Sunday, 26 April 2026

Blog

తిరుపతి

బొజ్జల బృందమ్మ ఆధ్వర్యంలో ఘనంగా యువత నాయకుడు మీర్జా జన్మదిన వేడుకలు

శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ యువత కార్యదర్శి షేక్ మీర్జా జన్మదినం సందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని బొజ్జల బృందమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు మీర్జాను శాలువాతో సన్మానించి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. యువతలో చైతన్యం కల్పిస్తూ పార్టీ బలోపేతానికి మీర్జా చేస్తున్న కృషిని నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జి విజయ్ కుమార్ తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మీర్జా సేవలను కొనియాడారు. భవిష్యత్తులో మరింత ప్రజాసేవ చేయాలని, రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తూ నాయకులు ఆకాంక్షించారు.

తిరుపతి

సియం నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి– నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ

శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన తిరుపతి జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతి, అలాగే పెండింగ్‌లో ఉన్న కీలక పనులపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారులు, తాగునీరు, విద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలపై ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో కూటమి ప్రభుత్వం తిరుపతి జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు ద్వారా సమగ్ర అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా వేగవంతమైన అభివృద్ధి చర్యలు తీసుకుంటూ, శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి కొనసాగిస్తానని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

కర్నూలు

దివ్యాంగులకు ఏపీ సర్కార్ దన్ను.. ‘దివ్యాంగ శక్తి’ కింద ఉచిత బస్సు ప్రయాణం

లాంఛనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఆర్.జి.ఎం, టీడీపీ నేత సోమశెట్టి వెంకటేశ్వర్లు, ​ఏటా రూ. 207 కోట్ల సబ్సిడీతో ప్రభుత్వ భరోసా ​కర్నూలు, ​ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఘనంగా కార్యక్రమం ​పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఆర్.జి.ఎం, టీడీపీ నేత సోమశెట్టి వెంకటేశ్వర్లు, తదితరులు ​కర్నూలు, మార్చి 18 (పున్నమి న్యూస్): సమాజ ప్రగతికి సమాన అవకాశాలే పునాది అనే సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దివ్యాంగుల ప్రయాణాన్ని సులభతరం చేస్తూ, వారిలో ఆత్మవిశ్వాసం నింపడమే లక్ష్యంగా “దివ్యాంగ శక్తి” పథకానికి రూపకల్పన చేసింది. ​ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని దివ్యాంగులు ఏపీఎస్ఆర్టీసీకి చెందిన పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 207 కోట్ల భారీ సబ్సిడీని భరిస్తూ దివ్యాంగులకు కొండంత భరోసాను ఇస్తోంది. ​అర్హతలు ఇవే.. RPwD చట్టం-2016 ప్రకారం గుర్తించిన 21 రకాల వైకల్యాలలో.. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హులైన వారు తమ గుర్తింపు కార్డులతో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. ​ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఘనంగా వేడుక: దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ప్రత్యేక సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ (RGM) తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ సోమశెట్టి వెంకటేశ్వర్లు, ఇతర రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ​ఈ కార్యక్రమానికి దివ్యాంగులు పెద్ద ఎత్తున హాజరై తమ సంతోషాన్ని పంచుకున్నారు. ప్రయాణ ఖర్చుల భారం లేకుండా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, రాష్ట్ర ప్రభుత్వానికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. Uploaded Video:

తిరుపతి

కనకదుర్గమ్మను దర్శించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి – ప్రజాశ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు

శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీసమేతంగా ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంను బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ పండితుల ఆశీర్వాదాలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. .. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ముఖ్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజల సమస్యలు తొందరగా పరిష్కారం కావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుననాని, జగన్మాత కనకదుర్గమ్మ తల్లి చల్లని దృష్టి ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని, సమాజంలో శాంతి, ఐక్యత నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. ఈ దర్శనం తనకు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపిందని, ప్రజా సేవలో మరింత నిబద్ధతతో ముందుకు సాగేందుకు ప్రేరణనిచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

తిరుపతి

ఘనంగా మాజీ ఎంపీటీసీ పి. రమేష్ రెడ్డి జన్మదిన వేడుకలు

పున్నమి ప్రతినిధి రామచంద్రాపురం రామచంద్రపురం మండలం కుప్పం బాదూరు మాజీ ఎంపీటీసీ పి. రమేష్ రెడ్డి అన్న జన్మదినాన్ని ఆయన అనుచరులు, స్థానిక ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు, చంద్రగిరి నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ సెంథిల్ కుమార్ ఆధ్వర్యంలో రమేష్ రెడ్డి శాలువాతో సత్కరించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేక్ కటింగ్ చేశారు ఆయన సేవలను కొనియాడారు. భవిష్యత్తులో ప్రజాసేవలో మరింత ముందుకు సాగి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

E-పేపర్

గాయపడ్డ జర్నలిస్టుకు TUWJ(H-143) యూనియన్ ఆర్థిక సహాయం

గాయపడ్డ జర్నలిస్టులకు TUWJ(H-143) యూనియన్ ఆర్థిక సహాయం ఇబ్రహీంపట్నం బిగ్ టివి జర్నలిస్ట్ ముచర్ల నగేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నగేష్ ను పరామర్శించి 65వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన ఇబ్రహీంపట్నం జర్నలిస్టులు.కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు సాక్షి చండిశ్వర్(జిల్లా నాయకులు )నియోజకవర్గం అధ్యక్షులు సూరమోని సత్యనారాయణ, జిల్లా నాయకులు వరికుప్పల అశోక్,,చెరుకూరి రాజు, చెరుకూరి మహేందర్, సూరమోని బాబు, హనుమంతు సుదర్శన్, రాఘవేందర్, విజయ్, కుమార్, రామ్ చందర్, నరేందర్, నరేందరెడ్డి, భూచక్రం గౌడ్, మహేష్ చారి తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ సంఘం విజ్ఞప్తి మేరకు ఆర్థిక సహాయం చేసినవార్ల పేర్లు ఇబ్రహీంపట్నం సిఐ మహేందర్ రెడ్డి =25,000/- ఇబ్రహీంపట్నం BRS యువజన విభాగం నియోజవర్గ అధ్యక్షులు జెర్కోని రాజు =10,000/- ఇబ్రహీంపట్నం నియోజకవర్గ జర్నలిస్టులు =30,000/- మొత్తం=65.000/-

