Sunday, 26 April 2026

Blog

E-పేపర్

గాయపడ్డ జర్నలిస్టు నాగేష్ కు ఇబ్రహీంపట్నం సీఐ ఆర్థిక సహాయం.

గాయపడ్డ జర్నలిస్టు నాగేష్ కు ఇబ్రహీంపట్నం సీఐ ఆర్థిక సహాయం. ఇబ్రహీంపట్నం :- పున్నమి న్యూస్ Tg….. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బిగ్ టివి రిపోర్టర్ ముచ్చర్ల నాగేష్ ఇటీవల న్యూస్ కవరేజ్ కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. నిరుపేద కుటుంబానికి చెందిన నాగేష్ పరిస్థితిని గూర్చి టియుడబ్ల్యూజే (హెచ్ 143) యూనియన్ నాయకుల విజ్ఞప్తి మేరకు పరిస్థితిని అర్థం చేసుకున్న ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్ రెడ్డి మానవ దృక్పథంతో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కేంద్రంలోని లిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిపోర్టర్ నాగేష్ ను పరామర్శించి ఆయనకు 25,000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామకృష్ణ, టీయూడబ్ల్యూజే (హెచ్ 143) నియోజకవర్గ అధ్యక్షులు సురమోని సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి చెరుకూరి రాజు, సురమోని బాబు, హనుమంతు సుదర్శన్, మొలుగు శ్రీను, కిషన్, గోవర్ధన్, సైదులు ఇతర యూనియన్ సభ్యులు పి.వెంకటేష్ పి.క్రాంతి, కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి కీలక వ్యాఖ్యలు.*

T.Ravinder ఖమ్మం మార్చి (పున్నమి ప్రతినిధి) *ఖమ్జిమం జిల్లా డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అన్నారు. ఇజ్రాయిల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావంతో ఇండియా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. గత మూడు నెలల్లో ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.300 పెంచిందని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అబద్ధాలు చెబుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నానని అన్నారు. రేపు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఇదే అంశంపై మాట్లాడనున్నట్లు తెలిపారు. యుద్ధ ప్రభావంతో రైతులు నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా యూరియా కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. యుద్ధంలో ఇప్పటివరకు ఇరాన్ పై చేయి సాధించిందని వ్యాఖ్యానించారు. యుద్ధ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని విమర్శించారు. భద్రాచలం టెంపుల్ శ్రీరాముడి ఆశీస్సులు దేశ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంకా కరెంట్ లేని గూడాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ మద్దతు ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. యుద్ధ ప్రభావంతో ఆయిల్‌తో పాటు ప్లాస్టిక్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. Ok

ఖమ్మం

రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి కీలక వ్యాఖ్యలు.*

T.Ravinder ఖమ్మం మార్చి (పున్నమి ప్రతినిధి) *ఖమ్జిమం జిల్లా డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అన్నారు. ఇజ్రాయిల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావంతో ఇండియా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. గత మూడు నెలల్లో ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.300 పెంచిందని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అబద్ధాలు చెబుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నానని అన్నారు. రేపు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఇదే అంశంపై మాట్లాడనున్నట్లు తెలిపారు. యుద్ధ ప్రభావంతో రైతులు నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా యూరియా కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. యుద్ధంలో ఇప్పటివరకు ఇరాన్ పై చేయి సాధించిందని వ్యాఖ్యానించారు. యుద్ధ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని విమర్శించారు. భద్రాచలం టెంపుల్ శ్రీరాముడి ఆశీస్సులు దేశ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంకా కరెంట్ లేని గూడాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ మద్దతు ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. యుద్ధ ప్రభావంతో ఆయిల్‌తో పాటు ప్లాస్టిక్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. Ok

E-పేపర్

రాజమండ్రి అమర జీవి పొట్టి శ్రీరాములు గారి 125 వ జయంతి వేడుకలు

✍️✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి రాజమండ్రి అమర జీవి పొట్టి శ్రీరాములు గారి 125 వ జయంతి సందర్భం గా రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కోట గుమ్మం వద్ద గల పొట్టి శ్రీ రాములు విగ్రహనికి అర్బన్ జిల్లా అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, పార్లమెంట్ కో ఆర్డినేటర్ శ్రీ tk విశవేశ్వర రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బెజవాడ రంగా రావు మరియు ఇతర కాంగ్రెస్డ్ నాయకులు తో కలసి అమర జీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా tk విశవేశ్వర రెడ్డి మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీ రాములు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయటం ద్వారా ఈ రాష్ట్రము ఏర్పడిందని ఆయన నిత్య స్మరనీయుడు అని అమరావతి లో ఆయన 58 అడుగుల విగ్రహం పెట్టడం సంతోషంచాల్సిన విషయం అని అన్నారు అర్బన్ జిల్లా అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ అమరజీవి లాంటి వ్యక్తి ఈనాటి యువతకు స్ఫూర్తి అని అమరజీవి ఆమరణ దీక్ష వల్లనే తెలుగు రాష్ట్రం ఏర్పడింది అని మనం అంతా అమర జీవి పొట్టి శ్రీరాములును నిత్యం స్మరిచాల్సిన వ్యక్తి అని ఆయన త్యాగం మరువలేనిదని కొనియాడారు, సీనియర్ నాయకులు బెజవాడ మాట్లాడుతూ పొట్టి శ్రీ రాములు గారి ప్రాంతీయ అభిమానం తెలుగువారి పట్ల తెలుగు జాతి పట్ల ఆయన చూపి న అభిమానం వేల కట్టలేనిదని మాట్లాడారు ఈ కార్యక్రమం లో కూరగంటి శ్రీను, ఆర్ రాజు, మాదేటి బుజ్జి, m పద్మావతి తదితర్లు పాల్గొన్నారు బాలేపల్లి మురళీధర్, రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు END…..

విశాఖపట్నం

విశాఖ జివిఎంసీ కార్పొరేటర్ల పదవీకాలం ముగింపు ప్రజా సేవలో ఐదేళ్ల ప్రయాణానికి నేటితో ముగింపు

విశాఖపట్నం మార్చి (పున్నమి ప్రతినిధి) విశాఖపట్నం నగర పాలక సంస్థ అయిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసీ)లో కార్పొరేటర్లుగా ఎన్నికైన వార్డు సభ్యుల పదవీకాలం నేటితో అధికారికంగా ముగియనుంది. ఐదేళ్ల క్రితం ప్రజల విశ్వాసంతో ఎన్నికైన ఈ ప్రజాప్రతినిధులు తమ తమ వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, పలు సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషించారు. ఈ కాలంలో నగర అభివృద్ధి, పారిశుధ్యం, రహదారుల నిర్మాణం, తాగునీటి సరఫరా, పార్కుల అభివృద్ధి వంటి అనేక రంగాల్లో కార్పొరేటర్లు ప్రజలతో మమేకమై సేవలందించారు. కొంతమంది కార్పొరేటర్లు తమ పనితీరుతో ప్రజల ప్రశంసలు అందుకోగా, మరికొందరు విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అందించడం, అవసరమైన వస్తువులు సరఫరా చేయడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాల్లో కార్పొరేటర్లు ముందుండి పనిచేశారు. ఆ సమయంలో వారి సేవలు ప్రత్యేకంగా నిలిచాయి. ఇదిలా ఉండగా, పదవీకాలం ముగియడంతో జివిఎంసీ పాలనలో తాత్కాలిక మార్పులు చోటుచేసుకోనున్నాయి. తదుపరి ఎన్నికల వరకు ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో పాలన కొనసాగనుంది. త్వరలోనే కొత్త ఎన్నికల ప్రక్రియపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో పలువురు కార్పొరేటర్లు తమ అనుభవాలను గుర్తుచేసుకుంటూ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తిరిగి ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు కొందరు వెల్లడించగా, మరికొందరు రాజకీయ భవిష్యత్తుపై ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి, జివిఎంసీ కార్పొరేటర్ల ఐదేళ్ల పదవీకాలం నేటితో ముగియడం నగర రాజకీయాల్లో ఒక ముఖ్యమైన పరిణామంగా నిలిచింది. రానున్న రోజుల్లో కొత్త నాయకత్వం ఎలా ఉండబోతోందో అన్నదానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

ఖమ్మం

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు పితృవియోగం

హెడ్లైన్: ఖమ్మం, మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి): జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు పితృవియోగం సంభవించింది. ఆయన తండ్రి లచ్చ నాయక్ మంగళవారం అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఈ వార్త తెలిసి కుటుంబ సభ్యులు, అనుచరులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. లచ్చ నాయక్ మృతిపై పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు, ఖమ్మం టూ టౌన్ బీజేపీ అధ్యక్షుడు ధనియకుల వెంకట్ నారాయణ ఖమ్మం రూరల్ అధ్యక్షులు జాటోత్సా మధు నాయక్ తదితరులు వారి కుటుంబం కి సంతాపం తెలియజేసారు

తిరుపతి

శ్రీకాళహస్తిలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి–విగ్రహ ప్రతిష్ఠకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హామీ

శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సోమవారం నాడు స్థానిక శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటగా ఆయన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ…తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేశారని ఆయన చేసిన త్యాగం ఫలితంగానే దేశంలో భాషా ఆధారిత రాష్ట్రాల ఏర్పాటు సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వచ్చే ఏడాది జయంతి నాటికి శ్రీకాళహస్తి పట్టణంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సగర్వంగా ప్రకటించారు. ఆయన ఆశయాలు, త్యాగస్ఫూర్తి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా మనమందరం కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, కూటమి నాయకులు, పలువురు అధికారులు పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకున్నారు.

సాహితీ

ఆంధ్ర రాష్ట్ర పితామహుడు స్వర్గీయ శ్రీ పొట్టి శ్రీరాములు – డాక్టర్ బద్రి పీర్ కుమార్

1901 మార్చి 16న మద్రాసులో జన్మించి మద్రాసు ప్రెసిడెన్సీ నుండి తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం కోరుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి డిసెంబర్15, 1952న ప్రాణాలర్పించి ‘ఆంధ్ర రాష్ట్ర పితామహుడు’ గా కీర్తించబడిన మహనీయుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఆయన బలిదానం తర్వాతే 1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఇది దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికింది. ఆయన స్మృత్యర్థం 2008లో నెల్లూరు జిల్లాను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా ప్రభుత్వం పేరు మార్చింది. తన 125వ జయంతి రోజు అమరావతిలో ఆయన గౌరవార్థం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ అనే పేరుతో ఒక భారీ విగ్రహాన్ని మరియు స్మృతి వనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఈ కవిత *అ* అందరి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రము కావాలని *మ* మద్రాస్ ప్రెసిడెన్సీలో మార్పులు రావాలని *ర* రణముచేయని రాజీపడని స్వాతంత్ర్య సమరయోధుడు *జీ* జీవం తెలుగు రాష్ట్రం కోసం అన్న దీక్షపరుడు *వి* విశ్వాసాన్ని ఊపిరిగా చేసుకున్న త్యాగధనుడు *శ్రీ* శ్రీకారం తెలుగుజాతి ఆకారంగా మలచగ *పొ* పొదిగి ఒదిగి ఎదిగిన దేశభక్తి నాయకత్వం *ట్టి* ఏట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగెయ్యని భావతత్వం *శ్రీ* శ్రీరస్తుగ గాంధేయ మార్గంలో ప్రయాణించగ *రా* రాజ్యాధినేతలను ఆలోచింపజేయగ *ము* ముదావహమైన త్యాగస్పూర్తితో అమరుడై *లు* లుప్తశరీరము నేడు 58 అడుగుల విగ్రహమై (అమరావతిలో) *జ* జనం మదిలో నూతన ఆంధ్రావతరణ ప్రకాశమై *యం* యంత్రాంగపాలన సత్సంగ జనతరంగమై *తి* తిరుగులేని మహాత్ముని ఆత్మీయ అమరజీవి ఆంధ్రుల నిత్య ఆరాధ్య సంజీవి తెలుగు ప్రజల మనోఫలకం చెక్కిన చిరంజీవి

