Saturday, 25 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

IJU 11వ ప్లీనరీకి విజయవాడ సిద్ధం

విజయవాడ (పున్నమి ప్రతినిధి): ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) 11వ ప్లీనరీ సమావేశాలు మార్చి 27, 28, 29 తేదీల్లో విజయవాడలో ఘనంగా నిర్వహించబడనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు ఈ మహాసభలో పాల్గొననున్నారు. జర్నలిస్టుల హక్కులు, వృత్తి పరిరక్షణ, మీడియా స్వేచ్ఛ, నూతన సాంకేతిక మార్పులపై చర్చలు జరగనున్నాయి. ప్రముఖ మీడియా ప్రతినిధులు, నాయకులు, నిపుణులు పాల్గొని కీలక అంశాలపై అభిప్రాయాలు పంచుకోనున్నారు. ఈ సమావేశాలు జర్నలిస్టుల ఐక్యతను బలపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు తెలిపారు. విజయవాడ నగరం ఈ వేడుకకు సిద్ధమై సందడి వాతావరణాన్ని సంతరించుకుంది.

ఆంధ్రప్రదేశ్

వారిపై చర్య తీసుకోవాలి: గ్యాస్ సిలిండర్ బ్లాక్ మార్కెటింగ్‌పై ప్రధాని

మధ్యప్రాచ్య యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. దేశవ్యాప్తంగా సుమారు 12,000 దాడులు నిర్వహించగా, 15,000కు పైగా గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సహజ వాయువుల మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి.

జాతీయ అంతర్జాతీయ

అబుదాబిలో క్షిపణి శకలాలు తగిలి భారతీయుడికి గాయాలు

అబుదాబిలోని అల్ షహామా ప్రాంతంలో బాలిస్టిక్ క్షిపణి శకలాలు తగలడంతో ఒక భారత జాతీయుడు గాయపడ్డాడు. బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్న అనంతరం ఒక ప్రాంతంలో శకలాలు పడిపోయాయి. ఈ ఘటనలో ఓ భారతీయుడికి స్వల్ప గాయాలు అయ్యాయని స్థానిక అధికారులు తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తోంది.

జాతీయ అంతర్జాతీయ

భారతీయ నౌకలు హోర్ముజ్ జలసంధిని దాటాయి: ప్రభుత్వం

భారత జెండా కలిగిన రెండు నౌకలు – జెగ వసంత్, గ్రీన్ గ్యాస్ – మొత్తం 92,612.59 మెట్రిక్ టన్నుల ఎల్ఎపీజీతో హోర్ముజ్ జలసంధిని దాటాయని భారత నౌకాయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. అవి మార్చి 26 నుంచి 28 మధ్య భారతానికి ఒడరేవులకు చేరుకుంటాయి. అంతకుముందు, మధ్యప్రాచ్య యుద్ధం జరుగుతున్న సమయంలో షివాలిక్, నందా దేవి, గ్రీన్ ఆర్ప్స్ అనే మూడు నౌకలు హోర్ముజ్ జలసంధిని దాటి భారతానికి చేరుకున్నాయి.

జాతీయ అంతర్జాతీయ

భారీగా పెరిగిన యూఎస్ మార్కెట్లు

అమెరికా-ఇరాన్ చర్చలు సజావుగా సాగుతున్నాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో అమెరికా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కొన్ని లేటర్ వ్యాపారం, ఉ. 7:10 గంటలకు (ET), S&P 500 సూచీ 240 పాయింట్లు పెరిగి, మార్కెట్ విలువలో 2 ట్రిలియన్ డాలర్లు చేరింది. కొద్దిసేపటికే, ఇరాన్ చర్చలను ఖండించడంతో మార్కెట్ తిరోగమించింది. ఫలితంగా ఉ. 8:00కు (ET) S&P 500 సూచీ 120 పాయింట్లు పడిపోయింది.

