Sunday, 26 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ తల గాయాల దినోత్సవ అవగాహన ర్యాలీ….

ప్రపంచ తల గాయాల దినోత్సవం సందర్భంగా అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో వి ఆర్ హై స్కూల్ నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్లు ప్రజలకు తల గాయాల ప్రమాదాలు వివరించారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని సూచించారు. ప్రమాదం తర్వాత “గోల్డెన్ అవర్”లో చికిత్స కీలకమని తెలిపారు. డ్రైవింగ్ నియమాలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని చెప్పారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగ యువతకు భారీగా ఉద్యోగాల కల్పన లక్ష్యం

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీడీపీ నేత జంపాల సీతారామయ్య తెలిపారు. ప్రభుత్వం 20 నెలల్లో 6,28,347 ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో 25 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించనున్నట్లు చెప్పారు. ఉగాది కానుకగా రెండోసారి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

కడప

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రెస్ మీట్

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల నియామకాలు చేపట్టింది.. ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి , మంత్రి నారా లోకేష్ కచ్చితంగా ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ వదలుతామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు… పరిశ్రమల్లో కూడా ఉద్యోగాల భర్తీ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది… పెట్టుబడులు పెట్టే వాళ్లను ప్రోత్సహిస్తున్నారు… గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఒక్క సచివాలయ ఉద్యోగులను తప్ప ఒక్కరికి ఒక్క ఉద్యోగం కల్పించలేదు… గ్రూప్ -1 , గ్రూప్ -2 లలో పెద్ద ఎత్తున 10,060 ఖాళీలు భర్తీ చేస్తున్నారు… రేపటి దినం ప్రపంచవ్యాప్తంగా జరిగే రంజాన్ పండుగను ప్రజలందరూ సంతోషంగా చేసుకోవాలి… అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా…

కర్నూలు

చెరుకులపాడులో ఘనంగా ఉగాది వేడుకలు.. భక్తిశ్రద్ధలతో పంచాంగ శ్రవణం, రథోత్సవం

కర్నూల్ (పున్నమి ప్రతినిధి) కర్నూలు జిల్లా, వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామంలో ఉగాది పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి. పండుగను పురస్కరించుకుని స్థానిక శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కర్నూలు శ్రీ శ్రీ శ్రీ గౌరీ శంకర స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ యు.యం. రుద్రయ్య స్వామి వారి ఆధ్వర్యంలో ‘పంచాంగ శ్రవణం’ కార్యక్రమం జరిగింది. నూతన సంవత్సరంలో గ్రహగతులు, పాడిపంటలు, రాశి ఫలాల గురించి రుద్రయ్య స్వామి వారు భక్తులకు వివరించారు. పంచాంగ శ్రవణం అనంతరం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ ఆంజనేయ స్వామి వారి పల్లకి ఉత్సవాన్ని మరియు శ్రీ బీరప్ప స్వామి వారి రథోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తరించారు. ఈ ఉగాది వేడుకల్లో గ్రామ పెద్దలు సురేంద్ర స్వామి, వంశీధర్ రెడ్డి, మోహన్ రెడ్డి, నరసింహారావు, బత్తిన చిన్న వెంకటప్ప, ఎర్రమల, చాకలి శివ, మనోహర్ లతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు, మహిళలు, యువకులు అత్యుత్సాహంగా పాల్గొన్నారు.

