Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

మద్యం దుకాణాల రెన్యువల్‌కు మరో రెండు రోజులు.. 23 వరకు గడువు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి ఆనంద్ అమరావతి, సెప్టెంబర్ 21: ఏ4 మద్యం దుకాణాల యజమానుల విజ్ఞప్తి మేరకు 2026–27 సంవత్సరానికి దుకాణాల రెన్యువల్ గడువును ప్రభుత్వం మరో రెండు రోజులు పొడిగించింది.
  • దీంతో రెన్యువల్ ప్రక్రియను పూర్తి చేసుకునేందుకు సెప్టెంబర్ 23 వరకు అవకాశం కల్పించారు.
  • రాష్ట్రవ్యాప్తంగా 3,650 ఏ4 మద్యం దుకాణాలను నోటిఫై చేశారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్

అమరావతి, సెప్టెంబర్ 21: ఏ4 మద్యం దుకాణాల యజమానుల విజ్ఞప్తి మేరకు 2026–27 సంవత్సరానికి దుకాణాల రెన్యువల్ గడువును ప్రభుత్వం మరో రెండు రోజులు పొడిగించింది. దీంతో రెన్యువల్ ప్రక్రియను పూర్తి చేసుకునేందుకు సెప్టెంబర్ 23 వరకు అవకాశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,650 ఏ4 మద్యం దుకాణాలను నోటిఫై చేశారు. రెన్యువల్ ఆర్‌ఈటీ, దరఖాస్తు ఫీజు కింద రూ.933.44 కోట్ల డిమాండ్‌కు గాను సెప్టెంబర్ 21 రాత్రి 7.15 గంటల వరకు రూ.676 కోట్లు వసూలయ్యాయి. వార్షిక ఆర్‌ఈటీ కింద రూ.2,454.76 కోట్ల డిమాండ్ ఉండగా రూ.441 కోట్లు, పర్మిట్ రూమ్ ఆర్‌ఈటీ కింద రూ.249.15 కోట్లకు గాను రూ.62 కోట్లు వసూలయ్యాయి. మూడు విభాగాల కింద మొత్తం రూ.3,637.35 కోట్ల వార్షిక డిమాండ్ ఉండగా ఇప్పటివరకు రూ.1,179.63 కోట్లు వసూలైనట్లు అధికారులు వెల్లడించారు. మద్యం దుకాణాల యజమానుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని రెన్యువల్ గడువును ఈ నెల 23 వరకు పొడిగించినట్లు ప్రభుత్వం తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *