Sunday, 26 April 2026

Blog

కడప

దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం – ఉచిత బస్సు ప్రయాణం

*ప్రొద్దుటూరు నియోజకవర్గం RTC బస్టాండ్ నందు దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించి దివ్యాంగులతో కలిసి బస్సులో రాజుపాలెం వరకు ప్రయాణించి దివ్యాంగులకు స్వయంగా భోజనాన్ని వడ్డించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు* *దివ్యాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసింది.దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ‘ దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఉగాది కానుకగా ప్రభుత్వం నేటి నుండి అమలులోకి తెచ్చింది.* *ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దివ్యాంగులను అన్ని రంగాల్లో సమానంగా ప్రోత్సహించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.ప్రతి దివ్యాంగుడు ఆత్మవిశ్వాసంతో,గౌరవంగా జీవించేలా చేయడమే చంద్రబాబు నాయుడు గారి సంకల్పం అని స్పష్టం చేశారు.ఈ అవకాశాన్ని దివ్యాంగులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు* *ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి గారు,కడప జిల్లా పరిషత్ C.E.O & ప్రొద్దుటూరు ప్రత్యేక అధికారి ఓబులమ్మ గారు,రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ Vs ముక్తియార్ గారు,రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ అహమ్మద్ గారు,రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు గారు,రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ డైరెక్టర్ శ్రీనివాసాచారి గారు,DLDO రామాంజనేయులు గారు,RTC DM గంగాధర్ గారు,MPDO సూర్యనారాయణ రెడ్డి గారు,TDP కడప జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వై.యస్ జబీవుల్లా గారు,TDP పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్ గారు,కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారు,ఇవి సుధాకర్ రెడ్డి గారు,టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి గారు,హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ మాజీ చైర్మన్ కామిశెట్టి బాబు గారు,మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆసం రఘురామి రెడ్డి గారు,వద్ది బాలుడు గారు,బచ్చల ప్రతాప్ గారు,BJP పట్టణ అధ్యక్షుడు నరేంద్ర గారు,జనసేన సుంకర మురళీ గారు,ప్రసాద్ గారు,జిలాన్ గారు,మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు,అధికారులు,కూటమి ప్రభుత్వ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దివ్యాంగులకు శుభ వార్త ఉచిత బస్సు ప్రయాణం ప్రారoబిoచిన హిమాన్ శుక్ల

నెల్లూరు నగరంలో దివ్యాంగులకు శుభవార్త అందింది. జిల్లా ఆర్టీసీ బస్టాండ్‌లో దివ్యాంగ శక్తి పథకాన్ని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి వారికి అందుతున్న సదుపాయాలను పరిశీలించారు. ఈ పథకం ద్వారా ఇకపై దివ్యాంగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన తెలిపారు. ప్రయాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని దివ్యాంగులను కోరారు. ప్రభుత్వం వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సుజాత, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. దివ్యాంగుల జీవనోపాధి, ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా ఈ పథకం ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.

కడప

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం అమృత నగర్ లో ఘనంగా రంజాన్ సేవా కార్యక్రమం.

రమజాన్ సంధర్భంగా అమ్రతనగర్ 2 లో బాబా వలీ మరియు అతని మిత్ర బృందం మహిళలకు 800 రూపాయలు విలువగల గల 11 రకాల నిత్యావసర సరుకుల కిట్నూ AP స్టేట్ షేక్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ V.S ముక్తియార్ గారి చేతుల మీదుగా అందచేసారు ఈ సందర్భంగా రమజాన్ మాస గొప్పదనం గురించి వివరిస్తూ ఖురాన్ భూమ్మీదికి వచ్చిన పవిత్ర మాసమని జీవనవిధానం గురించి పూర్తిగా అవగాహన కలిగేలా ఉన్నాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొణిజేటి శివ చంద్రారెడ్డి 19వ వార్డు మాజీ కౌన్సిలర్ మునీర్ లు పాల్గొన్నారు less

ఖమ్మం

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేతలు

ఖమ్మం, మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి): పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రముఖ నాయకులు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ ఉగాది పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన కోరారు. అలాగే కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, వరంగల్ జిల్లా ఇంచార్జి కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఉగాది పర్వదినం కొత్త ప్రారంభాలకు ప్రతీకగా నిలుస్తుందని, రైతులకు ఈ సంవత్సరం మంచి పంటలు పండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, రాష్ట్రంలో అభివృద్ధి, శాంతి, సుభిక్షతలు నెలకొనాలని ఆకాంక్షించారు

