Sunday, 26 April 2026

Blog

రంగారెడ్డి

* శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉగాది వేడుకలలో పాల్గొన్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ )మార్చి 19: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి హాజరై ఆలయములో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ పంతులు హరి పంతులు పంచాంగం చదివి వినిపించారు భక్తులకు ఉగాది పచ్చడి అందజేశారుఈ పూజ కార్యక్రమం రామలింగేశ్వర స్వామి దేవాలయ అధ్యక్షుడు వడ్డేపల్లి రాములు సాగర్, వార్డు నెంబర్లు, మందుగుల బాలకృష్ణ, పందుల యాదగిరి గౌడ్, బల్గురి శివ, చిలువేరు రమాదేవి శంకర్, కట్ల వనజ భాస్కర చారి, కమిటీ సభ్యులు, గ్రామస్తులు మోగుదాల సత్తయ్య గౌడ్, పాలకూర గిరి గౌడ్, సతీష్ గౌడ్, ఉప్పల రాజయ్య, జక్కల యాదయ్య, చిలువేరు అంజయ్య, ఉప్పల కృష్ణ, నీళ్ల ముత్యాలు, యాదయ్య, సూర రాజయ్య, క్రైమ్ మిర్రర్ రిపోర్టర్ ఉప్పల వెంకటేష్, గునిగంటి రాజు గౌడ్, బానోతు కిరణ్, రెవన పెళ్లి గోపాల్, రిపోర్టర్ సింగం కృష్ణ, పెద్దగోనిగిరి గౌడ్, కొంశెట్టి ప్రవీణ్ గుజ్జుల మునయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ప్రవీణ్ పాల్గొన్నారు.

E-పేపర్

పార్కింగ్ ఫీజు రద్దు ఆ ఒక్క థియేటర్లో మాత్రమే

పార్కింగ్ ఫీజు రద్దు ఆ ఒక్క థియేటర్లో మాత్రమే పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్: దిల్‌సుఖ్‌ నగర్‌లోని కోణార్క్ థియేటర్‌లో మాత్రమే పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవరించిన హైకోర్టు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ చేసిన సుదర్శన్ 35MM, RR సినీ ఎంటర్ప్రైజేస్ తదితరులు సింగిల్ జడ్జి ముందున్న పిటిషన్‌లో ప్రతివాదిగా ఒక్క థియేటర్ మాత్రమే ఉందని, కానీ జడ్జి అన్ని థియేటర్లకు వర్తింపజేశారని వాదనలు వినిపించిన పిటిషనర్ తరపు న్యాయవాది దీంతో దిల్‌సుఖ్‌ నగర్‌లోని కోణార్క్ థియేటర్‌కు మాత్రమే పార్కింగ్ ఫీజును ఫ్రీ చేస్తూ హైకోర్టు ఆదేశాలు

E-పేపర్

తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్

తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్ పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇన్చార్జి: నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టిన హిందీ పేపర్ హిందీ పేపర్ ఫోటో తీసి వాట్సాప్ గ్రూపుల్లో పంపి జవాబులు తెప్పించిన క్లర్క్ ఉపేందర్, ఇన్విజిలేటర్ నిజాంపూర్ సాగర్ బోధన్, మెండోరా మండలాల వాట్సాప్ గ్రూపుల్లో హిందీ పేపర్ చక్కర్లు కొట్టడంతో విచారణ చేపట్టిన డీఈవో కలెక్టర్ ఆదేశాలతో రాజేందర్ (జీహెచ్ఎం, దేగాం), విజయ్ కుమార్ (స్కూల్ అసిస్టెంట్, మచ్చెర్ల), ఉమేందర్ (ఎస్జీటీ, మిర్దాపల్లి), సాగర్ (ఎస్జీటీ, డీకంపల్లి), మమత (జీహెచ్ఎం, ఎస్సారెస్పీ), రవీందర్ (స్కూల్ అసిస్టెంట్, వెల్గటూర్), భూపతి (స్కూల్ అసిస్టెంట్, ఎస్సారెస్పీ), వేణు (స్కూల్ అసిస్టెంట్, పెంటాకలాన్, బోధన్), శివానందరావు (స్కూల్ అసిస్టెంట్, కల్దుర్కి, బోధన్)లను సస్పెండ్ చేసిన డీఈవో ప్రశ్నపత్రం లీక్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

