Sunday, 26 April 2026

Blog

ఖమ్మం

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రూ.5000… గ్యాస్ కొరతతో సంక్షోభం లో హోటల్ పరిశ్రమ.

ఖమ్మం, మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి) అంతర్జాతీయ పరిణామాల ప్రభావం స్థానిక వ్యాపారాలపై పడుతోంది. అమెరికా – ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడగా, దాని ప్రభావం ఖమ్మం నగరం తొ పాటు జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వాణిజ్య అవసరాల కోసం వినియోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత హోటల్ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. 5000 రూపాయలకు కమర్షియల్ సిలిండర్ సాధారణంగా రూ.2000 లోపు లభించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం అక్రమంగా రూ.5000 వరకు చేరిందని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. కొరతను అదునుగా చేసుకుని కొంతమంది దళారులు అధిక ధరలకు సిలిండర్లు విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్యాస్ కోసం హోటల్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. గ్యాస్ కొరత ప్రభావం చిన్న హోటళ్లపై ఎక్కువగా పడుతోంది. పెద్ద హోటల్ నిర్వాహకులు గత్యంతరం లేక అధిక ధరలకు సిలిండర్లు కొనుగోలు చేసి ఆహార పదార్థాల ధరలను పెంచి సరఫరా చేస్తున్నారు. కానీ చిన్న హోటల్ నిర్వాహకులు మాత్రం ఈ భారాన్ని భరించలేక తమ హోటళ్లను తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ ధరలు పెరగడం, సరఫరా నిలిచిపోవడం కారణంగా ఆహార పదార్థాల ధరలపై కూడా ప్రభావం పడుతోంది. హోటళ్లలో తినే భోజనం, టిఫిన్ ధరలు పెరుగుతున్నాయని వినియోగదారులు అంటున్నారు. గ్యాస్ సమస్య కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. గ్యాస్ కొరత సమస్యను త్వరగా పరిష్కరించాలని హోటల్ నిర్వాహకులు అధికారులను కోరుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను పెంచి దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి వచ్చినప్పుడే హోటల్ రంగం మళ్లీ పునరుద్ధరించబడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతొంది.

ఖమ్మం

ఖమ్మం కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన బీసీ నేత డా. విశారద మహారాజ్ అరెస్ట్*

T.Ravinder ఖమ్మం మార్చి16/2026 (పున్నమి ప్రతినిధి) ఖమ్మం: ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన బీసీ నాయకుడు డా. విశారద మహారాజ్‌ను ఖమ్మం పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు ఆయనను అక్కడి నుంచి తరలించారు. మొదట ఆయనను మధిర టౌన్ పోలీస్ స్టేషన్‌కు, అనంతరం మధిర రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. అక్కడి నుంచి ఆయనను నందిగామ వైపు పోలీసులు తరలించారు. ఈ ఘటనకు నిరసనగా మధిర రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద బీసీ నాయకులు పోలీస్ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. డా. విశారద మహారాజ్‌ను ఎందుకు అదుపులోకి తీసుకున్నారన్న విషయంపై అధికారిక వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

తిరుపతి

రైతులు బాగుంటే… రాష్ట్రం బాగుంటుంది ఎమ్మెల్యే పులివర్తి నాని

ప్రజా భూమి ప్రతినిధి, తిరుపతి రూరల్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే ఆయనకు రైతు కష్టాలు ప్రతి ఒక్కటి తెలుసు అని రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు* సోమవారం తిరుపతి రూరల్ మండలం పంచాయతీ కుంట్రపాక గ్రామంలో రైతన్నా మీకోసం కార్యక్రమం నిర్వహించారూ. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని కి ఘన స్వాగతం పలికిన కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు..అన్నదాత సుఖీభవ కార్యక్రమం పై గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపిన సందేశాన్ని రైతులకు వినిపించిన అధికారులు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు కుటుంబంలో ఆనందం కోసమే కూటమి ప్రభుత్వ ఆరాటం అన్నారు తిరుపతి రూరల్ మండలంలో 2911 మంది రైతులకు కోటి 64 లక్షల రూపాయలు మూడో విడత విడుదలచేసింది.**అన్నదాత సుఖీభవ పథకం రైతులకు అందుతున్న తీరుపై స్వయంగా గ్రామంలోని రైతుల ఇండ్లకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సమయంలో మీ గ్రామానికి వచ్చినప్పుడు కూటమి నాయకత్వంలో ఇచ్చిన హామీలతో పాటుగా మీ గ్రామానికి ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చమన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు

కర్నూలు

ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

కర్నూలు (పున్నమి ప్రతినిధి) జర్నలిస్టుల సామాజిక సేవ అభినందనీయం నిరుపేదలకు కంటి అద్దాల పంపిణీ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు కె. గంగాధర్ రెడ్డి ప్రభుత్వ నిబంధనలు, సౌకర్యాలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు ఒక వరం లాంటివని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు కె. గంగాధర్ రెడ్డి మరియు ఆదిత్య పాఠశాల కరస్పాండెంట్ జానకిరామయ్య పేర్కొన్నారు. ఆదివారం కల్లూరులోని ఆదిత్య పాఠశాల ఆవరణలో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం గౌరవాధ్యక్షులు పి. యూసుఫ్ ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లబ్ధిదారులకు ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నిరంతరం ప్రజల సేవలో.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజంలో వార్తలు సేకరించడమే మాత్రమే జర్నలిస్టుల పని అని అనుకోకుండా ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ జర్నలిస్టులే స్వయంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమైన విషయమని, వారి చొరవ ఆదర్శవంతమైనది అని కొనియాడారు. ఇప్పటికే పలుమార్లు వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు చికిత్స అందించడం ఒక గొప్ప సేవ అని తెలిపారు. భవిష్యత్తులో మారుమూల ప్రాంతాల్లో కూడా ఇలాంటి శిబిరాలను ఏర్పాటు చేస్తామని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు. కంటి అద్దాల పంపిణీ గతంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించిన వారికి నేడు ఉచితంగా అద్దాలను పంపిణీ చేశారు. ఏ.పీ.జే.ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ, కల్లూరు ఫోటో మరియు వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.వి. ఖాజా ఈ కార్యక్రమంలో పాల్గొని జర్నలిస్టులు చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఎఫ్ జిల్లా కార్యదర్శి వై. రాజశేఖర్, జిల్లా నాయకులు దండు విద్యాసాగర్, వి. విజయ్ కుమార్, కె. వెంకటేశ్వర రెడ్డి, మల్లికార్జున, నగర అధ్యక్షులు పి. నాగేంద్రుడు, నగర నాయకులు ఎస్.కె. మధు మరియు పెద్ద సంఖ్యలో యువకులు వృద్ధులు మహిళలు పాల్గొన్నారు.

తిరుపతి

ఏఐ -3డి ప్రింటింగ్ పై రెండు రోజుల జాతీయ సదస్సు విజయవంతం

పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం రామచంద్రపురం మండలం వెంకట్రామాపురం సమీపంలోని సెవెన్ హిల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ లో ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ మరియు ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగాల ఆధ్వర్యంలో “AI, 3D ప్రింటింగ్ మరియు నియంత్రణ సంసిద్ధతకు నాణ్యత “హామి” అనే అంశం పై నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు శనివారం నాడు విజయవంతంగా ముగిసింది. రెండో రోజున డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీన్కు చెందిన సతీష్ బాబు వక్తగా హాజరై భవిష్యత్ ఫార& సిస్టులకు అవసరమైన క్వాలిటీ మైండ్ సెట్ గురించి వివరించారు. అనంతరం శ్రీ ఆర్. చంద్రరేఖర్ జర్నల్ పేపర్ రచిన మరియు పరిశోధన విధానాల పై ముఖ్యమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగాం నిర్వహించిన మాఖక మరియు ఈ-పోస్టర్ ఉత్తమ ప్రజంటేషన్లకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సదస్సు ద్వారా ఫార్మసీ రంగంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3 డి, ప్రింటింగ్ మరియు క్వాలిటీ అష్యూరెన్స్ వంటిఆధునిక సాంకేతికతల పై అవగాహన పెంపొందించడంలో ముఖ్యమైన వేదికగా నిలిచిందని సదస్సు కన్వీనర్లు శివగామి, సతీష్ కుమార్ తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ – నేరాలకు దూరంగా ఉండాలని నెల్లూరు పోలీసుల హెచ్చరిక

జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ – నేరాలకు దూరంగా ఉండాలని నెల్లూరు పోలీసుల హెచ్చరిక నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణ మరియు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లు మరియు నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్‌పి ఆదేశాల మేరకు ఆదివారం అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ ప్రజా శాంతికి భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలు, బాలికలపై అత్యాచారాలు లేదా వేధింపులు చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. జిల్లాలో నేరాలపై ప్రత్యేక దృష్టి సారించామని, రౌడీ, కెడి, డీసీ కదలికలపై పటిష్ట నిఘా కొనసాగుతుందని చెప్పారు. ప్రజా శాంతికి భంగం కలిగించే చర్యలు చేస్తే అవసరమైతే పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. నేరాల నియంత్రణ కోసం జిల్లాలో కట్టుదిట్టమైన ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, బీట్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా నేరాలను అరికట్టే చర్యలు చేపట్టామని వివరించారు. గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తుల కదలికలపై కూడా పోలీసులు నిరంతరం నిఘా పెంచినట్లు తెలిపారు. నేర ప్రవర్తనను మానుకుని సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని సూచించారు. నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. కౌన్సెలింగ్ అనంతరం వారి ప్రస్తుత జీవన విధానం, జీవనోపాధి కోసం చేస్తున్న పనులపై కూడా అధికారులు వివరాలు సేకరించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో ఎలాంటి గొడవలు, అల్లర్లు లేదా అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే డయల్ 112 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నంబర్ 9392903413 కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. అలాగే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు. జిల్లాను ప్రశాంత జిల్లాగా నిలబెట్టడమే లక్ష్యంగా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాము.

తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం అపూర్వమైన త్యాగం చేసిన మహనీయుడు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే లక్ష్యంతో ఆయన 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తన ప్రాణాలను అర్పించారు. ఆయన త్యాగం వల్లే తెలుగు భాషా రాష్ట్రం ఏర్పడింది మరియు తెలుగు జాతికి గౌరవం లభించింది. సత్యం, అహింస మార్గంలో నడిచిన ఆయన జీవితం నేటి తరాలకు గొప్ప ప్రేరణగా నిలుస్తోంది. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాము. ఆయన ఆశయాలు, పోరాటస్ఫూర్తి ఎప్పటికీ మనకు మార్గదర్శకంగా నిలుస్తాయి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా టీడీపీ నేతల ఘన నివాళులు

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా టీడీపీ నేతల ఘన నివాళులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి టీడీపీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, మాజీ శాసనసభ్యులు కంభం విజయ రామిరెడ్డి, శాసనమండలి సభ్యులు బూదాటి రాధయ్య, మాజీ జెడ్పీ చైర్మన్ చెంచల బాబు యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్ళపాక అనురాధ, రాష్ట్ర కార్యదర్శి జెన్ని రవణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రం ఏర్పాటుకు తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం రావాలనే లక్ష్యంతో ఆయన 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి అమరుడయ్యారని గుర్తు చేశారు. ఆయన త్యాగఫలితంగానే నేటి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మార్గం సుగమమైందన్నారు. అలాగే మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ ఆశయాలకు జీవితాంతం కట్టుబడి పనిచేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు. ఆయన త్యాగాలు, ఆశయాలు, పోరాటాలు భవిష్యత్తు తరాలకు ఎప్పటికీ స్పూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు. పొట్టి శ్రీరాములు గారి త్యాగాలను చిరస్మరణీయంగా నిలుపుతూ, ఆయన 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా అమరావతిలో 58 అడుగుల స్మారక కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం శుభ సూచకమని చెప్పారు. గతంలో ఎన్.టి. రామారావు, ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాల పాలనలో పొట్టి శ్రీరాములు గారికి సముచిత గౌరవం కల్పించారని తెలిపారు. తెలుగుజాతికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పిస్తున్నామని చేజర్ల వెంకటేశ్వర రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కోట గురుబ్రహ్మం, పి.యల్. రావు, బొల్లినేని రామారావు, ధర్మవరపు సుబ్బారావు, పనబాక భూలక్ష్మి, డా. ఊరందూరు సురేంద్ర బాబు, షేక్ రసూల్, షేక్ అమృల్లా, వరికుంట్ల (రాజా) సురేష్, సాబీర్ ఖాన్, మన్నెం పెంచల నాయుడు, నన్నే సాహెబ్, గుమ్మడిపూడి కళ్యాణ్, బీవీ లక్ష్మీ, ధర్మవరపు గణేష్, అంకయ్య, హజరత్ కుమార్ శెట్టి, సోమిశెట్టి మధుసూదన్, ఎల్.సి. రమణా రెడ్డి, గోవింద రాజులు, నెల్లూరు మురళి, ఉప్పు భాస్కర్, సురేంద్ర, మునుస్వామి, శ్రీదేవి, పద్మమ్మ, తనూజ, ప్రమీల, ఈదర శ్రీనివాసులు, వెంగయ్య, బుజ్జయ్య, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రంజాన్ మాసం సందర్భంగా నెల్లూరులో ఘనంగా ఇప్తార్ విందు

