Saturday, 25 April 2026

Blog

హైదరాబాద్

రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు దైనందిని ఆవిష్కరించిన మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి గారు

*రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు దైనందిని ఆవిష్కరించిన మంత్రి వాకిటి శ్రీహరి గారు* *పున్నమి ప్రతినిధి హైదరాబాద్ ::తేదీ 23/03/2026* *ఈరోజు మినిస్టర్ క్వార్టర్స్ లో రాష్ట్ర యువజన క్రీడా శాఖ మాత్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారి కి* *రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ డైరీని* *అందజేసిన రాష్ట్ర అధ్యక్షులు ఎస్ .నరసింహులు రాష్ట్ర ప్రధాన సలహాదారులు కే*. *గోపాల్ జి, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు విజయ్* *కుమార్ తదితరులు, పాల్గొని రాష్ట్రంలోని అప్గ్రేడ్ పొందని పండితుల సమస్యలు* *మరియు టెట్ విషయంలో వినతి పత్రాన్ని అందించారు*

కడప

కడప జిల్లా… ప్రొద్దుటూరు పట్టణంలోని జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసిన చేసిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి

కడప జిల్లా…. ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ,.. కంటి చికిత్సకు సంబంధించి ఆధునికరిస్తున్న గదులను పరిసిలించిన నంద్యాల వరదరాజుల రెడ్డి ,.. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ,.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు కృషి చేయాలని సూచనలు… ఆసుపత్రి లో వివిధ విభాగాలను పరిశీలించిన ఎమ్మెల్యేకి , ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను వివరించిన ఆసుపత్రి సూపరిండెండెంట్ ఆనంద్ బాబు ,…

E-పేపర్

ఆరుట్ల లో ఘనంగా భగత్ సింగ్ 95వ వర్ధంతి వేడుకలు

ఆరుట్ల లో ఘనంగా భగత్ సింగ్ 95వ వర్ధంతి వేడుకలు ఆరుట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిందం శ్రీశైలం ఆధ్వర్యంలో పున్నమి న్యూస్ ప్రతినిధి 23 మార్చి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : భారతమాత ముద్దుబిడ్డ షహీద్ భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా* ఆరుట్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది…. *భయం అనే ఆలోచనలు మెదడులోకి రానీయకు_* *ఆ ఆలోచనలే నిన్ను పిరికి వాడిని చేస్తాయి భగత్ సింగ్… ఆరుట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిందం శ్రీశైలం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాతిరి ఎల్లేష్ మాట్లాడుతూ… దేశ స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి, ఒక లక్ష్యం కోసం పోరాడిన జీవితానికి అలాంటి ముగింపు గర్వకారణమే కానీ దయానియం కాదు,తన మరణము ముందు తరాలకు త్యాగమనే సుగుణంలో సాగుతుందని, మానవాళికి సేవ చేయడానికి, పీడితులకు విముక్తి కలిగించడానికి యువతరం ముందుకు వచ్చినప్పుడే నవయుగనికి నాంది ప్రస్తావన జరుగుతుందని వారినీ స్మరిస్తూ…. *షాహిద్ భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం* జరిగింది…….. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మోహన్ నాయక్ మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండి సలాం వార్డు సభ్యులు ఎండి ఇమ్రాన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడ్డిమల్ల చంద్రయ్యమార సురేష్ అంతటి రాజు గౌడ్ జిలమోని శ్రీనివాస్ వస్పరి కుమార్ ఇందిరమ్మ కమిటీ సభ్యులుబుట్టి కృష్ణ,చెరుకు నరసింహ, కంబాలపల్లి బుగ్గరాములు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బుడిగల పరమేశ్, రావుల నాగరాజు దాసరమోని అశోక్ ముదిరాజ్,ఆర్లశ్రీకాంత్,కొల్లోజు విశ్వనాథ్ చారి,ఆడెపు మధు,కొల్లోజు మహేష్ చారి,గ్రామ పెద్దలు యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది…….

తూర్పు గోదావరి

వేగంగా వచ్చిన కారు బైక్ను బలంగా ఢీకొట్టి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూ.గో.జిల్లా: గోపాలపురం మండలం వేళ్ళ చింతలగూడెం పెద్దాపురం గ్రామాల మధ్య వేగంగా వచ్చిన కారు బైక్ను బలంగా ఢీకొట్టి పంట పొలాల్లోకి దూసుకెళ్లినట్లు స్థానికులు తెలియజేశారు ఈ ప్రమాదం లో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా రాయబడ్డారు స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ లో వారిని గోపాలపురం ఆరోగ్య కేంద్రానికి అనంతరం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు ఇంకా వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. End

అనకాపల్లి

నక్కపల్లి నేలపై పరిశ్రమల విప్లవానికి శ్రీకారం… సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో AMNS స్టీల్ ప్లాంట్ భూమి పూజ ఘనంగా

