Sunday, 26 April 2026

Blog

తూర్పు గోదావరి

రంజాన్ పర్వదినం సందర్భంగా తాళ్లపూడిలో మానవత సంస్థ ఇఫ్తార్ విందు నిర్వహణ

తాళ్లపూడి, (పున్నమి ప్రతినిధి), మార్చి 20: ముస్లింల పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తాళ్లపూడిలోని మసీదులో ముస్లిం సోదరులకు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ విషయాన్ని సంస్థ అధ్యక్షుడు వెలుగుబంటి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుల, మత భేదాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్య, వైద్యంతో పాటు వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో సంస్థ చురుకుగా పాల్గొంటూ తన ఔన్నత్యాన్ని చాటుకుంటోందన్నారు. కష్టాల్లో ఉన్నవారి కన్నీటి బొట్టును తుడవాలన్నదే మానవత ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. సంస్థ ద్వారా విద్యా, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ చేస్తున్న సేవలను కొనియాడుతూ షేక్ ఖుధాన్ సాహెబ్ రూ.2,000, సుహానా సోలార్ సిస్టమ్స్‌కు చెందిన షేక్ సాబీర్ భాష రూ.3,000 విరాళంగా అందజేశారు. అదేవిధంగా మసీదు అవసరాల కోసం సంస్థ అధ్యక్షుడు ఒక మెడికల్ కిట్‌తో పాటు కొన్ని మందులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వెలుగుబంటి శ్రీనివాస్, సనపల రాజశేఖర్, అప్పన వీరహనుమంతురావు, అంకెం సురేష్, తలారి రామ్మోహన్, గంధం మునేశ్వరరావు తదితరులతో పాటు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

రంజాన్ పర్వదినం సందర్భంగా తాళ్లపూడిలో మానవత సంస్థ ఇఫ్తార్ విందు నిర్వహణ

తాళ్లపూడి, (పున్నమి ప్రతినిధి), మార్చి 20: ముస్లింల పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తాళ్లపూడిలోని మసీదులో ముస్లిం సోదరులకు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ విషయాన్ని సంస్థ అధ్యక్షుడు వెలుగుబంటి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుల, మత భేదాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్య, వైద్యంతో పాటు వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో సంస్థ చురుకుగా పాల్గొంటూ తన ఔన్నత్యాన్ని చాటుకుంటోందన్నారు. కష్టాల్లో ఉన్నవారి కన్నీటి బొట్టును తుడవాలన్నదే మానవత ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. సంస్థ ద్వారా విద్యా, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ చేస్తున్న సేవలను కొనియాడుతూ షేక్ ఖుధాన్ సాహెబ్ రూ.2,000, సుహానా సోలార్ సిస్టమ్స్‌కు చెందిన షేక్ సాబీర్ భాష రూ.3,000 విరాళంగా అందజేశారు. అదేవిధంగా మసీదు అవసరాల కోసం సంస్థ అధ్యక్షుడు ఒక మెడికల్ కిట్‌తో పాటు కొన్ని మందులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వెలుగుబంటి శ్రీనివాస్, సనపల రాజశేఖర్, అప్పన వీరహనుమంతురావు, అంకెం సురేష్, తలారి రామ్మోహన్, గంధం మునేశ్వరరావు తదితరులతో పాటు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

తిరుపతి

ముచ్చివోలులో 25న ఘనంగా శ్రీ సీతారామస్వామి ఆలయ మహాకుంభాభిషేకం

శ్రీకాళహస్తి, మార్చి 20: మండలంలోని ముచ్చివోలు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ సీతారామస్వామి దేవాలయ మహాకుంభాభిషేకం ఈ నెల 25న ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీరామ సేవా సమితి, హరేరామ భజన బృందం ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా మార్చి 23 నుంచి 25 వరకు మూడు రోజులపాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేవాదాయ శాఖ సహకారంతో నిర్మితమైన ఈ ఆలయంలో 23, 24 తేదీలలో విశ్వక్సేన పూజలు, పుణ్యాహవాచనం, అంకురార్పణం, హోమాలు, గ్రామోత్సవం తదితర కార్యక్రమాలు జరుగనున్నాయి. 25వ తేదీ ఉదయం 9:48 నుంచి 9:52 గంటల మధ్య మహాకుంభాభిషేకం నిర్వహించి, అనంతరం పూర్ణాహుతి, బింబస్థాపన, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదే రోజు శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరగనుంది. మూడు రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానం కూడా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆధ్యాత్మిక రంగంలో ముందంజలో ఉన్న ముచ్చివోలు గ్రామంలో జరుగుతున్న ఈ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని నిర్వాహకులు, గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో భారీగా అక్రమ గ్యాస్ సిలిండర్ల నిల్వలు గుర్తింపు.. విజిలెన్స్ దాడుల్లో బట్టబయలు!

