Sunday, 26 April 2026

Blog

తిరుపతి

రైతన్నల కళ్ళలో వెలుగు నింపటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

ఎమ్ఎస్ ఎంఈ డైరెక్టర్ చినబాబు పున్నమి ప్రతినిధి,రామచంద్రాపురం ఆరుగాలం కష్టపడి అందరికీ ఆహారాన్ని పండించే రైతన్నల కళ్ళలో వెలుగు నింపటమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు సూక్ష్మ చిన్న మధ్య తరగతి పరిశ్రమల డైరెక్టర్ నల్లపనేని మురళీమోహన్ (చినబాబు) అన్నారు. రామచంద్రాపురం మండలం,కమ్మపల్లి పంచాయతీలో బుధవారం రైతులు మరియు కార్యకర్తల అన్నదాత సుఖీభవకు సంభందించిన కర పత్రాలను ఆవిష్కరించి పంచిపెట్టారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు ఖాతాలకు జమ చేసినటు వంటి అన్నదాత సుఖీభవ నిధులను గురించి చినబాబు వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు యువ నాయకుడు నారా లోకేష్ రాష్ట్రమంతా పర్యటించి రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారని తెలిపారు.ఆ సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే సంవత్సరానికి 20వేల రూపాయలు అన్నదాతల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నట్లు చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం గత పాలకులు సాగించిన అనాలోచిత పాలనతో ఆర్థికంగా చితికి పోయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతన్నల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు.రైతులతో యాంత్రిక వ్యవసాయ పనిముట్లను విత్తనాలను ఎరువులను అందిస్తున్నారని గుర్తు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అందిస్తున్న పథకాలు ఏ ఇతర రాష్ట్రంలోనూ లేవని తెలియజేశారు.పంటలకు అవసరమయ్యే ఎరువులను గ్రామాలలోని ఎక్కడకక్కడ కూటమి ప్రభుత్వం అందిస్తున్నదని వివరించారు.రైతుల భూములకు సంబంధించి ఎలాంటి తప్పిదాలకు చోటు లేకుండా రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను పారదర్శకానికి మారుపేరుగా అందిస్తున్నదన్నారు.వ్యవసాయానికి న్యాయమైన కరెంటు అందించడంలో భాగంగా మండలంలో పలు కరెంటు సబ్ స్టేషన్లను మంజూరు చేసిందన్నారు.రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరిస్తున్నారని పేర్కొన్నారు.సమర్థత కలిగిన ఎమ్మెల్యే,దూర ఆలోచన కలిగిన ముఖ్యమంత్రి, ఆధునికతను అవలోహనము చేసుకున్న యువ నాయకుడు వున్న జట్టుతో రైతన్నలకు ఎల్లప్పుడు అన్ని విధాలుగా మంచిగలుగుతుందని తెలియజేశారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా అగ్రిటెక్ ను యువతకు పరిచయం చేసి వ్యవసాయ ఎగుమతులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నదని చెప్పారు.ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

100 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా ఆరోపణలు: స్థలాన్ని పరిశీలించిన కాకాణి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి ( పున్నమి ప్రతినిధి) .సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం కాగితాలపూరు వద్ద జాతీయ రహదారి పక్కనున్న సర్వే నంబర్ 434-Aలో 4.28 ఎకరాల ప్రభుత్వ భూమిని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ భూమిని కబ్జా చేసి ఫెన్సింగ్ వేసి, పాత జీపీఏలతో అక్రమ రిజిస్ట్రేషన్లకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. సుమారు రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేయడానికి కుట్ర జరుగుతోందని తెలిపారు. అధికారులు ఒత్తిడికి లొంగవద్దని హెచ్చరించారు.

ఖమ్మం

ఖమ్మం భూదాన్ భూములపై హైకోర్టు స్టేటస్ కో – కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ఖమ్మం, మార్చి ( పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భూదాన్ భూములపై యథాస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో బాధితులు హైకోర్టును ఆశ్రయించి, అసలైన లబ్ధిదారులను గుర్తించాలని, ఇళ్ల స్థలాలు కోల్పోయిన అందరికీ భూదాన్ భూముల్లో ఇళ్ల స్థలం మరియు ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. విచారణ అనంతరం కోర్టు, కేవలం 311 మందికే కాకుండా, అక్కడ ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని స్పష్టం చేసింది. అన్ని బాధితులను గుర్తించి వారికి తగిన ఇళ్ల స్థలం, నివాస సౌకర్యాలు కల్పించాల్సిందిగా సూచించింది. అలాగే భూదాన్ భూములపై ఎటువంటి మార్పులు చేయకుండా స్టేటస్ కో కొనసాగించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామం రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

