Saturday, 25 April 2026

Blog

కడప

ప్రొద్దుటూరు: గుండెపోటుతో టీచర్ మృతి

ప్రొద్దుటూరు వైవీఎస్ మున్సిపల్ పాఠశాలలో 10th పరీక్షల విధుల్లో ఉండగా సోమవారం ఉపాధ్యాయుడు గురునాథ్ గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. సోమవారం పరీక్షల ఆన్సర్ షీట్లను పోస్టాఫీసు తీసుకు వెళ్తుండగా.. గాంధీరోడ్డులో గుండెపోటు వచ్చి పడిపోయాడు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వెలిగండ్లలో విపిఆర్ నేత్ర సేవా శిబిరం – ఉచిత కంటి పరీక్షలు, అద్దాల పంపిణీ

కొండాపురం మండలం వెలిగండ్ల గ్రామంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విపిఆర్ నేత్ర సేవా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒకేచోట ఆధునిక పరికరాలతో కంటి పరీక్షలు నిర్వహించడం, అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు అందించడం అభినందనీయం అని పేర్కొన్నారు. ఈ శిబిరం ద్వారా కంటి సమస్యలతో బాధపడుతున్న అనేక మందికి నిపుణులైన వైద్యులు తగిన సూచనలు, సలహాలు అందిస్తున్నారు. అలాగే, శస్త్రచికిత్సలు అవసరమైన వారికి వాటిని నిర్వహించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమానికి మరింత విశిష్టతను తీసుకొచ్చింది. “సర్వేంద్రియానాం నయనం ప్రధానం” అన్న నానుడిని సార్థకం చేస్తూ, ప్రజల చూపు సంరక్షణకు కృషి చేస్తున్న ఈ సేవా కార్యక్రమం గ్రామీణ ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతోంది. ఈ సందర్భంగా నిర్వాహకులను పలువురు హృదయపూర్వకంగా అభినందించారు. 👁️

ఆంధ్రప్రదేశ్

అనంతపురం RDTకి హోంశాఖ లైన్‌క్లియర్!

FCRA అనుమతులు మంజూరు చేసినట్లు సమాచారం.ఈ మేరకు RDTకి కేంద్ర హోంశాఖ సమాచారం.రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టు(RDT)’ పేరుతో అనంతపురం జిల్లాలో పలు వైద్య, సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న RDT సంస్థ.మత మార్పిడిలకు పాల్పడుతున్నారంటూ సంస్థపై ఆరోపణలతో, ఏడాది క్రితం FCRA అనుమతులు నిలిపివేసిన కేంద్రం.ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన కేంద్ర హోంశాఖ.సంస్థ మత మార్పిడిలకు పాల్పడలేదని కేంద్ర హోంశాఖకు తెలిపిన రాష్ట్ర ప్రజాప్రతినిధులు.రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి, సీఎం ప్రత్యక్ష పర్యవేక్షణతో అనుమతులు మంజూరు చేసిన కేంద్ర హోంశాఖ.ఇకనుంచి RDTకి విదేశీ నిధులు పొందే అవకాశం కల్పించిన కేంద్రం.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విప్లవ వీరులకు ఘన నివాళి: ఓపిడిఆర్

ఓపీఢీఆర్ (OPDR) ఆధ్వర్యంలో, ఏపిటీఎఫ్ ఆల్ ఇండియా నాయకులు కేతా సుబ్బారెడ్డి, అడ్వొకేట్ శివకుమార్ తదితరులు విప్లవ వీరుల త్యాగాలను స్మరించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు . సమాజంలో విప్లవ పోరాటాలు, ప్రజా హక్కుల కోసం వీరు చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తుచేశారు. యువతలో చైతన్యం పెంపు లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది. , ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని తక్షణం ఆపాలని, ప్రజా హక్కుల రక్షణ, శాంతి కోసం అంతర్జాతీయ జోక్యం కోరారు. స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, వీరుల సేవలను శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలని పేర్కొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విప్లవ వీరులకు ఘన నివాళి: ఓపిడిఆర్

