Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: కోగిలి. దామరపు.హరికృష్ణ

తిరుపతి

*నేదురుమల్లితో వైయస్సార్సీపి శ్రేణులు భేటీ* } {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 29 వాకాడు మండలం,* }

*నేదురుమల్లితో వైయస్సార్సీపి శ్రేణులు భేటీ* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 29 వాకాడు మండలం,* *వెంకటగిరి నియోజవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు వాకాడు లోని నేదురుమల్లి నివాసంలో ఉండడంతో వాకాడు, కోట,చిట్టమూరు మండలాలకు చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో భారీగా ఆవుతోకలు జరుగుతున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదని రామ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం రామ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ లో జరుగుతున్న లోపాలను గురించి పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి దానికి తగిన విధంగా చర్యలు తీసుకునే విధంగా చేస్తానని వాకాడు,కోట,చిట్టమూరు మండలకు చెందిన వైఎస్సార్సీపి నాయకులకు, కార్యకర్తలకు హామీ ఇచ్చారు.

తిరుపతి

*నేదురుమల్లితో వైయస్సార్సీపి శ్రేణులు భేటీ* } {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 29 వాకాడు మండలం,* }

*నేదురుమల్లితో వైయస్సార్సీపి శ్రేణులు భేటీ* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 29 వాకాడు మండలం,* *వెంకటగిరి నియోజవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు వాకాడు లోని నేదురుమల్లి నివాసంలో ఉండడంతో వాకాడు, కోట,చిట్టమూరు మండలాలకు చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో భారీగా ఆవుతోకలు జరుగుతున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదని రామ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం రామ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ లో జరుగుతున్న లోపాలను గురించి పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి దానికి తగిన విధంగా చర్యలు తీసుకునే విధంగా చేస్తానని వాకాడు,కోట,చిట్టమూరు మండలకు చెందిన వైఎస్సార్సీపి నాయకులకు, కార్యకర్తలకు హామీ ఇచ్చారు.

తిరుపతి

*కోట ఏవీకేఆర్ పాఠశాల లో స్ఫూర్తి క్రీడ సందడి, ఘనంగా తెలుగు భాష, జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు,* }{ *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 29 కోట మండలం,* }

*కోట ఏవీకేఆర్ పాఠశాల లో స్ఫూర్తి క్రీడ సందడి, ఘనంగా తెలుగు భాష, జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 29 కోట మండలం,* నెల్లూరు జిల్లా కోట తెలుగు భాషా వికాసానికి గిడుగు వెంకటరామమూర్తి, భారత క్రీడా రంగానికి మేజర్ ధ్యాన్‌చంద్ చేసిన సేవలు చిరస్మరణీయమని వక్తలు పేర్కొన్నారు. కోట పట్టణంలోని ఏవీకేఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండు రోజుల క్రితం 100, 200, 400, 600, 800 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, హైజంప్ పోటీలు నిర్వహించారు. వాలీబాల్, కబడ్డీ పోటీలతో పాటు విద్యార్థులకు నచ్చిన క్రీడాకారుడిపై వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. పోటీలను సబ్‌మెరైన్ ఎస్‌ఐ శివసౌమ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడల వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు ఉపాధ్యాయులు అంకయ్య, సుబ్రహ్మణ్యం, కళ్యాణి ప్రసంగిస్తూ గిడుగు వెంకటరామమూర్తి భాషా సేవలను వివరించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయుడు వలి అహ్మద్ క్రీడల ప్రాధాన్యతను వివరించారు. మేజర్ ధ్యాన్‌చంద్ క్రీడా ప్రస్థానాన్ని విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కరుణాకర్ రెడ్డి, ఎం.సీనయ్య, ఉపాధ్యాయులు, సిబ్బంది, వ్యాయామ ఉపాధ్యాయుడు వలి అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

*గిరిజన విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ.* } {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 28 కోట మండలం,*}

