Sunday, 26 April 2026

Blog

తిరుపతి

ఉగాది పర్వదినం సందర్భంగా వేడుకగా శ్రీ విజయ గణపతి ఆలయంలొ ప్రత్యేక పూజలు*

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఆలయ ధర్మకర్త పుష్ప మునిరామ్ రెడ్డి పున్నమి ప్రతినిధి మార్చి 19 తిరుపతి రూరల్ తిరుపతి రూరల్ మండలం శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు నేతాజీ నగర్ లో వెలసి ఉన్న శ్రీవిజయ గణపతి ఆలయంలో గురువారం ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ విజయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు వేడుకగా నిర్వహించడం జరిగింది.MRR ట్రస్టు వారి శ్రీ విజయ గణపతి స్వామి వారికి పాలు పెరుగు తేనె నెయ్యి పన్నీరు విభూది చందన తదితర సుగంధ ద్రవ్యాలతో ఆలయ అర్చకులు మధు స్వామి అభిషేకం నిర్వహించారు.అనంతరం ఆలయ ధర్మకర్త పుష్ప మునిరామ్ రెడ్డి దంపతులు,కుటుంబ సభ్యులకు ,స్థానికులకు,గోత్ర నామాలతో అర్చన చేసి విజయ ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని కోరుతూ,స్వామి వారి తీర్థ ప్రసాదాలు,ఉగాది పచ్చడి అందేశారు.ప్రధాని ,ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి ప్రజలకు మంచి పాలన అందించాలని,పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగ విశేషాన్ని తెలిపారు.ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త పుష్ప మునిరామ్ మాట్లాడుతూ శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రజలందరూ సుఖ సంతోషాలతో శ్రీ విజయ గణపతి ఆశీస్సులతో అందరూ బాగుండాలి అని ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కడప

కడప జిల్లా ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ లో ఉగాది పండుగ వేడుకలు ప్రజలకు చేరవవున్న పోలీసులు💐

కడప జిల్లాలోని ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లు ఇవాళ పండుగ సందర్బంగా ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. నిత్యం ఖాకీ దుస్తుల్లో కనిపించే పోలీసులు, ఈరోజు సంప్రదాయ దుస్తుల్లో విధులకు హాజరై పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించారు. సబ్ డివిజన్ పోలీసు అధికారులు మరియు సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రొద్దటూర్ ఏఎస్పీ శ్రీ విభూకృష్ణ ఐపీఎస్ గారిని కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ వాతావరణం లో పోలీసు అధికారులు మరియు సిబ్బంది తో కలిసి ఏఎస్పీ గారు స్వీట్లు మరియు ఉగాది పచ్చడి ఆరగించి,పోలీసు అధికారు లందరిని మరియు సిబ్బంది ని ఆప్యాయంగా పలుకరించి అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ విభూ కృష్ణ ,ఐపీఎస్ గారు మాట్లాడుతూ పోలీసు లు కూడా ప్రజల్లో నుండి వచ్చినవారే నని,ప్రజలకు, పోలీసులు అంటే ఉన్న భయం తొలగిపోవాలని,తమ సమస్యలను ధైర్యంగా మరియు స్వేచ్ఛగా తెలియజేయాలని ప్రజలకు సూచించారు. ప్రొద్దుటూరు వన్ టౌన్ సిఐ కొండారెడ్డి,టూ టౌన్ సిఐ వంశీనాథ్ ,రూరల్ సిఐ నాగభూషణ్ మరియు సబ్ డివిజన్ ఎస్సై లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అన్నమయ్య

