపోయారు. కూటమి పాలనలో అవినీతి, అక్రమాలు తప్ప అభివృద్ధి లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేయడాన్ని నిరసిస్తూ చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, పథకం తిరిగి ప్రారంభించే వరకు పోరాటం కొనసాగుతుందని కాకాణి స్పష్టం చేశారు. ప్రజలు, రైతుల పక్షాన నిరంతరం నిలబడతామని తెలిపారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాయలసీమ లిఫ్ట్ కోసం పోరాటం ప్రారంభం : కాకాణి

పున్నమి ప్రతినిధి, నంద్యాల | ఫిబ్రవరి 5, 2026: రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కోసం చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని నందికొట్కూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాడు గ్రామం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. సాగు, తాగునీటి అవసరాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అత్యంత కీలకమని పేర్కొన్నారు. పనులు పూర్తి చేసే వరకు రాజీ లేని పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

తిరుపతి

యస్సీ కాలనీలో ఉచిత వైద్య శిబిరం

తొట్టంబేడు పిబ్రవరి 05, పున్నమి న్యూస్: మండలంలోని బసవయ్యపాలెం యానాది కాలనీలో డాక్టర్ ప్రమీలమ్మ ఆద్వర్యంలో అపోలో గ్రూప్స్ హాస్పిటల్స్ అధినేత పద్మ విభూషణ్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి 93వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ యస్సీ కాలనీ వాసులకు వైద్య పరిక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ, గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు న్యూట్రిషన్ పౌడర్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కె సుధాకర్ రెడ్డి, ఏఎన్ఎం మౌనిక, హరీష్, కళావతి, సునీత, సురేష్, నంద గోపాల్ పాల్గొనడం జరిగింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.