Sunday, 26 April 2026

Blog

కర్నూలు

ఘనంగా ఉగాది కవి సమ్మేళనం: “స్వ ఆధారిత జీవనం” ఆవశ్యకతపై కవుల సందేశం

కర్నూలు, పున్నమి ప్రతినిధి: జాతీయ సాహిత్య పరిషద్, కర్నూలు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం (మార్చి 20) సాయంత్రం బుధవారపేటలోని కేశవ మెమోరియల్ స్కూల్ వేదికగా ‘శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం’ అత్యంత వైభవంగా జరిగింది. “స్వ ఆధారిత జీవనం” (స్వదేశీ, స్వభాష, స్వభూష) అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ​ఈ కార్యక్రమానికి జాతీయ సాహిత్య పరిషద్ జిల్లా అధ్యక్షురాలు, ఉపన్యాసకులు డాక్టర్ దండె బోయిన పార్వతీదేవి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాతృభాషను, స్వదేశీ వస్తువులను, మన భారతీయ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఉద్బోధించారు. ​ఈ కవి సమ్మేళనానికి ఆత్మీయ అతిథిగా ప్రముఖ కవి, ఉపాధ్యాయులు శ్రీ రేవుల శ్రీనివాసులు హాజరయ్యారు. ప్రధాన వక్తగా విశ్రాంత బ్యాంకు మేనేజర్, ఆరెస్సెస్ (RSS) విభాగ్ సహ సంపర్క ప్రముఖ్ శ్రీ పరశురాముని రామకృష్ణ పాల్గొని ప్రసంగించారు. నేటి సమాజంలో స్వదేశీ భావజాలం, స్వభాష ప్రాముఖ్యతను, స్వభూష (మనదైన వేషధారణ) ఆవశ్యకతను వారు సభికులకు సవివరంగా తెలియజేశారు. ​అనంతరం జిల్లాలోని పలువురు ప్రముఖ కవులు “స్వ ఆధారిత జీవనం” అనే అంశంపై తమ స్వీయ కవితలను పఠించి సభికులను ఆలోచింపజేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సనాతన ధర్మ, జాతీయ భావాలను పెంపొందించేలా నిర్వహించిన ఈ కవి సమ్మేళనంలో స్థానిక కవులు, సాహిత్యాభిమానులు, నిర్వాహకులు శ్రీ రఘు, శ్రీమతి సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

ఎమ్మెల్యే సార్… రోడ్లు కాదు, ఇవి మరణపు గుంతలు!” “ప్రజలు చస్తేనే మీకు గుర్తొస్తుంద ఈ రోడ్డు ?????”

“ఎమ్మెల్యే సార్… రోడ్లు కాదు, ఇవి మరణపు గుంతలు!” “ప్రజలు చస్తేనే మీకు గుర్తొస్తుందా ఈ రోడ్డు?” ప్రజలు ఓటు వేసి గెలిపించిన నాయకులు, ఈ రోజు అదే ప్రజలు రోడ్లపై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎందుకు? పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్: 20 మార్చి 2026 యాచారం – మేడిపల్లి రోడ్ పరిస్థితి: గుంతలు కాదు… ప్రాణాలు తీసే ఉచ్చులు అర్ధాంతరంగా వదిలేసిన పనులు — ఎవరి బాధ్యత? హెచ్చరిక బోర్డులు లేవు… రక్షణ చర్యలు లేవు ఒక్క ప్రమాదం జరిగినా బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇది నిర్లక్ష్యం కాదు… ప్రజల ప్రాణాలతో చెలగాటం!!! ఎమ్మెల్యే గారు… ఈ రోడ్డు మీద మీరు ఎప్పుడైనా ప్రయాణించారా? ఈ గుంతల్లో పడేది ప్రజలే కాబట్టి పట్టించుకోవట్లేదా? ఓట్లు వేసే సమయంలో మాత్రమే ప్రజలు గుర్తొస్తారా? వెంటనే పనులు పూర్తి చేయాలి ప్రమాదకర ప్రాంతాల్లో బారికేడ్లు & లైట్లు ఏర్పాటు చేయాలి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి “ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే … ప్రజలే సమాధానం చెబుతారు!”

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మధ్యాహ్న భోజనం పై వివాదం:dr MVR

పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంపై గరికిపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను ప్రజా ఆరోగ్య వేదిక (PAV) తీవ్రంగా ఖండించింది. ఈ పథకం పిల్లలలో పోషకాహార లోపాలను తగ్గించడంతో పాటు, హాజరు శాతం పెంచి డ్రాప్‌అవుట్‌లను తగ్గించిందని తెలిపింది. పేద పిల్లలకు కనీస ఆహారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంది. పథకాన్ని బలోపేతం చేయాలని డా. ఎం.వి. రమణయ్య, రాష్ట్ర అధ్యక్షులు టీ. కామేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి – ప్రజా ఆరోగ్య వేదిక (PAV) డిమాండ్ చేస్తున్నారు