మద్యం మత్తులో ఘర్షణ.. చివరకు ప్రాణం తీసిన దాడి

– పెనగలూరు మండలంలో నరసింహులు హత్య కేసు ఛేదించిన పోలీసులు – ఇద్దరు నిందితుల అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు – జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాలతో కట్టుదిట్టమైన చర్యలు మద్యం మత్తులో జరిగిన చిన్నపాటి గొడవ కాస్తా ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న విషాద ఘటన పెనగలూరు మండలంలో చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరిని కోడూరు రూరల్ పోలీసులు బుధవారం రాత్రి చాకచక్యంగా అరెస్ట్ చేశారు. తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) శ్రీ ఎల్. సుబ్బారాయుడు గారి కట్టుదిట్టమైన ఆదేశాల మేరకు, రేణిగుంట ఎస్డీపిఓ శ్రీ వై. శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో పోలీసులు ఈ కేసును ఛేదించారు. -అసలేం జరిగిందంటే? పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 11వ తేదీ రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో పెనగలూరు మండలం ఇండ్లూరు గ్రామంలోని శివకృష్ణ వైన్ షాప్ వద్ద మద్యం మత్తులో ఘర్షణ చోటుచేసుకుంది. పెనగలూరు మండలం కంభాలకుంట గ్రామానికి చెందిన గుండ్లూరు వెంకటేశు, గుండ్లూరు గణేష్ అలియాస్ గని అనే ఇద్దరు వ్యక్తులు.. పాత సింగనమల గ్రామానికి చెందిన సామినేని నరసింహులు (38) పై విచక్షణారహితంగా దాడి చేశారు. మద్యం మత్తులో ఉన్న నిందితులు నరసింహులును చేతులతో, కాళ్లతో బాదారు. -చికిత్స పొందుతూ మృతి: ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నరసింహులును బంధువులు ఆసుపత్రికి తరలించారు. తొలుత పెనగలూరు పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 17/2026 కింద కేసు నమోదైంది. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ నెల 17వ తేదీన నరసింహులు మృతి చెందారు. దీంతో పోలీసులు ఈ కేసును హత్య కేసుగా (Section 105 BNS) మార్పు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. -బెస్తపల్లి వద్ద నిందితుల అరెస్ట్: నిందితులు పరారీలో ఉన్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు.. కోడూరు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ డి. శ్రీనివాసులు, పెనగలూరు ఎస్సై శ్రీ కె. రఘురాం మరియు పోలీస్ సిబ్బంది కలిసి బుధవారం (18-03-2026) రాత్రి 8:20 గంటల సమయంలో మెరుపు దాడి చేశారు. కోమంతరాజుపురం వెళ్లే మార్గంలో బెస్తపల్లి గ్రామం వద్ద మాటు వేసి నిందితులు వెంకటేశు మరియు గణేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. -న్యాయస్థానంలో హాజరు: అరెస్ట్ చేసిన నిందితులను గురువారం (19-03-2026) గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించనున్నట్లు సీఐ డి. శ్రీనివాసులు తెలిపారు. మద్యం మత్తులో గొడవలకు దిగి ఇతరుల ప్రాణాలు తీసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ కేసును తక్కువ సమయంలో ఛేదించిన పోలీస్ బృందాన్ని జిల్లా ఉన్నతాధికారులు అభినందించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆశీస్సులతో ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్న తనయుడు – సహాయం చేసిన జనసేన కుటుంబానికి చిన్నా కృతజ్ఞతలు

నెల్లూరు జిల్లా: తనయుడు ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకుని ఆరోగ్యంగా తిరిగి ఇంటికి చేరుకున్న సందర్భంగా జనసేన నాయకుడు చిన్నా భావోద్వేగానికి గురయ్యారు. ఫిబ్రవరి 25వ తేదీన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తన కుమారుడు, వైద్యుల చికిత్సతో కోలుకుని మార్చి 13వ తేదీన డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో తనకు ఆర్థికంగా, మానసికంగా అండగా నిలిచిన జనసేన కుటుంబ సభ్యులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా జనసేన ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు, వీర మహిళలు, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ శ్రేణులు అందించిన సహాయం, సహకారం జీవితాంతం మరువలేనిదని పేర్కొన్నారు. అలాగే ఆసుపత్రికి స్వయంగా వచ్చి పరామర్శించిన నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకత్వానికి, తెలుగు రాష్ట్రాల జనసైనికులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కష్ట సమయంలో తనకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ జీవితాంతం రుణపడి ఉంటానని చిన్నా భావోద్వేగంగా వెల్లడించారు.

వరంగల్

వరంగల్ భద్రకాళి ఆలయంలో ఉగాది సందడి

ఉగాది పండుగ సందర్భంగా వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అలంకరణలతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి ఉగాది పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించడంతో దర్శనం సజావుగా కొనసాగింది.

జాతీయ అంతర్జాతీయ

‘డోరేమాన్’ దర్శకుడు సుటోము షిబాయామా మృతి

టోక్యో, మార్చి 19: ప్రపంచవ్యాప్తంగా చిన్నారులను అలరించిన ప్రసిద్ధ యానిమేషన్ సిరీస్ *‘డోరేమాన్’*కు దర్శకత్వం వహించిన ప్రముఖ జపనీస్ డైరెక్టర్ సుటోము షిబాయామా (84) కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన మార్చి 6న తుదిశ్వాస విడిచినట్లు యానిమేషన్ సంస్థ ఆసియా-డో వెల్లడించింది. కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు అంత్యక్రియలు ప్రైవేటుగా నిర్వహించినట్లు తెలిపింది. 1980 నుంచి 2004 వరకు డోరేమాన్ టీవీ యానిమేషన్ సిరీస్‌కు ఆయన విశేష సేవలు అందించారు.

రాజన్న సిరిసిల్ల

రంజాన్ సందర్భంగా నామాపూర్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు

ముస్తా బాద్/ మార్చి /పున్నమి ప్రతినిధి ఈరోజు నామాపూర్ గ్రామంలోని మసీదు వద్ద రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రోజా ఉన్న ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందు నిర్వహించారు. బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్తపల్లి నారాయణ గారి ఆధ్వర్యంలో, గ్రామ పార్టీ కార్యకర్తల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించి, పరస్పర సౌహార్దాన్ని చాటుతూ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. .