ఓపీఢీఆర్ (OPDR) ఆధ్వర్యంలో, ఏపిటీఎఫ్ ఆల్ ఇండియా నాయకులు కేతా సుబ్బారెడ్డి, అడ్వొకేట్ శివకుమార్ తదితరులు విప్లవ వీరుల త్యాగాలను స్మరించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు . సమాజంలో విప్లవ పోరాటాలు, ప్రజా హక్కుల కోసం వీరు చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తుచేశారు. యువతలో చైతన్యం పెంపు లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది. , ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని తక్షణం ఆపాలని, ప్రజా హక్కుల రక్షణ, శాంతి కోసం అంతర్జాతీయ జోక్యం కోరారు. స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, వీరుల సేవలను శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలని పేర్కొన్నారు.

సూర్యాపేట

మున్సిపల్ ‘కోఆప్షన్’పై.. పొలిటికల్ హీట్.. ! మైనారిటీ కోటాకు గట్టి పోటీ.. నేతల చుట్టూ ఆశావహుల ప్రసన్నం ప్రదక్షిణలు..

సూర్యాపేట మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల నియామకంపై రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. మున్సిపల్ పాలకవర్గం కొలువు -దీరడంతో ఆశావహులందరూ కో-ఆప్షన్ పదవులపై దృష్టి సారించారు. *గత నెల 16న సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మెన్, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన విషయం తెల్సిందే.. ముఖ్యంగా మైనారిటీ కోటాకు సంబంధించిన కో-ఆప్షన్ పదవికి గట్టి పోటీ నెలకొన్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తెలంగాణ మున్సిపల్ చట్టం- 2019 ప్రకారం మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యులను -నియమించాల్సి ఉంటుంది. పాలకవర్గం ఏర్పడిన 60 రోజుల్లోపు మున్సిపల్ కమిషనర్ నోటిఫికేషన్ -విడుదల చేసి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలి. కౌన్సిలర్లతో సమాన హోదా కలిగిన ఈ సభ్యులు కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అయితే చైర్మెన్, వైస్ చైర్మెన్ -ఎన్నికల్లో వీరికి ఓటు హక్కు ఉండదు. సూర్యాపేట మున్సిపాలిటీలో నలుగురు కో-ఆప్షన్ సభ్యులను ఎంపిక చేయనున్నారు. వీరిలో మైనారిటీ వర్గానికి ఇద్దరు, జనరల్ కేటగిరీలో ఇద్దరు ఉండగా, మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించనున్నారు. ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలు, సామాజిక సేవలో అనుభవం ఉన్న మహిళలు, పట్టణ ప్రణాళిక లేదా ప్రభుత్వ విభాగాల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉండనుంది. ముస్లిం మైనారిటీ కోటా నుండి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజద్ అలీ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, వక్స్ బోర్డు ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ వైస్ చైర్మెన్ అబూబకర్ సిద్దిక్, సీనియర్ నాయకులు ఖాజా ఇస్రార్ అహ్మద్, మన్సూర్ ఆర్టిస్ట్, ఖమ్రుద్దీన్, నీడ్స్ సాజిద్, గౌస్ తదితరులు పోటీలో ఉన్నారు. వీరిలో సీనియర్ నాయకులు, పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసినవారు ఉండటంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో పలువురు ఆశావహులు ఏఐసీసీ చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో కొందరికి కో-ఆప్షన్ పదవులు ఇస్తామని హామీలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. టికెట్ రాని వారు, పోటీ నుంచి తప్పుకున్న వారు, రిజర్వేషన్ల కారణంగా అవకాశం కోల్పోయిన సీనియర్లు ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కో-ఆప్షన్ సభ్యుల ఎంపికలో పోటీ అధికంగా ఉంటే కౌన్సిలర్లతో ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. కానీ ఆ పరిస్థితి ఉండదని తెలుస్తోంది. ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ వర్గాలకు చెందిన వారు, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న మహిళలు, పురపాలనలో అనుభవం, నైపుణ్యం కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ లేదా పట్టణ ప్రణాళిక విభాగంలో పని చేసి గెజిటెడ్ అధికారి హోదాలో రిటైర్డు అయిన ఉద్యోగులు కో-ఆప్షన్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లోని సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులుగా ఐదేళ్లు పని చేసిన వారూ అర్హులే అవుతారు. ఇదిలావుండగా ప్రభుత్వం ట్రాన్స్ జెండర్లో ఒకరికి ఇవ్వాలని భావిస్తోంది. ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్తో సమాన హోదా కో-ఆప్షన్ సభ్యులకు ఉంటుంది. కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉండడంతో ఈ పదవికి డిమాండ్ ఏర్పడింది. పాలకవర్గం ఉన్నంత వరకు పదవిలో ఉంటారు. పాలన, సమస్యలపై చర్చించే వీలుంటుంది. కానీ అభివృద్ధి పనులు తీర్మానంలో వీరి పాత్ర ఉండదు. సభ్యులు వరుసగా మూడు సమావేశాలకు హాజరు కాని పక్షంలో సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంటుంది. గౌరవ వేతనం కూడా ఉంటుంది. కో-ఆప్షన్ పదవి దక్కాలంటే కౌన్సిల్ ఓటరు జాబితాలో ఓటు హక్కు కలిగి ఉండి 21 సంవత్సరాలు దాటిన వారు అర్హులు అవుతారు. మొత్తంగా సూర్యాపేట మున్సిపాలిటీలో కో-ఆప్షన్ పదవుల కోసం రాజకీయంగా తీవ్ర పోటీ నెలకొనగా, తుది నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది.