ఖమ్మం

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేతలు

ఖమ్మం, మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి): పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రముఖ నాయకులు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ ఉగాది పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన కోరారు. అలాగే కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, వరంగల్ జిల్లా ఇంచార్జి కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఉగాది పర్వదినం కొత్త ప్రారంభాలకు ప్రతీకగా నిలుస్తుందని, రైతులకు ఈ సంవత్సరం మంచి పంటలు పండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, రాష్ట్రంలో అభివృద్ధి, శాంతి, సుభిక్షతలు నెలకొనాలని ఆకాంక్షించారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అనంతసాగరం మార్కెట్ యార్డ్ ఆధునికీకరణకు శ్రీకారం – ఛైర్మన్ ఆరికట్ల జనార్ధన్ నాయుడు పరిశీలన

అనంతసాగరం మండలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆధునికీకరణకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆరికట్ల జనార్ధన్ నాయుడు సంబంధిత అధికారులతో కలిసి మార్కెట్ యార్డ్‌ను పరిశీలించారు. మార్కెట్ యార్డ్‌లో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాల మెరుగుదలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. తూకం యంత్రాల సమీకరణ, గోదాముల నిర్మాణం, తాగునీటి సదుపాయం, డ్రైనేజీ వ్యవస్థ, రహదారుల అభివృద్ధి వంటి అంశాలను అధికారులతో సమీక్షించారు. రైతులు తమ పంటలను సులభంగా విక్రయించుకునే విధంగా మార్కెట్ యార్డ్‌ను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దాలని సూచించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధితో రైతులకు మెరుగైన ధరలు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

దివ్యాంగులకు శుభవార్త

✍️✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు గౌ.కందుల దుర్గేష్ గారి కార్యాలయం నిడదవోలు మార్చి 2026 నుండి SADAREM స్లాట్స్ విడుదల ప్రారంభం పాత పెండింగ్ అప్లికేషన్లకు మార్గం సుగమం. మార్చి 2026 నుంచి మే 2026 వరకు (1st రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో నిర్ణీత సంఖ్యలో స్లాట్ లు అందుబాటులో ఉంటాయి ముఖ్య అంశాలు:- ప్రతి సోమ, మంగళవారాల్లో స్లాట్ బుకింగ్ అందుబాటులో ఉంటుంది. మొత్తం 21 రకాల వైకల్యాలకు సర్టిఫికెట్లు జారీ చేస్తారు. RPWD చట్టం ప్రకారం అసెస్మెంట్ జరుగుతుంది. (RPWD చట్టం అంటే “Rights of Persons with Disabilities Act, 2016” (వికలాంగుల హక్కుల చట్టం, 2016). ఇందులో మొత్తం 21 రకాల వైకల్యాలు గుర్తించబడ్డాయి. అంధత్వం, తక్కువ చూపు, వినికిడి లోపం, లోకోమోటర్ డిజబిలిటీ, కుష్ఠ వ్యాధి నివారణ పొందిన వారు, మేధో వైకల్యం, మానసిక అనారోగ్యం, ఆటిజం, సెరిబ్రల్ పాల్సీ, కండరాల క్షీణత, దీర్ఘకాలిక నరాల వ్యాధులు, లెర్నింగ్ డిజబిలిటీస్, మల్టిపుల్ స్క్లెరోసిస్, మాట మరియు భాషా వైకల్యం, ధలసీమియా, హీమోఫీలియా, సికిల్ సెల్ డిసీజ్, మల్టిపుల్ డిజబిలిటీస్, యాసిడ్ ఎటాక్ బాధితులు, పార్కిన్సన్స్ వ్యాధి వంటి పరిస్థితులు ఇందులో చేర్చబడ్డాయి. ముఖ్య సమాచారం:- UDID (Unique Disability ID) కార్డు లింక్ చేయడం అనేది అతి ముఖ్యమైన అంశం. UDID కార్డు అనేది వికలాంగుల కోసం ప్రభుత్వం ఇచ్చే ఒక యూనిక్ ఐడెంటిటీ కార్డు. UDID కార్డు లింక్ చేయడం అంటే మీ ఆధార్, బ్యాంక్, మరియు ప్రభుత్వ పథకాలతో మీ డిసబిలిటీ ఐడీని కనెక్ట్ చేయడం. దీని వలన పెన్షన్, స్కాలర్‌షిప్, మరియు ఇతర బెనిఫిట్స్ సులభంగా పొందేందుకు ఉపయోగపడుతుంది. గ్రామ సచివాలయం లేదా MeeSevaలో కూడా లింక్ చేయించుకోవచ్చు. ఈ లింకింగ్ వికలాంగతకు సంబంధించిన అన్ని వివరాలు ఒకే కార్డులో ఉంటాయి. మళ్లీ మళ్లీ సర్టిఫికేట్లు చూపాల్సిన అవసరం తగ్గుతుంది. UDID కార్డు All India valid – ఏ రాష్ట్రంలోనైనా ఉపయోగించవచ్చు. బయోమెట్రిక్ & ఫోటో తప్పనిసరి ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ తప్పనిసరి మెడికల్ బోర్డు ద్వారా ఫైనల్ వెరిఫికేషన్* జరుగుతుంది. పై సమాచారాన్ని *కేడర్ క్షేత్రస్థాయిలో అవసరమైన దివ్యాంగులకు తెలియజేయండి. పూర్తి సమాచారం కొరకు సచివాలయాలలో ఉన్న వెల్ఫేర్, డిజిటల్ అసిస్టెంట్లను సంప్రదించండి. END…..