రాజన్న సిరిసిల్ల

మొర్రపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – సైకిల్‌పై వెళ్తున్న బాలుడు మృతి

ముస్తా బాద్ మార్చి పున్నమి ప్రతినిధి ముస్తా బాద్ లోని మొర్రపూర్ గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది మొర్రాపూర్. గ్రామానికి చెందిన భూక్య యాదగిరి కుమారుడు భూక్యా ఇషాన్ అనే బాలుడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి సైకిల్‌పై బయటకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. మొర్రపూర్ నుంచి కంకర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్, బాలుడు ప్రయాణిస్తున్న సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇషాన్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడు 3వ తరగతి చదువుతున్న విద్యార్థిగా తెలిసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సాహితీ

తెలుగు సంవత్సరాది ఉగాది (కవిత) – డాక్టర్ బద్రి పీర్ కుమార్

ఇది పరాభవ నామ సంవత్సరం నూతనోత్సాహానికి శ్రీకారం పరాభవమా అని నిరుత్సాహకరం? కొందరికి కానీ మానవుడు ప్రకృతి సిద్ధంగా సహజంగా తన జీవనాన్ని కొనసాగిస్తే ఈ పరాభవ నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి పరాభవం కాదు వైభవం సంప్రాప్తిస్తుందని, ఈ ఉగాది మనందరి ఉజ్వల భవిష్యత్తుకు పునాది కావాలని కోరుకుంటూ … ప్రకృతి ప్రథమ పండుగ జీవరాసికిది నిండుగ పరిసరాలు కనులవిందుగ మది మదిని ఉల్లాసపరచగ మానవాళిని ఆహ్లాద పరిచే వాతావరణం జీవనంపై ప్రభావం చూపే ప్రకృతిశోషణం జరగబోయే మార్పులు తెలిపే జనాభాగణనం గ్రహస్థితి మార్పుల విశ్లేషణం మానవ చర్యల సంయమనం పఠణం శ్రవణం మననం ఇందులో మనం భిన్న భావాల సమ్మేళనం కళామతల్లికి కమనీయ కవననీరాజనం ఈ సందర్భంగా అక్షరాత్మక భావత్మక రక్షణ లక్షణ శుభాకాంక్షావలి ప్రథమాక్షర వాక్యసుమాంజలి ఈ కవిత. *తె* తెలుగుజాతి తేజస్సుకు ఉషస్సు *లు* లుమాల సాంకేతికం నేటి కృత్రిమ మేధస్సు *గు* గుణగణాత్మక పర్యావరణం శ్రేయస్సు *సం* సంక్షేమ సమాజానికి ఆయుష్షు *వ* వసంతం మనసొంతమనే మనస్సు *త్స* ఉత్సాహ ప్రోత్సాహక తపనల తపస్సు *రా* రాగమాలికల నిత్య యవ్వనవయస్సు *ది* దివ్యానుభూతి కలిగించు ప్రకృతిమాత ఆశీస్సు *ఉ* ఉన్నత నవీకరణ భావ బ్రహ్మోత్సవం *గా* గానామృత పంచాంగ శ్రవణ వైభవం *ది* దినదినాభివృద్ధి ప్రజాసంక్షేమ సౌష్టవం *శు* శుభకామనల సౌభాగ్య భావనలు *భా* భాగ్యరేఖల సూచనాత్మక ఆచరణలు *కాం* కాంక్షల సమృద్ధి బాటలో కార్యాలు *క్ష* క్షణక్షణం ప్రతిధ్వనించు ప్రవచనరాగాలు *లు* లున్నతము చేయగ నవజీవన గమనాలు ప్రకృతి సమీప స్నేహాత్మక పయనం సాహిత్య సంస్కృతి సమ్మేళన స్మరణం వర్తమాన భవిష్యత్ విజయాలకు నిదర్శనం మనసోల్లాస విజయాంస సంపూర్ణ సందర్శనం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఘనంగా జరిగిన జాతీయ కవి సమ్మేళనం – స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డిచే కవులకు సత్కారం

మార్చి18 @ వెంకటాచలం (నెల్లూరు) సమీపంలో ఉన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది సందర్భంగా శతాధిక జాతీయ కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. సుమారు 200కు పైగా కవులు రచయితలు పాల్గొని ఉగాది సందర్భంగా వివిధ సామాజిక అంశాలతో తమ కవితలను వినిపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తూ తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఇటువంటి కార్యక్రమాల ద్వారా తెలుగు పై మక్కువ పెరుగుతుందని, సుదీర్ఘ ప్రాంతాల నుండి ఇంతమంది కవులు పాల్గొనడం చాలా సంతోషించదగిన విషయమని అందరినీ అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య ఎం. సంపత్ కుమార్, అధ్యయనకేంద్ర సిబ్బంది, ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (బాల సాహిత్యంలో) పొందిన డా. గంగిశెట్టి శివకుమార్, డా. బద్రి పీర్ కుమార్ తదితర కవులు , రచయితలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.