రంజాన్ మాసం సందర్భంగా నెల్లూరు కోటమిట్టలోని సాధిమంజిల్‌లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఇప్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శాసనమండలి సభ్యుడు బీద రవిచంద్ర, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డితో పాటు పలువురు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. రంజాన్ మాసం ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ ఇప్తార్ విందులో పాల్గొన్న నాయకులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పరస్పర సౌహార్దం, సామరస్యానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ముస్లిం సంఘాల నాయకులు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల

మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జోగులాంబ సమావేశం

జోగులాంబ గద్వాల్ మర్చి 16(పున్నమి ప్రతినిధి) మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జోగులాంబ సమావేశం.. గద్వాల జిల్లాలో ప్రకృతి దర్శన కార్యక్రమమాన్ని జిల్లా మాజీ అధ్యక్షుని ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ ప్రకృతి దర్శన కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లందరితో పరిచయ కార్యక్రమం, గద్వాల జిల్లాలో ఉన్న సామాజిక_రాజకీయ_ఆర్థిక పరిస్థితులపై అవగాహన కల్పించడం, మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఈ గద్వాల జిల్లాలో ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఏమేం చేయాలనే విషయాలపైన సుదీర్ఘంగా చర్చించడం మరియు కాన్షీరామ్ గారి జయంతి ఉత్సవాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం 5 గంటల వరకు ప్రకృతి దర్శన కార్యక్రమం MNS ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలకంఠం గారు వచ్చి మాట్లాడుతూ గద్వాల జిల్లాలో ఉన్న మూఢనమ్మకాల పైన సుదీర్ఘంగా ప్రసంగించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎదుల నాగరాజు గారు మాట్లాడుతూ ఈ జిల్లాలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని ఎలా బలోపేతం చేయాలో చెప్పడం జరిగింది. రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లవి గారు మాట్లాడుతూ కాన్షీరామ్ జయంతి సందర్భంగా అతని త్యాగాలను వచ్చిన వారికి తెలియజేయడం జరిగింది. ఇక్కడే ఉంటున్న గద్వాల్ జిల్లా యువకుడు శరణప్ప గారు సభ అధ్యక్షత వహించి ఎంతో చక్కగా ఈ ప్రకృతి దర్శన కార్యక్రమాన్ని నడిపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షులు పెరుగు గౌతమ్ గారు, జాతీయ యూత్ ప్రధాన కార్యదర్శి గోమాస సందీప్ గారు, MNS నాయకులు రమేష్ గారు, నయీం గారు, అశోకు గారు, సుధాకర్ మరియు ఇతరులు పాల్గొని ప్రకృతి దర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రకృతి దర్శన కార్యక్రమమాన్ని జిల్లా మాజీ అధ్యక్షుని ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ ప్రకృతి దర్శన కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లందరితో పరిచయ కార్యక్రమం, గద్వాల జిల్లాలో ఉన్న సామాజిక_రాజకీయ_ఆర్థిక పరిస్థితులపై అవగాహన కల్పించడం, మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఈ గద్వాల జిల్లాలో ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఏమేం చేయాలనే విషయాలపైన సుదీర్ఘంగా చర్చించడం మరియు కాన్షీరామ్ గారి జయంతి ఉత్సవాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం 5 గంటల వరకు ప్రకృతి దర్శన కార్యక్రమం MNS ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలకంఠం గారు వచ్చి మాట్లాడుతూ గద్వాల జిల్లాలో ఉన్న మూఢనమ్మకాల పైన సుదీర్ఘంగా ప్రసంగించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎదుల నాగరాజు గారు మాట్లాడుతూ ఈ జిల్లాలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని ఎలా బలోపేతం చేయాలో చెప్పడం జరిగింది. రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లవి గారు మాట్లాడుతూ కాన్షీరామ్ జయంతి సందర్భంగా అతని త్యాగాలను వచ్చిన వారికి తెలియజేయడం జరిగింది. ఇక్కడే ఉంటున్న గద్వాల్ జిల్లా యువకుడు శరణప్ప గారు సభ అధ్యక్షత వహించి ఎంతో చక్కగా ఈ ప్రకృతి దర్శన కార్యక్రమాన్ని నడిపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షులు పెరుగు గౌతమ్ గారు, జాతీయ యూత్ ప్రధాన కార్యదర్శి గోమాస సందీప్ గారు, MNS నాయకులు రమేష్ గారు, నయీం గారు, అశోకు గారు, సుధాకర్ మరియు ఇతరులు పాల్గొని ప్రకృతి దర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.