Saturday, 25 April 2026

Blog

తిరుపతి

దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని దివ్యాంగులకు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఒక కీలక ప్రకటన ద్వారా శుభవార్తను తెలియజేశారు. గత కొంతకాలంగా నిలిచిపోయిన సదరం (SADAREM) స్లాట్ బుకింగ్ ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుందని ఆయన వెల్లడించారు. మార్చి 25వ తేదీ నుండి ఆన్‌లైన్ ద్వారా స్లాట్ల బుకింగ్ ప్రారంభమవుతుందని, అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కీలక సమాచారం. స్లాట్ బుకింగ్ ప్రారంభం మార్చి 25, వైద్య పరీక్షల నిర్వహణ మార్చి 30 నుండి ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించబడతాయి. బుకింగ్ కేంద్రాలు సమీపంలోని మీ సేవ కేంద్రాలు లేదా గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చని నూతన సాఫ్ట్‌వేర్ ద్వారా పరీక్షలు పూర్తి చేసుకున్న వారికి త్వరితగతిన డిజిటల్ సంతకంతో కూడిన సర్టిఫికెట్ జారీ చేస్తారు. 40% వైకల్యం ఉన్న వారికి ప్రభుత్వం నుండి నెలవారీ పింఛను అందుతుందని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. రైల్వే రాయితీలు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఈ సర్టిఫికెట్ ప్రామాణికంగా ఉంటుందన్నారు. అర్హత కలిగిన దివ్యాంగులు ఎటువంటి ఆలస్యం చేయకుండా నిర్ణీత తేదీల్లో స్లాట్లు బుక్ చేసుకుని, వైద్య పరీక్షలకు హాజరు కావాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచించారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ సంక్షేమ ఫలాలను అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

తిరుపతి

ఉరిశిక్షను చిరునవ్వుతో ముద్దాడిన వీరులకు టీడీపీ నాయకుల ఘన నివాళి

శ్రీకాళహస్తి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన విప్లవ వీరులు భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్‌గురుల త్యాగం అజరామరమని శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కొనియాడారు. సోమవారం ‘అమరవీరుల దినోత్సవం’ (షహీద్ దివస్) సందర్భంగా పట్టణంలో వారి చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ, దేశ విముక్తి కోసం యవ్వన ప్రాయంలోనే ఉరికంభాన్ని ఎక్కిన ఈ ముగ్గురు వీరులు భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. వారి పోరాట పటిమ నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం కార్యకర్తలు “భగత్ సింగ్ అమర్ రహే”, “ఇంక్విలాబ్ జిందాబాద్”, “భారత్ మాతాకీ జై” అంటూ చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉదయ్ కుమార్ రెడ్డి, కొరియర్ రవి, జగదీష్, అత్తూరు హరి, భాస్కర్ రెడ్డి, మోహన్ రావు, పవర్ సుమన్ మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భరతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు వారు చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.

తిరుపతి

భగత్ సింగ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలీ- సీపీఐఎం నేత గంధం మణి

శ్రీకాళహస్తి: భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో భగత్ సింగ్ ఒక వెలుగుచుక్క అని, ఆయన త్యాగం అజరామరమని సీపీఐ(ఎం) ప్రాంతీయ కార్యదర్శి గంధం మణి కొనియాడారు. సోమవారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో భగత్ సింగ్, సుఖ్ దేవ్ ల వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గంధం మణి మాట్లాడుతూ.. బ్రిటీష్ పాలకుల గుండెల్లో నిద్రపోయిన విప్లవ వీరుడు భగత్ సింగ్ అని, కమ్యూనిస్టు భావజాలంతో చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించారని గుర్తుచేశారు. నేటి యువత మత్తు పదార్థాలకు, మతోన్మాదానికి దూరంగా ఉండి, సమసమాజ స్థాపన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. భగత్ సింగ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్యతో పాటు గురునాథం, రాపూరు సుబ్రమణ్యం, ఉస్మాన్ బాషా, కే.సుబ్రమణ్యం మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