*గిరిజన విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ.* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 28 కోట మండలం,* కోట మండలం చెందోడు గిరిజన కాలనీలో నివసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు వారికి అవసరమైనటువంటి విద్యా సామాగ్రిని ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ పంపిణీ చేశారు. శుక్రవారం రక్షాబంధన్ మరియు సోదరి ఎం భాగ్యలక్ష్మి జన్మదినోత్సవాన్ని పురస్కరించి నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు అవసరమైన నోట్ బుక్స్, పలకలు పంపిణీ చేయడమే కాక వారికి పుట్టినరోజు సందర్భంగా చాక్లెట్స్ మరియు ఒకరికొకరు ఒకరు రక్ష అన్నట్లు విద్యార్థిని విద్యార్థులకు రక్షాబంధన్ కార్యక్రమం కూడా నిర్వహించి రాఖీలు కట్టించారు. ఈ సందర్భంగా ముప్పవరపు లీలా మోహన్ కృష్ణకు పలువురు రాఖీలు కట్టడం విశేషం. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు కోటేశ్వరరావు,ఎం. వి లవ్ ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీల మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి అంగనవాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

*గంట మధు చౌదరికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు,*} {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 27 వాకాడు మండలం,* }

*గంట మధు చౌదరికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 27 వాకాడు మండలం,* వాకాడు: పెన్వర్ కంపెనీ అధినేత గంట మధు చౌదరి జన్మదినాన్ని పురస్కరించుకుని వాకాడు మండల తెలుగుదేశం పార్టీ నాయకుడు దువ్వూరు జనార్దన్ రెడ్డి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గంట మధు చౌదరి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, విజయవంతమైన జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. గంట మధు చౌదరి వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేస్తూ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్నారని దువ్వూరు జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయనకు రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత విజయాలు, శుభాలు చేకూరాలని కోరుకున్నారు. జన్మదిన వేడుకల సందర్భంగా స్నేహితులు, శ్రేయోభిలాషులు, వ్యాపార ప్రముఖులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు గంట మధు చౌదరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జన్మదిన వేడుకల వాతావరణం ఆనందోత్సాహాలతో నిండిపోయింది. “గంట మధు చౌదరి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, ప్రజల అభిమానం మరియు శ్రేయోభిలాషుల ఆశీస్సులతో చిరకాలం సంతోషంగా ఉండాలి” అని దువ్వూరు జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు.

తిరుపతి

*ఉచిత నేత్రవైద్యశిభిరం.* }{ *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 27 చిట్టమూరు మండలం,* }

*ఉచిత నేత్రవైద్యశిభిరం.* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 27 చిట్టమూరు మండలం,* చిట్టమూరు గిరిజన కాలనీలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కోట మండలం విద్యానగర్ గ్రామానికి చెందిన విద్యా ప్రదాత స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు వారి శ్రీమతి ఆదిలక్ష్మి గారి జ్ఞాపకార్థం ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం గిరిజన కాలనీవాసుల కోసం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో కోట పట్టణానికి చెందిన రమేష్ ఐ కేర్ నేత్ర వైద్యనిపుణుడు డాక్టర్ వి రమేష్ కంటి సమస్యలతో బాధపడే వారికి కంప్యూటర్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి వారిలో ఉన్న దృష్టిలోపాన్ని గుర్తించారు. దృష్టి సమస్యలతో బాధపడే వారికి వారికి ఉన్న సైట్ ఆధారంగా కంటి అద్దాలు, శుక్లాలు ఉన్నవారికి తిరుపతి వాసన్ ఐ కేర్ లో ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించినట్లు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది చిట్టమూరు గిరిజన కాలనీవాసులు పాల్గొన్నారు.

తిరుపతి

*శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి* }{*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 26 చిల్లకూరు మండలం,*}

*శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 26 చిల్లకూరు మండలం,* *నెల్లూరు జిల్లాచిల్లకూరు మండలం తూర్పు కనుపూరులోని శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లిని ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. సాంప్రదాయ ప్రకారం దేవస్థానం చైర్మన్ చిల్లకూరు దశరధరామిరెడ్డి, ఈఓ నవీన్, దేవస్థానం కమిటీ సభ్యుడు, కోట మండల బీజేపీ నాయకుడు సారంగ రమేష్ బాబు లు ఆయనకు ఆహ్వానం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం దేవస్థానం తరఫున తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి దేవస్థానం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.*

తిరుపతి

*కోట ఎస్సీ గురుకులంలో ఐఐటీ, నీట్ ఎక్సలెన్స్ సెంటర్* * *రూ.20 లక్షలతో అధునాతన పనులు.. ఈ నెల 29 వరకు స్పాట్‌ అడ్మిషన్లు* * *అసిస్టెంట్ జాయింట్ సెక్రటరీ శ్రీదేవి* }{ *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 26 కోట మండలం,* }

*కోట ఎస్సీ గురుకులంలో ఐఐటీ, నీట్ ఎక్సలెన్స్ సెంటర్* * *రూ.20 లక్షలతో అధునాతన పనులు.. ఈ నెల 29 వరకు స్పాట్‌ అడ్మిషన్లు* * *అసిస్టెంట్ జాయింట్ సెక్రటరీ శ్రీదేవి* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 26 కోట మండలం,* *నెల్లూరు జిల్లాకోట పట్టణంలోని ఎస్సీ గురుకుల పాఠశాలను బుధవారం గురుకులాల అసిస్టెంట్ జాయింట్ సెక్రటరీ శ్రీదేవి సందర్శించారు. ఈ గురుకుల పాఠశాలలో ఐఐటీ, నీట్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో జరుగుతున్న పనులను ఆమె పరిశీలించారు. ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటులో భాగంగా రూ.20 లక్షలతో అధునాతన పనులు చేపడుతున్నట్లు శ్రీదేవి తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీ వరకు స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిఒ ప్రభావతి, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.*

తిరుపతి

*ఉక్కు జనార్ధన్ 9వ వర్ధంతి ఘనంగా* } {ఆరూరు } {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 26 చిట్టమూరు మండలం,*}

*ఉక్కు జనార్ధన్ 9వ వర్ధంతి ఘనంగా* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 26 చిట్టమూరు మండలం,* ఆరూరు: తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి, పార్టీ బలోపేతానికి, ప్రజా సేవకు అంకితభావంతో కృషి చేసిన దివంగత మాజీ మండల అధ్యక్షుడు ఉక్కు జనార్ధన్ 9వ వర్ధంతిని ఆరూరు గ్రామంలో అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం వద్ద ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, అభిమానులు మాట్లాడుతూ.. ఉక్కు జనార్ధన్ తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి మండల అధ్యక్షుడి స్థాయికి చేరుకున్న ఆయన పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారని గుర్తుచేశారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, కార్యకర్తలకు అండగా నిలుస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేశారని తెలిపారు. ఆరూరు ప్రాంతంలో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం అభివృద్ధికి కూడా జనార్ధన్ విశేషంగా కృషి చేశారని నాయకులు గుర్తుచేశారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని భక్తుల సౌకర్యాల కోసం కృషి చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లు గడిచినా ఉక్కు జనార్ధన్ జ్ఞాపకాలు తమ హృదయాల్లో చెరగని ముద్రగా నిలిచిపోయాయని అభిమానులు తెలిపారు. ఆయన చూపిన సేవా మార్గం, పార్టీ పట్ల ఉన్న అంకితభావం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సేవలో ముందుకు సాగడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని ఉక్కు జనార్ధన్‌కు ఘన నివాళులర్పించారు.

తిరుపతి

*30 మందికి కంటి అద్దాలు పంపిణి..* *చెందోడు *} {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 26 కోట మండలం*}

*30 మందికి కంటి అద్దాలు పంపిణి..* (*చెందోడు )* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 26 కోట మండలం* సేవాస్ఫూర్తిదాత మదర్ థెరిస్సా గారి జయంతిని పురస్కరించుకొని ఎం వి రావు ఫౌండేషన్ నిర్వాహకులు దృష్టిలోపం ఉన్నవారికి బుధవారం కంటి అద్దాలను పంపిణీ చేశారు. కోట, వాకాడు,చిట్టమూరు మండలాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించి అందులో దృష్టి లోపం ఉన్న వారిని గుర్తించారు. వారిలో 30 మందికి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించి వారికి అవసరమైన నాణ్యమైన కంటే అద్దాలను ఎం వి రావు ఫౌండేషన్ వారు తయారుచేసి దృష్టిలోపం ఉన్న వారందరికీ కంటి అద్దాలు పంపిణీ చేశారు. దృష్టిలోపం నివారించడమే మా ఫౌండేషన్ లక్ష్యం అని ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ కార్యదర్శి ఎం విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు దృష్టిలోపం ఉన్నవారు పాల్గొన్నారు.