Saturday, 25 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ఈ నెల 28 వరకు వర్షాలు కొనసాగనున్నాయి!

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 28వ తేదీ వరకు కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఇవాళ SKLM, VZM, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, NTR, GNT జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA చెప్పింది. మిగతా జిల్లాల్లోనూ జల్లులు పడతాయని అంచనా వేసింది

E-పేపర్

నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. నన్ను పాస్ చేయండి సార్

నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. నన్ను పాస్ చేయండి సార్ పున్నమి న్యూస్ తెలంగాణ 23 మార్చి 2026 నేను చదువుకున్నవి పరీక్షలో రాలేదు, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా.. మీరే నా దేవుడు సార్ ఇంటర్ పరీక్షల్లో ఒక విద్యార్థి మూల్యాంకుడిని వేడుకుంటూ రాసిన లేఖ వైరల్

E-పేపర్

దేవాలయ నిర్మాణానికి 50,000/- రూపాయల విరాళం..!!*

*దేవాలయ నిర్మాణానికి 50,000/- రూపాయల విరాళం..!!* పున్నమి న్యూస్ 23 మార్చి 2026 తెలంగాణ.. 9640204826 మన లెక్చరర్స్ కాలనీ డివిజన్ పరిధిలోని హయత్ నగర్ ప్రాంతం *శ్రీరామ్ నగర్* కాలనీలో నిర్మితమవుతున్న *శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయ* నిర్మాణానికి ఇచ్చిన మాట ప్రకారం మా *జక్కిడి చారిటబుల్ ట్రస్ట్* తరపున *50,000/- రూపాయలు (అక్షరాల యాభై వేలు)* విరాళంగా ఇవ్వడం జరిగింది. ఆధ్యాత్మిక సేవను పరమోన్నత ధర్మంగా భావిస్తూ, మా జక్కిడి చారిటబుల్ ట్రస్ట్ తరపున ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించడం ఎంతో ఆనందంగా ఉంది. భగవంతుడి దయ కటాక్షాలు అందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి , నాగార్జున రెడ్డి , మహేష్ రెడ్డి , రాజు , కేశవ్ , ఉమా మహేశ్వర్ రావు , కాలనీ సంక్షేమ సంఘం వారు, ఆలయ కమిటీ వారు తదితరులు పాల్గొన్నారు. *జక్కిడి రఘువీర్ రెడ్డి* *చైర్మన్ – జక్కిడి చారిటబుల్ ట్రస్ట్* *సీనియర్ నాయకులు – BRS పార్టీ* *ఎల్.బి.నగర్*

ఖమ్మం

జిల్లా వ్యాప్తంగా బీజేపీ నేతల అరెస్టులు – చలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో ఉద్రిక్తత

ఖమ్మం, మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రకటించిన “చలో అసెంబ్లీ” కార్యక్రమం నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం అర్థరాత్రి నుంచే ఖమ్మం నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురు నేతలను వారి నివాసాల వద్దనే అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు సమాచారం. బీజేపీ శ్రేణులు ఈ అరెస్టులను అక్రమంగా అభివర్ణిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు, శాంతిభద్రతల దృష్ట్యా ముందస్తు చర్యల భాగంగా ఈ అరెస్టులు చేసినట్లు పోలీసులు తెలిపారు

సాహితీ

జలం మన బలం – డా. బద్రి పీర్ కుమార్

ప్రతి సంవత్సరం మార్చి 22న ‘ప్రపంచ జల దినోత్సవం’ జరుపుకుంటాము. మానవ జీవనానికి నీటి ఆవశ్యకతను తెలియజేయడం, మంచినీటి వనరుల సంరక్షణపై అవగాహన కల్పించటం ఈ దినం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేని బిలియన్ల మంది ప్రజల సమస్యలను పరిష్కరించడం మరియు 2030 నాటికి అందరికీ నీరు, పారిశుధ్యం అందించాలనే సుస్థిర అభివృద్ధి లక్ష్యం తో 1992లో రియోడిజెనీరోలో జరిగిన పర్యావరణ సదస్సులో చేసిన ప్రతిపాదన మేరకు, ఐక్యరాజ్యసమితి 1993 నుంచి ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచ జల దినోత్సవం ‘నీరు, మహిళలు మరియు లింగ సమానత్వం’ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది 2026 థీమ్ నిర్వహించబడుతున్నది. నీటి సంక్షోభం మహిళలపై చూపే ప్రభావం మరియు నీటి యాజమాన్యంలో వారి భాగస్వామ్యంపై ఈ థీమ్ దృష్టి పెడుతున్నది. ఈ సందర్భంగా జలం మన బలం అనే ఈ కవితాశీర్షిక ప్రాణికోటికి నివాసం భూగోళం నీలవర్ణంతో ఆవరించింది జలం నీరు సకల జీవరాశికి మూలం మేఘఆగమననేస్తం ఉపరితలం జలవనరులకు కేటాయించు స్థలం ఇది ప్రకృతి చక్రీయఆకృతిలోని కాలం నీటిలబ్ధితో మానవ మనుగడ నిశ్చలం నీటి మార్గాల సంరక్షణే భావిఫలం అవనిపై శుద్ధినీటిక్షేత్రాల పరిరక్షకులం హరితావరణపోషనే గంగాప్రవాహశీలం ఆటంకదారులకు మనమే త్రిశూలదారులం ముందుచూపుతో రాదు జలకళకు కలకలం మేఘం వర్షిస్తే నదుల నాట్య విన్యాసం పర్యావరణస్వీకృతి సంరక్షణ దరహాసం నవీనయుగంలో ప్రకృతితో సహవాసం నిరంతరం సంబరమే భూగ్రహ ఆవాసం పశుసంపద ప్రమాణానికి అవసరం గ్రాసం జీవుల చలన సంపత్తికి ఆహార విలాసం సహజవనరుల స్నేహాత్మక సంతోషం జలామృత నిల్వకు నిరంతర అభ్యాసం హరిత ఆహ్లాద వాతావరణం కోసం వనవాసాల్లేని మధుమాసం కోసం జలారాధన జీవసంరక్షణ మనిషి మనుగడకు నిత్య ఆలంబన అన్నిటికి మించి జలం మన బలం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు బీఎస్పీ మహిళ కన్వీనర్‌గా కలువాయి లక్ష్మి నియామకం

