Sunday, 26 April 2026

Blog

తిరుపతి

ముదిరాజ్ సోదరులందరు రాజకీయాలకు అతీతంగా కలసుండాలి- సంఘ జిల్లా అధ్యక్షులు

శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలో స్థానిక బహుదూర్పేటలో వున్న నలగంగమ్మ దేవాలయంలో బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం యొక్క డైరీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సంఘ జిల్లా అధ్యక్షులు వై.వి. రమణయ్య ముదిరాజ్ చేతుల మీదగా ప్రారంభించారు. ఈ సందర్బంగా సంఘ అధ్యక్షులు మాట్లాడుతూ….స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ముదిరాజ్ సంఘానికి ప్రత్యేక గుర్తింపు లేదా కార్పొరేషన్ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా ముదిరాజ్ వర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇరవై వేల మంది ముదిరాజ్‌లు ఉన్నారని ప్రతి ముదిరాజ్ సోదరుడు రాజకీయాలకు అతీతంగా ఐక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో ముదిరాజ్ సంఘానికి ప్రత్యేక భవనం నిర్మించుకోవాలని, అందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగియగా, ముదిరాజ్ సంఘ ఐక్యతకు ఇది నాంది పలికిందని నిర్వాహకులు పేర్కొన్నారు.

తిరుపతి

బొజ్జల కుటుంబం సమక్షంలో శ్రీకాళహస్తిలో దివ్యాంగశక్తి పథకం ప్రారంభం

శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దివ్యాంగశక్తి పథకాన్ని బుధవారం నాడు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ సంయుక్తంగా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ….ప్రత్యేక ప్రతిభావంతుల ప్రయాణ సౌకర్యాల మెరుగుదలకు ఈ పథకం దోహదపడుతుందని శ్రీకాళహస్తి ఆర్టీసీ పరిధిలో 98 బస్సులు దివ్యాంగులకు అనుకూలంగా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఇప్పటికే పీహెచ్సీ పాస్‌లు కలిగిన 359 మంది లబ్ధిదారులు ఉండగా పట్టణ పరిధిలో మొత్తం 1972 మంది ప్రత్యేక ప్రతిభావంతులు ఉన్నారని వివరించారు. ఈ పథకం కింద మహిళాశక్తి బస్సుల్లో దివ్యాంగులకు పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పించబడుతుందని, డీలక్స్, లగ్జరీ బస్సుల్లో 50 శాతం రాయితీ ఇవ్వబడుతుందని అర్హులైన దివ్యాంగులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ భవాని ప్రసాద్, ఆర్టీసీ అధికారులు, కూటమి నాయకులు, దివ్యాంగులు పాల్గొన్నారు.

తిరుపతి

పట్టణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలుతెలిపిన వైసీపీ నాయకులు మిద్దెల హరి

శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజికవర్గ వైసీపీ నాయకులు మాజీ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, ఆప్కో డైరెక్టర్ మిద్దెల హరి ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకు పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఒక ప్రకటనలో తెలియజేస్తూ నూతన తెలుగు సంవత్సరం లో తెలుగు ప్రజల కుటుంబాల్లో ఆర్థిక, ఆరోగ్య, సంతోషాలను నిలపాలని కోరుకుంటున్నట్లు గవర్నర్‌ తెలిపారు. 60 ఏళ్ల కాలచక్రంలో పరాభవ 40వ సంవత్సరమని, పరాభవ అంటే మనలోని అహంకారాన్ని, చెడు ఆలోచనలను ఓడించి విజయానికి పునాది వేసేదన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో గంజాయి స్మగ్లర్ అరెస్ట్ – 2 కేజీల మాదకద్రవ్యాలు స్వాధీనం

శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలో గంజాయి రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతూ ఒక స్మగ్లర్‌ను అరెస్ట్ చేశారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీలలో సుమారు 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో గంజాయి రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో బంగారమ్మ గుడి నుంచి కైలాసగిరి కాలనీకి వెళ్లే మార్గంలో తనిఖీలు నిర్వహించగా 64 ఏళ్ల పెరుమాలు వేణుగోపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని, అనంతరం రిమాండ్‌కు తరలించారు. అతను ప్రస్తుతం శ్రీకాళహస్తిలో నివసిస్తున్నప్పటికీ, తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. గతంలో తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో గంజాయి కేసులో కూడా అతనిపై కేసు నమోదై జైలుకు వెళ్లి వచ్చినట్టు వెల్లడైంది. ఒడిశా నుంచి గంజాయి తెచ్చి తిరుపతి, శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ‘వజ్రపహార్’ కార్యక్రమం కింద గ్రామాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ ఈ కేసును ఛేదించామని పేర్కొన్నారు. గంజాయి వల్ల యువత దారి తప్పుతోందని, దొంగతనాలు, గొడవలు పెరుగుతున్నాయని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా గంజాయి రవాణా లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని సీఐ ప్రజలను కోరారు.

తిరుపతి

నారా వారికి రుద్రాక్షమాలను బహుకరించిన ఎంజీఎం గ్రూప్ చైర్మన్ మల్లికార్జున్ నాయుడు

శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే దివంగత నేత నారా రామమూర్తి నాయుడు 74వ జయంతి వేడుకలు నారావారిపల్లెలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారా రామమూర్తి నాయుడు సతీమణి నారా ఇందిరా, కుమారులు నారా గిరీష్, నారా రోహిత్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శృతి వనంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కేక్ కట్ చేసి ఆయనతో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎంజీఎం గ్రూప్ చైర్మన్ గుడ్లూరు మల్లికార్జున్ నాయుడు హాజరై శ్రీకాళహస్తిలోని తమ హోటల్ ఎంజీఎం గ్రాండ్ లో ఉన్న తోటలో రుద్రాక్ష పండ్ల నుంచి వచ్చిన రుద్రాక్ష పండ్లతో తయారు చేసిన 36 గింజల రుద్రాక్ష మాలను నారా కుటుంబ సభ్యులకు బహుకరించారు. ఈ వేడుకల్లో బంధువులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శాప్ చైర్మన్ రవి నాయుడు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తదితరులు హాజరై నివాళులు అర్పించారు.

తిరుపతి

పీఎం ఉషా పథకంలో శ్రీకాళహస్తి మహిళా కళాశాల ఎంపిక – రూ.5 కోట్ల నిధులు

శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం ఉషా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 29 కళాశాలల్లో తిరుపతి జిల్లాకు చెందిన శ్రీకాళహస్తి మహిళా డిగ్రీ కళాశాల చోటు దక్కించుకుందని కళాశాల ప్రిన్సిపాల్ రాజశేఖర్ ప్రకట ద్వారా తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ….ఈ పథకం ద్వారా కళాశాలకు మొత్తం రూ.5 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడైనదని ఈ నిధులతో రూ.3 కోట్ల వ్యయంతో 8 గదుల నూతన భవనం నిర్మాణం, రూ.1 కోట్లతో ఆధునిక ల్యాబ్ పరికరాల కొనుగోలు, రూ.50 లక్షలతో కళాశాల మరమ్మతులు, మరో రూ.50 లక్షలతో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలతో కళాశాలలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడి, విద్యార్థులకు నాణ్యమైన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ప్రిన్సిపాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

