Saturday, 25 April 2026

Blog

తిరుపతి

వైభవంగా శ్రీ కోదండరాముని రథోత్సవం

రామనామ స్మరణతో మార్మోగిన తిరువీధులు తిరుపతి, 2026 మార్చి 24 పున్నమి ప్రతినిధి తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు మంగళవారం ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 8.30 గంటలకు శ్రీ సీతా–లక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారు రథాన్ని అధిష్టించి నాలుగు మాడ వీధుల్లో విహరించారు. భక్తుల రామనామ స్మరణతో తిరుపతి తిరువీధులు మార్మోగాయి. డప్పు వాయిద్యాలు, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా భక్తులు భక్తి భావంతో రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. రథం నాలుగు మాడ వీధుల్లో ఊరేగి యథాస్థానానికి చేరిన అనంతరం ప్రబంధం, వేద శాత్తుమొర నిర్వహించి హారతి ఇచ్చారు. రథోత్సవానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక తాత్పర్యం ఉంది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులుగా భావిస్తారు. ఈ విధంగా శరీరాన్ని రథంతో పోల్చడం ద్వారా శరీరం వేరని, ఆత్మ భిన్నమని తెలియజేసే ఆత్మ–అనాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవం ద్వారా భక్తులకు ఈ తత్త్వజ్ఞానం తెలియజేయబడుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అర్చకులు తిరుమంజనం, ఆస్థానం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు అశ్వవాహన సేవ వేడుకగా జరగనుంది. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జి. భానుప్రకాశ్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ మునిశంకర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్, ఇంజినీరింగ్ అధికారులు మరియు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మార్చి 25న చక్రస్నానం శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 9 గంటల నుండి 10.30 గంటల వరకు కపిలతీర్థంలో చక్రస్నానం వైభవంగా నిర్వహించనున్నారు. ———————– టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

E-పేపర్

త్వరలో ”సాదా బైనమాల” పరిష్కారం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణలో సాదా బైనామాల సమస్యపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ముఖ్యమైన విషయాలు ఇలా ఉన్నాయి 👇 రాష్ట్రంలో సుమారు 9 లక్షలకు పైగా సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమస్యను త్వరలో పూర్తిగా పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు. దీనికోసం ప్రభుత్వం GO 76 జారీ చేసింది. *కొత్త నిర్ణయాలు* ముందుగా: కొనుగోలుదారు + అమ్మకందారు ఇద్దరి నుంచి అఫిడవిట్ తీసుకోవాలి ఇప్పుడు: కేవలం కొనుగోలుదారు నుంచి మాత్రమే అఫిడవిట్ తీసుకుంటారు 👉 దీంతో ప్రక్రియ సులభం అవుతుంది రైతులకు లాభం🙏 2020 నుంచి పెండింగ్‌లో ఉన్న కేసులు క్లియర్ అవుతాయి భూములపై పూర్తి హక్కులు పొందే అవకాశం ఉంటుంది త్వరగా పరిష్కారం కోసం గ్రామ, రెవెన్యూ స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు.

అనంతపురం

ఆర్డీటికి ఎఫ్.సీ.ఆర్.ఏ. పునరుద్ధరణ పట్ల హర్షం

మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపిన డా. నల్లాని తెలుగు రాష్ట్రాల్లో 50 సంవత్సరాలకు పైగా విశేషసేవలందిస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్.డీ.టి) మళ్లీ విదేశీ నిధులను పొందేలా అనుమతులను పునరుద్ధరించడం పట్ల ప్రముఖ సామాజికవేత్త, రచయిత్రి, కేంద్ర ప్రభుత్వ ‘రాజ్య మహిళా సమ్మాన్’ అవార్డు గ్రహీత డాక్టర్ నల్లాని రాజేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. లక్షలాదిమంది తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషించేలా ప్రత్యేకకృషి చేసి, ఎఫ్.సీ.ఆర్.ఏ రెన్యూవల్ సాధించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు డా. నల్లాని ధన్యవాదములు తెలిపారు. ప్రజల జీవితాల్లో కీలక భాగమైన ఆర్డీటీ సేవలు ఇకపై యథావిధిగా కొనసాగుతాయన్నారు. ఈ సేవలు నిరంతరాయంగా అందేలా చూడాలని మాట ఇచ్చిన మంత్రి లోకేష్ తన మాటను నెరవేర్చాడని ఆమె ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన సంప్రదింపుల్లో, పేదల ఇళ్లలో వెలుగు నింపడం, నిరుపేద పిల్లల విద్య, ఉపాధి అవకాశాలు, ఆర్థిక సాధికారత, వైద్య సేవలందించడంలో ఆర్డీటీ దశాబ్దాలుగా చేస్తున్న విశేష కృషిని లోకేష్ వివరించడం అభినందనీయమన్నారు. ఆర్డీటీకి ఉన్న అడ్డంకులు తొలగిపోయి, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్.సీ.ఆర్.ఏ) ప్రకారం ఆర్డీటీ రెన్యువల్ పూర్తి కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, అధికారులందరికీ డాక్టర్ నల్లాని రాజేశ్వరి ధన్యవాదములు తెలిపారు. అనేక దశాబ్దాలుగా సేవాస్ఫూర్తితో పనిచేస్తున్న ఆర్డీటీ నిర్వాహకులు అన్నే ఫెర్రర్, మాంచో ఫెర్రర్, విశా ఫెర్రర్ తదితరులకు డాక్టర్ నల్లాని రాజేశ్వరి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