అమరావతి

లోకేష్ సిఎం రూమర్స్ – అసలు కథ ఏమిటి?

రాష్ట్రంలో లోకేష్‌ను ముఖ్యమంత్రిగా చేస్తారన్న ప్రచారం ఉగాది ముందు సోషల్ మీడియాలో హోరెత్తింది. టిడిపి, వైకాపా, బిజెపి అనుకూల యూట్యూబ్ ఛానెల్స్ ఈ వార్తను విస్తృతంగా ప్రచారం చేశాయి. అయితే ఉగాది గడిచినా అది నిజం కాలేదు. ఈ ప్రచారం వెనుక ప్రధానంగా బిజెపి సోషల్ మీడియా హ్యాండిల్స్ పాత్ర ఎక్కువగా ఉందని తెలుస్తోంది. కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించడమే లక్ష్యమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వైకాపా కూడా దీనిని బలంగా వినియోగించుకుంది. టిడిపి, జనసేన నేతలు మాత్రం అధికారికంగా స్పందించకుండా మౌనం పాటించడం గమనార్హం.

అన్నమయ్య

హోమ్ మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోం వ్యవహారాలు & విపత్తు నిర్వహణ శాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత అక్కకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..💐💐 మీ..*శ్రీరామ్ చినబాబు* రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు

ఆంధ్రప్రదేశ్

IJU 11వ ప్లీనరీకి విజయవాడ సిద్ధం

విజయవాడ (పున్నమి ప్రతినిధి): ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) 11వ ప్లీనరీ సమావేశాలు మార్చి 27, 28, 29 తేదీల్లో విజయవాడలో ఘనంగా నిర్వహించబడనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు ఈ మహాసభలో పాల్గొననున్నారు. జర్నలిస్టుల హక్కులు, వృత్తి పరిరక్షణ, మీడియా స్వేచ్ఛ, నూతన సాంకేతిక మార్పులపై చర్చలు జరగనున్నాయి. ప్రముఖ మీడియా ప్రతినిధులు, నాయకులు, నిపుణులు పాల్గొని కీలక అంశాలపై అభిప్రాయాలు పంచుకోనున్నారు. ఈ సమావేశాలు జర్నలిస్టుల ఐక్యతను బలపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు తెలిపారు. విజయవాడ నగరం ఈ వేడుకకు సిద్ధమై సందడి వాతావరణాన్ని సంతరించుకుంది.

ఆంధ్రప్రదేశ్

వారిపై చర్య తీసుకోవాలి: గ్యాస్ సిలిండర్ బ్లాక్ మార్కెటింగ్‌పై ప్రధాని

మధ్యప్రాచ్య యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. దేశవ్యాప్తంగా సుమారు 12,000 దాడులు నిర్వహించగా, 15,000కు పైగా గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సహజ వాయువుల మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.