Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

జంపపాలెం కల నెరవేరింది.. శారదా నదిపై స్నాన ఘాట్‌కు శ్రీకారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జంపపాలెం కల నెరవేరింది.. శారదా నదిపై స్నాన ఘాట్‌కు శ్రీకారం

వార్త ముఖ్యాంశాలు

  • రూ.4.50 లక్షలతో నిర్మాణ పనులు ప్రారంభం: ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పున్నమి ప్రతినిధి ఆనంద్ :యలమంచిలి యలమంచిలి, సెప్టెంబర్ 21: జంపపాలెం గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది.
  • శారదా నదిపై రూ.4.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న స్నాన ఘాట్ మెట్లకు ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

రూ.4.50 లక్షలతో నిర్మాణ పనులు ప్రారంభం: ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

పున్నమి ప్రతినిధి ఆనంద్ :యలమంచిలి

యలమంచిలి, సెప్టెంబర్ 21: జంపపాలెం గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. శారదా నదిపై రూ.4.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న స్నాన ఘాట్ మెట్లకు ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జంపపాలెంలో శారదా నది గట్ల అభివృద్ధితో పాటు వారం రోజుల్లో రహదారి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో డ్రైనేజీలు, కాలువలు, చెరువుల పూడికతీత, రహదారులు, తాగునీటి వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు, గ్రామ ప్రజలు, యువకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *