Saturday, 25 April 2026

Blog

తిరుపతి

ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడటమే ప్రధాన ధ్యేయమన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి, మార్చి 24 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం నాడు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించి, వారి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. ప్రతి విన్నపాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కారం కల్పించేలా చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…కూటమి ప్రభుత్వంలో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడటమే తమ ప్రధాన ధ్యేయమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేసి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

తిరుపతి

గ్రామ దేవతల కుంభాభిషేక మహోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి, మార్చి 24 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఊరందూరు గ్రామంలో మంగళవారం నాడు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రామ దేవతలు శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి, శ్రీ శ్రీ అంకమ్మ తల్లి, శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు కుంభాభిషేక మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా జరిగిన ఈ వేడుకను భక్తులు కనులారా వీక్షించారు.ఈ కుంభాభిషేక కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన కుటుంబ సమేతంగా విచ్చేశారు. యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఆలయ కమిటీ చైర్మన్ జంగాలపల్లి తులసీరామిరెడ్డి ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ మర్యాదలతో పండితులు ఆశీర్వచనం అందించగా, చైర్మన్ అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బొజ్జల బృందమ్మ, వ్యవసాయ మార్కెట్ కమిటి అద్యక్షులు రంగినేని చెంచయ్య నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు నీలకంఠ రెడ్డి, రామిరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు పాల్గొని అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ వారు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.

తిరుపతి

ఏపీలో భారీ ఉక్కు ప్రాజెక్ట్‌కు శ్రీకారం – లక్ష ఉద్యోగాలకు దారి, లోకేష్ కార్యదక్షతకు ప్రశంసలు

శ్రీకాళహస్తి, మార్చి 24 (పున్నమి న్యూస్): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా. యం. ఉమేష్ రావు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్‌కు భూమిపూజ జరగడం రాష్ట్రానికి శుభపరిణామమని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి కొత్త దిశ ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. సుమారు రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో ఇది దేశంలో ప్రముఖ ప్రాజెక్ట్‌గా నిలవనుందని చెప్పారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా యువతలో నమ్మకాన్ని నారా లోకేష్ నిలబెట్టారని కొనియాడారు. కేవలం ఉద్యోగాలు మాత్రమే కాకుండా, యువతకు స్థిరమైన కెరీర్, భవిష్యత్తును అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ స్థాపనకు భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది కేవలం ఉక్కు పరిశ్రమ కాకుండా భవిష్యత్తులో “స్టీల్ సిటీ”గా అభివృద్ధి చెందే కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.జి.దశరథాచారి,వన్నెకుల క్షత్రియ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి,గిరిజన సలహా మండలి సభ్యులు యం.సుబ్బయ్య, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు,తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్‌ కోట చంద్రశేఖర్,తిరుపతి పార్లమెంటు నాయకుడు గంగనపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

దేశ ప్రజలు సిద్ధంగా ఉండాలి ప్రధాని మోదీ

దేశ ప్రజలు సిద్ధంగా ఉండాలి ప్రధాని మోదీ పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశ ప్రజలు ఎలాంటి ఛాలెంజ్‌కైనా సిద్ధంగా ఉండాలని రాజ్యసభ వేదికగా PM మోదీ పిలుపునిచ్చారు. వార్ ఇంపాక్ట్ చాలా కాలం ఉంటుందన్నారు. అయితే ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. కరోనా సమయంలో చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వాలు జట్టుగా పనిచేసి ఈ సంక్షోభం నుంచి బయటపడాలని కోరారు. వలస కార్మికులను కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని మోదీ సూచించారు.

పల్నాడు

కార్పొరేట్ సంస్థ కనికరం చూపలేదు

ఒకవైపు పుట్టబోయే బిడ్డ గురించి ఆందోళన.. మరోవైపు ఆఫీసు నిబంధనలు. వైద్యులు బెడ్ రెస్ట్ అవసరమని పదేపదే హెచ్చరిస్తున్నా.. ఆ కార్పొరేట్ సంస్థ కనికరం చూపలేదు. ఇంటి నుంచి పని చేస్తా అని వేడుకున్నా.. ఆఫీసుకి రావాల్సిందే అని హుకూం జారీ చేసింది. ఆ మొండితనమే చివరకు ఓ పసిప్రాణాన్ని బలితీసుకుంది. బిడ్డను కోల్పోయిన ఓ తల్లి ఆవేదనకు.. మానవత్వం మరిచి ప్రవర్తించిన ఆ దిగ్గజ సంస్థకు బుద్ధి చెబుతూ.. కోర్టు ఇప్పుడు అక్షరాలా రూ.210 కోట్ల పరిహారంతో తీర్పు ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్

త్వరలోసర్వీస్ రోడ్డుకు మోక్షం రానుంది—టికేఆర్ కమాన్ నుండి మల్లమ్మ వరకు సర్వీస్ రోడ్ అందుబాటులోకి

పున్నమి ప్రతినిధి సంగి శెట్టి ధనుంజయ మార్చ్స 24:బడగ్పేట్ సర్కిల్ జిల్లెలగూడ 59వ, డివిజన్ లోని టీకేఆర్ కామన్ నుండి గాయత్రి నగర్ మందమల్లమ్మ చౌరస్తా వరకు మరియు గాయత్రి నగర్ అపోలో ఫార్మసీ , నుండి కెనరా బ్యాంకు వారకు సర్వీస్ రోడ్డు పూర్తిగా ఆక్రమణకు గురైందని కొత్తగా డ్రైనేజ్ లైన్ కి మోక్షం రానుంది సర్వీస్ రోడ్డు వేసి ప్రజలకు ఉపయోగపడేలా చేయమని పలుమార్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి ట్రాఫిక్ డీసీపీ కి,మీర్పేట్ మున్సిపల్ కమిషనర్ కి, శంషాబాద్ జోనల్ కమిషనర్ చంద్రకళ కి ఫెడరేషన్ తరుపున కంప్లైంట్ ఇచ్చి సమస్యను ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వంటేరు నర్సింహ్మ రెడ్డి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి వర్కింగ్ ప్రసిడెంట్ ఆంజనేయులు ట్రెజరర్ నాగేశ్వరరావు వెంకటయ్య ప్రేమ్ చందర్ రెడ్డి పని కిరాన్ కాలనీల ప్రజలు వాహనదారులు పడుతున్న ఇబ్బందులను మేడం కి వివరించగా వెంటనే స్పందించి సంబంధిత అధికారికి సమస్యను పరిశీలించమని బడంగ్పేట్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ కిరణ్ గారికి ఆదేశించడం జరిగింది ఈరోజు టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కిరణ్ గారు టి కె ఆర్ కామన్ నుండి మంద మల్లమ్మ చౌరస్తా వరకు ఉన్న సర్వీస్ రోడ్డును మరియు గాయత్రి నగర్ ఎక్స్ రోడ్ నుండి కృష్ణ హాస్పిటల్ వరకు ఆక్రమించిన రోడ్డును పరిశీలించి వ్యాపారస్తులకు 2, రోజుల్లో తొలగించమని చెప్పడం జరిగినది లేనియెడల శనివారం జేసీబీ సహాయంతో అన్ని తొలగిస్తానని వాళ్లకు అధికారులు వార్నింగ్ ఇవ్వడం జరిగింది

కడప

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలో 16 సిలిండర్లు స్వాధీనం

ప్రొద్దుటూరులో వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్న 16 డొమస్టిక్ గ్యాస్ సిలిండర్లను అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. మంగళవారం పొద్దుటూరు ఎన్ఫోర్స్మెంట్ డీటీ శివప్రసాద్ ఆధ్వర్యంలో 4 టీములుగా పట్టణంలోని రెస్టారెంట్లు, హోటల్లు, బేకరీలు టీ స్టాళ్లలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 16 సిలిండర్లు సీజ్ చేశారు. వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

E-పేపర్

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో సమావేశమైన ప్రొఫెసర్ కోదండరాం

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో సమావేశమైన ప్రొఫెసర్ కోదండరాం పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 24 మార్చి 2026 ఫార్మా సిటీ మరియు గ్రీన్ ఫీల్డ్ హైవే భూ బాధితుల సమస్యల పరిష్కారానికి సంబంధించి తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి కలిసి చర్చించారు. ఈ సందర్భంగా భూ సేకరణలో నష్టపోయిన రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గత ప్రభుత్వంలో జరిగిన బలవంతపు భూ సేకరణ వల్ల నష్టపోయిన రైతులకు తగిన న్యాయం జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. వివాదాల్లో ఉన్న భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు నష్టపరిహారం అందించాలని కోరారు. అలాగే ఫార్మా సిటీ భూసేకరణ జరిగిన కుర్మిద్ద, తాటిపర్తి, నానక్‌నగర్, మేడిపల్లి గ్రామాలను సందర్శించి రైతులతో సమావేశమై వారి గ్రామాల సమస్యలను తెలుసుకోవాలని కలెక్టర్ ని కోరారు. ఈ విషయాలపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి, త్వరలో రైతులతో సమావేశమై సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె వినయ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దారా సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త రవి, కార్యదర్శులు సామ నిరంజన్, నాగని రామకృష్ణ మరియు బాధిత గ్రామాల రైతులు పాల్గొన్నారు.

E-పేపర్

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో సమావేశమైన ప్రొఫెసర్ కోదండరాం

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో సమావేశమైన ప్రొఫెసర్ కోదండరాం పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 24 మార్చి 2026 ఫార్మా సిటీ మరియు గ్రీన్ ఫీల్డ్ హైవే భూ బాధితుల సమస్యల పరిష్కారానికి సంబంధించి తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి కలిసి చర్చించారు. ఈ సందర్భంగా భూ సేకరణలో నష్టపోయిన రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గత ప్రభుత్వంలో జరిగిన బలవంతపు భూ సేకరణ వల్ల నష్టపోయిన రైతులకు తగిన న్యాయం జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. వివాదాల్లో ఉన్న భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు నష్టపరిహారం అందించాలని కోరారు. అలాగే ఫార్మా సిటీ భూసేకరణ జరిగిన కుర్మిద్ద, తాటిపర్తి, నానక్‌నగర్, మేడిపల్లి గ్రామాలను సందర్శించి రైతులతో సమావేశమై వారి గ్రామాల సమస్యలను తెలుసుకోవాలని కలెక్టర్ గారిని కోరారు. ఈ విషయాలపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి, త్వరలో రైతులతో సమావేశమై సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె వినయ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దారా సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త రవి, కార్యదర్శులు సామ నిరంజన్, నాగని రామకృష్ణ మరియు బాధిత గ్రామాల రైతులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జనసేన సభ్యత్వ నమోదు ముమ్మరం – మండలంలో 1000 మంది నమోదు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి) మనుబోలుమండలంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతోందని మండల అధ్యక్షుడు ప్రసాద్ తెలిపారు. మంగళవారం చంద్రమౌళి నగర్, గిరిజన కాలనీ, కోదండరాంపురం ప్రాంతాల్లో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఇప్పటికే 1000 మందిని సభ్యులుగా నమోదు చేశామని వెల్లడించారు. సభ్యత్వం ద్వారా కార్యకర్తలకు భరోసా, బీమా సదుపాయం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో పెనుబాక మహేష్, జాకీర్ ఖాదర్ వలీ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.