రంగారెడ్డి

* ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం .. బిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ సామ మహేందర్ రెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 23 : ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రజావ్యతిరేక పాలనపై మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ సామ మహేందర్ రెడ్డి తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేస్తూ ఎన్నికల ముందు గొప్పగా ప్రకటించిన పథకాలు ఇప్పటికీ అమలుకాలేదని రైతులు, నిరుద్యోగులు, పేద ప్రజలు నేడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతులకు హామీ ఇచ్చిన ఆర్థిక సహాయం తగ్గించడం అన్యాయం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు పెన్షన్ల పెంపు గురించి స్పష్టత లేదు సంక్షేమ పథకాల అమలులో గందరగోళం ప్రభుత్వం మాటలు ఒకలా, పనులు మరోలా ఉండటం ప్రజలను మోసం చేయడమే. ఈ పరిస్థితిని బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ప్రజల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. లేకపోతే ప్రజలతో కలిసి ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని ప్రజల హక్కుల కోసం మా పోరాటం కొనసాగుతుందని తెలిపారు

రంగారెడ్డి

* చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి కి మాతృవియోగం *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 23 : చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి తల్లి గడ్డం చంద్రకళమ్మ పరమపదించారని తెలిసి, వారి నివాసానికి వెళ్లి ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా దుఃఖిత కుటుంబ సభ్యులకు ఆమె తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

E-పేపర్

భగత్ సింగ్ ఆశయాలను సాధిద్దాం షహీద్ భగత్ సింగ్ వర్ధంతి NSUI నాయకులు కోట దుర్గరాజు ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ ఆవరణంలో ఘననివాళి

*భగత్ సింగ్ ఆశయాలను సాధిద్దాం* పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 23 మార్చి 2026 షహీద్ భగత్ సింగ్ , రాజు గురు, సుఖదేవ్ ల వర్ధంతి NSUI నాయకులు కోట దుర్గరాజు ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ ఆవరణంలో నివాళి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భగత్ సింగ్ బ్రిటిష్ సామ్రాజ్యావానికి వ్యతిరేకంగా స్వేచ్ఛ కోసం స్వాతంత్రం కోసం బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి కోసం రాజీలేని పోరాటాలను కొనసాగించి వీరమరణం పొందారు• సోషలిస్ట్ లౌకికవాదం తో కూడిన ఉద్యమాలను ఎలాంటి మత విశ్వాసాలకు దూరంగా తన జీవితాన్ని కొనసాగించారు .!బ్రిటిష్ సామ్రాజ్యవాదంనశించాలివిప్లవం వర్ధిల్లాలి !అనే నినాదంతో అదే తమ పవిత్రాశయంగా అత్యున్నత రాజకీయ విశ్వసంగా ప్రకటిస్తూ తుది శ్వాస విడిచారు .1928 ఢిల్లీ కేంద్రంగా రెండు రోజులు సమావేశాలు నిర్వహించి,సోషలిస్ట్ అనే పదానికి లౌకిక దృక్పథానికి ప్రణాళికలో మౌలికమైన మార్పుకు ఆమోదం పొందేటట్లు చేయడంలో భగత్ సింగ్ పాత్ర కీలకం.ఆనాడే భగత్ సింగ్ తాము కోరుకుంటున్న స్వాతంత్రం కొద్ది మంది సంపన్నుల కోసం కాదని కోట్లాది శ్రమజీవుల కోసమని ప్రజలకు సూటిగా అర్థమయ్యేలా చెప్పారు.నేటి పాలకవర్గాలు నోటితో పొగుడుతూ ఆచరణలోఆయన బోధించిన లౌకిక వాదాన్ని సోషల్టి సమాజాన్ని నోసటితో వెక్కిరిస్తున్నారు .కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం భగత్ సింగ్ ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ వస్తున్నాయి .పాఠ్యాంశాల్లో భగత్ సింగ్ చరిత్రను కూడా తొలగించారు. భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకపోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉన్నది , భగత్ సింగ్ కోరుకున్న భావజాలాన్ని దేశం నలుమూలలకు వ్యాపింప చేయాలి. ఫ్యాక్టరీలు,కార్ఖానాలు,మురికి వాడలు,గ్రామాల్లో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పూరి గుడిసెల్లో నివసిస్తున్న కోట్లాది ప్రజానీకాన్ని పాఠశాల, కళాశాల,విశ్వవిద్యాలయాల విద్యార్థులను పోరాటాలలో భాగస్వామ్యం చేయాలని కోరుతున్నాం. ఇంక్విలాబ్ జిందాబాద్ ఈ కార్యక్రమంలో NSUI నాయకులు శ్రీధర్ , టి ఎస్ ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ ఎం శ్రీకాంత్ యాదవ్, AMSA ఓయూ అధ్యక్షులు నామ సైదులు రాష్ట్ర అధ్యక్షుడు విజయ నాయక్ , NSUI నాయకులు, మహేందర్, రుద్రాక్ష, సాయి, రమేష్ ,విశాల్, నాయకులు పాల్గొన్నారు. ఉద్యమాభివందనాలతో కోట దుర్గరాజు NSUI నాయకులు