అనకాపల్లి జిల్లా, మార్చి 23 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్): నక్కపల్లి మండలంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్కలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (AMNS) ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్తో పాటు కేంద్ర మంత్రులు హాజరై కార్యక్రమానికి విశేష ప్రాధాన్యతను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కొత్త దారులు తెరుస్తుందని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని తెలిపారు. ఏటికొప్పాక గ్రామం నుంచి ఎలమంచిలి నియోజకవర్గానికి చెందిన జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రజల ఉత్సాహం మధ్య జరిగిన ఈ భూమి పూజ కార్యక్రమం నక్కపల్లి ప్రాంతానికి ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది

అన్నమయ్య

తుమ్మచెట్లపల్లి సూరి గారి మనవరాలు నామకరణం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు

తంబళ్లపల్లె నియోజకవర్గం టీడీపీ నాయకులు తుమ్మచెట్లపల్లి సూరి గారి మనవరాలు నామకరణం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు,బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్.. Uploaded Video:

E-పేపర్

అర్ధరాత్రి నుంచి బిజెపి నాయకుల ముందస్తు అరెస్టు…

పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 9640204826 : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని మేడిపల్లి నక్కర్త లో ని గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ ల పర్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి BJP నాయకులు, కార్యకర్తలు అంటే భయం* అవినీతి అరాచకం కమిషన్ ల కాంగ్రెస్ సర్కార్ పైన BJP అసెంబ్లీ ముట్టడి సందర్బంగా అక్రమ అరెస్ట్ లు చేసిన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పోలీసులు అక్రమ అరెస్ట్ లతో ఉద్యమాలను ఆపలేరు అని Ex MPTC జిల్లా కార్యవర్గ సభ్యులు ముంత జంగయ్య BJYM మండల కార్యదర్శి బన్నే శివ అన్నారు

ఆంధ్రప్రదేశ్

నేడు షహీద్ దివస్: అమరవీరులకు వందనాలు

దేశ స్వాతంత్య్ర సమరంలో భగత్ సింగ్ ప్రత్యేక స్థానం. లాలాలజపతి రాయ్ మరణించడం భగత్ సింగ్ పోరాటానికి ఆజ్యం పోసింది. తన స్నేహితులు సుఖ్ దేవ్, రాజురులతో కలిసి లాల మరణానికి కారణమైన జేమ్స్ స్కాట్ను చంపే క్రమంలో పొరపాటున జాన్ సౌండర్స్ అనే మరో ఆఫీసర్ను హతమార్చుతారు. ఈ కేసుపైనే బ్రిటిషర్లు వీరిని అరెస్ట్ చేసి 1931 MAR 23న ఉరి తీశారు. వీరి పోరాటానికి నివాళిగా ఏటా ఈరోజును షాహీద్ దివస్ గా జరుపుకుంటాం.

జాతీయ అంతర్జాతీయ

డర్టీ బాంబ్: ఇరాన్ చివరి అస్త్రం ఇదేనా?

సాధారణ పేలుడు పదార్థాలకు రేడియోధార్మిక వ్యర్థాలను కలిపి చేసేదే ‘డర్టీ బాంబ్’. ఇది అణుబాంబులా భారీ విస్ఫోటం సృష్టించకపోయినా రేడియేషన్ను గాలిలో వ్యాపింపజేసి ప్రాంతాన్ని విషపూరితం చేస్తుంది. ఇరాన్ వద్ద 60% శుద్ధి చేసిన యురేనియం తగినంత ఉండటంతో దీని తయారీ సాధ్యమేనని నిపుణులు భావిస్తున్నారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి ఇరాన్ ఈ డర్టీ బాంబును ఆఖరి అస్త్రంగా వాడే ముప్పు ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

జాతీయ అంతర్జాతీయ

భయంకరం: ఆసుపత్రిపై డ్రోన్ దాడి.. 64 మంది ప్రాణాలు కోల్పోయారు

సూడాన్లో ఆర్మీ, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) మధ్య ఆధిపత్య పోరు సామాన్యుల ప్రాణాలను తీస్తోంది. తాజాగా ఈద్ రోజున RSF ఆధీనంలో ఉన్న ఓ నగరంలోని ఆస్పత్రిపై జరిగిన డ్రోన్ దాడిలో 64 మంది మృతి చెందారు. వీరిలో 13 మంది పిల్లలు, ఓ డాక్టర్, ఇద్దరు నర్సులు ఉన్నట్లు WHO వెల్లడించింది. మరో 89 మంది గాయపడినట్లు తెలిపింది. ఈ దాడిని ఆర్మీ చేసినట్లు RSF ఆరోపిస్తుండగా తమకు సంబంధం లేదని సైనికులు ప్రకటించారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.