సూర్యాపేట

రోడ్డు ఆక్రమించి వ్యాపారాలు చేయొద్దు..

సూర్యాపేట పట్టణంలో ఆపరేషన్ రోప్ ROPE – Removal of Obstructive Parking and Encroachments. స్పెషల్ డ్రైవ్. జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణంలో ప్రజల, వాహనదారుల సౌకర్యార్థం సూర్యాపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి “ఆపరేషన్ రోప్” కార్యక్రమం చేపట్టడం జరిగినదని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం అన్నారు. దీనిలో భాగంగా ఈరోజు కుడ కుడ రోడ్డు లో ఉన్న ఆక్రమణలను మున్సిపాలిటీ అధికారులతో కలిసి తొలగించారు. అలాగే రోడ్డు పై ఉన్న మట్టి కుప్పలు, చెత్తను, రాళ్ళను తొలగించి రోడ్డు సక్రమంగా కనిపించేలా వినియోగించేలా చేశారు. ముఖ్య పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి, ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా, ప్రమాదాలు జరగకుండా చేయడం, ఆక్రమణలు, అనధికారిక పార్కింగ్ తొలగించడం, వాహనాలు క్రమపద్ధతిలో వెళ్లడం అరైవ్ అలైవ్, రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో ఆపరేషన్ రోప్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు.

కడప

ప్రొద్దుటూరు: జేసీతో సమావేశమైన ఏఎస్పీ విభూకృష్ణ

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా మంగళవారం జేసీ నిధి మీనా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ మున్సిపల్ కార్యాలయానికి వచ్చి మర్యాదపూర్వకంగా జేసీతో సమావేశమయ్యారు. ప్రొద్దుటూరు పట్టణంలోని ట్రాఫిక్ పరిస్థితులను వివరించారు. ASP వెంట 1టౌన్ సీఐ కొండారెడ్డి, ట్రాఫిక్ సీఐ రాజగోపాల్, ఎస్ఐలు ఉన్నారు.

అన్నమయ్య

చిట్వేల్‌లో ఉచిత విద్యకు సువర్ణావకాశం – కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రవేశాలు ప్రారంభం