శ్రీకాళహస్తి, మార్చి 20, పున్నమి ప్రతినిధి: శ్రీకాళహస్తి పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న గ్యాస్ సిలిండర్ల దందాను విజిలెన్స్ అధికారులు రట్టు చేశారు. జిల్లా విజిలెన్స్ ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం విజిలెన్స్ అధికారి సి.ఐ. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీసు సిబ్బంది సంయుక్తంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా బైపాస్ రోడ్డు సమీపంలోని ఒక ప్రైవేట్ దుకాణంపై అధికారులు మెరుపు దాడి చేశారు. ఈ క్రమంలో అక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా, అత్యంత ప్రమాదకర రీతిలో నిల్వ ఉంచిన భారీ సంఖ్యలోని గ్యాస్ సిలిండర్లను చూసి అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. నివాస ప్రాంతాలకు సమీపంలో ఇంత పెద్ద మొత్తంలో గ్యాస్ నిల్వలు ఉంచడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ సి.ఐ. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నాగరాని అనే మహిళా అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచడం, బ్లాక్ మార్కెట్‌కు తరలించడం ఇటువంటి పనులు చేస్తుందని ఇవి చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. పట్టుబడిన సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామని, నిబంధనలు ఉల్లంఘించిన సదరు దుకాణ యజమానిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల భద్రతతో ఆడుకునే ఇలాంటి అక్రమ వ్యాపారాలపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.

తిరుపతి

కూలీల బకాయిలను వెంటనే చెల్లించేలా పోలీసులు జోక్యం చేసుకోవాలీ-ఏఐటీయూసీ

ఏర్పేడు, మార్చి 20, పున్నమి న్యూస్: కాంట్రాక్ట్ పనులు చేయించుకుని సెంట్రింగ్ మేస్త్రీలకు పూర్తి చెల్లింపులు చేయకుండా వేధింపులకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నాడు ఏర్పేడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మండల పరిధిలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో స్థానిక కాంట్రాక్టర్లు జి. వెంకయ్య, సిహెచ్. అంకయ్యలు కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతానికి చెందిన సెంట్రింగ్ మేస్త్రీలను తీసుకువచ్చి పని చేయించుకున్నప్పటికీ, వారికి పూర్తిగా చెల్లింపులు చేయలేదని ఆరోపించారు. సుమారు రూ.15 లక్షల పనికి కేవలం రూ.9 లక్షలు మాత్రమే ఇచ్చి, మిగిలిన రూ.6 లక్షలు ఇవ్వకుండా బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. బయటి జిల్లాకు చెందినవారనే కారణంతో మేస్త్రీలను భయపెట్టి, దౌర్జన్యంగా ప్రవర్తించడం అన్యాయమని విమర్శించారు. అంతేకాకుండా, పని కోసం ఉపయోగించిన మెటీరియల్స్ కూడా తిరిగి ఇవ్వకుండా బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. పేద కూలీలకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించేలా పోలీసులు జోక్యం చేసుకోవాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, సభ్యులు, మేస్త్రీలు పాల్గొన్నారు.

తిరుపతి

గిరిజన సంక్షేమమే ధ్యేయం-నేషనల్ కమిషన్ చైర్మన్‌కు ఘన స్వాగతం

శ్రీకాళహస్తి, మార్చి 20, పున్నమి న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం నాడు నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గిరిజనుల అభ్యున్నతిపై కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (NCST) చైర్పర్సన్ అంతర్ సింగ్ ఆర్యకు అపూర్వ స్వాగతం లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సలహా మండలి సభ్యులు సుబ్బయ్య చైర్పర్సన్ ఆర్యకు పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయ స్వాగతం పలికి అనంతరం ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో గిరిజన ప్రాంతాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలు, విద్య, వైద్య సౌకర్యాల గురించి చర్చించారు. గిరిజనుల హక్కుల రక్షణకు, వారి ఆర్థికాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కృషి చేయాలని ఈ సందర్భంగా నేతలు అభిప్రాయపడ్డారు. గిరిజన సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు చైర్పర్సన్ పర్యటన దోహదపడుతుందని సుబ్బయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, గిరిజన సంక్షేమ శాఖ ప్రతినిధులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

తిరుపతి

జాబ్ క్యాలెండర్‌తో యువతకు ఊపిరి…బాబు వచ్చారు–జాబులు తెచ్చారు అంటూ టీడీపీ నేతల హర్షం

శ్రీకాళహస్తి, మార్చి 20, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని పూసల వీధిలో టీడీపీ నేతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం ద్వారా ప్రభుత్వం నమ్మకాన్ని నిలబెట్టిందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. “బాబు వస్తేనే జాబు వస్తుంది” అనే నమ్మకాన్ని నిజం చేస్తూ సరైన సమయంలో ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటించడం యువతకు ఊపిరి పోసిందని కొనియాడారు. ఎన్నికల హామీల మేరకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉందని, యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం విశ్వసనీయతకు నిదర్శనమని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతంగా పెంచడమే లక్ష్యమని, ఇప్పటికే లక్షలాది ఉద్యోగాలు కల్పించామని, పరిశ్రమల స్థాపనతో మరింత ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని చెప్పారు. ఉగాది సందర్భంగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వివిధ శాఖల్లో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని, అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.జి.దశరథాచారి, వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యులు యం.సుబ్బయ్య, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్‌ కోట చంద్రశేఖర్, తొట్టంబేడు మండలం, తెలుగు యువత అధ్యక్షుడు బీమాల చంద్రబాబు చందు, శ్రీకాళహస్తి పురపాలక సంఘం, మాజీ కౌన్సిలర్ షేక్ మహబూబ్ బాషా, తిరుపతి పార్లమెంటు నాయకులు ఆనంద్ రెడ్డి, సయ్యద్ ముజీబ్, గాజుల భగత్, సులేమాన్, గంగనపల్లి రమేష్, సయ్యద్ ఆదిల్, వెంకటస్వామి, కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం, మారయ్య, సలార్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

అల్లాహ్ కరుణ అందరిపై ఉండాలి- ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి, మార్చి 20, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసన సభ సబ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు తన హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ.. పవిత్ర రంజాన్ మాసం ఆత్మశుద్ధి, నియమ నిష్టలు, సహనం, దయ, సమానత్వం వంటి గొప్ప విలువలను బోధించే దైవిక కాలమని పేర్కొన్నారు. ఈ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో అల్లాహ్‌ను స్మరిస్తూ ఉపవాస దీక్షలు ఆచరించడం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు. వారు పాటించిన ఉపవాసాలు ఫలించి, అల్లాహ్ కరుణ కటాక్షాలు ప్రతి కుటుంబంపై నిలిచి ఉండాలని ప్రేమ, పంచుకోవడం, పరస్పర గౌరవం, సోదరభావం వంటి విలువలను పెంపొందించే రంజాన్ సందేశాన్ని అందరూ జీవితాల్లో ఆచరించాలని సూచించారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం మరింత బలపడాలని, ప్రతి ఒక్కరి జీవితం ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో నిండాలని ప్రార్థించారు.

తిరుపతి

హక్కులు అడిగిన ఒంటరి మహిళపై వేధింపులు… ఉద్యోగం కోసం అసభ్య డిమాండ్ ఆరోపణలు

శ్రీకాళహస్తి, మార్చి 20, పున్నమి న్యూస్: ప్రభుత్వం నుంచి తనకు దక్కాల్సిన హక్కులను కోరిన ఒంటరి మహిళపై స్థానిక తెలుగు గంగ ప్రాజెక్టు కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం కల్పించాలంటే అనుచిత కోరిక తీర్చాలని ఒత్తిడి తెచ్చినట్లు బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి వివరాల మేరకు… శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగు గంగ కాలనీలో కూతురితో కలిసి నివసిస్తున్న ఆమె, ఇటీవల మరణించిన తన పినతండ్రి ద్వారా లభించాల్సిన ప్రభుత్వ ప్రయోజనాల కోసం కార్యాలయాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న సుబ్బారెడ్డి అనే ఉద్యోగి, వివిధ కారణాలు చూపుతూ ఆమెను పదేపదే కార్యాలయానికి రప్పించి వేధింపులకు గురి చేసినట్లు తెలిపింది. ఉద్యోగం కల్పించాలంటే తన కోరిక తీర్చాల్సిందేనని డిమాండ్ చేయడంతో పాటు, కావాలని పత్రాల్లో లోపాలు చూపుతూ ఇబ్బందులకు గురి చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. ఆమె ప్రతిఘటించడంతో, స్థానికంగా గంగయ్య అనే వ్యక్తిని ప్రోత్సహించి వేధింపులకు దిగేలా చేశాడని పేర్కొంది. గంగయ్య తరచూ మద్యం మత్తులో వచ్చి మహిళతో పాటు ఆమె కుమార్తె పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడని ఫిర్యాదులో వెల్లడించింది. దీంతో విసిగి పోయిన బాధితురాలు ఈ నెల 16న జిల్లా కలెక్టర్‌కు, అలాగే టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనకు ప్రాణహాని ఉందని కూడా ఆమె పేర్కొంది. ఘటనపై అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