తిరుపతి

బాలమురుగన్ ఆలయంలో నిత్య అన్నదానం – పేదలకు అండగా అంబిలి స్వామి

శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి ఆలయానికి సమీపంలోని సన్నిధి వీధిలో ఉన్న శ్రీ బాలమురుగన్ ఆలయంలో ప్రతిరోజూ పేదలు, భక్తులకు మజ్జిగ, అంబలి పంపిణీ చేస్తూ నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆలయ పీఠాధిపతి శ్రీ స్వయంబు లింగ స్వామి (అంబిలి స్వామి) ఆధ్వర్యంలో ఈ సేవలు కొనసాగుతున్నాయి. గోశాలలో లభించే పాల ఉత్పత్తులతో భక్తులకు ఆహారం అందించడం విశేషంగా నిలుస్తోంది. పేదలకు అన్నదానం చేయడం ద్వారా సమాజంలో సేవా భావాన్ని పెంపొందిస్తూ, భక్తుల ప్రశంసలు అందుకుంటున్న అంబిలి స్వామి సేవలు స్థానికంగా ఆదర్శంగా నిలుస్తున్నాయి.

తిరుపతి

బొజ్జల బృందమ్మ ఆధ్వర్యంలో ఘనంగా యువత నాయకుడు మీర్జా జన్మదిన వేడుకలు

శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ యువత కార్యదర్శి షేక్ మీర్జా జన్మదినం సందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని బొజ్జల బృందమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు మీర్జాను శాలువాతో సన్మానించి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. యువతలో చైతన్యం కల్పిస్తూ పార్టీ బలోపేతానికి మీర్జా చేస్తున్న కృషిని నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జి విజయ్ కుమార్ తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మీర్జా సేవలను కొనియాడారు. భవిష్యత్తులో మరింత ప్రజాసేవ చేయాలని, రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తూ నాయకులు ఆకాంక్షించారు.

తిరుపతి

సియం నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి– నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ

శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన తిరుపతి జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతి, అలాగే పెండింగ్‌లో ఉన్న కీలక పనులపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారులు, తాగునీరు, విద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలపై ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో కూటమి ప్రభుత్వం తిరుపతి జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు ద్వారా సమగ్ర అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా వేగవంతమైన అభివృద్ధి చర్యలు తీసుకుంటూ, శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి కొనసాగిస్తానని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

కర్నూలు

దివ్యాంగులకు ఏపీ సర్కార్ దన్ను.. ‘దివ్యాంగ శక్తి’ కింద ఉచిత బస్సు ప్రయాణం

లాంఛనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఆర్.జి.ఎం, టీడీపీ నేత సోమశెట్టి వెంకటేశ్వర్లు, ​ఏటా రూ. 207 కోట్ల సబ్సిడీతో ప్రభుత్వ భరోసా ​కర్నూలు, ​ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఘనంగా కార్యక్రమం ​పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఆర్.జి.ఎం, టీడీపీ నేత సోమశెట్టి వెంకటేశ్వర్లు, తదితరులు ​కర్నూలు, మార్చి 18 (పున్నమి న్యూస్): సమాజ ప్రగతికి సమాన అవకాశాలే పునాది అనే సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దివ్యాంగుల ప్రయాణాన్ని సులభతరం చేస్తూ, వారిలో ఆత్మవిశ్వాసం నింపడమే లక్ష్యంగా “దివ్యాంగ శక్తి” పథకానికి రూపకల్పన చేసింది. ​ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని దివ్యాంగులు ఏపీఎస్ఆర్టీసీకి చెందిన పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 207 కోట్ల భారీ సబ్సిడీని భరిస్తూ దివ్యాంగులకు కొండంత భరోసాను ఇస్తోంది. ​అర్హతలు ఇవే.. RPwD చట్టం-2016 ప్రకారం గుర్తించిన 21 రకాల వైకల్యాలలో.. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హులైన వారు తమ గుర్తింపు కార్డులతో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. ​ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఘనంగా వేడుక: దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ప్రత్యేక సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ (RGM) తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ సోమశెట్టి వెంకటేశ్వర్లు, ఇతర రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ​ఈ కార్యక్రమానికి దివ్యాంగులు పెద్ద ఎత్తున హాజరై తమ సంతోషాన్ని పంచుకున్నారు. ప్రయాణ ఖర్చుల భారం లేకుండా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, రాష్ట్ర ప్రభుత్వానికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. Uploaded Video:

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.