హైదరాబాద్

పండితుల సంక్షేమమే రికగ్నైజ్డ్ పండిత పరిషత్తు ఏకైక లక్ష్యం

*పండితుల సంక్షేమమే* *రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు లక్ష్యం* *పున్నమి ప్రతినిధి హైదరాబాద్:: తేదీ 23/03/ 2026* ఘనంగా రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు (RUPP) డైరీ ఆవిష్కరణ రవీంద్ర భారతిలో మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగిందని అధ్యక్ష అధ్యక్షులు నరసింహులు తెలిపార సంఘం ముఖ్య నేతలు కే.గోపాల్ జి, అమీర్ పాషా , మానపురి వెంకటేశ్వర్లు, కే.ఇజ్రాయిల్ , నర్సింగ్ రావు, ప్రవీణ్ కుమార్, తదితర నాయకుల బృందం రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న భాషా సంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి లతోపాటు ప్రముఖ కవి ఆచార్య ఎన్ .గోపి ఎందరో కవులు కళాకారుల కలిసిన బృందం, కొన్ని సూచనలు చేస్తూ మెమోరండం సమర్పించడం జరిగిందని తెలిపారు పాఠశాల విద్యలో తెలుగు భాష వికాసం కోసం పండిత పరిషత్ చేస్తున్న కృషిని అదేవిధంగా ఉగాది రోజున దైనందిని డైరీ ఆవిష్కరణ చేయడం పట్ల రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ప్రముఖ జర్నలిస్ట్ పాశం యాదగిరి గారి తో పాటు పలువురు కవులు కళాకారులు అభినందించారు. ఈరోజు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి వేదికగా రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు – తెలంగాణ రాష్ట్ర శాఖ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.* గౌరవ భాషా సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీ *జూపల్లి కృష్ణారావు* గారు మరియు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ *ఏనుగు నరసింహారెడ్డి* గారి చేతుల మీదుగా డైరీ ఆవిష్కరించబడింది. *మంత్రి గారికి విన్నపం* ఉపాధ్యాయులందరికీ TET నుండి మినహాయింపు ఇవ్వాలని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఇతర రాష్ట్రాల తరహాలో పాస్ పర్సంటేజీని తగ్గించి నూతన జీవో (G.O.) విడుదల చేయాలని గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. పండుగ రోజైనప్పటికీ, మా విన్నపాన్ని మన్నించి ఆకస్మికంగా సమయం కేటాయించిన గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ఈ కార్యక్రమంలో *✅ శ్రీ గోపాల్‌జీ గారు (రాష్ట్ర గౌరవ సలహాదారులు)* *✅ శ్రీ అమీర్ పాషా గారు (రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి*) *✅ డాక్టర్ మానుపురి వెంకటేశ్వర్లు గారు (వికారాబాద్ జిల్లా* *అధ్యక్షులు)* *✅ శ్రీ ఇశ్రాయేలు గారు* *(హైదరాబాద్ జిల్లా* *అధ్యక్షులు)* *✅ శ్రీ నర్సింగరావు గారు (హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి)* *✅ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు (హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు*) *ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సంఘం బలోపేతానికి కృషి చేస్తున్న నాయకత్వానికి, కార్యనిర్వాహక వర్గానికి రాష్ట్ర శాఖ పక్షాన హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలిపారు*

ఖమ్మం

నేడు బీజేపీ ధర్నా

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఎన్నికల సమయం లో కాంగ్రెస్ఇ పార్టీ చ్చిన హామీలని నెరవేర్చకుండా ప్రజలని మోసం చేస్తుండటానికి నిరసన గా నేడు భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు తెలిపారు.

E-పేపర్

బ్రేకింగ్ న్యూస్: 10వ తరగతి పరీక్ష వాయిదా – రంజాన్ దృష్ట్యా విద్యాశాఖ కీలక నిర్ణయం

దుత్తలూరు Date19-3-2026 పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు ముఖ్య గమనిక. ఏప్రిల్ 2న జరగాల్సిన 10వ తరగతి వార్షిక పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. రంజాన్ పండుగ తేదీలో మార్పు రావడంతో విద్యార్థులకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుఉన్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులకు తెలియజేయబడినది ఏమనగా, ప్రభుత్వం 21-03-2026 తేదీని రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) సందర్భంగా ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించిన నేపథ్యంలో, అదే తేదీన నిర్వహించవలసిన ఎస్‌ఎస్‌సి 3వ భాష ఇంగ్లీష్ పరీక్ష (పేపర్ కోడ్‌లు 13E & 14E) వాయిదా వేయబడినది. అందువలన, *3వ భాష ఇంగ్లీష్ పరీక్ష (పేపర్ కోడ్‌లు 13E & 14E)ను 02-04-2026 (2nd April 2026 – Thursday) తేదీన ఉదయం 09:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించబడును.* జిల్లా విద్యాశాఖాధికారులు తమ తమ జిల్లాలలో ఈ మార్పును విస్తృతంగా ప్రచారం చేయించి, ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లు మరియు పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థికి సమాచారం చేరేలా నిర్ధారించాలి. అదనంగా, 02-04-2026న జరగనున్న పరీక్షను సజావుగా నిర్వహించుటకు సంబంధిత జిల్లాలలో పరీక్షా కేంద్రాల సిద్ధత, సిబ్బంది నియామకం మరియు అవసరమైన ఇతర లాజిస్టిక్ ఏర్పాట్లు పూర్తిగా సిద్ధంగా ఉంచవలెను. 21-03-2026 తేదీన విధులకు నియమించబడిన ఇన్విజిలేటర్లు యథావిధిగా 02-04-2026 తేదీన కూడా విధులు నిర్వహించవలెను. దీనికి సంబంధి ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి

తిరుపతి

ఉగాది సందర్భంగా తిరుమలలో “స్వర సంగమం”

తిరుమల, 2026 మార్చి 19 పున్నమి ప్రతినిధి భక్తులను మైమరపించిన భక్తి సంగీత విభావరి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల నాదనీరజనం వేదికపై గురువారం సాయంత్రం నిర్వహించిన “స్వరసంగమం” భక్తి సంగీత కార్యక్రమం భక్తులను సంగీత తరంగాల్లో ముంచెత్తింది. “స్వర సంగమం” అనే ఈ ప్రత్యేక సంగీత సమ్మేళనం ఉగాది శుభసందర్భంగా భక్తులకు ఆధ్యాత్మిక సంగీతానుభూతిని అందించింది. శాస్త్రీయ సంగీతం, పాప్ మరియు ఫ్యూజన్ రంగాల్లో తన ప్రత్యేక శైలితో ఖ్యాతి పొందిన పద్మశ్రీ డ్రమ్స్ శివమణి తమ డ్రమ్స్ వాయిద్యంతో భక్తులను మైమరపించారు. పద్మశ్రీ డా. శంకర్ మహదేవన్ తన సుమధుర గాత్రంతో భక్తి గీతాలను ఆలపించి సంగీత ప్రియులను మైమరపించారు. శివమణి వాయిద్య రాగాలు మరియు శంకర్ మహదేవన్ గారి మధుర స్వర విన్యాసం కలసి తిరుమల అంతటా మారుమ్రోగుతూ భక్తులకు ఒక అపూర్వ సంగీతానుభూతిని అందించాయి. ఈ అద్భుత సంగీత సమ్మేళనం సంగీతాభిమానులకు శ్రవణానందాన్ని కలిగించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ వాద్యకారులు శ్రీ బి.వి. బాలసాయి (ఫ్లూట్), శ్రీ రాజేష్ (మాండలిన్), శ్రీ ఎంబర్ కణ్నన్ (వయోలిన్), శ్రీ ప్రవీణ్ నారాయణన్ (తబల), శ్రీ శాశ్విన్ ఆళ్వార్ (కీబోర్డు) తమ ప్రతిభను ప్రదర్శించారు. టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి కళాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, ఎస్వీబీసీ ఇన్‌చార్జ్ సీఈఓ శ్రీ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. —————– టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

తూర్పు గోదావరి

సిరిబొమ్మ ఆచారంతో మోదుగులమ్మ ఉత్సవం ఘనంగా

తాళ్లపూడి,(పున్నమి ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా): తాళ్లపూడి మండలంలోని తాళ్లపూడి గ్రామంలో శ్రీశ్రీశ్రీ మోదుగులమ్మ అమ్మవారి ఉత్సవాలు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నా మన పరమేశ్వరరావు ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు సిరి బొమ్మ రూపంలో గ్రామమంతా ఊరేగింపుగా ఇంటింటికి తీసుకెళ్లి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు నీళ్ల బిందెలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలతో అమ్మవారిని పూజించి తమ కోరికలు తీర్చమని ప్రార్థించారు. తరువాత అమ్మవారిని దేవాలయానికి తీసుకువచ్చి, భక్తుల దర్శనార్థం గుడి ముందు ప్రాంగణంలో ఉంచి ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని సిరిబొమ్మ రూపంలో మూడు సార్లు తిప్పే ఆచారం నిర్వహించారు. అప్పుడు భక్తులు జీడిమామిడికాయలు లేదా అరటిపండ్లతో సిరిబొమ్మను తాకుతూ తమ కోరికలు తీర్చమని ప్రార్థించారు. ఈ పద్ధతి సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఈ కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు వీక్షించి భక్తి పరవశులయ్యారు. భక్తులు, కమిటీ సభ్యులు మరియు పోలీసుల పర్యవేక్షణలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉగాది పండుగ రోజు గ్రామ ప్రజలంతా అమ్మవారి ఆశీర్వాదాలతో ఆనందంగా దర్శనం చేసుకున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా బుట్ట బొమ్మలు, కాళికామాత బొమ్మలతో తీన్మార్ ఊరేగింపు నిర్వహించడం ఆకర్షణగా నిలిచింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవంలో మోదుగులమ్మ అమ్మవారి కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు. Uploaded Video:

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.