*కోట ఎస్సీ గురుకులంలో ఐఐటీ, నీట్ ఎక్సలెన్స్ సెంటర్*
* *రూ.20 లక్షలతో అధునాతన పనులు.. ఈ నెల 29 వరకు స్పాట్ అడ్మిషన్లు*
* *అసిస్టెంట్ జాయింట్ సెక్రటరీ శ్రీదేవి*
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 26 కోట మండలం,*
*నెల్లూరు జిల్లాకోట పట్టణంలోని ఎస్సీ గురుకుల పాఠశాలను బుధవారం గురుకులాల అసిస్టెంట్ జాయింట్ సెక్రటరీ శ్రీదేవి సందర్శించారు. ఈ గురుకుల పాఠశాలలో ఐఐటీ, నీట్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో జరుగుతున్న పనులను ఆమె పరిశీలించారు. ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటులో భాగంగా రూ.20 లక్షలతో అధునాతన పనులు చేపడుతున్నట్లు శ్రీదేవి తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిఒ ప్రభావతి, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.*
