Sunday, 26 April 2026

Blog

తిరుపతి

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఘనంగా – ఆర్యవైశ్యుల నివాళులు

శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని సన్నిధి వీధిలో ఉన్న శ్రీ వాసవి ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని ఆర్యవైశ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రం సాధన కోసం 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్పాలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ భవాని ప్రసాద్ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. తెలుగు ప్రజల కోసం ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో AVOPA అధ్యక్షులు కోటిలింగాల శశిధర్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి ఐత మురళీకృష్ణ, అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, AVOPA మహిళా విభాగం అధ్యక్షురాలు కోటిలింగాల నిరుపమతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.

తిరుపతి

మైనార్టీ మహిళా నాయకురాలి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన మైనార్టీ మహిళా నాయకురాలు షర్మిల ఠాగూర్ కుటుంబంలో ఇటీవల చోటుచేసుకున్న విషాదం పట్ల మాజీ ఎమ్మెల్యే బియ్యపు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షర్మిల ఠాగూర్ కుటుంబ సభ్యులు షేక్ ఫాతిమా, షేక్ మలాన్ ఇటీవల అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సోమవారం నాడు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు వ్యక్తిగతంగా కూడా తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ బాషా, మైనారిటీ సెల్ అధ్యక్షుడు పఠాన్ ఫరీద్, సాగిరాభి, యువజన విభాగం అధ్యక్షుడు శ్రీవారి సురేష్, జూమ్లేష, ఫజల్, గఫూర్, ఆరిఫ్, పట్టణ యువత అధ్యక్షుడు మునికృష్ణారెడ్డి, అమ్మపాలెం సిరాజ్, జిలాని, అస్లాం, ఫిరోజ్, గౌస్ బాషా, షఫీ, కరిముల్లా, రసూల్, గిరి, చింత రాజేంద్ర, మురళి, నాగరాజు, రవి, నారాయణ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

గాయాలతోనే పరీక్షకు హాజరైన విద్యార్థి – ధైర్యం చూపిన ధనుష్

శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని బాయ్స్ హైస్కూల్‌లో సోమవారం నాడు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఒక విద్యార్థి చూపిన పట్టుదల అక్కడ ఉన్న వారిని ఆకట్టుకుంది. తొండమనాడు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి ధనుష్ ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 13వ తేదీన జరిగిన ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. అయితే చదువుపై ఉన్న ఆసక్తి, పరీక్షలను కోల్పోకూడదనే సంకల్పంతో ధనుష్ గాయాలపై కట్లు కట్టుకున్న పరిస్థితిలోనే నేరుగా పరీక్షా కేంద్రానికి చేరుకుని పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. అతని పట్టుదల చూసి ఉపాధ్యాయులు, ఇతర విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విద్యార్థి ధైర్యసాహసం ప్రశంసనీయమని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఇబ్బందులు ఉన్నప్పటికీ పరీక్షలకు హాజరై తన లక్ష్యాన్ని సాధించాలనే ధనుష్ పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో పరీక్షా కేంద్రాలను డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్న పోలీసులు

శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్‌ఐ ఎస్ఐ వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. సోమవారం నాడు పాత్రికేయులతో మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు పరీక్షా కేంద్రాల వద్ద అనవసరంగా గుంపులు గుమికూడకుండా పోలీసులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పోలీసులు ప్రత్యేకంగా గస్తీ నిర్వహిస్తూ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఎటువంటి అలజడులు, అసాంఘిక కార్యక్రమాలకు అవకాశం లేకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ డ్రోన్ కెమెరాల ద్వారా కూడా పర్యవేక్షణ చేపట్టినట్లు ఎస్‌ఐ వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని, విద్యార్థులు, తల్లిదండ్రులు పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

తిరుపతి

వంట నూనె ధరల మంట… సామాన్యులకు భారంగా పెరుగుతున్న ఖర్చులు

శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్): దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు రోజురోజుకు పెరుగుతూ సామాన్య ప్రజలకు భారంగా మారుతున్నాయి. ముఖ్యంగా సన్‌ఫ్లవర్ నూనె ధరలు గణనీయంగా పెరగడంతో కుటుంబాల నెలవారీ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇటీవల వరకు ఆన్‌లైన్ మార్కెట్‌లో సన్‌ఫ్లవర్ నూనె లీటర్ ధర సుమారు రూ.152గా ఉండగా, ప్రస్తుతం అది రూ.174 నుంచి రూ.178 వరకు చేరింది. ఇక స్థానికంగా ఉన్న సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాల్లో కూడా లీటర్‌కు రూ.165 నుంచి రూ.168 వరకు విక్రయిస్తున్నారు. ధరలు పెరగడంతో పాటు సన్‌ఫ్లవర్ నూనెకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో సరఫరా తగ్గిపోయి పలు దుకాణాల్లో “నో స్టాక్” బోర్డులు కూడా కనిపిస్తున్నాయి. ఇక పల్లీ నూనె ధరలు కూడా సామాన్యులకు అందనంత స్థాయికి చేరుతున్నాయి. ప్రస్తుతం పల్లీ నూనె లీటర్ ధర రూ.220కు పైగానే మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. దీంతో వంట నూనెల కొనుగోలు విషయంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార వర్గాల సమాచారం ప్రకారం అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయని చెబుతున్నారు. అక్కడి పరిస్థితులు మరికొంతకాలం కొనసాగితే వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుని సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించాలని వినియోగదారులు కోరుతున్నారు.