తెలంగాణ

అపర్ణ సైనర్జీ – ఆధునిక జీవనానికి ప్రీమియం నివాసాలు

అపర్ణ సైనర్జీ (Aparna Synergy) అనేది ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన Aparna Constructions అభివృద్ధి చేసిన గృహ ప్రాజెక్ట్. హైదరాబాద్‌లో గాండీ మైసమ్మ సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్ట్, ORR ద్వారా గచ్చిబౌలి IT హబ్‌కు సుమారు 40 నిమిషాల దూరంలో ఉంటుంది. 2 & 3 BHK అపార్ట్‌మెంట్లు, ఆధునిక సౌకర్యాలు, గ్రీన్ లివింగ్, భద్రతా ప్రమాణాలు ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు. కుటుంబాలకు సౌకర్యవంతమైన జీవనశైలిని అందించేలా ప్రణాళిక చేయబడింది

విశాఖపట్నం

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గ్యాస్ సంక్షోభం… ఉత్పత్తిపై ప్రభావం

విశాఖపట్నం మార్చి(పున్నమి ప్రతినిధి) దేశంలో ప్రఖ్యాతి గాంచిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం తీవ్ర గ్యాస్ కొరత సమస్యను ఎదుర్కొంటోంది. పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావంతో ఎల్పీజీ సరఫరా పూర్తిగా నిలిచిపోవడం ప్లాంట్ కార్యకలాపాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సరఫరాలో గృహ వినియోగం, ఆస్పత్రులకు ప్రాధాన్యం ఇవ్వడంతో పరిశ్రమల సరఫరా తగ్గించబడింది. సాధారణ పరిస్థితుల్లో ప్లాంట్ ఉత్పత్తి నిర్వహణకు రోజుకు సుమారు 12 టన్నుల ఎల్పీజీ అవసరం ఉంటుంది. అయితే ప్రస్తుతం కేవలం ఐదు రోజులకే సరిపడే నిల్వలు మాత్రమే మిగిలి ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నిల్వలు ముగిసిన తర్వాత కటింగ్, ఫ్యాబ్రికేషన్ వంటి కీలక పనులు నిలిచిపోవడం అనివార్యం అవుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ కొరత కారణంగా స్టీల్ బ్లూమ్స్‌ను బయట ప్రైవేట్ యూనిట్లకు పంపించి ప్రాసెసింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల రవాణా ఖర్చులు, ప్రాసెసింగ్ చార్జీలు పెరిగి ప్లాంట్‌పై అదనపు ఆర్థిక భారం పడుతోంది. ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిలో ఉన్న ప్లాంట్‌కు ఇది మరింత భారంగా మారింది. ఈ సంక్షోభం కొనసాగితే ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్లాంట్ కార్యకలాపాలు మందగిస్తే ఉద్యోగుల ఉపాధిపై కూడా ప్రభావం పడే అవకాశముంది. దీనితో కార్మికులు, స్థానిక ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని గ్యాస్ కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి పరిశ్రమలకు కనీస అవసరాల మేరకు గ్యాస్ సరఫరా పునరుద్ధరించకపోతే, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిశ్రమల అభివృద్ధికి కీలకమైన ఈ ప్లాంట్‌ను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు సూచిస్తున్నారు.

E-పేపర్

ప్రజాపాలన-ప్రగతిప్రణాళిక, లో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసినటు వంటి CDPO వినితాదేవి

పున్నమి న్యూస్ తెలంగాణ.. ఈ రోజు ICDS ఇబ్రహీంపట్నం ప్రాజెక్టు పరిధిలోని ఖానాపూర్ లో “ప్రజాపాలన-ప్రగతిప్రణాళిక, లో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసినటు వంటి CDPO వినితాదేవి మాట్లాడుతు. SAM, MAM, పిల్లలు గ్రోత్ గురించి తెలియచేయుడం. అలాగే హేత్ఫల్డెన్ నెంబర్స్ 1098, 100, 112,181 గురించి బాల్యవివాహాల పరిణామాలు గురించి తెలియచేసారు. అలాగే CBE Evendలో భాగంగా గర్భిణలను శ్రీదంటే చేసి సలహాలు, సూచనలు అంద చేయడం జరిగిది. ఈ కార్యక్రమానికి సూరుర్వజర్ కల్పనీ BC శ్రీనివాస్ AWT లలిత గర్భిణలు, బాలెంతలు, పిల్లల తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గనడం జరిగింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.