ఖమ్మం

కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ కన్నెర్ర ఖమ్మం కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా, వినతిపత్రం సమర్పణ

ఖమ్మం, మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు ఖమ్మం జిల్లాలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నారపరాజు రామచంద్రరావు పిలుపు మేరకు శుక్రవారం ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర కోశాధికారి శ్రీ దేవకీ వాసుదేవరావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పేదలపై భారాలు మోపుతోందని తీవ్రంగా విమర్శించారు. సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం, ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలు రాష్ట్రంలో మరింత పెరిగాయని ఆయన ఆరోపించారు. ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేసిన ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పే సమయం వచ్చిందని అన్నారు. ధర్నా అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గేంటెల విద్యా సాగర్, మండదపు సుబ్బారావు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాకదాని పుల్లారావు యాదవ్, ఇవీ రమేష్, నున్న రవికుమార్, , గుత్తా వెంకటేశ్వర్లు, వక్కలంక సుబ్రహ్మణ్యం, రవిరాథోడ్, మేకల నాగేందర్, మంద సరస్వతి తదితర నాయకులు, మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఫ్లెక్సీలపై కఠిన చర్యలు: నెల్లూరు కమిషనర్ హెచ్చరిక

నెల్లూరులో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదని కమిషనర్ వైవో నందన్ స్పష్టం చేశారు. టౌన్ ప్లానింగ్ సిబ్బందితో సమీక్షలో ఫ్లెక్సీలు 24 గంటలకు మించి ఉండకూడదని తెలిపారు. అనుమతి లేని ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. సెంట్రల్ డివైడర్లు, ఇతర ప్రదేశాల్లో అక్రమంగా పెట్టే ఫ్లెక్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగర సౌందర్యం కాపాడాలని సూచించారు.

జాతీయ అంతర్జాతీయ

హార్ముజ్ మార్గం భారత్‌కు అవకాశం

టెహ్రాన్‌తో జరుగుతున్న చర్చల నేపథ్యంలో, హార్ముజ్ సముద్రసంధి ద్వారా భారత నౌకలకు సురక్షిత ప్రయాణానికి ఇరాన్ అనుమతులు ఇవ్వనున్నట్టు సమాచారం. సముద్ర రవాణా భద్రత కోసం ప్రత్యేక అనుమతి విధానాన్ని రూపొందిస్తున్నట్టు లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. భారత్ 22 నౌకలను గుర్తించి, వాటిలో 20 నౌకలు దేశ ఇంధన భద్రతకు కీలకమని అంచనా వేసింది. ఒక ఎల్పీజీ నౌక ఇరాన్ జలాల్లో ప్రత్యేక మార్గంలో ప్రయాణించినట్లు నివేదిక పేర్కొంది.

కడప

కడప: ఎఫెక్ట్… ప్రోక్యుర్మెంట్ సెంటర్లలో దోపిడీకి తెర.!

కడప జిల్లాలో మార్కెఫెడ్ 21 పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసింది. వీటిని DCMS నిర్వహిస్తోంది. ఇక్కడి ఇన్ఛార్జ్లు రైతుల నుంచి బస్తాకు రూ.150-200లు దోపిడీ చేస్తున్నారు. దీనిపై Way2Newలో వీడియోలతో సహా వరుస కథనాలు ప్రచురించింది. దీంతో శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రొక్యూర్మెంట్ కేంద్రాల్లో క్వింటాలకు రూ.75లు మించి వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు. 88 న్యూస్ శ్రీనివాస నగర్ కేటగిరీలు వైరల్ రీలోడ్

అన్నమయ్య

లోకేష్ ‘భరోసా’.. నిరుద్యోగుల్లో నవోత్సాహం!

