Saturday, 25 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నిరుపేద గిరిజన కుటుంబానికి మెట్టుకూరు బ్రదర్స్ ఆర్థిక సాయం

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కచేరి దేవరాయపల్లి గ్రామంలో నివసిస్తున్న ఒక నిరుపేద గిరిజన కుటుంబానికి మెట్టుకూరు బ్రదర్స్ ఆర్థిక సహాయం అందించారు. గ్రామంలో గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానిక జనసేన పార్టీ నేతలు భరత్, బీవీ రమణ మెట్టుకూరు బ్రదర్స్ దృష్టికి తీసుకెళ్లగా, వారు వెంటనే స్పందించి సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈరోజు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసి మానవతా భావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమం మెట్టుకూరు బ్రదర్స్ సహకారంతో టీడీపీ గ్రామ అధ్యక్షుడు బొల్లినేని ప్రభాకర్, అనంతసాగరం చెరువు వైస్ చైర్మన్ తిరుపతి కరివేటి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ సభ్యుడు కేవీ రమణయ్య, అంతిమ తీర్పు కృష్ణ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఈ సహాయంపై సంతోషం వ్యక్తం చేస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు.

ఉదయగిరి ఈద్గా ప్రాంగణంలో ఘనంగా రంజాన్ ముగింపు ప్రార్థనలు – ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు

నెల్లూరు జిల్లా ఉదయగిరి ఈద్గా ప్రాంగణంలో పవిత్ర రంజాన్ ముగింపు సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధి ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రంజాన్ పర్వదినం ఆత్మశుద్ధి, దైవభక్తి, సహనం, దానధర్మాల వంటి మహత్తరమైన విలువలను మనకు గుర్తుచేస్తుందని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, పరస్పర గౌరవం మరింత బలపడాలని ఆకాంక్షించారు. మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇమామ్‌లు, మోజాన్‌లకు గౌరవ వేతనాల విడుదలతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. సమాన అభివృద్ధి లక్ష్యంగా ప్రతి వర్గానికీ న్యాయం చేసే విధంగా పాలన కొనసాగుతుందని వెల్లడించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మంత్రి ఆనం పర్యటనలో మార్పు.. అనంతసాగరం షెడ్యూల్ రద్దు

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి మార్చి 23, 2026 నాటి పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. అనంతసాగరం మండలంలో పంట నష్టాల పరిశీలన కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే, అదే రోజు ఉదయం నెల్లూరు నగరంలో పలు అధికారిక మరియు పార్టీ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు నెల్లూరు కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించే 2025-26 రబీ (లేట్ ఖరీఫ్) ధాన్యం సేకరణపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రంజాన్ సందర్భంగా నెల్లూరు జిల్లాలో పటిష్ట పోలీస్ బందోబస్తు

నెల్లూరు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. మసీదులు, ప్రార్థనా స్థలాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తూ భక్తుల ప్రార్థనలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికతో వాహన రాకపోకలను క్రమబద్ధీకరించారు. అదనంగా డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొత్తపల్లిలో నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకుల పంపిణీ

ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఐటీ కోఆర్డినేటర్ పులిపాటి అనీల్ సహకారంతో అనంతసాగరం మండలం కొత్తపల్లి గ్రామంలో ఓ నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు భరత్, బీవీ రమణ ముందుండి సహాయాన్ని అందించారు. బాధిత కుటుంబానికి ఆహార ధాన్యాలు, అవసరమైన సరుకులు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సేవా కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ నాయకుడు కేవీ రమణయ్యతో పాటు జనసేన నాయకులు కృష్ణ, విజయ్ తదితరులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు. జనసేన కార్యకర్తల సేవాభావాన్ని స్థానికులు అభినందించారు.

ఖమ్మం

ఖమ్మం రూరల్‌ మండలము లో బీజేపీ శిక్షణ శిబిరం

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం రూరల్ మండలంలో డాక్టర్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబిరం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు జాటోతూ మధు నాయక్ అధ్యక్షత వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ప్రసంగిస్తూ పార్టీ బలోపేతానికి శిక్షణ శిబిరాలు కీలకమని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు వంకలంక సుబ్రహ్మణ్యం, నకిరికంటి వీర భద్రం, నల్లమాస శ్రీనివాస్, కందుల శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో విపత్తుల శిక్షణా కేంద్రం ఏర్పాటు దిశగా అడుగులు: మంత్రి పొంగులేటి

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) హైదరాబాద్‌లోని డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో విపత్తుల నిర్వహణ విభాగం, ఫైర్ సర్వీసెస్, ఎస్‌డిఆర్ఎఫ్, హైడ్రా, ఐసిసిసి విభాగాల అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విపత్తులు సంభవించిన తర్వాత సహాయక చర్యలకే పరిమితం కాకుండా ముందస్తు సన్నద్ధతతో నష్టాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకోవాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్’ (SIDM) ఏర్పాటు కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తెలంగాణను విపత్తుల నిర్వహణలో దేశానికి ఆదర్శంగా నిలిపేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. అగ్నిప్రమాదాలు సహా అన్ని రకాల విపత్తులను ఎదుర్కొనేందుకు రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థ, ఆధునిక పరికరాలు, డ్రోన్లు, హైస్పీడ్ బోట్లు వంటి సదుపాయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో విపత్తుల నిర్వహణ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ విక్రమ్ సింగ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఐసిసిసి డైరెక్టర్ కమలాసన్ రెడ్డి, స్పెషల్ పోలీస్ బెటాలియన్ అదనపు డీజీ సంజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో ఘోర రోడ్డుప్రమాదం

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూ.గో.జిల్లా: దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఎర్నగూడెం వద్ద ఓ కారు రాంగ్ రూట్‌లో ఫ్లైఓవర్ పైకి వెళ్లింది. దీంతో ఎదురుగా వస్తున్న మరో కారు ఈ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. రెండు కార్లు వేగంగా ఢీకొట్టుకోవడంతో నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లోనే మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి మృతుల వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ప్రమాదం గురించిన మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. End

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.