రంగారెడ్డి

అభాగ్యులకు కెఎల్ఆర్ ట్రస్ట్ ఆపన్న హస్తం –మాతృదేవోభవ అనాథాశ్రమానికి రూ.10లక్షల వితరణ –జీవితాంతం పేదలకు సహయం అందిస్తా: కిచ్చెన్న* –ఐరన్, మెటీరియల్ అందటంపై నిర్వాహాకులు గిరి కృతజ్ఞతలు.

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 23 : పేదలకు, అభాగ్యులకు, పేద విద్యార్థులకు నిరంతరం కెఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా సేవ చేసే భాగ్యం కలగటం తన అదృష్టమని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కెఎల్ఆర్ ట్రస్ట్ అధినేత కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. జిహెచ్ఎంసి డివిజన్ నాదర్ గుల్ గ్రామంలోని మాతృదేవో భవ అనాథాశ్రమానికి రూ.10 లక్షల విలువ చేసే భవన నిర్మాణ ఇనుము సహా మెటీరియల్ అందజేశారు ట్రస్ట్ నిర్వాహాకులు. అభాగ్యులు, నిరుపేదలు, మతిస్థిమితం లేని వారికి ఆశ్రమం కల్పిస్తున్న గట్టు గిరిని కేఎల్ఆర్ అభినందించారు. నూతన ఆశ్రమంలో జరుగుతున్న పనులను లక్ష్మారెడ్డి గతంలో పరిశీలించారు. తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.10లక్షల విలువైన మెటీరియల్ ను పంపటంతో అనాథాశ్రమ నిర్వాహాకులు గట్టు గిరి సంతోషం వ్యక్తం చేశారు. సేవకుడే నాయకుడు:– కాంగ్రెస్ నేతలు సేవకుడే నాయకుడు అంటూ పదేపదే మాట చెప్పే కిచ్చెన్నగారు… ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని నాదర్ గుల్ కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. పేదల కోసం కెఎల్ఆర్ ట్రస్ట్ స్థాపించి ఎందరికో సేవ చేస్తున్నారని కొనియాడారు. ఓట్ల కోసం కాకుండా పేద విద్యార్థుల కోసం సైతం *లీడ్ ఇండియా * స్థాపించి ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలను, నైపుణ్య శిక్షణను నేటి తరానికి లక్ష్మారెడ్డి అందిస్తున్నారని మహేశ్వరనియోజకవర్గం హస్తం పార్టీ నేతలు గుర్తు చేశారు.