జాతీయ అంతర్జాతీయ

ఇరాన్‌తో 15 అణుశాలపై చర్చ, అందులో మొదటిది ఇరాన్ వద్ద అణుఆయుధాలు ఉండొద్దు: ట్రంప్

అమెరికా, ఇరాన్‌తో 15 అంశాలపై అంగీకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం తెలిపారు. ఇరాన్ వద్ద ఎలాంటి అణుఆయుధాలు ఉండకూడదనే ఈ అంశంలో మొదటిది పేర్కొన్నారు. కొనసాగుతున్న మధ్యప్రాచ్య యుద్ధం నేపథ్యంలో, చర్చల కోసం ఇరాన్ తనను సంప్రదించిందని, ఒప్పందాన్ని కోరుకుంటోందని ట్రంప్ చెప్పారు. కాగా చర్చల కోసం తమ అమెరికాను సంప్రదించామని విషయాన్ని ఇరాన్ ఖండించింది.

Featured

బ్లూటూత్ ఇయర్‌ఫోన్లను ఉపయోగించడం వల్ల మెదడులో కణితులు వస్తాయా?

బ్లూటూత్ ఇయర్‌ఫోన్లను ఉపయోగించడం వల్ల మెదడులో కణితులు వస్తాయనే వాదనలో నిజం లేదని అమెరికాకు చెందిన న్యూరోసర్జన్ డాక్టర్ రూపా జాతాని తెలిపారు. “బ్లూటూత్ ఇయర్‌ఫోన్లు మెదడు లేదా ఇతర కణితుల ప్రమాణాన్ని పెంచుతాయన్నదానికి ఎలాంటి ఆధారాలు లేవు. బ్లూటూత్ పరికరాలు DNAను దెబ్బతీయని రేడియేషన్‌ను విడుదల చేస్తాయి,” అని న్యూరోసర్జన్ డాక్టర్ రూపా జాతాని వెల్లడించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నారాయణరావు కుటుంబంతో నారా భువనేశ్వరి

లోకేష్ గెలుపు మొక్కు పై ధన్యవాదాలు నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలవాలని హృదయపూర్వకంగా కోరుకుని, ఆయన గెలిస్తే మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో స్వామివారికి శాశ్వత రథం సమర్పిస్తానని సినీ నిర్మాత, తెలుగుదేశం వీరాభిమాని కావలి వాసి అట్లూరి నారాయణరావు మనసారా సంకల్పించి, ఆమేరకు. ఎంతో ఆనందం, భక్తి భావంతో ఈ ఏడాది జనవరి 24వ తేదీన నే స్వామివారికి కోటిరూపాయలకు పైగా విలువైన శాశ్వత రథాన్ని తయారు చేయించిన నారాయణరావు రావు కుటుంబం ను నారా భువనేశ్వరి ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ పుణ్య కార్యక్రమానికి నారా భువనేశ్వరి ని మరియు నారా రోహిత్ ని ఆహ్వానించగా, అయితే ఆ రోజున భువనేశ్వరి కి అవకాశం లేకపోవడంతో, నారా రోహిత్ చేతుల మీదుగా స్వామికి నారాయణరావు రథం సమర్పించారు. ఈసందర్భాన్ని పురస్కరించుకుని ఎంతో ప్రేమతో భువనేశ్వరి నారాయణరావు కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించి, అభినందించారు .తన కుటుంబంతో ఆమె చూపిన ఆప్యాయత, గడిపిన ఆ సంతోష క్షణాలు తమ జీవితంలో చిరస్మరణీయంగా మిగిలిపోతాయని. ఆ సందర్భంలో వారు తనకు తెలియజేసిన కృతజ్ఞత మనసులో శాశ్వతంగా నిలిచి పోతుందని ఈ ప్రేమ, ఆత్మీయత, గౌరవానికి తాను ఎల్లప్పుడూ భువనమ్మ కి రుణపడి ఉంటానని నారాయణరావు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధనే ధ్యేయం

“* వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తో సమావేశమై రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి చర్చించిన పలు జిల్లాల పార్టీ అధ్యక్షులు, కాకాణి గోవర్ధన్ రెడ్డి అనంత వెంకట్రామిరెడ్డి , కాటసాని రాంభూపాల్ రెడ్డి గమ భూమన కరుణాకర్ రెడ్డి , అమర్నాథ్ రెడ్డి , రవీంద్రనాథ్ రెడ్డి , ఉష శ్రీ చరణ్ తోపాటు శైలజనాథ్ సతీష్ కుమార్ రెడ్డి , లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి , పుట్టా శివ శంకర్ పలువురు రైతు సంఘాల నాయకులు, తదితరులు రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనే ధ్యేయంగా ఉద్యమించాలని నిర్ణయించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం దాదాపు పూర్తికా వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు మోకాలు అడ్డడం అన్యాయం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు విని చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి తీరని ద్రోహం తలపెట్టారని ఆరోపించారు. కర్ణాటక రాష్ట్రం ఒక పక్క ఆల్మట్టి ఎత్తు పెంచుతూ నిర్ణయం తీసుకుని ముందుకు వెళుతున్న నేపథ్యంలో ఆంధ్రా ప్రాంతానికి తీవ్రమైన సాగునీటి కొరత రాబోతుందని తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం జలాశయం నుండి 800 అడుగుల దిగువ భాగం నుండే రోజుకు 8 టీఎంసీల నీరు తరలించుకుపోతుందని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే శ్రీశైలం జలాశయాన్ని నిబంధనలు అతిక్రమించి వినియోగించుకునే విధంగా గతంలో తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు నిర్మించగా చంద్రబాబు తిరిగి 2024 లో ముఖ్యమంత్రి కాగానే రేవంత్ రెడ్డి మాటలు విని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అట్టెకెక్కించేశారని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం యొక్క ప్రాధాన్యతను రైతులకు, ప్రజలకు వివరించి, ప్రభుత్వంపై పోరాటం చేసే క్రమంలో జిల్లాస్థాయి, నియోజకవర్గస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకుని, రైతాంగానికి సాగునీటి కోసం, ప్రజానీకానికి త్రాగు నీటి కోసం, ఉత్పన్నం కానున్న కష్ట,నష్టాల గురించి వివరించాలని నిర్ణయించారు. రాయలసీమ లిఫ్ట్ సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు, కలిసి వచ్చే అన్ని పార్టీలు, స్వచ్ఛంద సేవ సంస్థలు, పౌరహక్కుల నేతలు, రైతు సంఘం నాయకులు, అందరితో కలిసి ఉద్యమిస్తూ రాయలసీమ ఎత్తిపోతల సాధనే ధ్యేయంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, తిరిగి ప్రారంభించే వరకు పోరాడుదాం అని పిలుపునిచ్చారు. చంద్రబాబు మెడలు వంచైనా, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సాధించి ,రాయలసీమ ప్రాంతం తో పాటు, నెల్లూరు, దక్షిణ ప్రకాశం ప్రాంతాలకు సాగునీరు, త్రాగునీరు, అందించేందుకు సన్నద్ధం కావాలని నిర్ణయించారు. జగన్మోహన్ రెడ్డి రోజుకు రెండు టీఎంసీల చొప్పున రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు లిఫ్ట్ ద్వారా నీరందించాలనే లక్ష్యంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శ్రీకారం చుట్టగా అది పూర్తవుతున్న పరిస్థితుల్లో జగన్ కు మంచి పేరు వస్తుందని, రైతుల ప్రయోజనాలు విస్మరించి, చంద్రబాబు, రేవంత్ రెడ్డి మాటలు విని అర్ధాంతరంగా ఆపివేయడం దుర్మార్గంగా సమావేశం లో నిర్ణయించారని కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. –

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

“తడ “నుంచి “గుంటూరు “వరకు రాజుకున్న తీరం ..

తమిళనాడు బోట్ల వివాదం ఇంతై అంతై తడ నుంచి గుంటూరు జిల్లా రామాపురం పల్లిపాలెం వరకు పాకింది. తమిళ బోట్లు తరలింపు సమస్య దాదాపు 143 గ్రామాలకు కీలకమైంది. ఈ విషయంలో ఈ గ్రామాలన్నిటికీ పెద్దకాపుగా ఉన్న వ్యక్తే కీలకం కావడం మత్స్యకారులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది . తమ జీవనోపాధికి సంబంధించిన ఎన్నో సంవత్సరాల సమస్య పై తాము నమ్ముకున్న పెద్దకాపే తమను పక్కదారి పట్టించడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. సహజంగా మత్స్యకారులు ఎంతగా ప్రేమిస్తారో…. దారితప్పితే అంతగా ద్వేషిస్తారు.. అన్నది వారి జీవనశైలి. ప్రస్తుతానికి ఈ సమస్య పరిష్కరించే దిశలో రాజకీయ నాయకులను ,అధికారులను దూరం పెట్టేసిన మత్స్యకారులు ఏప్రిల్ మూడవ తేదీ 143 గ్రామాల కాపులతో కీలక సమావేశం నిర్ణయించారు. సమావేశం అజెండా లక్ష్యాలంటూ ప్రత్యేకంగా ఏమీ లేకపోయినా తమిళ బోట్ల విడుదల సమస్య ఏకైక అజెండాగా మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. బోట్ల తరలింపు పై ఆందోళన చెందిన ఇసుక పల్లి పల్లి పాలెం వాసులు తమను మిగిలిన 142 గ్రామాల కాపులు బహిష్కరిస్తారని భయపడి ముందస్తుగా ముగ్గురు కాపులను నిర్బంధించి గ్రామానికి సమస్య లేకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. బాధ్యులైన కాపులను బంధించకపోతే తమ ఆచారం ప్రకారం బహిష్కరణ గురైతే గ్రామ వాసులందరికీ ఇబ్బందువుతోందని కట్టుబాటుకు చర్యలు చేపట్టినట్టు సమాచారం . గ్రామస్తులు ముందస్తుగా కాపులను ఇలా కట్టి వేయడంతో 142 గ్రామాల వారు కొంత సంతృప్తికి గురవుతున్నట్లుగా తెలుస్తోంది .ఇక బోట్ల విడుదలకు ఎవరు ఎలా అనే విషయం మూడో తేదీలోపు స్పష్టతకు వచ్చిన తర్వాత 143 గ్రామాలకు సంబంధించి కాపు లు తీసుకునే నిర్ణయం కఠినంగానే ఉండవచ్చు అని తెలుస్తోంది. గతంలో ఒక సంఘటనలో ఇప్పటి టీటీడీ చైర్మన్ అప్పటి జిల్లా కలెక్టర్ గా ఉన్న మద్దాడ రవిచంద్ర కు తమ సమస్య పరిష్కారం తెలుపాలని లక్ష్యంతో మత్స్యకారులు కలెక్టర్ బంగళా చుట్టూ పడవలు పెట్టి కొన్ని గంటల పాటు చేసిన ధర్నా కార్యక్రమం నాడు రాష్ట్రంలో సంచలనం గా మారింది. అదేవిధంగా 2004లో చెన్నాయి పాలెం పెదపట్టపాలెం సంఘటన రాష్ట్రవ్యాప్తంగా అధికారులకు పాలకులకు తీవ్ర తలనొప్పిగా మారిన నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు, పోలీసు ఉన్నతాధికారులు పదిమంది కి పైగా ఆ గ్రామంలో గంటలసేపు బైఠాయించాల్సిన పరిస్థితి నెలకొంది .అయినా ఆ సంఘటనలో పట్టిన పట్టు వారు వీడలేదు. అధికారాలతో రాజకీయాలతో వ్యవహారాన్ని ముడి పెట్టాల్సిన అవసరం లేదని ఇది తమ జీవనోపాధికి సంబంధించిందని కాపులు చేసిన సూచనలతో తీరంలోని 143 గ్రామాల మత్స్యకార ప్రజలు ఏకీభవించడంతో ఈ సమస్య ఎటు వెళ్లుతుందనేది అర్థం కాని విషయమే. మత్స్యకారుల మనోభావాలపై నేటి యువ అధికారులకు సరైన అవగాహన లేని నేపథ్యంలో ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చాలా కసరత్తులు చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది .ఎక్కడైనా ఏదైనా తొందరపాటు చర్య జరిగితే అది గతంలో అల్లూరు బోగోలు తీరంలో జరిగిన సంఘటనలు పురావృత్తం అయ్యే ప్రమాదం కూడా ఉంటుందనేది సమాచారం. ఈ సమస్యకు ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ అంశం కూడా తోడు కావడం, మరోవైపు చెన్నాయి పాలెం పెదపట్టపాలెం భూముల సమస్య కూడా రోడ్డుకి ఎక్కడంతో జిల్లా అధికారులకు మాత్రం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.