Sunday, 26 April 2026

Blog

తిరుపతి

అనారోగ్యంతో ఉన్న టిడిపి నేతను పరామర్శించి ధైర్యం చెప్పిన బొజ్జల బృందమ్మ

శ్రీకాళహస్తి, మార్చి 21 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ తన నియోజకవర్గంలోని సీనియర్ కార్యకర్తల పట్ల తనకున్న మమకారాన్ని చాటుకున్నారు. శ్రీకాళహస్తి మండలం, ఎంపేడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈశ్వర్ రెడ్డి గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, ప్రస్తుతం తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బృందమ్మ స్వయంగా ఆసుపత్రికి విచ్చేసి ఈశ్వర్ రెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆమె, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు. పార్టీ అభివృద్ధిలో మొదటి నుంచి కీలక పాత్ర పోషిస్తున్న ఈశ్వర్ రెడ్డి వంటి సీనియర్ నాయకులకు బొజ్జల కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. బొజ్జల కుటుంబ పెద్దగా బృందమ్మ స్వయంగా వచ్చి పరామర్శించడంతో ఈశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ, ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో జనసేన జోరు-10 వేల మార్కును దాటిన క్రియాశీలక సభ్యత్వాలు

శ్రీకాళహస్తి, మార్చి 21 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పార్టీ ఎదుగుదల అనూహ్యంగా కొనసాగుతోంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ప్రసాద్ నేతృత్వంలో నియోజకవర్గంలో పార్టీ కేడర్ ఉత్సాహంగా పని చేస్తోంది. ఈ క్రమంలో నియోజకవర్గంలో జనసేన క్రియాశీలక సభ్యత్వాల సంఖ్య 10,000 మార్కును దాటడం ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది. గత ఏడాది 7,388 సభ్యత్వాలు నమోదు కాగా, ఈ సంవత్సరం ఆ సంఖ్యను అధిగమించి ఇప్పటికే 10 వేల మార్కును చేరుకుంది. ఇదే ఉత్సాహంతో 15,000 సభ్యత్వాల లక్ష్యం దిశగా నియోజకవర్గ జనసైనికులు దూసుకుపోతున్నారు. ఈ అద్భుత విజయానికి కారకులైన శ్రీకాళహస్తి నియోజకవర్గ సాధకులకు, కార్యకర్తలకు కొట్టే సాయి ప్రసాద్ తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజా క్షేత్రంలో పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న సాయి ప్రసాద్ కృషిని కార్యకర్తలు కొనియాడారు. ఇదే పంథాలో ముందుకు సాగి నియోజకవర్గంలో జనసేన జెండాను మరింత ఎత్తులో ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో గంజాయి బ్యాచ్ బరితెగింపు-మార్కెట్ యార్డ్ సిబ్బందిపై పైశాచిక దాడి

శ్రీకాళహస్తి, మార్చి 21 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలో గంజాయి బ్యాచ్‌లు బరితెగిస్తున్నాయి. తాజాగా శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) కార్యాలయంలో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందిపై గంజాయి మత్తులో ఉన్న కొందరు దుండగులు దాడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శ్రీకాళహస్తి మార్కెట్ యార్డ్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న తుమ్మ బాల, రాకేష్‌లపై గుర్తు తెలియని గంజాయి బ్యాచ్ ఒక్కసారిగా దాడికి దిగింది. ఏ కారణం లేకుండానే విచక్షణారహితంగా దాడి చేయడంతో బాధితులకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తసిక్తమైన స్థితిలో ఉన్న వారిని తోటి సిబ్బంది వెంటనే శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు అక్కడ చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు బాధితులను ఆసుపత్రిలో పరామర్శించారు. పట్టణంలో గంజాయి విక్రయాలు, తాగుబోతుల ఆగడాలు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి కూడా రక్షణ లేకపోవడం దురదృష్టకరమని వారు మండిపడ్డారు. నిందితులను వెంటనే గుర్తించి, వారిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గంజాయి మహమ్మారిని అరికట్టడంలో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మార్కెట్ యార్డ్ పరిసరాల్లోని సీసీటీవీ దృశ్యాలను సేకరించి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

తిరుపతి

శ్రీకాళహస్తి శివార్లలో పేకాట రాయుళ్ల అరెస్ట్- నగదు, బైక్‌లు స్వాధీనం

శ్రీకాళహస్తి, మార్చి 21 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు నిఘా పెంచారు. మండలంలోని ఉడమలపాడు గ్రామ శివార్లలో రహస్యంగా జూదం (పేకాట) ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జూదం ఆడుతున్న నలుగురు వ్యక్తులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేసినట్లు శ్రీకాళహస్తి రూరల్ సీఐ ఇబ్రహీం, ఎస్ఐ వెంకటేశ్ వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ. 8,500 నగదు, 4 సెల్‌ఫోన్లు, మరియు వారు ప్రయాణించిన 2 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. ఈ సందర్భంగా సీఐ ఇబ్రహీం మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో జూదం, కోడిపందాలు వంటి చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంటుందని, ఎవరైనా ఇటువంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎక్కడైనా ఇలాంటి పనులు జరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు కోరారు.

