Saturday, 25 April 2026

Blog

ఎలూరు

3కేజీ ల కణితి ని ఆపరేషన్ చేసి తీసిన సాయి దుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది. సర్జన్స్ & గైనకాలజిస్ట్

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. ఏలూరు జంగారెడ్డిగూడెం బి జంగారెడ్డిగూడెం లోని సాయి దుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో బి వెంకటలక్ష్మి 37 సంవత్సరాలు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ వస్తే ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయడం జరిగింది కడుపులో 3కేజీ ల కణితి ని హాస్పిటల్ వారు ఆపరేషన్ చేసి తీయడం జరిగింది, ఆపరేషన్ సక్సెస్ చేసినందుకు పేషంట్ తరపు వారు Dr. అత్తిలి పోసేశ్వరరావు,హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్థోపెడిక్ సర్జన్& గైనకాలజిస్ట్ వారి బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. End

ఖమ్మం

అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: ధనియాకుల వెంకట్ నారాయణ పిలుపు

ఖమ్మం, మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అరాచక పాలనను నిరసిస్తూ నిర్వహించనున్న “అసెంబ్లీ ముట్టడి” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు నాయకత్వంలో సోమవారం (23వ తేదీ) జరగనున్న ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొనాలని ఆయన కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న కమీషన్ల పాలన, ప్రజల జీవనంపై పడుతున్న ప్రభావం, భావితరాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న పరిస్థితులపై నిరసన వ్యక్తం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. కాబట్టి జిల్లా, పట్టణ స్థాయి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం

అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి: నెల్లూరు కోటేశ్వరరావు పిలుపు

ఖమ్మం, మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించనున్న “అసెంబ్లీ ముట్టడి” కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని . ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల బతుకులను దెబ్బతీస్తూ, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. అవినీతి, అరాచకాలు, కమీషన్ల పాలనతో రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు నాయకత్వంలో మార్చి 23, సోమవారం నాడు నిర్వహించనున్న “అసెంబ్లీ ముట్టడి” కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మోసపూరిత హామీలతో ప్రజలను వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని, పేదల సమస్యలను విస్మరించిన ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

ఖమ్మం

బడ్జెట్‌లో ఖమ్మం జిల్లాకు గుండు సున్నా.. తెలంగాణ బడ్జెట్‌పై బీజేపీ నేత దేవకీ వాసు దేవా రావు ఆగ్రహం

ఖమ్మం, మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి): తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో ఖమ్మం జిల్లాకు అన్యాయం జరిగిందని బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర బీజేపీ కోశాధికారి దేవకి వాసుదేవరావు మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ “ఆలీబాబా అరడజన్ పథకాలు” లా ఉందని, ప్రజలను మోసం చేసే పిట్ట కథలతో సమానమని విమర్శించారు. ఖమ్మం జిల్లాకు బడ్జెట్‌లో గుండు సున్నా మాత్రమే దక్కిందని, ముగ్గురు మంత్రులు ఉన్నా జిల్లాకు నిధులు తీసుకురాలేకపోయారని అన్నారు. ఇచ్చిన హామీలకు అవసరమైన ఖర్చు కంటే తక్కువ ఆదాయం ఉండటంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాబోయే రోజుల్లో ఖమ్మం ప్రజలు ఈ విషయాన్ని గమనించి తగిన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

News

మంత్రి వర్యా….! మా మొర వినుమా…!! మా బుగ్గారం రోడ్డు వేసి – మమ్ము ఆదుకొనుమా….!!! – రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాక సందర్భంగా మండల ప్రజల ప్రత్యేక విజ్ఞప్తి

