Saturday, 25 April 2026

Blog

ఖమ్మం

ACB అధికారుల అదుపులో వైరా MVI

ఖమ్మం (మార్చి ) (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం జిల్లా పరిధిలో గల వైరా మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (MVI) ప్రసాద్, తన పరిధిలో నడుస్తున్న ఫిర్యాదుదారుడి రవాణా వాహనాలపై జరిమానాలు మరియు పెనాల్టీలు విధించకుండా ఉండేందుకు గాను, తన ప్రైవేట్ అసిస్టెంట్ రాజశేఖర్ ద్వారా రూ. 24,800/- #లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా #అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు వైరాలోని ఆర్టీఓ యూనిట్ కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్ట్ చేశారు.

అమరావతి

మాజీ సీఎం జగన్‌మోహన్క రెడ్డి ని లిసిన ఆదాల

నెల్లూరు నేత మాజీ MP ఆదాల ప్రభాకర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అంశాలు, పార్టీ కార్యక్రమాలపై చర్చ జరిగినట్లు సమాచారం. అదాల పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో చేపట్టాల్సిన పలు , ప్రజా సమస్యల పరిష్కారంపై సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

అమరావతి

మాజీ సీఎం జగన్‌మోహన్క రెడ్డి ని లిసిన ఆదాల

నెల్లూరు నేత మాజీ MP ఆదాల ప్రభాకర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అంశాలు, పార్టీ కార్యక్రమాలపై చర్చ జరిగినట్లు సమాచారం. అదాల పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో చేపట్టాల్సిన పలు , ప్రజా సమస్యల పరిష్కారంపై సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

తూర్పు గోదావరి

పెట్రోల్ బంక్ వద్ద ఆందోళన వాతావరణం – ఇంధనం కోసం వాహనదారుల ఆత్రం

పున్నమి ప్రతినిధి, తాళ్లపూడి (తూర్పుగోదావరి జిల్లా), మార్చి 24:తాళ్లపూడిలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు పెట్రోలు, డీజిల్ కోసం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఇంధనం సరఫరా విషయంలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా వాహనదారులు ముందస్తుగా ట్యాంకులు నింపుకునేందుకు బంక్ వద్దకు భారీగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంక్ వద్ద పెద్ద ఎత్తున వాహనాలు క్యూలలో నిలబడటంతో రద్దీ వాతావరణం నెలకొంది.కొంతమంది ఇంధనం అందకపోతుందేమోనన్న భయంతో అదనంగా నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఒక్కసారిగా పెరిగిన వినియోగదారుల రద్దీతో పెట్రోల్ బంక్ సిబ్బంది తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. వాహనాల రద్దీ నియంత్రణలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాహనదారులు అనవసర భయాందోళనలకు గురికాకుండా సాధారణ అవసరాలకు మాత్రమే ఇంధనం వినియోగించాలని స్థానికులు సూచిస్తున్నారు.

తూర్పు గోదావరి

ఆన్‌లైన్ బుకింగ్ విఫలం… గ్యాస్ కోసం గ్రామస్తుల పరుగులు

పున్నమి ప్రతినిధి, తాళ్లపూడి (తూర్పుగోదావరి జిల్లా)మార్చి 24:మండలంలోని వేగేశ్వరపురం గ్రామంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకుని 15 రోజులు గడిచినా సరఫరా జరగడం లేదని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులు ఆన్లైన్‌లో బుకింగ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ సక్రమంగా నమోదు కాకపోవడం వల్ల పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతుందని చెబుతున్నారు. దీంతో ప్రత్యక్షంగా గ్యాస్ ఏజెన్సీలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా గ్యాస్ కంపెనీల కార్యాలయాల వద్ద భారీ రద్దీ నెలకొంది. మరోవైపు వినియోగదారుల తాకిడి పెరగడంతో డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాల సిబ్బంది కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం వేగేశ్వరపురం గ్రామంలోకి హెచ్.పీ గ్యాస్ ఆటో చేరుకోగానే ప్రజలు ఒక్కసారిగా ఖాళీ సిలిండర్లు పట్టుకుని ఆటో వద్దకు పరుగులు తీశారు. ఆన్లైన్‌లో బుకింగ్ చేయని వారు కూడా గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని డ్రైవర్లపై ఒత్తిడి తెచ్చారు. దీంతో గ్యాస్ సరఫరా సిబ్బంది దిక్కుతోచని స్థితిలో ఆందోళనకు గురయ్యారు. “బుకింగ్ లేకుండా గ్యాస్ ఎలా ఇవ్వగలం” అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో భారీగా గుమికూడిన జనసమూహాన్ని చూసి గ్యాస్ ఆటో అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా, అవసరం లేకపోయినా నిల్వ కోసం గ్యాస్ సిలిండర్లు సేకరించే ధోరణి పెరగడం కూడా సమస్యను మరింత తీవ్రం చేస్తున్నదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకుని గ్యాస్ సరఫరా వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