అన్నమయ్య

నవోదయ ‘సాకేతం’.. చిట్వేలు విద్యార్థి అద్భుత విజయం

– 91.25 మార్కులతో రాష్ట్రస్థాయిలో మెరిసిన వెంకట సాకేత్ యాదవ్ – ‘శ్రీ సాయి వికాస్’ పాఠశాల కీర్తి కిరీటంలో మరో మణిహారం – క్రమశిక్షణ, గురువుల మార్గదర్శకత్వమే విజయరహస్యం: కరస్పాండెంట్ తిరుమల రెడ్డయ్య నిరంతర కృషి, అకుంఠిత దీక్ష ఉంటే ఆకాశమే హద్దుగా రాణించవచ్చని చిట్వేలు మండలానికి చెందిన విద్యార్థి మొకం వెంకట సాకేత్ యాదవ్ నిరూపించాడు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష-2026 ఫలితాల్లో సాకేత్ అద్భుత ప్రతిభ కనబరిచి, రాష్ట్రస్థాయి మార్కులతో నవోదయ సీటును కైవసం చేసుకున్నాడు. బుధవారం విడుదలైన ఫలితాల్లో రోల్ నంబర్: 1024529 కలిగిన ఈ విద్యార్థి 91.25 అత్యుత్తమ మార్కులు సాధించి, నవోదయ మాణిక్యంగా మెరిశాడు. -విజయానికి పునాది.. క్రమశిక్షణే ఆయుధం: చిట్వేలు మండల కేంద్రంలోని ప్రముఖ విద్యాసంస్థ శ్రీ సాయి వికాస్ హైస్కూల్‌ లో చదువుతున్న సాకేత్, ప్రాథమిక విద్య నుంచే చదువుపై అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవాడు. కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ వహించేవాడు. క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతూ, ఉపాధ్యాయులు బోధించే మెలకువలను తూచా తప్పకుండా పాటించడం ఇతని విజయానికి ప్రధాన కారణం. ముఖ్యంగా పోటీ పరీక్షల దృష్ట్యా నిర్వహించే సాధన పరీక్షల్లో నిలకడైన ప్రతిభను చాటుతూ, చివరకు లక్ష్యాన్ని చేరుకున్నాడు. -తల్లిదండ్రుల ఆనందం.. గురువుల గర్వం తన కుమారుడు సాధించిన ఈ ఘనతపై సాకేత్ తండ్రి మారుతి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. “సాకేత్ చిన్నతనం నుంచే ఎంతో కష్టపడి చదివేవాడు. స్కూల్ యాజమాన్యం అందించిన ప్రోత్సాహం, గురువుల ప్రత్యేక శిక్షణ వల్లే ఈరోజు నవోదయ సీటు సాధించగలిగాడు. ఇది మా కుటుంబానికే కాకుండా గ్రామానికి కూడా గర్వకారణం” అని ఆయన భావోద్వేగంతో పేర్కొన్నారు. -పాఠశాలలో పండుగ వాతావరణం: శ్రీ సాయి వికాస్ స్కూల్ కరస్పాండెంట్ తిరుమల రెడ్డయ్య నాయుడు మాట్లాడుతూ.. “సాకేత్ విజయం మా విద్యాసంస్థకు లభించిన గొప్ప గౌరవం. నవోదయ వంటి కఠినమైన పరీక్షలో 91.25 మార్కులు సాధించడం సామాన్యమైన విషయం కాదు. అతని ఏకాగ్రత, పట్టుదల భవిష్యత్తులో అతడిని మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. పాఠశాల తరపున అతనికి ఘనంగా సన్మానం చేస్తాము” అని వెల్లడించారు. -గ్రామస్తుల నీరాజనం: సాకేత్ సాధించిన విజయవార్త తెలియగానే చిట్వేలు మండల వ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. గ్రామ పెద్దలు, స్నేహితులు సాకేత్ ఇంటికి చేరుకుని మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి, ప్రభుత్వ అత్యున్నత విద్యాసంస్థలో ఉచితంగా నాణ్యమైన విద్యను పొందే అవకాశం దక్కించుకోవడంపై విద్యావేత్తలు ప్రశంసలు కురిపిస్తున్నారు. నవోదయ విద్యాలయంలో ప్రవేశం లభించడంతో సాకేత్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ వంటి ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయడానికి బలమైన పునాది పడిందని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

మహబూబ్ నగర్

49వ డివిజన్ కార్పొరేటర్ ని అభినందించిన అధ్యక్షులు ఉపాధ్యక్షులు

*49వ డివిజన్ మహబూబ్నగర్ కార్పొరేటర్ గా శ్రీమతి ప్రసన్న ఆనంద్ కుమార్ గౌడ్ గారికి అభినందనలు తెలియజేసిన అధ్యక్షులు ఉపాధ్యక్షులు* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 19/03/2026* *హృదయపూర్వక శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు శుభాకాంక్షలు. మీరు ప్రజా సేవలో నిమగ్నమై ప్రజలమన్నలను చూరగొనాలని ఆకాంక్షిస్తూ, మున్మందు ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాము* *మహేశ్వరి కాలనీ అధ్యక్షులు మహాదేవ్, ఉపాధ్యక్షులు ఎమ్. ఎన్. విజయకుమార్ మరియు కాలనీ వాసులు అందరి తరపున శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు, అభినందనలు*