చిట్వేల్ మండలంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో 2026-27 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. “నాణ్యమైన విద్య అందించడమే మా లక్ష్యం” అని ప్రిన్సిపాల్ తులసి తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల ఆడపిల్లలకు ఉచితంగా సమగ్ర విద్యను అందిస్తూ, వారి భవిష్యత్తును మెరుగుపరచడమే ఈ విద్యాలయ ముఖ్య ఉద్దేశమని ఆమె వివరించారు. ఈ విద్యాసంవత్సరానికి గాను 6వ తరగతిలో 40 సీట్లు, 7వ తరగతిలో 13 సీట్లు, 8వ తరగతిలో 5 సీట్లు, 9వ తరగతిలో 4 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అలాగే ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ (ఇంగ్లీష్ మీడియం) కోర్సుకు 40 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సీట్లు పరిమితంగా ఉన్నందున అర్హులైన విద్యార్థినులు తక్షణమే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థినుల కోసం పాఠశాలలో క్రమబద్ధమైన రోజువారీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 5:30 గంటలకు యోగా, 7 గంటలకు రాగి మాల్ట్, 7:30 నుండి 8:30 వరకు ఉదయం అధ్యయనం, 8:30కు అల్పాహారం, 9 గంటలకు ప్రార్థన అనంతరం 9:15 నుండి సాయంత్రం 4:15 వరకు తరగతులు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12:15కు పోషకాహారంతో కూడిన భోజనం అందిస్తారు. సాయంత్రం 4:15కి బూస్ట్, స్నాక్స్, రాత్రి 6 నుండి 9 వరకు నైట్ స్టడీ అవర్స్, 7 గంటలకు భోజనం వంటి సదుపాయాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థినుల సంక్షేమం కోసం పాఠశాలలో ఉచితంగా పరుపులు, దుప్పట్లు, శానిటరీ నాప్కిన్స్, సోలార్ గీజర్ ద్వారా వేడి నీరు, డిజిటల్ విద్యా సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. అదనంగా యూనిఫాం, బ్యాగ్, షూస్, పుస్తకాలు, నోట్‌బుక్స్ అన్నీ ఉచితంగా అందజేస్తారు. ప్రతి సంవత్సరం ఒక్కో విద్యార్థినికి రూ.1000 కాస్మెటిక్ ఖర్చుల కోసం ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. కేవలం పాఠ్య విద్య మాత్రమే కాకుండా, వృత్తి విద్యా కోర్సులను కూడా ప్రవేశపెట్టినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థినులను స్వయం సమర్థులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. డ్రాప్‌అవుట్ బాలికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని ఆమె పేర్కొన్నారు.ఆడపిల్లల భద్రత, ఆరోగ్యం, నాణ్యమైన విద్య కలగలిపి సమగ్ర అభివృద్ధి సాధించడమే కేజీబీవీల ప్రధాన లక్ష్యమని తెలిపారు. తల్లిదండ్రులు ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకొని తమ పిల్లలను విద్యాబోధనలో ముందుకు తీసుకెళ్లాలని ఆమె కోరారు. విద్యార్థినులు మరియు వారి తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందిస్తామని హామీ ఇచ్చారు. అడ్మిషన్లు పరిమితంగా ఉన్నందున ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ తులసి మరోసారి విజ్ఞప్తి చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కుమ్మరకొండూరులో రూ.32 లక్షలతో గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన

కలిగిరి మండలం కుమ్మరకొండూరు గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.32 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయాలు ప్రజా సమస్యల పరిష్కారానికి కేంద్రబిందువులుగా మారాలని సూచించారు. ఇక నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. ఈ నూతన భవనం పూర్తయిన తరువాత ప్రభుత్వ సేవలు గ్రామ ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కుమ్మరకొండూరులో రూ.32 లక్షలతో గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన

కలిగిరి మండలం కుమ్మరకొండూరు గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.32 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయాలు ప్రజా సమస్యల పరిష్కారానికి కేంద్రబిందువులుగా మారాలని సూచించారు. ఇక నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. ఈ నూతన భవనం పూర్తయిన తరువాత ప్రభుత్వ సేవలు గ్రామ ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

కడప

ప్రొద్దుటూరు: గుండెపోటుతో టీచర్ మృతి

ప్రొద్దుటూరు వైవీఎస్ మున్సిపల్ పాఠశాలలో 10th పరీక్షల విధుల్లో ఉండగా సోమవారం ఉపాధ్యాయుడు గురునాథ్ గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. సోమవారం పరీక్షల ఆన్సర్ షీట్లను పోస్టాఫీసు తీసుకు వెళ్తుండగా.. గాంధీరోడ్డులో గుండెపోటు వచ్చి పడిపోయాడు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వెలిగండ్లలో విపిఆర్ నేత్ర సేవా శిబిరం – ఉచిత కంటి పరీక్షలు, అద్దాల పంపిణీ

కొండాపురం మండలం వెలిగండ్ల గ్రామంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విపిఆర్ నేత్ర సేవా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒకేచోట ఆధునిక పరికరాలతో కంటి పరీక్షలు నిర్వహించడం, అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు అందించడం అభినందనీయం అని పేర్కొన్నారు. ఈ శిబిరం ద్వారా కంటి సమస్యలతో బాధపడుతున్న అనేక మందికి నిపుణులైన వైద్యులు తగిన సూచనలు, సలహాలు అందిస్తున్నారు. అలాగే, శస్త్రచికిత్సలు అవసరమైన వారికి వాటిని నిర్వహించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమానికి మరింత విశిష్టతను తీసుకొచ్చింది. “సర్వేంద్రియానాం నయనం ప్రధానం” అన్న నానుడిని సార్థకం చేస్తూ, ప్రజల చూపు సంరక్షణకు కృషి చేస్తున్న ఈ సేవా కార్యక్రమం గ్రామీణ ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతోంది. ఈ సందర్భంగా నిర్వాహకులను పలువురు హృదయపూర్వకంగా అభినందించారు. 👁️

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.