Saturday, 25 April 2026

Blog

యాదాద్రి భువనగిరి

* జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గుత్త ఉమా ఫ్రేమ్ చందర్ రెడ్డి ని సన్మానించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 23 : సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీపీ గుత్త ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి గారు గుత్తా ఉమా ఫ్రేమ్చందర్ రెడ్డి ని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డ్ మెంబర్ సభవత్ రఘునాయక్, గునిగంటి రాజు గౌడ్, యువజన కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు, యువజన కాంగ్రెస్ మండల కార్యదర్శి కొండ నవీన్ గౌడ్, బానోతు కిరణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి: తహసిల్దార్ రమాదేవి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి) .మనుబోలు మండలంలో రైతులు ధాన్యపు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని తహసిల్దార్ రమాదేవి సూచించారు. సోమవారం ఎమ్మార్వో కార్యాలయంలో మాట్లాడుతూ, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ఈ కేంద్రాలను ప్రారంభించిందన్నారు. మధ్యవర్తుల చేతిలో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా దళారులు మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు నేరుగా కేంద్రాలకు వచ్చి ధాన్యం విక్రయించాలని కోరారు.

తిరుపతి

జస్వంత్ రెడ్డి ఆచూకీ కనుగొని, కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని

జాయింట్ కలెక్టర్ గోవిందరాజులుకి వినతి విద్యార్ధి సంఘం నేతలు పున్నమి ప్రతినిధి 23 మార్చి 2026 తిరుపతి తిరుపతి మల్లంగుంటలో ఉన్న గీతం జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం (ఇంటర్ ఫస్ట్ ఇయర్) చదువుతున్న జస్వంత్ రెడ్డి అనే విద్యార్థి ఈ నెల 11వ తారీఖున కాలేజీ హాస్టల్ నుండి కనిపించకుండా పోయాడు. ఇంతవరకు ఆ అబ్బాయిని ఆచూకీ కనిపెట్టలేనందున వైయస్సార్ ఎస్ యు, ఎన్ ఎల్ ఎస్ ఏ, ఎన్ ఎస్ యు ఐ, ఓ బి సి విద్యార్థి సంఘం, బి సి యువజన, జి జె ఎస్, విద్యార్థి సంఘ నేతలు. మరియు అబ్బాయి తల్లిదండ్రులు తో కలిసి ఈరోజు జాయింట్ కలెక్టర్ గోవిందరాజులు గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థు సంఘం నేతలు మాట్లాడుతూ సుమారు రెండు వారాలు అయినా ఆ విద్యార్థి ఆచూకీ ఇప్పటివరకు తెలియకపోవడం ఇలాంటి సున్నితమైన, ప్రాణాలకు సంబంధించిన ఘటన జరిగినప్పటికీ, కళాశాల యాజమాన్యం వెంటనే సరైన చర్యలు చేపట్టలేదు. కనిపించకుండా పోయిన విద్యార్థిని కళాశాల యాజమాన్యం కనిపెట్టకుండా మరియు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఆలస్యం చేశారు ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.విద్యార్థి తల్లిదండ్రులకు సకాలంలో సమాచారం అందించలేదు. ఈ విధంగా కళాశాల యాజమాన్యం పూర్తి వైఫల్యం చూపించింది. తక్షణమే విద్యార్థి జస్వంత్ రెడ్డి ఆచూకీ త్వరగా కనుగొనేందుకు సంబంధిత పోలీసు, ఇతర అధికారులతో కలిసి తక్షణ చర్యలు చేపట్టాలి. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు, హాస్టళ్లలో విద్యార్థుల భద్రత, హాస్టల్ పర్యవేక్షణ, మిస్సింగ్ విద్యార్థులపై తక్షణ సమాచారం ఇవ్వడం వంటి మార్గదర్శకాలు కఠినంగా అమలు అయ్యేలా తగిన ఆదేశాలు జారీ వారన్నారు. విద్యార్థి మరికొద్ది రోజుల్లో కనిపెట్టనియెడల విద్యార్థుల తల్లిదండ్రులతో కళాశాల ముట్టడిస్తామని కూడా హెచ్చరిక జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బి ఓబుల్ రెడ్డి,నేషనల్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుందర్ రాజు, ఎన్ ఎస్ యు వై జిల్లా అధ్యక్షుడు శివ బాలాజీ, జి జె ఎస్ అధ్యక్షుడు మహేంద్ర నాయక్, ఓబీసీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు విజయ్ ఉత్తరాది,బీసీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ యాదవ్, చంద్రగిరి నియోజకవర్గ అధ్యక్షుడు చెంగల్రెడ్డి, విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు యశ్వంత్ రెడ్డి, రఫీ,వినోద్ కుమార్ శేషారెడ్డి భార్గవ్, చంద్రగిరి నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ సెందిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

పాలన గాలికి ఒదిలేసి దొంగ నాటకాలు ఆడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ మరియు కేంద్ర బీజేపీ ప్రభుత్వాలు..!!

పాలన గాలికి ఒదిలేసి దొంగ నాటకాలు ఆడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ మరియు కేంద్ర బీజేపీ ప్రభుత్వాలు..!! పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 23 మార్చి 2026 రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మరియు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ ఆడుతున్న దొంగ నాటకాలకు వ్యతిరేకంగా ఈరోజు మన ఎల్.బి.నగర్ చౌరస్తా వద్ద BRS పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన *నిరసన కార్యక్రమంలో* పాల్గొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం “గ్యాస్ సప్లై ఎక్కడా ఆగలేదు, అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి” అని పేర్కొంటుండగా, రాష్ట్ర ప్రభుత్వం “కేంద్రం నుంచి సరైన సరఫరా లేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయి” అని చెబుతోంది. ఈ రెండు ప్రభుత్వాల పరస్పర ఆరోపణల మధ్యలో సామాన్య ప్రజలు, రోజువారీ జీవనంపై ఆధారపడే ఆటో డ్రైవర్లు, టిఫిన్ సెంటర్ యజమానులు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ వంటి అనేక వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి, ఇది నిజమైతే పూర్తిగా అన్యాయమని పేర్కొనడం జరిగింది. ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చడానికి కాంగ్రెస్ నాయకులు ఆ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ అంటూ దొంగ నాటకాలు ఆడుతున్నారని, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అని, ఇకనైనా మారి ప్రజా సమస్యలు పరిష్కరించే పని చెయ్యాలని వారిని హెచ్చరించడం జరిగింది. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సరఫరా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం, బాధ్యత వహించడం ప్రభుత్వాల కర్తవ్యమని, వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని మాజీ కార్పొరేటర్లు, సీనియర్ BRS పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాళ్లు, ఉద్యమకారులు, పలు విభాగాల కమిటీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మహిళలు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. *జక్కిడి రఘువీర్ రెడ్డి* *సీనియర్ నాయకులు – BRS పార్టీ* *ఎల్.బి.నగర్*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిగుంట పాఠశాలలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆకస్మిక తనిఖీలు – విద్యార్థులతో కలిసి భోజనం

వింజమూరు మండలం నందిగుంట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ, విద్యార్థుల సంక్షేమం, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును స్వయంగా పరిశీలించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం కింద విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యత, పరిశుభ్రత, పోషకాహార విలువలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎమ్మెల్యే సురేష్ గారు స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించి, వారితో కలిసి భోజనం చేసి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భోజనం తయారీ విధానం, వంటశాల పరిశుభ్రత, వడ్డింపు విధానాన్ని పరిశీలించి ఎటువంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని సూచించారు. అలాగే పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన ఆయన, పరిశుభ్రత మరియు భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని ఉపాధ్యాయులు, అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా రహదారి దాటే సమయంలో విద్యార్థుల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, తగిన పర్యవేక్షణ అవసరమని సూచించారు. ఈ తనిఖీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పోషకాహారం, సురక్షిత వాతావరణం కల్పించడంపై తన కట్టుబాటును ఎమ్మెల్యే మరోసారి స్పష్టం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో ప్రజా ఫిర్యాదుల వేదికకు 127 ఫిర్యాదులు – చట్ట ప్రకారం త్వరితగతిన న్యాయం చేస్తామని ఎస్పీ హామీ

నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్)’ కార్యక్రమంలో మొత్తం 127 ఫిర్యాదులు స్వీకరించబడ్డాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ గారు మాట్లాడుతూ ప్రజల ఫిర్యాదుల పట్ల ఎలాంటి అలసత్వం ప్రదర్శించకూడదని, బాధితులతో జవాబుదారీగా వ్యవహరించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వేదికకు వచ్చిన ఫిర్యాదుల్లో మహిళలపై వేధింపులు, అదనపు కట్న వేధింపులు, మిస్సింగ్ కేసులు, భూమి వివాదాలు వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. అనంతసాగరం పరిధిలో ప్రేమ పేరుతో వేధింపులు, బాలాజీ నగర్‌లో మిస్సింగ్ కేసు, నవాబుపేటలో కట్న వేధింపులు, కావలి రూరల్‌లో భూ వివాదం, అల్లూరు ప్రాంతంలో మహిళపై వేధింపులపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులన్నింటినీ చట్టపరంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తామని, ప్రతి కేసును ప్రాధాన్యతగా తీసుకుని వేగంగా పరిష్కరిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సౌజన్య గారు, రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు, డబ్ల్యూపీఎస్ డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో లాడ్జిలపై పోలీసుల ఆకస్మిక దాడులు – 36 మంది అదుపులో

నెల్లూరు పట్టణంలోని చిన్నబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కొన్ని లాడ్జిలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అందిన విశ్వసనీయ సమాచారంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. జిల్లా ఎస్.పి. ఆదేశాల మేరకు, అడ్మిన్ అదనపు ఎస్.పి. శ్రీమతి CH. సౌజన్య సూచనలతో, టౌన్ ఏఎస్‌పి శ్రీమతి దీక్ష, ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఈ తనిఖీలు చేపట్టింది. మనాసి, పీఎస్‌కే, పీవీకే, సాయి లాడ్జిలలో తనిఖీలు జరిపిన పోలీసులు, అక్కడ వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో 14 మంది మహిళలు, 17 మంది పురుషులు, 5 మంది హోటల్ సిబ్బంది కలిపి మొత్తం 36 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి 27 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. లాడ్జి నిర్వాహకుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అనుమానాస్పద కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పట్టణంలో శాంతి భద్రతల కోసం ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసు అధికారులను జిల్లా ఎస్.పి. అభినందించారు.

E-పేపర్

కురిమిద్ద తండా దగ్గర నిరాహార దీక్ష చేస్తున్న రైతులకు మద్దతుగా నాలుగు గ్రామాల ఫార్మాసిటీ పోరాట కమిటీ రైతులు…

కురిమిద్ద తండా దగ్గర నిరాహార దీక్ష చేస్తున్న రైతులకు మద్దతుగా నాలుగు గ్రామాల ఫార్మాసిటీ పోరాట కమిటీ రైతులు… గతంలో ఇచ్చిన హమీలను నిలబెట్టుకోవాలని రైతులు నిరసన దీక్ష చేస్తున్నారు. పున్నమి న్యూస్ ప్రతినిధి 23 మార్చి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : గత మూడు రోజుల నుంచి కురిమిద్ద తండా దగ్గర నిరాహార దీక్ష చేస్తున్న రైతులకు మద్దతుగా నాలుగు గ్రామాల ఫార్మాసిటీ పోరాట కమిటీ రైతులందరూ పాల్గొన్నారు. హైకోర్టు అవార్డులు రద్దు చేసి, తీసుకున్న భూముల్లో కూడా ఎలాంటి పనులు చేయొద్దని ఆదేశాలు ఉన్నా కూడా చట్ట వ్యతిరేకంగా గిరిజన రైతులను భయభ్రాంతులకు గురిచేసి రోడ్డు వేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం, కోర్టు దిక్కరణ. ఇప్పుడు ప్రభుత్వంలో నాయకులు, గత ప్రభుత్వ హయాంలో అప్పుడు చట్ట వ్యతిరేకంగా చేస్తున్న నిర్మాణ పనులు అడ్డుకోన్నారు. మూడు పంటలు పండే భూములు తీసుకోవడానికి లేదని, ఇప్పుడున్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ మాకు అప్పుడు అండగా ఉన్నారు. కానీ పదవులు వచ్చినాక మా సమస్యలు పరిష్కారం చేయటం లేదు. ప్రజా ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు మేము రైతులం మీకు కనబడటం లేదా? గతంలో మీరు టిఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా రైతుల దగ్గర భూములు తీసుకుంటుందని కురుమిద్ద గ్రామంలో నిరాహార దీక్ష చేపించడం జరిగింది. కానీ ఇప్పుడు అదే భూములని మీరు అక్రమంగా గుంజుకుంటున్నారు. గతంలో ఇచ్చిన హమీ ని నిలబెట్టుకోవాలని రైతులు నిరసన దీక్ష చేస్తున్నారు. గతంలో మీరు మా ప్రభుత్వం వస్తే ఇవ్వని భూములని తీసుకోమని, ఫార్మా సిటీ రద్దు చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఫార్మా సిటీ జి. ఓ ఎందుకు రద్దు చెయ్యలేదు, భూములు ఇయ్యాలని ఎందుకు బలవంతం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాము. ఇప్పటికైనా రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. లేకుంటే త్వరలో మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరుగుతుంది. ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ కవుల సరస్వతి, కానమోని గణేష్ మహిపాల్ రెడ్డి నేనావత్ శ్రీకాంత్ భగవంతు రెడ్డి అనసూయమ్మ, సిద్ధం రవి, ఉడతల పెంటయ్య, బూర సత్తయ్య, అందెకర్ దేవోజి మరియు రైతులందరూ పాల్గొనడం జరిగింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలులో మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలంలో పలు గ్రామాల్లో జరిగిన మరణాల నేపథ్యంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుటుంబాలను పరామర్శించారు. పిడూరు పాలెంలో టిడిపి నేత వెంకట కృష్ణారెడ్డి, వెంకన్నపాలెంలో బీజేపీ నేత వాసిరెడ్డి రామిరెడ్డి తండ్రి రంగారెడ్డి, అదే గ్రామంలో దయాకర్ రెడ్డి తల్లి దొరసానమ్మ మృతిపై కుటుంబ సభ్యులకు ఆయన సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారికి ధైర్యం చెప్పి పరామర్శించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

మహబూబ్ నగర్

కరాటే శిక్షణలో మెలుకువలు అందిస్తున్న మాస్టర్

*జూనియర్స్ సీనియర్స్ కు కరాటే శిక్షణ లో మెలుకువలు ఇస్తున్న మాస్టర్* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా:: తేదీ 23/03/2026* *సీనియర్ జూనియర్స్ కరాటే ఛాంపియన్స్ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న ఆర్కే స్పోర్ట్స్ కరాటే యోగ మాస్టర్ కె. రవికుమార్ స్థానిక మహబూబ్నగర్ గ్రామర్ స్కూల్ యందు ఈ శిక్షణ విద్యార్థులకు మానసిక శారీరిక దృఢత్వాన్ని పెంచుటకు ఎంతో ఉపయోగపడుతుందని వచ్చే వేసవి సెలవుల్లో శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులను విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.