ఆత్మకూరు నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ బలోపేతానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. బండ్లపల్లి గ్రామానికి చెందిన కలువాయి లక్ష్మిని ఆత్మకూరు నియోజకవర్గ మహిళ కన్వీనర్‌గా నియమించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర మహిళ కన్వీనర్ కాకుటూరు పుష్పాంజలి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కలువాయి లక్ష్మి బీఎస్పీ పార్టీలో చేరారు. కార్యక్రమంలో నెల్లూరు జిల్లా బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పుష్పాంజలి గారు సూచించగా, బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని లక్ష్మి హామీ ఇచ్చారు. స్థానిక నాయకులు ఆమె నియామకాన్ని స్వాగతించారు.

ఖమ్మం

బుదాన్ నిర్వాసితులకు బీజేపీ అండ ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు కేటాయించే వరకు పోరాటం కొనసాగిస్తామని హామీ:

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఇప్పటికీ ఇళ్ల స్థలాలు కేటాయించని బుదాన్ నిర్వాసితులకు అండగా భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చింది. రాష్ట్ర నాయకులు, కోశాధికారి శ్రీ దేవకి వాసుదేవరావు ఆధ్వర్యంలో వారి క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో, వెలుగుమట్లలో ఇళ్ల స్థలాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇల్ల స్థలాలు మరియు ఇల్లు కేటాయించే వరకు బీజేపీ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు నగిరికంటి వీరభద్రం, రాష్ట్ర నాయకులు సన్నే ఉదయ్ ప్రతాప్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాస్, సీనియర్ నాయకులు వక్కలంక సుబ్రహ్మణ్యం, డోగుపర్తి రవీందర్, మార్తి వీరభద్రప్రసాద్, రుద్ర ప్రదీప్, బోయినపల్లి చంద్రశేఖర్, నల్ల మాస శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వీనర్ కందుల శ్రీకృష్ణ, రమేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే అర్బన్ మండల ప్రధాన కార్యదర్శి ఆచంటి కోటేశ్వరరావు, శ్రీ రామ్, ఖమ్మం రెండో పట్టణ ప్రధాన కార్యదర్శి రుద్రగాని మాధవ్‌తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఖమ్మం

బుదాన్ నిర్వాసితులకు బీజేపీ అండ ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు కేటాయించే వరకు పోరాటం కొనసాగిస్తామని హామీ:

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఇప్పటికీ ఇళ్ల స్థలాలు కేటాయించని బుదాన్ నిర్వాసితులకు అండగా భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చింది. రాష్ట్ర నాయకులు, కోశాధికారి శ్రీ దేవకి వాసుదేవరావు ఆధ్వర్యంలో వారి క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో, వెలుగుమట్లలో ఇళ్ల స్థలాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇల్ల స్థలాలు మరియు ఇల్లు కేటాయించే వరకు బీజేపీ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు నగిరికంటి వీరభద్రం, రాష్ట్ర నాయకులు సన్నే ఉదయ్ ప్రతాప్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాస్, సీనియర్ నాయకులు వక్కలంక సుబ్రహ్మణ్యం, డోగుపర్తి రవీందర్, మార్తి వీరభద్రప్రసాద్, రుద్ర ప్రదీప్, బోయినపల్లి చంద్రశేఖర్, నల్ల మాస శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వీనర్ కందుల శ్రీకృష్ణ, రమేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే అర్బన్ మండల ప్రధాన కార్యదర్శి ఆచంటి కోటేశ్వరరావు, శ్రీ రామ్, ఖమ్మం రెండో పట్టణ ప్రధాన కార్యదర్శి రుద్రగాని మాధవ్‌తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బండారు శ్రీనివాస్ జన్మదినం ఘనంగా – పారిశుధ్య కార్మికులకు బట్టల పంపిణీ

కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా మోడేకుర్రు గ్రామంలో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మోడేకుర్రు పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బండారు శ్రీనివాస్ గారు ప్రజా సేవలో ఎప్పుడూ ముందుంటారని, ఆయన ఆదర్శాన్ని అందరూ అనుసరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నిరుపేద గిరిజన కుటుంబానికి మెట్టుకూరు బ్రదర్స్ ఆర్థిక సాయం

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కచేరి దేవరాయపల్లి గ్రామంలో నివసిస్తున్న ఒక నిరుపేద గిరిజన కుటుంబానికి మెట్టుకూరు బ్రదర్స్ ఆర్థిక సహాయం అందించారు. గ్రామంలో గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానిక జనసేన పార్టీ నేతలు భరత్, బీవీ రమణ మెట్టుకూరు బ్రదర్స్ దృష్టికి తీసుకెళ్లగా, వారు వెంటనే స్పందించి సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈరోజు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసి మానవతా భావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమం మెట్టుకూరు బ్రదర్స్ సహకారంతో టీడీపీ గ్రామ అధ్యక్షుడు బొల్లినేని ప్రభాకర్, అనంతసాగరం చెరువు వైస్ చైర్మన్ తిరుపతి కరివేటి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ సభ్యుడు కేవీ రమణయ్య, అంతిమ తీర్పు కృష్ణ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఈ సహాయంపై సంతోషం వ్యక్తం చేస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.