తిరుపతి

ముచ్చివోలులో ఘనంగా మహా కుంభాభిషేక వేడుకలు – భక్తి పరవశంలో గ్రామం

శ్రీకాళహస్తి, మార్చి 24 (పున్నమి న్యూస్): ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరుగాంచిన ముచ్చివోలు గ్రామంలో భక్తి పారవశ్యం వెల్లివిరుస్తోంది. దేవాదాయ శాఖ సహకారంతో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. గత రెండు రోజులుగా కొనసాగుతున్న యాగాలు, ధార్మిక క్రతువులు బుధవారం నాడు ప్రధాన ఘట్టంతో ముగియనున్నాయి. ఉదయం నుంచే ముచ్చివోలు శ్రీరామ సేవా సమితి హరేరామ భజన బృందం ఆధ్వర్యంలో విశేష పూజలు ప్రారంభం కానున్నాయి. నేడు ఉదయం 9:48 నుంచి 9:52 గంటల మధ్య ఉన్న శుభ ముహూర్తంలో విగ్రహ ప్రతిష్ఠాపన, మహా కుంభాభిషేకం, సంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. అనంతరం యంత్ర స్థాపన, దేవస్య బింబ స్థాపన, విమాన కుంభాభిషేకం జరుగుతుంది. భక్తులకు స్వామివారి దర్శనంతో పాటు గో దర్శనం, కన్యా దర్శనం, వేద ఆశీర్వచనాలు కల్పించనున్నారు. కుంభాభిషేకం అనంతరం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించనున్నారు. భక్తులందరికీ విస్తృత స్థాయిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాత్రి 10 గంటలకు తిరుపమల తిరుపతి దేవస్థానం వారి ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ పవిత్ర వేడుకలకు భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని గ్రామ సర్పంచ్, శ్రీరామ సేవా సమితి సభ్యులు, గ్రామ ప్రజలు ఆహ్వానిస్తున్నారు.

తిరుపతి

శ్రీరామనవమి వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించిన ముక్కంటి ఆలయ ఈఓ

శ్రీకాళహస్తి, మార్చి 24 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిలో శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థాన యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ పట్టాభి రామస్వామి వారి ఆలయంలో జరగనున్న సీతారాముల కళ్యాణోత్సవ ఏర్పాట్లను ముక్కంటి ఆలయ కార్యనిర్వహణాధికారి భాస్కర్ రెడ్డి మంగళవారం నాడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈఓ భాస్కర్ రెడ్డి ఆలయ అధికారులతో కలిసి ఆలయ పరిసరాలను కలియతిరిగారు. కళ్యాణోత్సవానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. స్వామివారి కళ్యాణ వేడుకలు కనులపండువగా జరిగేలా విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ…. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టాభిరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, సీతారాముల కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో ఘనంగా రాష్ట్ర హోం మంత్రి జన్మదిన వేడుకలు-శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి, మార్చి 24 (పున్నమి న్యూస్): రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత జన్మదిన వేడుకలు మంగళవారం నాడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. స్థానిక పార్టీ కార్యాలయంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఈ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కేక్ కట్ చేసి, హోం మంత్రికి తన ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో హోం మంత్రి అనిత అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. కూటమి ప్రభుత్వంలో మహిళా సాధికారతకు, ప్రజా రక్షణకు ఆమె అంకితభావంతో చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆమె నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు విజయకుమార్, ఇతర ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొని హోం మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో పారిశుద్ధ్యానికి బలం – సిఎస్‌ఆర్ నిధులతో గార్బేజ్ ఆటోలు ప్రారంభం

శ్రీకాళహస్తి, మార్చి 24 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపర్చే దిశగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కీలక చర్యలు చేపట్టారు. కోక కోలా సంస్థ సిఎస్‌ఆర్ నిధులతో రూ. 12 లక్షల వ్యయంతో మూడు గార్బేజ్ ఆటోలను మంగళవారం నాడు ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా సుదీర్ రెడ్డి మాట్లాడుతూ… సామాజిక బాధ్యతతో ప్రాంత అభివృద్ధికి సహకరిస్తున్న సంస్థలను అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని మౌలిక వసతులు కల్పించి శ్రీకాళహస్తిని ఆదర్శప్రాయ ప్రాంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తి మండలంలోని కాపుగున్నేరి, చెర్లోపల్లి, తొండమనాడు గ్రామాలకు ఒక్కొక్కటి చొప్పున ఒక్కో వాహనం విలువ రూ. 4 లక్షలు ఈ ఆటోలను కేటాయించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం ద్వారా గ్రామాల్లో పరిశుభ్రతను పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమనీ ప్రజలు కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన వాతావరణం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

తిరుపతి

తిరుమల పవిత్రత దెబ్బతీశారంటూ వైసీపీపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆగ్రహం

శ్రీకాళహస్తి, మార్చి 24 (పున్నమి న్యూస్): తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. వైసీపీ పాలనలో తిరుమల ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలు చోటుచేసుకున్నాయని ఆయన ఆరోపించారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో అన్యమత ప్రచారం, డిక్లరేషన్ వంటి కీలక అంశాలపై స్పందించని వైసీపీ నాయకులు, ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత మతపరమైన అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో టీటీడీ వ్యవహారాల నిర్వహణపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. తిరుమల క్షేత్ర గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యతను విస్మరించారని, కొన్ని నిర్ణయాలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కొన్నారు. తిరుమలలో ప్రసాదాల నాణ్యత, నిర్వహణలో లోపాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన, స్వామివారి ఆస్తుల పరిరక్షణలో కూడా గత పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. అలాగే తప్పుడు ప్రచారాలు, డీప్‌ఫేక్ వీడియోల ద్వారా రాజకీయ లాభాలు పొందాలని ప్రయత్నించడం తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఇప్పటికే అబద్ధాలను గుర్తించి తగిన తీర్పు ఇచ్చారని, భవిష్యత్తులో కూడా ఇటువంటి చర్యలకు గట్టి సమాధానం ఇస్తారని ఆయన స్పష్టం చేశారు. తిరుమల పవిత్రత, భక్తుల విశ్వాసాన్ని కాపాడటం కూటమి ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.