కడప

ప్రొద్దుటూరు: గృహనియోగ సిలిండర్లు వ్యాపారాలకు మళ్లింపు

ప్రొద్దుటూరులో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను బహిరంగంగానే వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్నారు. రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీలు, టీస్టాళ్ళు, క్యాటరింగ్ సెంటర్లలో విచ్చలవిడిగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాడుతున్నారు. స్థానిక గ్యాస్ ఏజెన్సీలు గృహ వినియోగ సిలిండర్లను అధిక ధరలకు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ఈ దోపిడీపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గృహ వినియోగదారులు కోరుతున్నారు.

రాజన్న సిరిసిల్ల

మంగళగడ్డ ఆంజనేయస్వామి దేవాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం లో 11 రోజుల మాలాధారణ.

ముస్తాబాద్ మార్చి 21 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కేంద్రంలో మంగళగడ్డ ఆంజనేయస్వామి దేవాలయంలో ఈరోజు భక్తిశ్రద్ధలతో 11 రోజుల మాలాధారణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రాంతీయ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు హారతులు నిర్వహించారు దేవాలయంలో ఉదయం నుంచి ఆధ్యాత్మిక వాతావరణం. నెలకొని మలాధారణ చేసిన భక్తులు నియమనిష్టలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజారి రాజు పంతులు వేదమంత్రాల నడుమ స్వామివారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. 11 రోజులు భక్తులు నియమాలు పాటిస్తూ ఉపవాసాలు. భజనలు చేస్తూ స్వామివారిని ప్రార్థించనున్నారు. మనోధారణ వేసిన భక్తులకు శాంతి . అష్ట ఐశ్వర్యాలు సుఖ సమృద్ధులు కలగాలని పంతులుగారు ఆశీర్వదించారు.

హైదరాబాద్

ఎయిడ్స్ వైరస్ వ్యాప్తి

ఎయిడ్స్‌కు కారణమైన HIV వైరస్ రక్తం, అసురక్షిత లైంగిక సంబంధం, సంక్రమిత సూదులు పంచుకోవడం, తల్లి నుంచి శిశువుకు గర్భధారణ లేదా పాలిచ్చే సమయంలో వ్యాపిస్తుంది. సాధారణ స్పర్శ, ఆహారం పంచుకోవడం లేదా గాలి ద్వారా ఇది వ్యాపించదు. సురక్షిత లైంగిక ప్రవర్తన, కొత్త సూదుల వినియోగం, రక్త పరీక్షలు వ్యాప్తిని తగ్గిస్తాయి. ముందస్తు పరీక్షలు, యాంటిరెట్రోవైరల్ చికిత్సతో బాధితులు ఆరోగ్యంగా జీవించగలరు. అవగాహన పెంపు ద్వారా వ్యాధి నియంత్రణ సాధ్యమని World Health Organization తెలియజేస్తుంది.

హైదరాబాద్

టీనేజ్ బాలికల సంరక్షణ

టీనేజ్ దశలో బాలికల శారీరక, మానసిక ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ అవసరం. సమతుల ఆహారం, ఇనుము, కాల్షియం సమృద్ధిగా ఉండాలి. మెన్స్ట్రువల్ హైజీన్ పాటించడం చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన నిద్ర శరీర వికాసానికి సహాయపడతాయి. భావోద్వేగ మార్పులను అర్థం చేసుకుని కుటుంబం మద్దతు ఇవ్వాలి. అవసరమైనప్పుడు వైద్య సలహా తీసుకోవాలి. ఆరోగ్య అవగాహన, ఆత్మవిశ్వాసం పెంపు టీనేజ్ బాలికల భవిష్యత్తుకు పునాది అవుతుందని UNICEF సూచిస్తుంది.

హైదరాబాద్

బేసిక్ కంటి సంరక్షణ సూచనలు

కంటి ఆరోగ్యం మొత్తం శరీర ఆరోగ్యానికి కీలకం. రోజూ సమతుల ఆహారం తీసుకోవడం, విటమిన్ A ఉన్న కూరగాయలు, పండ్లు తినడం కళ్లకు మంచిది. స్క్రీన్ ఉపయోగంలో 20-20-20 నియమాన్ని పాటించాలి. ధూళి, కాలుష్యం నుంచి కళ్లను రక్షించేందుకు సన్‌గ్లాసెస్ ఉపయోగించాలి. కళ్లను చేతులతో తరచూ రుద్దకూడదు. సరైన వెలుతురులో చదవడం ముఖ్యం. కంటి నొప్పి, ఎర్రదనం లేదా చూపు మందగించడం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని World Health Organization సూచిస్తుంది.

హైదరాబాద్

AIIMS Delhi దేశంలో తొలి ఫేస్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రోగ్రామ్ ప్రకటన

దేశంలో మొదటిసారిగా AIIMS Delhi ముఖ మార్పిడి (Face Transplant) కార్యక్రమాన్ని ప్రకటించింది. తీవ్రమైన ప్రమాదాలు, కాలిన గాయాలు లేదా జన్యుపరమైన లోపాలతో బాధపడుతున్న రోగులకు ఇది ఆశాకిరణం. ఈ శస్త్రచికిత్సలో చర్మం, కండరాలు, నరాలు సమన్వయంతో మార్పిడి చేయబడతాయి. నిపుణుల బృందం దీర్ఘకాల పునరావాసాన్ని కూడా పర్యవేక్షిస్తుంది. ఆధునిక మైక్రోసర్జరీ సాంకేతికతలతో విజయశాతం పెరుగుతుందని వైద్యులు తెలిపారు. ఇలాంటి పురోగతులు Indiaలో పునర్నిర్మాణ శస్త్రచికిత్స రంగానికి కొత్త దిశను చూపుతున్నాయి. Uploaded Video:

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.