E-పేపర్

భగత్ సింగ్ ఆశయాలను సాధిద్దాం

*భగత్ సింగ్ ఆశయాలను సాధిద్దాం* పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 23 మార్చి 2026 షహీద్ భగత్ సింగ్ , రాజు గురు, సుఖదేవ్ ల వర్ధంతి NSUI నాయకులు కోట దుర్గరాజు ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ ఆవరణంలో నివాళి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భగత్ సింగ్ బ్రిటిష్ సామ్రాజ్యావానికి వ్యతిరేకంగా స్వేచ్ఛ కోసం స్వాతంత్రం కోసం బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి కోసం రాజీలేని పోరాటాలను కొనసాగించి వీరమరణం పొందారు• సోషలిస్ట్ లౌకికవాదం తో కూడిన ఉద్యమాలను ఎలాంటి మత విశ్వాసాలకు దూరంగా తన జీవితాన్ని కొనసాగించారు .!బ్రిటిష్ సామ్రాజ్యవాదంనశించాలివిప్లవం వర్ధిల్లాలి !అనే నినాదంతో అదే తమ పవిత్రాశయంగా అత్యున్నత రాజకీయ విశ్వసంగా ప్రకటిస్తూ తుది శ్వాస విడిచారు .1928 ఢిల్లీ కేంద్రంగా రెండు రోజులు సమావేశాలు నిర్వహించి,సోషలిస్ట్ అనే పదానికి లౌకిక దృక్పథానికి ప్రణాళికలో మౌలికమైన మార్పుకు ఆమోదం పొందేటట్లు చేయడంలో భగత్ సింగ్ పాత్ర కీలకం.ఆనాడే భగత్ సింగ్ తాము కోరుకుంటున్న స్వాతంత్రం కొద్ది మంది సంపన్నుల కోసం కాదని కోట్లాది శ్రమజీవుల కోసమని ప్రజలకు సూటిగా అర్థమయ్యేలా చెప్పారు.నేటి పాలకవర్గాలు నోటితో పొగుడుతూ ఆచరణలోఆయన బోధించిన లౌకిక వాదాన్ని సోషల్టి సమాజాన్ని నోసటితో వెక్కిరిస్తున్నారు .కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం భగత్ సింగ్ ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ వస్తున్నాయి .పాఠ్యాంశాల్లో భగత్ సింగ్ చరిత్రను కూడా తొలగించారు. భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకపోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉన్నది , భగత్ సింగ్ కోరుకున్న భావజాలాన్ని దేశం నలుమూలలకు వ్యాపింప చేయాలి. ఫ్యాక్టరీలు,కార్ఖానాలు,మురికి వాడలు,గ్రామాల్లో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పూరి గుడిసెల్లో నివసిస్తున్న కోట్లాది ప్రజానీకాన్ని పాఠశాల, కళాశాల,విశ్వవిద్యాలయాల విద్యార్థులను పోరాటాలలో భాగస్వామ్యం చేయాలని కోరుతున్నాం. ఇంక్విలాబ్ జిందాబాద్ ఈ కార్యక్రమంలో NSUI నాయకులు శ్రీధర్ , టి ఎస్ ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ ఎం శ్రీకాంత్ యాదవ్, AMSA ఓయూ అధ్యక్షులు నామ సైదులు రాష్ట్ర అధ్యక్షుడు విజయ నాయక్ , NSUI నాయకులు, మహేందర్, రుద్రాక్ష, సాయి, రమేష్ ,విశాల్, నాయకులు పాల్గొన్నారు. ఉద్యమాభివందనాలతో కోట దుర్గరాజు NSUI నాయకులు

యాదాద్రి భువనగిరి

* భగత్ సింగ్ ఆశయాలను సాధిద్దాం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 23 : సంస్థాన్ నారాయణపురం మండలం కేంద్రంలో నేతాజీ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో భగత్ సింగ్ 95వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి హాజరై భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలో వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఉరికంభం ముందున్నా వెనుదిరగని ఉక్కు సంకల్పం ప్రాణాలకన్నా దేశాన్ని గొప్పగా భావించిన అజేయ వీరత్వం భగత్ సింగ్ మహానుభావుల త్యాగం భారత స్వాతంత్ర్యానికి ప్రేరణగా నిలిచిన అజరామర జ్యోతి వారి అడుగుజాడల్లో నడవడం అంటే కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడం కాదు మనలోని దేశభక్తిని మేల్కొలిపి, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలనిగాలని అన్నారు ఈ కార్యక్రమంలో నేతాజీ యోజన సమైక్య సంఘ సభ్యులు, వార్డ్ మెంబర్లు వివిధ పార్టీల రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

*ఏంవి ఫ్రూట్ జ్యూస్ సెంటర్ ప్రారంభించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 23 :సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన దుర్గం వెంకటయ్య ఏంవి ఫ్రూట్ జ్యూస్ సెంటర్ ను సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు సుర పెళ్లి వెంకటేష్, సభావత్ రఘు నాయక్, రాచకొండ రమేష్, క్రైమ్ మిర్రర్ రిపోర్టర్ ఉప్పల వెంకటేష్, యువజన కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు, గునిగంటి రాజు గౌడ్, వలిగొండ మాధవులు, యువజన కాంగ్రెస్ మండల కార్యదర్శి కొండ నవీన్ గౌడ్, బానోతు కిరణ్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.