Sunday, 26 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆపరేషన్ “వజ్రప్రహార్”లో భాగంగా కావలిలో కార్డన్, సెర్చ్

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో పోలీసులు నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఆపరేషన్ “వజ్రప్రహార్”లో భాగంగా కావలి 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టి ఇంటింటి తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై దృష్టి సారిస్తూ పత్రాలు లేని వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 27 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా, కొత్తగా ప్రాంతానికి వచ్చిన వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచుతున్నామని పోలీసులు తెలిపారు. అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారి వివరాలను సేకరిస్తూ, అనుమానాస్పద వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని, తమ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఇలాంటి ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నేరాల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా డ్రోన్ నిఘా – జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల, IPS

నెల్లూరు: జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నారు. జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల, IPS గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సంబంధిత డీఎస్పీల ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు కలిసి పట్టణం, శివారు ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాల్లో డ్రోన్ల సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నేరాల నివారణ లక్ష్యంగా క్రైమ్ ప్రోన్ ఏరియాలపై నిరంతరం డ్రోన్ నిఘా కొనసాగుతోంది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట నిర్వహణ, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, దొంగతనాలు, రహదారి ప్రమాదాలు వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. నేరాలకు ఆస్కారం ఉన్న ప్రదేశాలను ముందుగానే గుర్తించి పాడుబడిన భవనాలు, తోటలు, పార్కులు, నదీ తీర ప్రాంతాల్లో ప్రత్యేకంగా డ్రోన్ నిఘా ఏర్పాటు చేశారు. పట్టణ సమీప ప్రాంతాల్లో కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గంజాయి సేవించడం, అమ్మడం, రవాణా చేసే వారిపై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే డయల్ 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. జిల్లాలో సాంకేతికత ఆధారంగా నేరాల నియంత్రణకు తీసుకుంటున్న ఈ వినూత్న చర్యలతో ప్రజలకు మరింత భద్రత కల్పించాలనే లక్ష్యంతో నెల్లూరు పోలీసులు ముందుకు సాగుతున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు దర్గా సెంటర్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు – మంత్రి ఆనం, టిడిపి నేతల పాల్గొనడం

ఆత్మకూరు పట్టణంలోని దర్గా సెంటర్‌లో రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు గౌ. శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు మరియు కిమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ తాళ్లూరి గిరి నాయుడు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆత్మకూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ ఆరికట్ల జనార్ధన్ నాయుడు పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో ఉపవాస విరమణ చేశారు. నాయకులు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పవిత్ర మాసం శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, మత పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సోదరభావాన్ని చాటారు.

News

“కళారత్న నేషనల్ అవార్డ్” అందుకున్న నక్క పోచ రాజయ్య ( నక్క రాజు) బహుజన సాహితీ వేత్తలను గుర్తించడమే మన బి.ఎస్.ఎ. లక్ష్యం – సౌత్ ఇండియా నేషనల్ కాన్ఫరెన్స్ లో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ – తెలంగాణ అమర వీరుల త్యాగాలను చాటి చెప్పిన డా.దరువు ఎల్లన్న

“కళారత్న నేషనల్ అవార్డ్” అందుకున్న నక్క పోచ రాజయ్య ( నక్క రాజు) బహుజన సాహితీ వేత్తలను గుర్తించడమే మన బి.ఎస్.ఎ. లక్ష్యం – సౌత్ ఇండియా నేషనల్ కాన్ఫరెన్స్ లో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ – తెలంగాణ అమర వీరుల త్యాగాలను చాటి చెప్పిన డా.దరువు ఎల్లన్న ****************** జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన నక్క పోచ రాజయ్య (నక్క రాజు) ఆదివారం సాయంత్రం తిరుపతి లోని జి.ఎస్.కె.ఆర్. భవన్ లో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ చేతుల మీదుగా “కళారత్న నేషనల్ అవార్డ్” అందుకున్నారు. బహుజన జాతీయవాది మాన్యశ్రీ కాన్షీరామ్ జయంతి సందర్భంగా తిరుపతిలో 18వ జాతీయ స్థాయి సాహితీ వేత్తల సదస్సు, అవార్డుల ప్రధానోత్సవ సభను బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. దాదాపు గత రెండు దశాబ్దాలుగా నక్క పోచ రాజయ్య (నక్క రాజు)చేస్తున్న కళా ప్రదర్శనలు, ఆధ్యాత్మిక, ఉద్యమ కళా ప్రదర్శనలు, 24 గంటల నిర్విరామ గాన స్వరాభిషేకం, తెలంగాణ ఉద్యమ కారునిగా అందించిన ఉద్యమ కార్యక్రమాలు, నేటికీ సమాజ హితం కోసం ఆయన చేస్తున్న ప్రజా అవగాహన కార్యక్రమాలను, సదస్సులను, యువత గంజాయి, డ్రగ్స్ లకు అలవాటు పడుతున్న నేపథ్యంలో వాటి నివారణ కోసం సదస్సులు, మహిళలకు, బాలికలకు భరోసా లాంటి కార్యక్రమాలను నిర్వహించడం లాంటి అతని గొప్ప కలలను గుర్తించి ఈ “కళారత్న నేషనల్ అవార్డ్” అందించడం జరిగిందని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుడుచ్చేరి తదితర రాష్ట్రాల డెలిగెట్స్ తో పాటు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన బహుజన సాహిత్య అకాడమీ ప్రతినిధులు, పలువురు ప్రముఖులతో పాటు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటి మెంబర్ డా.దరువు ఎల్లన్న, తెలంగాణ రాష్ట్ర కో – ఆర్డినేటర్ విష్ణు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కనుకుట్ల విజయ కుమార్, ప్రముఖ అంబేద్కరిస్ట్ ఉద్యమ నాయకులు మామిడిపల్లి బాపన్న, ప్రముఖ రచయిత, కర్ణాటక రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్.డి.వెంకమ్మ, కేరళ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కళారాణి, తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు పివి రాజేషన్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. ఎన్. వర ప్రసాద్ లతో పాటు వివిధ రాష్ట్రాల, జిల్లాల బాధ్యులు, జాతీయ అవార్డుల సెలెక్షన్ కమిటి సభ్యుడైన సేవా రత్న అవార్డు గ్రహీత, ప్రముఖ ఉద్యమ కారులు చుక్క గంగారెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు గడ్డం రమేష్ తదితరులు పాల్గొన్నారు. – బహుజన సాహితీ వేత్తలను గుర్తించడమే మన బి.ఎస్.ఎ. లక్ష్యం – బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ సౌత్ ఇండియా స్థాయి అవార్డుల ప్రధానోత్సవ సభలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ భారత దేశంలోని బహుజనుల నుండి సాహిత్య పరమైన, సమాజ సేవా పరమైన ఆణిముత్యాలను, త్యాగధనులను వెలికితీసి వారికి తగ్గ గుర్తింపు నిచ్చి అవార్డులతో సత్కరించ డమే మన బహుజన సాహిత్య అకాడమీ సంస్థ లక్ష్యమని వివరించారు. 2017 లో పురుడు పోసుకున్న మన బహుజన సాహిత్య అకాడమీ నేడు జాతీయ స్థాయిలో 28 రాష్ట్రాలకు, ప్రపంచ స్థాయిలో 8 దేశాలకు విస్తరించిందన్నారు. నేపాల్ లో అంతర్జాతీయ స్థాయి సదస్సు, అవార్డుల ప్రధానోత్సవ సభ జరిగిందన్నారు. త్వరలో మలేషియాలో కూడా అంతర్జాతీయ స్థాయి అవార్డుల ప్రధానోత్సవ సభ జరగనుందని ఆయన పేర్కొన్నారు. మన భారత దేశంలోని వివిధ ముఖ్యమైన నగరాలలో ఇప్పటి వరకు జరిగిన ఈ18 కాన్ఫరెన్స్ ల ద్వారా జాతీయ స్థాయిలో వేలాది మంది సాహితీ వేత్తలకు, కవులు – కళాకారులకు, ఉద్యమ కారులకు, సమాజ సేవకులకు, త్యాగ ధనులకు ఆణిముత్యాలుగా గుర్తించి అవార్డులు అందజేయడం జరిగిందన్నారు. అవార్డుల ప్రాధాన్యత, వాటి గొప్ప తనం గూర్చి తనదైన శైలిలో “పాట – మాట” రూపంలో కండ్లకు కట్టినట్లు వివరించి సభికులను ఎంతగానో ఆకట్టుకున్నారు. మన దేశ మహానీయుల గూర్చి, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సాహితీ వేత్తల గురించి, ప్రముఖుల గూర్చి, జాతి రత్నాలైన మన దేశ మహానీయుల గూర్చి, వారి సేవల గూర్చి చాలా చక్కగా వివరించారు. వారి గొప్ప తనాలను ముందు తరాలకు చాటి చెప్పేందుకే అలాంటి మహానీయుల పేరిట మన “బహుజన సాహిత్య అకాడమీ” ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు అందజేయడం జరుగుతోందని సూచించారు. గతంలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ సభలకు ప్రజా యుద్ధ నౌక గద్దర్, జయరాజ్, విమలక్క, మిట్టపల్లి సురేందర్, పాటమ్మ రాంబాబు లాంటి తదితర గొప్ప సాహితీ వేత్తలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారని తెలుపుతూ వారి – వారి గొప్ప తనాల గూర్చి కూడా సభికులకు వివరించారు. నేడు మన తెలంగాణ ఉద్యమ కళాకారులైన సాహితీ వేత్త డాక్టర్ దరువు ఎల్లన్న ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగిందని తెలుపుతూ దరువు ఎల్లన్న గొప్ప తనాన్ని, ఆయన ఉద్యమ సేవలను, జైలు జీవితాన్ని, కలలను, ఆయన రచనలను, పాటలను సభికులకు నల్లా రాధాకృష్ణ సవివరంగా తెలియజేశారు. తెలంగాణ అమర వీరుల త్యాగాలు ప్రపంచానికే గొప్పవి – సౌత్ ఇండియా సభలో చాటి చెప్పిన డా.దరువు ఎల్లన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సాహితీ వేత్త, తెలంగాణ ఉద్యమ కళాకారులు డాక్టర్ దరువు ఎల్లన్న మాట్లాడుతూ మా తెలంగాణ అమర వీరుల త్యాగాలు ప్రపంచానికే గొప్పవని సౌత్ ఇండియా సభలో చాటి చెప్పారు. “వీరులారా వందనం – విద్యార్థి అమరులారా వందనం” పాటను ఆలపించారు. తెలంగాణ ఉద్యమ తీరును, తెలంగాణ రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమర వీరుల త్యాగాలను, తెలంగాణ కలలను, కవులు – కళాకారుల, విద్యార్థుల, ఉద్యమ కారుల పోరాటాలను, తెలంగాణ సంస్కృతిని వివరిస్తూ తనదైన శైలిలో ఉద్యమ గీతాలను ఆలపించి సభికులను ఆశ్చర్యశకితులను చేశారు. వివిధ రాష్ట్రాల నుండి సౌత్ ఇండియా స్థాయిలో ఇట్టి సదస్సుకు హాజరైన ప్రముఖులు, అవార్డ్ గ్రహీతలు, సభికులకు బాహుజనుల గురించి, ప్రభుత్వాల బాధ్యతల గురించి చాలా చక్కగా వివరించారు. బహుజన సాహిత్య అకాడమీ ద్వారా అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరూ మరింత బాధ్యతగా ఈ సభ్య సమాజానికి ఉపయోగ పడేలా మీ సేవలను, కలలను, సాహిత్యాలను ప్రదర్శించాలని కోరారు. బహుజన సాహిత్య అకాడమీ సంస్థ జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి నేడు ఎదిగిందని, ఈ సంస్థ వ్యవస్థాపకులైన నల్లా రాధాకృష్ణ సేవలు యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మన దేశ ఔన్నత్యాన్ని, మన దేశ కళలను గొప్ప కలలుగా, మన సాహిత్యం గొప్ప సాహిత్యంగా చాటిచెప్పడం ఎంతో గర్వంగా ఉందని దరువు ఎల్లన్న పేర్కొన్నారు. ఇంత గొప్పగా ప్రపంచ స్థాయికి ఎదిగి మన దేశ ఔన్నత్యాన్ని, మన కలలను, సాహిత్యాలను గుర్తించి అవార్డులు అందజేసి యావత్ ప్రపంచానికి తెలియజేస్తున్న ఘనత కేవలం బహుజన సాహిత్య అకాడమీ కే దక్కిందని సభకు హాజరైన వక్తలు, ప్రముఖులు కొనియాడారు. మన దేశ ప్రభుత్వం ఈ బహుజన సాహిత్య అకాడమీని గుర్తించి సంస్థ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ కు “భారత రత్న అవార్డు” ప్రకటించాలని ఈ సభలో ముక్త కంఠంతో కోరుతూ సభా తీర్మానంగా ప్రకటించారు. Uploaded Video:

రాజన్న సిరిసిల్ల

మోహినికుంటలో నూతన దంపతులను ఆశీర్వదించిన కల్వకుంట్ల గోపాల్ రావు

ముస్తాబాద్ మార్చి పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో దప్పు శంకర్ – నర్సవ్వ దంపతుల చిన్న కుమారుడు దప్పు లక్ష్మణ్ వివాహ వేడుక సందర్భంగా నూతన దంపతులను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, గ్రామ పెద్దలు సుభాష్ రావు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దంపతులు సుఖశాంతులతో, ఆనందంగా జీవితం గడపాలని ఆశించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

రాజన్న సిరిసిల్ల

మోహినికుంటలో నూతన దంపతులను ఆశీర్వదించిన కల్వకుంట్ల గోపాల్ రావు

ముస్తాబాద్ మార్చి పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో దప్పు శంకర్ – నర్సవ్వ దంపతుల చిన్న కుమారుడు దప్పు లక్ష్మణ్ వివాహ వేడుక సందర్భంగా నూతన దంపతులను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, గ్రామ పెద్దలు సుభాష్ రావు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దంపతులు సుఖశాంతులతో, ఆనందంగా జీవితం గడపాలని ఆశించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గురువిందపూడిలో అభివృద్ధి పనులకు శ్రీకారం – హైస్కూల్‌కు కొత్త గదుల నిర్మాణానికి హామీ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి ) మనుబోలుమండలం గురువిందపూడి గ్రామంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జల్జీవన్ మిషన్ ద్వారా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్, సిసి రోడ్డును ప్రారంభించారు. రూ.36 లక్షల వ్యయంతో నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్‌కు శంకుస్థాపన చేశారు. గ్రామ హైస్కూల్‌కు స్థలం కొరత ఉండటంతో పక్కనున్న భూమిని కొనుగోలు చేసి అదనపు గదులు నిర్మిస్తామని తెలిపారు. నిధుల లేమితో ఆగిపోయిన పనులను త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. గ్రామ రహదారుల మరమ్మత్తులు చేపడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

గుండె జబ్బుతో బాధపడుతున్న మహిళకు “మానవత” ఆర్థిక సాయం

పున్నమి ప్రతినిధి, తాళ్లపూడి, మార్చి 17: మానవత – తాళ్లపూడి ఆధ్వర్యంలో గుండె జబ్బుతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న ప్రక్కిలంక గ్రామానికి చెందిన జుట్టా పద్మావతికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ద్వారా రూ.6,000, అంకెం సురేష్ రూ.1,000, కాలినేని ప్రదీప్ రూ.1,000 కలిపి మొత్తం రూ.8,000 ఆర్థిక సాయం అందించినట్లు సంస్థ అధ్యక్షుడు వెలుగుబంటి శ్రీనివాస్ తెలిపారు. కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడవడమే “మానవత” సంస్థ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. అలాగే సంస్థ ప్రధానంగా విద్య, వైద్య సేవల కోసం అధికంగా ఖర్చు చేస్తుందని వెల్లడించారు. వీరవల్లి శివకృష్ణ మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారు మానవతను ఆశ్రయిస్తే తప్పకుండా సహాయం అందిస్తామని తెలిపారు. సంస్థ ఫౌండర్ రామచంద్రారెడ్డి ఆశయాల మేరకు మానవ సేవ చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో వెలుగుబంటి శ్రీనివాస్, సనపల రాజశేఖర్, అప్పన వీరహనుమంతురావు, అంకెం సురేష్, పెమ్మాడి దుర్గాప్రసాద్, తైలం పోచారావు, కొప్పాక వెంకటేశ్వరరావు, వీరవల్లి శివకృష్ణ, సొలస గాంధీ తదితరులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

బీసీ యూత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మనోహర్‌కు సన్మానం

ముస్తాబాద్ మార్చి పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ బీసీ సాధికారిత సంఘం యూత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నూతనంగా నియమితులైన మెంగని మనోహర్‌ను బీసీ సంఘం రాష్ట్ర నాయకులు శీలం స్వామి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శీలం స్వామి మాట్లాడుతూ, మనోహర్ విద్యార్థి ఉద్యమ కారుడిగా విద్యార్థి ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూనే బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ రాష్ట్ర స్థాయిలో సేవలందించారని పేర్కొన్నారు. ఆయనకు ఈ బాధ్యతలు రావడం ఆనందకరమని అన్నారు. మనోహర్ మాట్లాడుతూ, బీసీ యువతను చైతన్యం చేస్తూ వారి హక్కుల సాధన కోసం కృషి చేస్తానని, తనపై నమ్మకం ఉంచిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుద్దాల దేవయ్య, కొమ్మేట రాజు, భూక్య మధు నాయక్, బాలయ్య, పుట్ట చంద్రయ్య, వినయ్, బాబు తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

రైతన్న ముంగిటకే వ్యవసాయ శాఖ.. ‘రైతన్న మీ కోసం’ కార్యక్రమం ప్రారంభం!

– 16 నుండి 18 వరకు, తిరిగి 23 నుండి 25 వరకు 6 రోజుల పాటు గ్రామాల్లో పర్యటన – ప్రతి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి ‘పంచ సూత్రాల’పై అవగాహన – ఎల్ నినో ముప్పు – నీటి సంరక్షణపై రైతులకు దిశానిర్దేశం రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “రైతన్న మీ కోసం”కార్యక్రమం గ్రామాల్లో సందడిగా ప్రారంభమైంది. వ్యవసాయ శాఖతో పాటు పశుసంవర్ధక, ఉద్యానవన తదితర అనుబంధ శాఖల సిబ్బంది ప్రతి రైతు సేవా కేంద్రం పరిధిలో రైతుల ఇంటి వద్దకే వెళ్లి సాగు మెలకువలను వివరిస్తున్నారు. ఈ నెల 16 నుండి 18 వరకు మొదటి విడతగా, తిరిగి 23 నుండి 25 తేదీ వరకు రెండో విడతగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి గారి ‘పంచ సూత్రాల’ ప్రచారం: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన పంచ సూత్రాలను కరపత్రాల ద్వారా రైతులకు వివరిస్తున్నారు. పంటల ఎంపిక నుండి మార్కెటింగ్ వరకు అనుసరించాల్సిన వ్యూహాలను సిబ్బంది క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. నీటి కొరతపై అప్రమత్తం – ఎల్ నినో ప్రభావం: వచ్చే జూన్ నెల నుండి ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు: పంటల మార్పిడి తక్కువ నీటితో పండే స్వల్పకాలిక పంటల వైపు మొగ్గు చూపాలి.తోటల సంరక్షణ చీని, నిమ్మ వంటి ఉద్యాన పంటలు నీటి ఎద్దడికి గురికాకుండా చేపట్టాల్సిన రక్షణ చర్యలపై రైతులకు ప్రత్యక్షంగా వివరిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం తక్కువ నీటితో సాగు చేసే ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు – ప్రత్యామ్నాయాల వైపు: మిడిల్ ఈస్ట్ దేశాలలో యుద్ధ పరిస్థితుల కారణంగా కొన్ని వ్యవసాయ పరికరాలు, దిగుమతి వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని, అందుకే రైతులు ఖర్చు తగ్గించుకునే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం ద్వారా అందుతున్న వివిధ పథకాలు మరియు రాయితీల గురించి కూడా ఈ పర్యటనలో క్షుణ్ణంగా వివరిస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.