E-పేపర్

దశావధాన సురభిళం ……………అన్నమయ్యపురం

అన్నమయ్యపురంలో దశావధాన సురభిళం శ్రీ పరాభవ నామ ఉగాది పర్వదిన సందర్భంగా అన్నమాచార్య భావనా వాహిని, “మీతో” సంస్థల సంయుక్త నిర్వహణలో భాగ్యనగరం హైటెక్ సిటీ అన్నమయ్య సదన్ కళావేదికలో జరిగిన శ్రీ సురభి శంకరశర్మ దశావధానం ఆద్యంతం రసజ్ఞులను అలరింపజేసింది. ఈ అవధానానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు కసిరెడ్డి వేంకటరెడ్డి సంచాలకులుగా వ్యవహరించారు. ప్రాశ్నికులుగా నిషిద్ధాక్షరి౼వాడవల్లి బాలకృష్ణమూర్తి,న్యస్తాక్షరి౼డా||పి.కమలసుధారాణి, దత్తపది౼డా||పొన్నెకంటి సూర్యనారాయణ, సమస్య౼టి.భ్రమరాంబిక, వర్ణన౼డా||జిల్లెళ్ళ వరప్రసాద్, ఆశువు౼సింగం ఫణికుమార్, కావ్య పఠనం౼ఓర్చు రాజారాం, మీమాట నాపాట౼వారణాసి కోటేశ్వరశర్మ, ఘంటాగణనం౼ పి.లింగమూర్తి, అప్రస్తుత ప్రసంగం౼వేపా పార్వతీశం వ్యవహరించారు. దత్తపది అంశంలో మోడీ,పుతిన్,ట్రంపు,కిమ్ పదాలను యిచ్చి భారతార్థంలో శార్దూల వృత్తంలో కోరగా, ‘ఒమ్మున్ జేయగ జూచు కౌరవులు మి”మ్మోడి”ంచుటే ధ్యేయమై నమ్మన్ బిల్చియు చం”పుతిన్న”గను విన్నాణంబు చూపించుచున్ సమ్మోదంబగు నెట్లు సంధిమనకున్ చ”ట్రంపు” బంధాలతో, “కిమ్మీ”రాంతక, భీమసేన వినుమా, కీడెంచి మేలెంచుమా. అని ద్రౌపది భీమ సేనునితో అన్ననట్లుగా అవధాని పూరించారు. సమస్య అంశంలో౼”కోకిల కూయుచుండగను కూయుచునుండెను కాకులన్నియున్ “అని ఇవ్వగా౼ ‘ప్రాకట వృద్ధి రాగములు భారతమందున వచ్చె మోడితో కేకలు వేసి కొందరిట కీడుదలంప ప్రధాని గారిపై మైకము కమ్మి వాగెదరు మాన్యత వీడియు దుష్టబుద్ధితో కోకిల కూయుచుండగను కూయుచునుండెను కాకులన్నియున్’ అని పూరించారు. మీమాట- నా పాట అంశములో అన్నమాచార్యుని పదశోభపై పాటను కోరగా అన్నమయ్య అన్నమయ్య -తెలుగు జాతి ఖ్యాతివయ్య తాళ్ళపాక అన్నమయ్య- పదకవితల ధాతవయ్య నీపాటల సప్తగిరుల ఎదిగి ఎదిగి పొంగెనయ నీమాటల భక్తజనుల ఒదిగి ఒదిగి సాగెనయ అంటూ పూరించారు. అవధానానంతరం ప్రాశ్నికులను,అవధానిని అన్నమాచార్యభావనావాహిని అధ్యక్షులు పద్మశ్రీ డా|| శోభారాజ్ ఘనంగా సత్కరించారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.