నిర్మల్లో ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
రూ.12 కోట్లతో శ్రీశ్రీశ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ నిర్మాణం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్మల్, అక్టోబర్ 16 (పున్నమి ప్రతినిధి – అబ్దుల్ సాదిక్): నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజుల్ పెట్ 21వ వార్డులో శ్రీశ్రీశ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ ఆలయ నిర్మాణానికి రూ.12 కోట్ల నిధులు కేటాయించినట్లు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయించడం, పనులకు శ్రీకారం చుట్టడంతో స్థానికంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. కార్యక్రమంలో అయ్యన్న, గారి భూమయ్య. మరియు జుమే రాత్రి పెట్ అశోక్. రాజేశ్వర్.చిన్న రాజేశ్వర్.శ్రీశైలం నాగరాజు. పవార్ కైలాస్పా. కిషన్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు, గాజులపేట్ వార్డు ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.