మంత్రి వర్యా….! మా మొర వినుమా…!! మా బుగ్గారం రోడ్డు వేసి – మమ్ము ఆదుకొనుమా….!!! – రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాక సందర్భంగా మండల ప్రజల ప్రత్యేక విజ్ఞప్తి బుగ్గారం / జగిత్యాల జిల్లా: – ( చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ , సెల్ నం: 99481 33 539 ) అయ్యా…. మా ప్రియతమ మంత్రివర్యా….! మా మొర వినుమా…!! మా బుగ్గారం రోడ్డు వేసి – మమ్ము ఆదుకొనుమా …!!! అంటూ తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను జగిత్యాల జిల్లా బుగ్గారం మండల ప్రజలు ప్రత్యేకంగా వేడుకుంటున్నారు. పలు అభివృద్ధి పనుల శంఖుస్థాపనల కోసం ఆదివారం బుగ్గారం మండల కేంద్రానికి విచ్చేస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై మండల ప్రజలు ఎంతగానో ఆశలు పెట్టుకొని వారి రాక కోసం ఎదిరి చూస్తున్నారు. జగిత్యాల నుండి ధర్మపురి వెళ్ళే 63వ జాతీయ రహదారిలోని “బుగ్గారం ఎక్స్ రోడ్డు” నుండి మండల కేంద్రానికి వచ్చే ప్రధాన రోడ్డు మార్గం సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరం మొత్తం రోడ్డు పూర్తిగా చెడిపోయినది. రోడ్డంతా…. గుంతలు – గుంతలతో పాటు కంకర రాళ్లు కూడా తేలి అత్యంత ప్రమాద కరంగా మారింది. నిత్యం ఈ రోడ్డు వెంట వేలాది మంది ప్రజలు ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళంతా అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. గత కొన్ని ఏండ్ల నుండి రాకపోకలకు తీవ్ర ఇబ్బందితో పాటు, కొత్త – కొత్త వాహనాలు చెడిపోవడం, ఈ రోడ్డు పై ప్రయాణం చేసిన వారు అంతా గుంతల రోడ్డు, కంకర తేలిన రోడ్డుతో శరీరం కుదింపులకు గురై , తీవ్ర అనారోగ్యాల పాలు కావడం జరుగుతోంది. చిన్నా – చితకా ప్రమాదాలు కూడా జరిగి అనేక మంది గాయాల పాలైన వారు కూడా ఉన్నారు. బుగ్గారం మండల కేంద్రం అయినందున నిత్యం అధిక సంఖ్యలో ప్రజలు ఈ రోడ్డు వెంటే ప్రయాణం చేస్తూ ఉంటారు. మండలంలోని వివిధ శాఖల అధికారులు – సిబ్బంది, ఉద్యోగులు, ఉపాధ్యాయనీ – ఉపాధ్యాయులు, వివిధ రకాల వ్యాపారస్తులు ఈ రోడ్డు వెంట రావాలంటే వారి ప్రాణాలు అర చేతిలో పెట్టుకున్నంత ఇబ్బందిగా మారింది ఈ రోడ్డు దుస్థితి. కావున అయ్యా… మా ప్రియతమ మంత్రి వర్యా….! దయచేసి మమ్మల్ని కరుణించి మాపై మీ కృపా కటాక్షాలు ఉంచి మా “బుగ్గారం రోడ్డు” డబల్ రోడ్డుగా మంజూరు చేయించి వెంటనే నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం కూడా చేయించి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని బుగ్గారం మండల ప్రజలు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను వేడుకుంటున్నారు. అలాగే…. మేమంతా ఇంకా అనేక సమస్యలతో నిత్యం సతమతం అవుతున్నాం… సౌకర్యాల లేమితో… నిలిచి పోయిన అభివృద్ధి పనులతో…. ప్రభుత్వ కార్యాలయాలలో అధికారుల, సిబ్బంది కొరతతో… ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం…. ప్రత్యేకంగా మిమ్మల్ని కలిసి మా బాధలు, మా సమస్యలు అత్యవసరంగా … మీతో చెప్పుకోవాల్సినవి ఇంకా అనేకంగా ఉన్నాయి. దయచేసి మిమ్మల్ని వీలైనంత త్వరలో…. మేము ప్రత్యేకంగా కలిసే భాగ్యం మాకు కల్పిస్తారని మండల ప్రజలు, ప్రముఖులు, ముఖ్యంగా మహిళలు, యువత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు.

తిరుపతి

బీడీ కాలనీలో పండుగ సంబరం: ముస్లింలకు కలవగుంట భరత్ రెడ్డి కానుకలు.

