Sunday, 26 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అనంతసాగరం మండలంలో రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన టిడిపి అధ్యక్షుడు మెట్టుకూరు కృష్ణారెడ్డి

అనంతసాగరం మండలం తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు మెట్టుకూరు కృష్ణారెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన రంజాన్ మాసం మనకు ఆత్మశుద్ధి, నియమ నిష్ఠలు, సహనం, దయ వంటి మహత్తరమైన విలువలను గుర్తు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉపవాస దీక్షల ద్వారా మనసును, ఆలోచనలను పరిశుభ్రం చేసుకుంటూ ఆధ్యాత్మికత వైపు ముందుకు నడిపించే ఈ పవిత్ర కాలం ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నారు. రంజాన్ మనకు పేదల పట్ల దయ చూపాలని, జకాత్ ద్వారా సహాయం చేయాలని, సమాజంలో సమానత్వం మరియు సోదరభావం పెంపొందించాలని సూచిస్తుందని వివరించారు. ప్రేమ, కరుణ, పరస్పర గౌరవం వంటి విలువలను మన జీవితాల్లో నిలబెట్టే ఈ పర్వదినం ఎంతో గొప్పదని కొనియాడారు. ఈ పవిత్ర సందర్భంలో ముస్లిం సోదర సోదరీమణుల జీవితాల్లో సంతోషం, ఆరోగ్యం, శాంతి, ఐశ్వర్యం నిండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మండల ప్రజలందరికీ మరోసారి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు మండలంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహణ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చ్( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం మడమనూరు, అక్కంపేట, వీరంపల్లి గ్రామాలలో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, సమాజ శాంతి, సౌభ్రాతృత్వం కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మత గురువులు, పెద్దలు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొని ఆనందం వెల్లివిరిసింది.

కాకినాడ

ద్రాక్షవరం (ద్రాక్షారామం) అనే పేరు …

ద్రాక్షవరం (ద్రాక్షారామం) అనే పేరు పూర్వంలో ఉన్న “దక్షారామం” నుండి వచ్చినదిగా భావిస్తారు. ఇది హిందూ పురాణాల్లోని దక్ష యజ్ఞంతో సంబంధం కలిగి ఉందని చెబుతారు. కాలక్రమేణా ఉచ్చారణ మార్పులతో దక్షారామం → ద్రాక్షారామం → ద్రాక్షవరం అయ్యింది. ఇక్కడ ప్రసిద్ధ భీమేశ్వర స్వామి ఆలయం ఉంది, ఇది పంచారామ క్షేత్రాల్లో ఒకటి. గోదావరి ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రం ఆధ్యాత్మిక ప్రాధాన్యం, చారిత్రక వైభవంతో ప్రత్యేక గుర్తింపు పొందింది.

కాకినాడ

కాకినాడ పేరు రహస్యం

కాకినాడ అనే పేరుకు స్పష్టమైన ఆధారం లేకపోయినా, సాధారణంగా “కాకి + నాడ” నుండి ఉద్భవించిందని భావిస్తారు. అంటే కాకులు ఎక్కువగా ఉన్న ప్రాంతం అని అర్థం. బ్రిటిష్ కాలంలో ఈ ప్రాంతాన్ని “Cocanada” అని పిలిచేవారు. పూర్వం ఇది “కాకినాడివాడ” అనే చిన్న గ్రామంగా ఉండి, కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ కాకినాడగా మారింది. గోదావరి డెల్టా ప్రాంతం కావడంతో ఇక్కడ పచ్చదనం, ప్రకృతి అందాలు విస్తారంగా కనిపిస్తాయి.

E-పేపర్

నందిపాడులో ఘనంగా రంజాన్ వేడుకలు

దుత్తలూరు Date:21-3-2026 నందిపాడు: పవిత్ర రంజాన్ పండుగను నందిపాడు ప్రాంతంలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు నిర్వహించిన వారు ఈద్ సందర్భంగా ప్రత్యేక నమాజులు నిర్వహించారు. ఉదయం నుంచే మసీదులకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అల్లాహ్‌కు ప్రార్థనలు చేశారు. పరస్పరం కౌగిలించుకుని “ఈద్ ముబారక్” అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్నారులు కొత్త దుస్తులు ధరించి ఆనందంగా పండుగను జరుపుకున్నారు.స్థానిక ప్రముఖులు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. నందిపాడు ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పండుగ నమాజ్ ముగిసింది.

తిరుపతి

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు

తిరుమల, 2026 మార్చి 21 పున్నమి ప్రతినిధి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు తన సతీమణి శ్రీమతి భువనేశ్వరి, కుమారుడు మరియు మంత్రి శ్రీ లోకేష్ లతో కలిసి తన మనవడు చిరంజీవి నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ద్వారా గౌ|| ముఖ్యమంత్రివర్యులు ఆలయంలోకి ప్రవేశించారు. మహద్వారం వద్దకు చేరుకోగానే అర్చకులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. ధ్వజస్తంభం వద్ద నమస్కరించిన అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ వకుళమాతను, ఆలయ ప్రదక్షణగా వచ్చి విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, యోగనరసింహస్వామివారిని దర్శించుకుని హుండిలో కానుకలు సమర్పించారు. శ్రీవారిని దర్శించుకున్న గౌ|| ముఖ్యమంత్రివర్యులకు స్వామివారి శేష వస్త్రాన్ని అందించారు. తరువాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా గౌ|| ముఖ్యమంత్రివర్యులకు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిలు, శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, పరాభవ నామ సంవత్సర పంచాంగం, డైరీ, క్యాలెండర్, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులను చైర్మన్, ఈవోలు అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీటీడీ బోర్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా అధికారులు, టీటీడీ జేఈవోలు శ్రీ వీరబ్రహ్మం, డాక్టర్ శరత్, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. ——————————— టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

జాతీయ అంతర్జాతీయ

AI హాస్పిటల్స్ – వైద్య విద్యలో విప్లవం!

చైనాలోని త్సింగ్హువా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న AI ఆధారిత “వర్చువల్ హాస్పిటల్స్” వైద్య విద్యలో కొత్త మార్గాన్ని చూపుతున్నాయి. ఈ సిస్టమ్‌లో మెడికల్ విద్యార్థులు డిజిటల్ రోగులు, AI డాక్టర్లతో ఇంటరాక్ట్ అవుతూ నిజ జీవిత ఆసుపత్రి అనుభవాన్ని పొందగలరు. వేలాది క్లినికల్ కేసులు, రోగి చరిత్ర, లక్షణాలు, ల్యాబ్ రిపోర్టులు అందుబాటులో ఉంటాయి. విద్యార్థుల నిర్ణయాలను విశ్లేషించి వెంటనే ఫీడ్‌బ్యాక్ ఇస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది భవిష్యత్ వైద్యులను సురక్షిత డిజిటల్ వాతావరణంలో శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.

ఖమ్మం

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన బత్తుల మురళి

ఖమ్మం మార్చి (పువ్వాడ నాగేంద్ర కూమర్ పున్నమి జిల్లా ఇంచార్జి ) పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఖమ్మం కార్పొరేషన్ మాజీ డిప్యుటీ మేయర్ బత్తుల మురళి ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ పండుగ సామరస్యానికి, సహనానికి, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించాలని ఆకాంక్షించారు. ఉపవాస దీక్షలు ఆచరించే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుకున్నారు.

తూర్పు గోదావరి

వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా తోట రామకృష్ణకు అభినందనలు – నాయకుల సన్మానం

తాళ్లపూడి,(తూర్పుగోదావరి,పున్నమి ప్రతినిధి ), మార్చి 21:ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మరియు గోపాలపురం నియోజకవర్గ పరిశీలకుడిగా తోట రామకృష్ణ నియమితులైన సందర్భంగా ఆయనకు పార్టీ నాయకులు ఘనంగా సత్కారం నిర్వహించారు. వేగేశ్వరపురం సర్పంచ్ మరియు తాళ్లపూడి మండలం సర్పంచ్ ఛాంబర్ అధ్యక్షులు కొమ్మిరెడ్డి పరశురామారావు, గ్రామ కమిటీ అధ్యక్షులు భగవాన్, పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, నల్లజర్ల మండల వైస్ ఎంపీపీ శివాజీ, సచివాలయ కన్వీనర్ వీరబద్రరావు, వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు అచ్చుత వెంకట స్వామి తదితరులు మర్యాదపూర్వకంగా కలసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షులు ఇంటి వీర్రాజు కూడా పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ప్రక్కిలంకలో శ్రీనివాస స్మార్ట్ హాస్పిటల్ వార్షికోత్సవం – నాణ్యమైన వైద్య సేవలతో ముందుకు

తాళ్లపూడి,(పున్నమి ప్రతినిధి,తూర్పుగోదావరి) : తాళ్లపూడి మండలం ప్రక్కిలంకలోని రావిపాటి ఫంక్షన్ హాల్ సమీపంలో ఉన్న శ్రీనివాస స్మార్ట్ హాస్పిటల్ రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా హాస్పిటల్ ప్రాంగణంలో వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ అధినేత మూర్తి మాట్లాడుతూ, హాస్పిటల్ స్థాపించినప్పటి నుంచి ప్రజలకు వివిధ అనారోగ్య సమస్యలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ, ఎక్కడా రాజీ పడకుండా రోగులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగులపై ఆర్థిక భారం తగ్గించే విధంగా సేవలు అందిస్తున్నామని, హాస్పిటల్ 365 రోజులు 24 గంటలు నిరంతర సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ సేవలందించడంలో హాస్పిటల్ సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. హాస్పిటల్ అభివృద్ధికి సహకరించిన ప్రజలకు, గ్రామీణ వైద్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చరణ్, డాక్టర్ భవ్య, ఆర్ఎంపీలు మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.