ఖమ్మం

ఖమ్మం కార్పొరేషన్196 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం

ఖమ్మం, మార్చి: ( పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి జిల్లా ఇంచార్జి ) 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ రూ.196 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం లభించింది. బుధవారం మేయర్ పూనుకోల్లు నీరజ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి బడ్జెట్ వివరాలను వెల్లడించారు. నగర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా నగరంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు కోసం చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, చెత్త సేకరణ వంటి పౌర సేవలను మరింత మెరుగుపరచడంపై దృష్టి సారించారు. ఈ బడ్జెట్ ద్వారా నగరంలో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కార్పొరేషన్ కృషి చేయనుంది.

రాజన్న సిరిసిల్ల

మొరాపూర్ గ్రామంలో కంకర లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో బాలుని మృతి .

ముస్తాబాద్ మార్చి 18 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గుర్రాపూర్ గ్రామంలో అతివేగంగా వస్తున్న కంకర లోడ్ ట్రాక్టర్ భూక్య ఇషాన్ అక్కడికక్కడే మృతి చెందాడు.ఇషాన్ ముస్తాబాద్ మహర్షి స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. స్కూల్ అయిపోగానే అయిపోగానే ఆడుకోవడానికి సైకిల్ తీసుకొని రోడ్డుపైన వెళుతుండగా వేగంగా ఉన్న ట్రాక్టర్లు ఢీకొట్టడంతో స్పాట్లోనే చనిపోయాడు. వెంటనే ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఈ సంఘటనతో మొరాపూర్ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి

నారాయణపేట

ప్రధానమంత్రి సంసాద్ ఖేల్ మహోత్సవాన్ని విజయవంతం చేయండి బీజేపీ రాష్ట్ర నాయకులు బి కొండయ్య

గ్రామీణ స్థాయి యువకులకు మానసిక ఉల్లాసన్ని మరియు క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసే లక్షంతో దేశం మొత్తం పైన అన్ని మండల కేంద్రాల్లో క్రికెట్, వాలీబాల్, ఖోఖో మరియు ఖబడ్డీ నిర్వహించడానికి మన దేశ ప్రధాని శ్రీ నరేంద్రమోడీ సంసాద్ ఖేల్ ప్రోగ్రాం ను తీసుకోవడం జరిగిందని కొండయ్య గారు అన్నారు. క్రిష్ణ మండల అధ్యక్షులు నల్లే నర్సప్ప అధ్యక్షతన పత్రికా సమావేశన్ని నిర్వహించిన వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ నెల 9 నుండి ప్రారంభం అయినా ఈ కార్యక్రమం 24 వరకు క్రీడా కారులు QR కోడ్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని ఏప్రిల్ 9 నుండి 24 వరకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతిలు ఇవ్వడం జరుగుతుంది అన్నారు. క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన వారిని తాలూకా జిల్లా స్థాయికి పంపడం జరుగుతుంది. అన్నారు. ఈ ప్రోగ్రాం సమన్వం చేయడానికి,,ఖబడ్డీ ఆటకు,,కు గాను 1.జెగ్గిలి ఉసెనప్ప గుడెబల్లూరు 9133525823గారిని,,క్రికెట్ ఆటకు,, 2 సచిన్ బట్ క్రిష్ణ 7676923324 గారిని,,ఖోఖో ఆటకు,, జి శ్రీనివాస్లు ఖందొడ్డి 9391572911గారిని మరియు,, వాలిబాల్ ఆటకు,, దండు రాఘవేంద్ర ముడుమాల్ 9000241469 గార్లను క్రిష్ణ మండల పరిధిలోని గ్రామాల క్రీడా కారులు సంప్రదించాలని అన్నారు.