శ్రీకాళహస్తి, మార్చి 21 (పున్నమి న్యూస్): నిరుపేద ముస్లిం సోదరుల ఇళ్లలో రంజాన్ పండుగ కాంతులు నిండాలనే సంకల్పంతో ప్రముఖ సంఘ సేవకులు కలవగుంట భరత్ రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. తొట్టంబేడు మండలం, బీడీ కాలనీ నివాసితులకు పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని శనివారం ఆయన తన యువసేన సభ్యుల ద్వారా పండుగ కానుకలను పంపిణీ చేశారు. ప్రతి ఏటా రంజాన్ సందర్భంగా బీడీ కాలనీ ముస్లిం కుటుంబాలకు అండగా నిలవడం భరత్ రెడ్డి ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా కాలనీలోని పేద కుటుంబాలకు చికెన్ మరియు కోడిగుడ్లను అందజేశారు. ఈ సందర్భంగా భరత్ రెడ్డి ఫోన్ ద్వారా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. పవిత్ర మాసంలో చేసే ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఆత్మీయతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. తమ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, ఏటా పండుగ వేళ తమకు అండగా నిలుస్తున్న భరత్ రెడ్డికి బీడీ కాలనీ ముస్లిం సోదరులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలవగుంట భరత్ రెడ్డి యువసేన సభ్యులు మరియు స్థానిక నేతలు పాల్గొన్నారు.

తిరుపతి

సేవా దృక్పథంతో ముందుకు సాగాలి-రెడ్ క్రాస్ కార్యవర్గాన్ని అభినందించిన మంత్రి సత్య కుమార్.

శ్రీకాళహస్తి, మార్చి 21 (పున్నమి న్యూస్): ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు సకాలంలో రక్తాన్ని అందించి ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అడుగులు వేయడం అభినందనీయమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం నాడు తిరుపతిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్‌ను ఆయన తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులుతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెడ్ క్రాస్ సొసైటీ ప్రపంచవ్యాప్తంగా సేవా దృక్పథంతో పనిచేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోందని కొనియాడారు. తిరుపతిలో కొత్తగా బ్లడ్ బ్యాంక్ అందుబాటులోకి రావడం వల్ల స్థానిక ప్రజలకు, అత్యవసర వైద్య సేవల అవసరమున్న వారికి ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన తిరుపతి రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గ సభ్యులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, జిల్లా చైర్మన్ డాక్టర్ శ్రీహరి రావు, వైస్ చైర్మన్ డాక్టర్ గుడ్లూరు మయూర్, సెక్రటరీ ప్రతీత్, ట్రెజరర్ సుబ్బారావు, రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గ సభ్యులు మణి శ్రీనివాస్, కృష్ణ కుమార్, సుధీర్, శివకుమార్, సుబ్రహ్మణ్యం రెడ్డి, గుణశేఖర్, రవి ఇతర ముఖ్య నేతలు, వైద్య సిబ్బంది ఈ ప్రారంభోత్సవంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

తిరుపతి

భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు-పాపానాయుడుపేట ఈద్గా వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు

ఏర్పేడు, (సూర్యోదయం) ప్రతినిధి, మార్చి 21: పాపానాయుడు పేటలో జామియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా అత్యంత భక్తి శ్రద్దలతో ఈద్గా వద్ద ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మత గురువు ముస్తఫా మాట్లాడుతూ.. రంజాన్ నెలలో అల్లా కోసం 30 రోజులు ఉపవాసాలు ఉన్న వారికి ఆ అల్లా ప్రతి ఒక్కరిని కరుణతో చూస్తాడని అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నాను . 30 రోజులు ఉపవాసలు ఉన్నవారికి ఆ అల్లా తప్పనిసరిగా మానవులు తెలిసి తెలియక చేసిన పాపములను కడిగి తమ జీవితం సార్థకమవుతుందని. ప్రస్తుతం ప్రపంచ దేశాలు అల్లకల్లోలమైన స్థితిలో ఉన్నదని. ప్రపంచ శాంతిని ప్రసాదించాలని అల్లాను ప్రార్థించారు. తదుపరి ప్రతి ఒక్కరూ ఒకరిని ఒకరు ఆ లింగం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలియ జేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ముత్తపల్లి లాలాసాహెబ్. సెక్రటరీ భాషా సాహెబ్. ఆషీం . సర్దార్. కరీముల్లా. మౌలా, కమిటీ సభ్యులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సాహితీ