– జాబ్ క్యాలెండర్ విడుదలపై రైల్వేకోడూరులో ‘తెలుగుయువత’ సంబరాలు – మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం – యువగళం హామీని నిలబెట్టుకున్న యువనేత: ఖాదీ బోర్డు చైర్మన్ కేకే చౌదరి రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిరుద్యోగుల చిరకాల స్వప్నమైన జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయడం పట్ల రైల్వేకోడూరు నియోజకవర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉగాది పండుగ కానుకగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, శుక్రవారం కోడూరు పట్టణంలో తెలుగుయువత ఆధ్వర్యంలో ఘనంగా కృతజ్ఞతా సభ నిర్వహించారు. మాట తప్పని నేత – నిలబెట్టుకున్న భరోసా: రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల చైర్మన్, తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షులు కేకే చౌదరి ఆదేశాల మేరకు నిరుద్యోగ యువతతో కలిసి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తెలుగుయువత నాయకులు మాట్లాడుతూ.. యువగళం పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చిన ప్రతి హామీని నేడు అధికారంలోకి వచ్చాక తు.చ తప్పకుండా అమలు చేస్తున్నారని కొనియాడారు. ఏళ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ జాబ్ క్యాలెండర్ ఒక వరమని హర్షం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల గొంతుకగా లోకేష్: విద్యార్థులు, యువత సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న లోకేష్ , అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీతో పాటు వరుస నోటిఫికేషన్ల షెడ్యూల్ విడుదల చేయడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. నిరుద్యోగ యువతలో మళ్లీ ఆశలు చిగురించాయని, త్వరలోనే ఇంటికో ఉద్యోగం అనే లక్ష్యం నెరవేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. పాల్గొన్న ముఖ్య నేతలు: ఈ కార్యక్రమంలో గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ పులేల రమేష్ బాబు, టీడీపీ నేత నార్జాల హేమరాజ్, మండల ప్రధాన కార్యదర్శులు చప్పిడి రమేష్ బాబు, తేనెపల్లి నరసింహులు (చిన్నా) పాల్గొన్నారు. తెలుగుయువత ప్రతినిధులు: పోతురాజు సుమన్ రాయల్, మడుపూరి నరేష్, బుంగటావుల రాజశేఖర్, బొబ్బే దునుంజయ యాదవ్, మించల బాలకృష్ణ యాదవ్, హేమంత్ రాయల్, కాకర్ల రెడ్డయ్య, మోసాటి హరినాధ రెడ్డి, తుంగా నవీన్, ఈశ్వర్ యాదవ్, కట్టా గిరిబాబు, పోలిన గణేష్, బాలు నాగేంద్ర, టీఎన్ఎస్ఎఫ్ శివ, బాలాజీ, కస్తూరి జగదీష్, దిలీప్, కట్టా శివ, పాలురి సుధాకర్, మద్దిన రమేష్, మన్నూరు తేజ తదితర ముఖ్య కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గడప గడపకు బీఎస్పీ కార్యక్రమం విజయవంతం – కొండాపురం మండలంలో విస్తృత ప్రచారం

అందరికీ జై భీం నినాదాలతో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో గడప గడపకు బీఎస్పీ కార్యక్రమాన్ని కొండాపురం మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించారు. కమ్మి, రామానుజపురం, బీమవరప్పాడు, రామవరప్పాడు గ్రామాల్లో ఈ ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, బీఎస్పీ సిద్ధాంతాలు, లక్ష్యాలను వివరించారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం బీఎస్పీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రాకుటూరు పుష్పాంజలి, ఉదయగిరి కన్వీనర్ బెజవాడ ప్రకాశరావు, శెట్టిపల్లి వెంకటేశ్వర్లు, మాతయ్య, కోటేశ్వరరావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామస్థులు కూడా ఈ కార్యక్రమానికి మంచి స్పందన చూపించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పటిష్ట పోలీస్ బందోబస్త్ మధ్య ప్రశాంతంగా ముగిసిన RSS పథసంచలన ర్యాలీలు – నెల్లూరు జిల్లాలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా విజయవంతం

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఆధ్వర్యంలో ఉగాది పర్వదినం సందర్భంగా నిర్వహించిన పథసంచలన ర్యాలీలు పటిష్టమైన పోలీస్ బందోబస్త్ మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగిశాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి సమర్థంగా నిర్వహించారు. నెల్లూరు టౌన్‌లో సుమారు 500 మంది RSS కార్యకర్తలు VRC గ్రౌండ్స్ నుండి ర్యాలీని ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహం, పాత ZP ఆఫీస్, పెద్దబజార్, చిన్నబజార్, అజాద్ సెంటర్, ములుముడి బస్ స్టాండ్, కనికల హాస్పిటల్, AC సెంటర్, అలంకార్ సెంటర్, గాంధీ విగ్రహం మీదుగా తిరిగి VRC గ్రౌండ్స్ వరకు ర్యాలీ సాగింది. మొత్తం మార్గంలో ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు లేకుండా పోలీసులు సమన్వయం చేశారు. అదేవిధంగా కావలి టౌన్‌లో బృందావనం కాలనీ, భాష్యం స్కూల్ వద్ద ప్రారంభమైన ర్యాలీ ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ మీదుగా శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో సుమారు 250 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందుకూరుపేట టౌన్‌లో కూడా ఉగాది సందర్భంగా నిర్వహించిన RSS ర్యాలీలు పోలీస్ మరియు ప్రత్యేక బందోబస్త్ నడుమ విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS గారు, SDPO నెల్లూరు టౌన్ ASP శ్రీమతి దీక్ష, IPS గారు, చిన్నబజార్ CI కోటేశ్వరరావు, సంతపేట CI సోమయ్య, ట్రాఫిక్ CIs రామకృష్ణ, వెంకటరెడ్డి, కావలి టౌన్ CI ఫిరోజ్, ఇందుకూరుపేట SIతో పాటు బందోబస్త్ నిర్వహించిన పోలీసు సిబ్బందిని అభినందించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.