మహబూబ్ నగర్

*ప్రకృతికి ప్రాణం పోసే పండుగ ఈ ఉగాది

*పచ్చని తోరణం …ప్రకృతికి ప్రాణం.. ఈ ఉగాది* *మామిడి ఆకుల తోరణాల *పంచాంగ శ్రవణం*, *వివరాలతో* *కారం అనే అసహనాన్ని* *నిన్నటి చేదును* *మర్చిపోదాం*, *రేపటి తీపి కోసం, ఎదురుచూద్దాం*. *ఉప్పుతో ఉత్సాహంగా ముందుకెళ్దాం*, *వసంతకాలంలో కోకిల గానం, ఆనందాన్ని నింపే పచ్చని* *తోరణం*, *ప్రకృతికి ప్రాణం పోసే పండుగ,* *మన సంస్కృతి మూలాలకు అసలైన వేదిక ఉగాది,* *రచన ఎమ్ ఎన్ విజయకుమార్,* *కవి రచయిత, పాలమూరు జిల్లా*

మహబూబ్ నగర్

*ప్రకృతికి ప్రాణం పోసే పండుగ ఈ ఉగాది

*పచ్చని తోరణం …ప్రకృతికి ప్రాణం.. ఈ ఉగాది* *మామిడి ఆకుల తోరణాల *పంచాంగ శ్రవణం*, *వివరాలతో* *కారం అనే అసహనాన్ని* *నిన్నటి చేదును* *మర్చిపోదాం*, *రేపటి తీపి కోసం, ఎదురుచూద్దాం*. *ఉప్పుతో ఉత్సాహంగా ముందుకెళ్దాం*, *వసంతకాలంలో కోకిల గానం, ఆనందాన్ని నింపే పచ్చని* *తోరణం*, *ప్రకృతికి ప్రాణం పోసే పండుగ,* *మన సంస్కృతి మూలాలకు అసలైన వేదిక ఉగాది,* *రచన ఎమ్ ఎన్ విజయకుమార్,* *కవి రచయిత, పాలమూరు జిల్లా*

కడప

దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం – ఉచిత బస్సు ప్రయాణం

*ప్రొద్దుటూరు నియోజకవర్గం RTC బస్టాండ్ నందు దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించి దివ్యాంగులతో కలిసి బస్సులో రాజుపాలెం వరకు ప్రయాణించి దివ్యాంగులకు స్వయంగా భోజనాన్ని వడ్డించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు* *దివ్యాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసింది.దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ‘ దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఉగాది కానుకగా ప్రభుత్వం నేటి నుండి అమలులోకి తెచ్చింది.* *ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దివ్యాంగులను అన్ని రంగాల్లో సమానంగా ప్రోత్సహించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.ప్రతి దివ్యాంగుడు ఆత్మవిశ్వాసంతో,గౌరవంగా జీవించేలా చేయడమే చంద్రబాబు నాయుడు గారి సంకల్పం అని స్పష్టం చేశారు.ఈ అవకాశాన్ని దివ్యాంగులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు* *ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి గారు,కడప జిల్లా పరిషత్ C.E.O & ప్రొద్దుటూరు ప్రత్యేక అధికారి ఓబులమ్మ గారు,రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ Vs ముక్తియార్ గారు,రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ అహమ్మద్ గారు,రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు గారు,రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ డైరెక్టర్ శ్రీనివాసాచారి గారు,DLDO రామాంజనేయులు గారు,RTC DM గంగాధర్ గారు,MPDO సూర్యనారాయణ రెడ్డి గారు,TDP కడప జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వై.యస్ జబీవుల్లా గారు,TDP పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్ గారు,కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారు,ఇవి సుధాకర్ రెడ్డి గారు,టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి గారు,హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ మాజీ చైర్మన్ కామిశెట్టి బాబు గారు,మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆసం రఘురామి రెడ్డి గారు,వద్ది బాలుడు గారు,బచ్చల ప్రతాప్ గారు,BJP పట్టణ అధ్యక్షుడు నరేంద్ర గారు,జనసేన సుంకర మురళీ గారు,ప్రసాద్ గారు,జిలాన్ గారు,మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు,అధికారులు,కూటమి ప్రభుత్వ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దివ్యాంగులకు శుభ వార్త ఉచిత బస్సు ప్రయాణం ప్రారoబిoచిన హిమాన్ శుక్ల

నెల్లూరు నగరంలో దివ్యాంగులకు శుభవార్త అందింది. జిల్లా ఆర్టీసీ బస్టాండ్‌లో దివ్యాంగ శక్తి పథకాన్ని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి వారికి అందుతున్న సదుపాయాలను పరిశీలించారు. ఈ పథకం ద్వారా ఇకపై దివ్యాంగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన తెలిపారు. ప్రయాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని దివ్యాంగులను కోరారు. ప్రభుత్వం వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సుజాత, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. దివ్యాంగుల జీవనోపాధి, ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా ఈ పథకం ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.