రాజన్న సిరిసిల్ల

పేదా ముస్లిం కుటుంబాలకు రంజాన్ తుఫాన్ అందించిన 34 వార్డు మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ దార్ల సందీప్.

సిరిసిల్ల మార్చి 18 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా 34వ వార్డులో రంజాన్ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ దార్ల సందీప్ గారు మాట్లాడుతూ గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు రాష్ట్రంలో అన్ని మతాలను గౌరవిస్తూ వారి పండగలకు సహాయ సహకారాలు అందించారు. ఈరోజు అదే ఆలోచన కనుగొనంగా పవిత్ర రంజాన్ మాసంలో 34వ వార్డుకు చెందిన ముస్లిం కుటుంబాలకు రంజాన్ తుఫాన్ అందించడం జరిగింది ఎదుటివారికి సహాయం చేయడం దాతృత హృదయాన్ని కలిగి ఉండేలా ఆ అల్లా చూపిన మంచి మార్గాన్ని పాటిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

E-పేపర్

గాయపడ్డ జర్నలిస్టుకు ఆర్థిక సహాయం చేసిన జెర్కోని రాజు

గాయపడ్డ జర్నలిస్టుకు ఆర్థిక సహాయం చేసిన జెర్కోని రాజు పున్నమి న్యూస్ తెలంగాణ ఇంచార్జి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 5వ వార్డ్ కౌన్సిలర్ జెర్కోని మమత రాజు* ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం బిగ్ టివి జర్నలిస్ట్ ముచర్ల నగేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నగేష్ ను పరామర్శించి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో సూరమోని సత్యనారాయణ వరికుప్పల అశోక్, చెరుకురి రాజు, వీర ప్రవీణ్, చింతకింది వీరేష్ ,మాదాసు శ్రీరామ్, సోప్పరి కరుణాకర్ నెనవత్ జలంధర్, ప్రవిణ్ నాయక్,తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

తిరుపతి అభివృద్ధిలో మరో ముందడుగు ఉప్పరపల్లి – మహిళా యూనివర్సిటీ రోడ్డు విస్తరణ పనులకు భూమి పూజ.

పున్నమి ప్రతినిధి, 18 మార్చి 2026 తిరుపతి తిరుపతి నగరాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దే క్రమంలో భాగంగా, తుడా ఆధ్వర్యంలో ఉప్పరపల్లి చెక్ పోస్ట్ నుండి మహిళా యూనివర్సిటీ వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు బుధవారం శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి మరియు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథులుగా పాల్గొని పనులను ప్రారంభించారు. తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుపతి పరిసర ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు.ఉప్పరపల్లి నుండి మహిళా వర్సిటీ వరకు ఉన్న ఈ మార్గం అత్యంత కీలకమైనదని,ఈ రోడ్డు విస్తరణ వల్ల వేలమంది విద్యార్థులకు, స్థానిక ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని,తుడా నిధులతో యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ విస్తరణలో భాగంగా డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ మరియు పాదచారుల కోసం ప్రత్యేక ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిర్ణీత గడువులోగా, ఎక్కడా నాణ్యత విషయంలో రాజీ పడకుండా ఈ పనులను పూర్తి చేయాలని తుడా అధికారులకు తుడా ఛైర్మన్ సూచించారు.* ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ:చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రహదారులను నేడు ప్రాధాన్యత క్రమంలో బాగు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుడా ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు పంచాయతి సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

రాష్ట్రీయ గోకుల మిషన్ ఆధ్వర్యంలో లేగ దూడల ప్రదర్శన

పున్నమి ప్రతినిధి 18 మార్చి 2026 రామచంద్రపురం రామచంద్రపురం మండలం కొత్త వేపకుప్పం పంచాయతీ రైతు సేవా కేంద్రం వద్ద పశుసంవర్ధక శాఖ ద్వారా రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో లేగ దూడల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మండలఅధ్యక్షులు తిరుమలరెడ్డి మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు పులివర్తి నాని రైతుల అభివృద్ధికి త్వరలో మినీ గో కులాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. రైతులకు మినరల్ మిక్చర్, మల్టీ విటమిన్ సిరప్, పంపిణీ చేయడం జరిగింది. వేయదూడల ప్రదర్శనలు మొదటి బహుమతి రేవతి, రెండవ బహుమతి పాపిరెడ్డి, మూడవ బహుమతి సుబ్రహ్మణ్యం రెడ్డి కీ పాల క్యారియర్లు మినరల్ మిక్చారు మల్టీ విటమిన్ సిరపులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆవుల ప్రసాద్, వెటర్నరీ డాక్టర్లు భువనేశ్వరి, జయ కృష్ణ,కిరణ్, టిడిపి నాయకులు చిన్న స్వామి రెడ్డి, బండి విజయ్ కుమార్ రెడ్డి, పంతల వెంకటేష్ రాయల్, జోహార్, తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.