తిరుపతి

దైవప్రార్థన తల్లిదండ్రుల ఆశీస్సులతో పరీక్షా కేంద్రాలకు చేరిన విద్యార్థులు

శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ఉదయం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పరీక్షలు విజయవంతంగా రాయాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులు ముందుగా దేవాలయాలకు వెళ్లి ప్రార్థనలు చేసుకుని విద్యార్థులు తమ తల్లీ, తండ్రుల పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. కేంద్రాల వద్ద అధికారులు విద్యార్థుల హాల్ టికెట్లను పరిశీలించి లోనికి అనుమతించారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పరీక్షలు సజావుగా ప్రారంభమయ్యాయి.

రాజన్న సిరిసిల్ల

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసిన సిద్దుల బిక్షపతి

ముస్తాబాద్ మార్చి 16 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో ఈరోజు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్దుల బిక్షపతి గారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. కులమత బేధాలు కచ్చితంగా హిందూ ముస్లిం భాయి భాయి అనే భావనతో అందరం కలిసి ఉండాలని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ పుల్లూరి సంతోష్. చాకలి బాబు. టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ సేన మండల అధ్యక్షుడు వంగూరు దిలీప్. కోడూరి మనీష్. చెక్కపల్లి వెంకటేష్. ముస్లిం మత గురువు. ముస్లిం సోదరులు పాల్గొన్నారు..

రాజన్న సిరిసిల్ల

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసిన సిద్దుల బిక్షపతి

ముస్తాబాద్ మార్చి 16 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో ఈరోజు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్దుల బిక్షపతి గారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. కులమత బేధాలు కచ్చితంగా హిందూ ముస్లిం భాయి భాయి అనే భావనతో అందరం కలిసి ఉండాలని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ పుల్లూరి సంతోష్. చాకలి బాబు. టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ సేన మండల అధ్యక్షుడు వంగూరు దిలీప్. కోడూరి మనీష్. చెక్కపల్లి వెంకటేష్. ముస్లిం మత గురువు. ముస్లిం సోదరులు పాల్గొన్నారు..

ఖమ్మం

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రూ.5000… గ్యాస్ కొరతతో సంక్షోభం లో హోటల్ పరిశ్రమ.

ఖమ్మం, మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి) అంతర్జాతీయ పరిణామాల ప్రభావం స్థానిక వ్యాపారాలపై పడుతోంది. అమెరికా – ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడగా, దాని ప్రభావం ఖమ్మం నగరం తొ పాటు జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వాణిజ్య అవసరాల కోసం వినియోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత హోటల్ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. 5000 రూపాయలకు కమర్షియల్ సిలిండర్ సాధారణంగా రూ.2000 లోపు లభించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం అక్రమంగా రూ.5000 వరకు చేరిందని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. కొరతను అదునుగా చేసుకుని కొంతమంది దళారులు అధిక ధరలకు సిలిండర్లు విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్యాస్ కోసం హోటల్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. గ్యాస్ కొరత ప్రభావం చిన్న హోటళ్లపై ఎక్కువగా పడుతోంది. పెద్ద హోటల్ నిర్వాహకులు గత్యంతరం లేక అధిక ధరలకు సిలిండర్లు కొనుగోలు చేసి ఆహార పదార్థాల ధరలను పెంచి సరఫరా చేస్తున్నారు. కానీ చిన్న హోటల్ నిర్వాహకులు మాత్రం ఈ భారాన్ని భరించలేక తమ హోటళ్లను తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ ధరలు పెరగడం, సరఫరా నిలిచిపోవడం కారణంగా ఆహార పదార్థాల ధరలపై కూడా ప్రభావం పడుతోంది. హోటళ్లలో తినే భోజనం, టిఫిన్ ధరలు పెరుగుతున్నాయని వినియోగదారులు అంటున్నారు. గ్యాస్ సమస్య కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. గ్యాస్ కొరత సమస్యను త్వరగా పరిష్కరించాలని హోటల్ నిర్వాహకులు అధికారులను కోరుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను పెంచి దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి వచ్చినప్పుడే హోటల్ రంగం మళ్లీ పునరుద్ధరించబడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతొంది.

ఖమ్మం

ఖమ్మం కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన బీసీ నేత డా. విశారద మహారాజ్ అరెస్ట్*

T.Ravinder ఖమ్మం మార్చి16/2026 (పున్నమి ప్రతినిధి) ఖమ్మం: ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన బీసీ నాయకుడు డా. విశారద మహారాజ్‌ను ఖమ్మం పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు ఆయనను అక్కడి నుంచి తరలించారు. మొదట ఆయనను మధిర టౌన్ పోలీస్ స్టేషన్‌కు, అనంతరం మధిర రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. అక్కడి నుంచి ఆయనను నందిగామ వైపు పోలీసులు తరలించారు. ఈ ఘటనకు నిరసనగా మధిర రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద బీసీ నాయకులు పోలీస్ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. డా. విశారద మహారాజ్‌ను ఎందుకు అదుపులోకి తీసుకున్నారన్న విషయంపై అధికారిక వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.