మహబూబ్ నగర్

25వ డివిజన్ కార్పొరేటర్ ను అభినందించిన అధ్యక్షులు ఉపాధ్యక్షులు

*25,వ డివిజన్ కార్పొరేటర్ ను అభినందించిన కాలనీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 19/03/2026* *25 వ డివిజన్ BJP కార్పొరేటర్ శ్రీ పాండురంగా రెడ్డి గారికి శుభాకాంక్షలు. మీరు ప్రజా సేవలో నిమగ్నమై ప్రజలమన్నలను చూరగొనాలని ఆకాంక్షిస్తూ, మున్మందు ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నారు*. *మహేశ్వరి కాలనీ అధ్యక్షులు మహాదేవ్, ఉపాధ్యక్షులు ఎమ్ ఎన్ విజయకుమార్ మరియు కాలనీ వాసులు అందరి తరపున వారి స్వగృహమున మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ పరాభవ నామ తెలుగు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు* *

మహబూబ్ నగర్

25వ డివిజన్ కార్పొరేటర్ ను అభినందించిన అధ్యక్షులు ఉపాధ్యక్షులు

*25,వ డివిజన్ కార్పొరేటర్ ను అభినందించిన కాలనీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 19/03/2026* *25 వ డివిజన్ BJP కార్పొరేటర్ శ్రీ పాండురంగా రెడ్డి గారికి శుభాకాంక్షలు. మీరు ప్రజా సేవలో నిమగ్నమై ప్రజలమన్నలను చూరగొనాలని ఆకాంక్షిస్తూ, మున్మందు ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నారు*. *మహేశ్వరి కాలనీ అధ్యక్షులు మహాదేవ్, ఉపాధ్యక్షులు ఎమ్ ఎన్ విజయకుమార్ మరియు కాలనీ వాసులు అందరి తరపున వారి స్వగృహమున మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ పరాభవ నామ తెలుగు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు* *

మహబూబ్ నగర్

25వ డివిజన్ కార్పొరేటర్ ను అభినందించిన అధ్యక్షులు ఉపాధ్యక్షులు

*25,వ డివిజన్ కార్పొరేటర్ ను అభినందించిన కాలనీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 19/03/2026* *25 వ డివిజన్ BJP కార్పొరేటర్ శ్రీ పాండురంగా రెడ్డి గారికి శుభాకాంక్షలు. మీరు ప్రజా సేవలో నిమగ్నమై ప్రజలమన్నలను చూరగొనాలని ఆకాంక్షిస్తూ, మున్మందు ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నారు*. *మహేశ్వరి కాలనీ అధ్యక్షులు మహాదేవ్, ఉపాధ్యక్షులు ఎమ్ ఎన్ విజయకుమార్ మరియు కాలనీ వాసులు అందరి తరపున వారి స్వగృహమున మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ పరాభవ నామ తెలుగు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు* *

ఖమ్మం

రేపు. ఖమ్మం జిల్లా బీజేపీ. ఆధ్వర్యంలో ధర్నా కి నెల్లూరు కోటేశ్వరరావు పిలుపు

ఖమ్మం, మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రేపు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన నేపథ్యంలో ప్రజా సమస్యలపై నిలదీయడానికి ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి మండలం నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరుకావాలని కోరారు. అలాగే మండల అధ్యక్షులు తమ పరిధిలోని అన్ని నాయకులు, కార్యకర్తలకు సమాచారం అందించి, కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ధర్నా కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజల ముందుంచి, తమ నిరసనను తెలియజేయనున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కఠిన చర్యలు – రోడ్ సేఫ్టీ వారియర్స్‌తో విస్తృత అవగాహన కార్యక్రమాలు

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS గారి ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సూచనలతో జిల్లా వ్యాప్తంగా రోడ్ సేఫ్టీ వారియర్స్ బృందాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాను 6 డివిజన్లుగా విభజించి, SI స్థాయి అధికారులు మరియు సిబ్బందితో 6 రోడ్ సేఫ్టీ వారియర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ముఖ్య కూడళ్లు, జాతీయ రహదారులు, బ్లాక్ స్పాట్స్ మరియు ప్రమాద ప్రదేశాల్లో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాయి. సౌత్ ట్రాఫిక్ CI ఆధ్వర్యంలో ఇరగాలమ్మ గుడి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో హెల్మెట్ ప్రాముఖ్యతపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం, ఓవర్ స్పీడింగ్, మద్యం సేవించి డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ల డ్రైవింగ్, సెల్‌ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు నేరమని స్పష్టం చేశారు. పోలీసులు ప్రజలకు ఇచ్చిన ముఖ్య సూచనలు: హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి మద్యం సేవించి వాహనం నడపరాదు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మైనర్లు వాహనాలు నడపకూడదు అతివేగం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ ప్రమాదకరం ప్రామాణిక హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా హైవేల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నందున వాహనదారులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల తగ్గింపులో ప్రజల సహకారం కీలకమని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 లేదా సమీప పోలీసులను సంప్రదించాలని జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.