కవిత క(ళ/ల)ల భవిత -డాక్టర్ బద్రి పీర్ కుమార్

ప్రపంచ కవితా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 21న జరుపుకుంటాము. మానవ మనస్సులోని సృజనాత్మకతను, భావ వ్యక్తీకరణను గౌరవించడానికి, కవిత్వం ద్వారా భాషా వైవిధ్యాన్ని కాపాడటానికి అంతరించిపోతున్న భాషలకు ప్రాముఖ్యతనివ్వటానికి మరియు కవిత్వాన్ని చదవడం, రాయడం వంటి ప్రక్రియలను ప్రోత్సహించచాలనే ప్రధాన లక్ష్యంతో 1999లో పారిస్‌లో జరిగిన యునెస్కో 30వ సాధారణ సమావేశంలో మార్చి 21ని ప్రపంచ కవితా దినోత్సవంగా ప్రకటించారు. కవిత్వం అనేది వివిధ సంస్కృతుల మధ్య వారధిగా పనిచేస్తుంది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కవి సమ్మేళనాలు, వర్క్‌షాపులు మరియు సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. మన తెలుగు భాషలో కూడా ఎందరో మహానుభావులు కవిత్వం ద్వారా సామాజిక మార్పుకు, చైతన్యానికి కృషి చేసిన వారున్నారు. వారందరినీ గుర్తుచేసుకుంటున్న సందర్భంగా పాఠకుల కోసం ఈ కవిత కవిత్వం జనజీవన తత్వం భావాత్మకజాలంలో తన్మయత్వం మారుతున్న సమాజ భావకత్వం జీవితాన్ని ప్రతిబింబించే లాలిత్యం ఊగిసలాడే ఊహలపల్లకీ గీతం అనుభవాలమాటున కలలపారిజాతం అంతరంగంలో ఉద్భవించే ప్రకృతిజలపాతం ఆలోచన సాగరాన్ని మదించే మంత్రం ఊహల పందిరిలో హరివిల్లుల అద్భుతం భావాకృతిని ఆక్రమించుటలో స్వచరితం పాఠమైనా గుణపాఠమైనా విశ్లేషించువసంతం మనసును రంజింపచేయు సృజనాత్మకత్వం ధ్వనించు శబ్దంలో నిగూఢత్వం కదిలించే ఘటనల నిత్య ఆలోచనత్వం చైతన్యరాగాల ఆధునిక రూపకత్వం సమాసమానతలను తెలిపే అవసరసత్యం నిరంతర సాధనల అన్వేషణత్వం జీవన శృతిలయల మధురత్వం మదిమదిని మురిపించే దైవత్వం అనుభూతుల అక్షరరూపకం వర్ణనాతీతం

తిరుపతి

జనసేన సభ్యత్వ నమోదు వేగవంతం – 115 మంది సాధక్‌లతో గ్రామాల దాకా విస్తరణ

శ్రీకాళహస్తి, మార్చి 21 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 115 మంది సాధక్‌లు బాధ్యతలు స్వీకరించి, నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సాధక్‌లు గ్రామాల వారీగా తిరుగుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ భావజాలాలను ప్రజలకు వివరించడమే కాకుండా, ఉద్యమి సభ్యత్వం ద్వారా లభించే భద్రత, భరోసా వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఒక సభ్యత్వం ద్వారా అనేక వేల సభ్యత్వాలు నమోదు చేయిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ, జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తిగా పవన్ కళ్యాణ్ ఆశయాల సాధన కోసమేనని, ఇతరుల కోసం కాదని స్పష్టం చేశారు. సాధక్‌గా బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరు ఒక బలమైన నాయకుడిగా ఎదగాలనే సంకల్పంతో పనిచేస్తున్నారని తెలిపారు. పేట బ్రదర్స్ మిత్రబృందం ప్రతిపాదన మేరకు, ప్రతి సాధక్‌ను భవిష్యత్‌లో శక్తివంతమైన నాయకుడిగా తీర్చిదిద్దే దిశగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.