వార్త ముఖ్యాంశాలు
- యలమంచిలి మున్సిపాలిటీ రెండో సాధారణ ఎన్నికల్లో భాగంగా పెదపల్లి వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బొద్ధపు లలిత శనివారం నామినేషన్ దాఖలు చేశారు.
- పెదపల్లి వార్డు టీడీపీ అధ్యక్షుడు, మాజీ కోఆప్షన్ సభ్యుడు బొద్ధపు నాగేశ్వరరావు సతీమణి లలిత తన అనుచరులతో కలిసి గ్రామం నుంచి ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.
- అనంతరం ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఈ సందర్భంగా బొద్ధపు నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు.
యలమంచిలి మున్సిపాలిటీ రెండో సాధారణ ఎన్నికల్లో భాగంగా పెదపల్లి వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బొద్ధపు లలిత శనివారం నామినేషన్ దాఖలు చేశారు. పెదపల్లి వార్డు టీడీపీ అధ్యక్షుడు, మాజీ కోఆప్షన్ సభ్యుడు బొద్ధపు నాగేశ్వరరావు సతీమణి లలిత తన అనుచరులతో కలిసి గ్రామం నుంచి ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఈ సందర్భంగా బొద్ధపు నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు. వార్డు అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ ప్రజాసేవకు ప్రాధాన్యమిస్తున్నానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బొద్ధపు అప్పారావు, కరణం వెంకటరావు, శ్రీను, నానాజీ, దంట్ల విజయ్ కుమార్, గొర్లె వాసు, గల్లా కన్నబాబు, జెర్రిపోతుల చిన్న, మామిడి గోవిందు తదితరులు పాల్గొన్నారు.