తిరుపతి

ఎర్పేడు, మేర్లపాకలో అస్తవ్యస్తంగా రేషన్ పంపిణీ –నిరాశతో వెనుతిరుగుతున్న లబ్ధిదారులు

ఏర్పేడు, మార్చి 16 (పున్నమి న్యూస్): ఏర్పేడు మండల పరిధిలోని మేర్లపాక గ్రామాల్లో నిరుపేదల ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యం పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామస్తులు తమ సమస్యలను బయటపెట్టేందుకు రోడ్డెక్కుతున్నారు. సాధారణంగా ప్రతి నెలా 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ బియ్యం పంపిణీ జరగాల్సి ఉండగా, కేవలం రెండు మూడు రోజుల్లోనే ‘స్టాక్ అయిపోయింది’ అంటూ డీలర్లు చేతులెత్తేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో రేషన్ కోసం వచ్చిన వృద్ధులు, వికలాంగులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఎండ తీవ్రత మధ్య క్యూలలో వేచి ఉండలేక కొందరు స్పృహ తప్పి పడిపోయి ఆస్పత్రి పాలైన సంఘటనలు కూడా జరిగాయని స్థానికులు చెబుతున్నారు. 16వ తేదీ వచ్చినా బియ్యం పంపిణీ జరగలేదని, అడిగితే సరైన సమాధానాలు ఇవ్వడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. రేషన్ కోసం ఆశగా వచ్చిన లబ్ధిదారులు చివరకు ఖాళీ సంచులతోనే వెనుతిరుగుతున్న దుస్థితి నెలకొంది. మా బియ్యం మాకు ఎందుకు సక్రమంగా ఇవ్వడం లేదంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మేర్లపాక గ్రామ ప్రజలు మాట్లాడుతూ, తమ గ్రామాల్లో రేషన్ బియ్యం సక్రమంగా అందేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరుపేదల ఆకలితో చెలగాటం ఆడవద్దని, ఇప్పటికైనా యంత్రాంగం మేల్కొని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.

తిరుపతి

సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం – పాటలు, నాటికలతో గ్రామస్తుల్లో చైతన్యం

శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని తొట్టంబేడు మండలంలోని దిగువసంబాయిపాలెం, గుమ్మడిగుంట గ్రామాలు, శాస్త్రి గిరిజన కాలనీలో సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయ వాహిని ఫౌండేషన్ ఆధ్వర్యంలో, టాటా ట్రస్ట్స్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఆరోగ్యకర జీవన విధానం గురించి అవగాహన కల్పించారు. ముఖ్యంగా శరీరానికి అవసరమైన పోషకాహారం, విటమిన్ల ప్రాముఖ్యత, అంగన్వాడి కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారం, అలాగే పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం ద్వారా లభించే పోషకాల గురించి వివరంగా తెలియజేశారు. పిల్లలు, గర్భిణీ స్త్రీలు పోషకాహారం తీసుకోవడం ఎంతో అవసరమని నిపుణులు వివరించారు. అదేవిధంగా బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాలు, చిన్న వయసులో గర్భధారణ వల్ల తల్లి-శిశువులకు కలిగే ఆరోగ్య సమస్యలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ అంశాలను మరింత ప్రభావవంతంగా ప్రజలకు చేరవేసేందుకు జయరావు కళాబృందం పాటలు, నాటికల రూపంలో ప్రదర్శనలు ఇచ్చింది. ఈ ప్రదర్శనలు గ్రామస్తులను ఆకట్టుకోవడంతో పాటు సామాజిక సమస్యలపై చైతన్యం పెంచాయి. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ మరియమ్మ, విజయ వాహిని ఫౌండేషన్ ప్రోగ్రాం అసోసియేట్ వి. లక్ష్మి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామస్తులు, అంగన్వాడి సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.