Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

ఏటికొప్పాక లక్క బొమ్మల తయారీ కేంద్రాన్ని సందర్శించిన ఎన్జీవో సంఘాల నేతలు ..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏటికొప్పాక లక్క బొమ్మల తయారీ కేంద్రాన్ని సందర్శించిన ఎన్జీవో సంఘాల నేతలు ..

వార్త ముఖ్యాంశాలు

  • ​యలమంచిలి :మండలంలోని ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ జేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి.
  • రమణ శనివారం యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో పర్యటించారు.
  • ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.

​యలమంచిలి :మండలంలోని ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ జేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి. రమణ శనివారం యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్. రవిశంకర్, అనకాపల్లి ఏపీ ఎన్జీవో అధ్యక్షులు పీలా రవితో కలిసి వారు ప్రముఖ హస్తకళాకారుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత శ్రీశైలపు చిన్నాయాచారికి చెందిన లక్క బొమ్మల తయారీ కేంద్రాన్ని సందర్శించారు. ​అనంతరం వారు లక్క బొమ్మల తయారీ విధానాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక హస్తకళాకారులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాకారులు తెలిపిన సమస్యలపై నేతలు సానుకూలంగా స్పందిస్తూ, వాటిని సంబంధిత ఉన్నతాధికారులు మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో యలమంచిలి తాలూకా యూనిట్ ఏపీ ఎన్జీవో ఉపాధ్యక్షులు బండారు ప్రేమ్ కుమార్, నక్కపల్లి ఏపీ ఎన్జీవో అధ్యక్షులు శ్రీనుతో పాటు పలువురు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *