Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Breaking news

మహబూబాబాద్

భూ వివాద రహిత తెలంగాణే లక్ష్యం

🔸 _*ఏడాదిన్నరలో సమగ్ర భూసర్వే పూర్తి చేస్తాం*_ 🔸 _*స‌ర్వే ప‌ర్య‌వేక్ష‌ణ‌కు 7 జోన్లకు 14 మంది అధికారుల నియామకం*_ 🔸 _*నాణ్యత, పారదర్శకత, వేగం.. రీ–సర్వేలో అత్యంత కీలకం*_ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా భూ వివాదాలు లేని తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమగ్ర రీ–సర్వేను ఏడాదిన్నరలో పూర్తి చేసేలా పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగుతున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. శుక్ర‌వారం నాడు డాక్ట‌ర్ బి.ఆర్‌. అంబేద్క‌ర్ రాష్ట్ర సచివాల‌యంలో స‌ర్వే ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ఏర్పాటు చేసిన అధికారుల‌తో భూ సర్వే పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ సర్వేలో వేగం, నాణ్యతతో పాటు ప్రతి దశలో నిరంతర పర్యవేక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుమారు 125 ఏళ్ల తర్వాత సమగ్ర భూ సర్వేకు శ్రీకారం చుట్టామని, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు లభించిన ఈ అవకాశాన్ని అధికారులు అత్యంత బాధ్యతతో వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. రీ–సర్వేను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించేందుకు 7 జోన్లకు ఒక్కో జోన్‌కు రెవెన్యూ, స‌ర్వే విభాగాల నుంచి ఇద్దరు చొప్పున మొత్తం 14 మంది అధికారులను నియమించినట్లు మంత్రి తెలిపారు. సర్వే జరుగుతున్న తీరును, నాణ్యతను, ప్రజల స్పందనను ఎప్పటికప్పుడు పరిశీలించి స్ధానిక ప‌రిస్ధితుల‌కు అనుగుణంగా నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని సూచించారు. రాష్ట్రంలో తొలి దశలో 365 న‌క్షాలేని గ్రామాల్లో అలాగే జిల్లాకు 70 గ్రామాల చొప్పున 2,240 మొత్తం 2768 గ్రామాల్లో రీస‌ర్వే ముమ్మ‌రంగా సాగుతుంద‌ని ఇప్ప‌టివ‌ర‌కు 245 గ్రామాల్లో స‌ర్వే పూర్తి చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఈ స‌ర్వేను ప‌ర్య‌వేక్షించేందుకు 14 మంది అధికారుల‌ను ప‌ర్య‌వేక్ష‌కులుగా నియ‌మించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. మొద‌టి ద‌శ స‌ర్వేను న‌వంబ‌ర్ చివ‌రినాటికి పూర్తిచేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. ప్రతి మండలంలో కనీసం రెండు రెవెన్యూ గ్రామాల్లో సర్వే తప్పనిసరిగా చేపట్టేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి మండలానికి రెండు సర్వే బృందాలను ఏర్పాటు చేశామని, ఒక్కో బృందంలో లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌, జీపీవో, డిప్యూటీ తహసీల్దార్‌ లేదా ఆర్‌ఐ, సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ తదితర సిబ్బంది ఉంటారని వివరించారు. సర్వే జరుగుతున్న ప్రాంతాల్లో ప్రతి రోజు తహసీల్దార్‌ పర్యటించి పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ రోజు ఎక్కడ సర్వే జరిగింది? ఎన్ని ఎకరాలు/సర్వే నంబర్లు పూర్తయ్యాయి? ఎన్ని గ్రామాల్లో పని జరుగుతోంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? సర్వేలో ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా? అనే అంశాలపై అధికారులు ప్రతిరోజూ స్పష్టమైన సమాచారాన్ని సేకరించాలని సూచించారు.చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా, భవిష్యత్తులో భూ వివాదాలకు అవకాశం లేకుండా రీ–సర్వే జరగాలని మంత్రిగారు స్పష్టం చేశారు. _*హైదరాబాద్‌లో ప్రత్యేక డాష్‌బోర్డు:*_ రీ–సర్వేను రాష్ట్రస్థాయి నుంచి నిరంతరం పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక డాష్‌బోర్డును ఏర్పాటు చేయాలని అధికారుల‌ను ఆదేశించారు. సర్వే పురోగతి, రోజువారీ పనితీరు, గ్రామాల వారీగా పూర్తయిన సర్వే, పనిచేస్తున్న సర్వే బృందాలు, ఉపయోగిస్తున్న రోవర్లు, వాటి లొకేషన్‌ వంటి వివరాలన్నీ డాష్‌బోర్డులో రియల్‌టైమ్‌లో కనిపించేలా టెక్నాలజీని వినియోగించాలని సూచించారు. సర్వేకు అవసరమైన సర్వేయర్లు, రోవర్లు, సర్వర్లు, ఇతర సాంకేతిక పరికరాలు, సామగ్రి కొనుగోలుకు నిధుల కొరత ఉండదని స్పష్టం చేశారు. అవసరమైన నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేస్తుందని, అదనపు రోవర్లను కూడా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. రీ–సర్వే ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనద‌ని ప్రతి వారం రాష్ట్రస్థాయిలో అధికారులు సమీక్ష నిర్వహించాలని, ప్రతి 15 రోజులకు తాను స్వయంగా సమీక్షించి పురోగతిని పరిశీలిస్తానని తెలిపారు.ప్రభుత్వ భూముల సర్వే సమయంలో సరిహద్దులను గుర్తించే ప్రక్రియలో సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాల‌ని ఆదేశించారు. రీ–సర్వే పేరుతో స్థానికంగా ఎవరైనా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని మంత్రిగారు హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. _*మీడియా చిట్‌చాట్‌లో మంత్రి పొంగులేటి:*_ శుక్ర‌వారం నాడు స‌చివాల‌యంలో త‌న‌ను క‌లిసిన మీడియా ప్ర‌తినిధుల‌తో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఎర్రవల్లిలో 385 ఎకరాలలో 45 ఎకరాలు తక్కువ ఉందని. సర్వే కోసం మరొక సారి నోటీసులు ఇవ్వ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. ఎర్రవల్లిలో అసైన్డ్ భూములు కొన్ని చేతులు మారాయి వాటిని గుర్తించి చర్యలు తీసుకుంటామ‌న్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా అమరవీరులను గుర్తించి వాళ్లకు న్యాయం చేస్తామ‌న్నారు. ఎర్ర‌వెల్లిలో కూడా నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా అసైన్డ్ ల్యాండ్ ఉంటే వాటిని పేద‌ల‌కు పంచుతామ‌న్నారు.

మహబూబాబాద్

సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

ముల్లంగి మోహన్ రెడ్డి తెలంగాణ ఎసెన్స్ మహబూబాబాద్ జిల్లా కరస్పాండెంట్ అక్టోబర్ 9 మహబూబాబాద్ జిల్లా పౌరసరఫరాల శాఖ పూర్తి అదనపు బాధ్యతల మేనేజర్ వాసంశెట్టి నరసింహారావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ ఆధ్వర్యంలో మేనేజర్ నరసింహారావు నివాసంతోపాటు, ఆయన సంబంధీకులు, బంధువులు, బినామీల నివాసాల్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, హైదరాబాద్ తదితర మొత్తం ఏడు ప్రాంతాల్లోని నరసింహారావుకు చెందిన ఆస్తుల కూపీ లాగుతున్నారు. ఖమ్మంలో నరసింహారావుకు చెందిన రెండు విలాసవంతమైన భవనాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నరసింహారావుకు చెందిన అక్రమ ఆస్తులను భారీ ఎత్తున గుర్తించినట్లు సమాచారం…!

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొత్తపేటలో పాత సచివాలయ భవనంపై అధికారుల నిర్లక్ష్యం – పట్టించుకోని వైనం

కొత్తపేట గ్రామంలోని పాత గ్రామ సచివాలయం / పంచాయతీ కార్యాలయం భవనం అధికారుల నిర్లక్ష్యానికి మూగసాక్షిగా మ మారింది. ప్రభుత్వ భవనాల నిర్వహణ పట్ల పంచాయతీ అధికారులు మరియు గ్రామ సచివాలయం సిబ్బంది తీవ్ర ఉదాసీనత ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. * పట్టించుకోని వైనం: గ్రామ ప్రజలకు సేవలు అందించాల్సిన ప్రభుత్వ కార్యాలయ భవనం ప్రస్తుతం అన్యాక్రాంతమై, పర్యవేక్షణ లేక అధ్వాన్న పరిస్థితికి చేరుకుంది. * చెట్ల కొమ్మల కూల్చివేత: సచివాలయం భవనంపై భారీ చెట్ల కొమ్మలు విరిగిపడి ఉన్నప్పటికీ, వాటిని తొలగించేందుకు అధికారులు కనీసం ప్రయత్నించకపోవడం గమనార్హం. * అపరిశుభ్ర వాతావరణం: కార్యాలయ పరిసరాలు పిచ్చిమొక్కలు, చెట్లతో నిండిపోయి శిథిలావస్థకు చేరుకుంటున్నా సంబంధిత సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రజాధనంతో నిర్మించిన ఇలాంటి భవనాలను సంరక్షించడంలో విఫలమవుతున్న సంబంధిత పంచాయతీ అధికారులు, సచివాలయ సిబ్బందిపై పైస్థాయి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు: కొత్తపేటలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ వైర్లు.. స్పందించిన ఏఈ, మరియు సిబ్బంది

​దుత్తలూరు, అక్టోబర్ 6 (పున్నమి): మండలంలోని కొత్తపేట గ్రామం మధ్యలో రాకపోకలకు మరియు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ప్రమాదకర విద్యుత్ వైర్లను విద్యుత్ శాఖ అధికారులు వెంటనే తొలగించి, సమస్యను పరిష్కరించారు. ​గ్రామ మధ్యలో వ్రేలాడుతున్న విద్యుత్ వైర్ల వల్ల ఎప్పుడేం జరుగుతుందోనని స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతూ వచ్చారు. ఈ సమస్యపై స్పందించిన దుత్తలూరు మండల విద్యుత్ శాఖ ఏఈ మరియు వారి సిబ్బంది వెంటనే క్షేత్రస్థాయికి చేరుకున్నారు. ప్రమాదకరంగా ఉన్న వైర్లను సరిచేసి, కొత్త లైన్లను ఏర్పాటు చేయడం ద్వారా స్థానికుల భద్రతకు భరోసా కల్పించారు. ​ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా సకాలంలో స్పందించి చర్యలు తీసుకున్న ఏఈ మరియు విద్యుత్ సిబ్బందిని కొత్తపేట గ్రామ ప్రజలు ప్రత్యేకంగా అభినందించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బర్రెలను ఢీకొని బైక్‌దారుడు మృతి

చిన్నక్రాక గ్రామం వద్ద ఎన్ హెచ్ -167 బిజీ పై ఘటన తలకు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి. జలదంకి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చిన్నక్రాక గ్రామం వద్ద ఎన్ హెచ్ -167 బిజీ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న చెరుకూరి రమేష్‌ (58) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. కావలి మండలం అడవి రాజుపాలెం గ్రామానికి చెందిన చెరుకూరి రమేష్‌ తన పొలాలను చూసుకునేందుకు పరికోట గ్రామానికి వెళ్లి, అనంతరం తన ఏపీ 26 ఏపీ 3701 బైక్‌పై కావలికి బయలుదేరాడు. చిన్నక్రాక గ్రామం సమీపంలో ఎన్ హెచ్ -167 బిజీ రోడ్డుపై అకస్మాత్తుగా బర్రెలు అడ్డురావడంతో బైక్‌ను అదుపు చేయలేక వాటిని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో రమేష్‌ రోడ్డుపై పడిపోవడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందినట్లు చెబుతున్నారు. ఘటనపై జలదంకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొమ్మి గ్రామం కు చెందిన యారాం చిన్నమ్మ కు కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్టు తరుపున ఆర్థిక సాయం

ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం కొమ్మి గ్రామంలోని హరిజనవాడకు చెందిన యారాం చిన్నమ్మ ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న **కోడే వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు చెరుకూరి నవీన్** ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా చెరుకూరి నవీన్ మాట్లాడుతూ.. పేద, నిరుపేద ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కోడే వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పేద ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా ట్రస్ట్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్మి గ్రామ కమిటీ అధ్యక్షులు **దేవినేని వెంకటసుబ్బయ్య**, బూత్ ఇన్‌చార్జీలు **చెరుకూరి శేషయ్య, శ్రీను**, **చెరుకూరి వెంకయ్య, కొండలరావు**, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రకాశం

🚨 కనిగిరిలో రెట్టింపు డబ్బుల మోసం కేసులో ఆరుగురు అరెస్ట్ రూ.13.28 లక్షల నగదు, బ్యాంక్ ఖాతాలో రూ.31.70 లక్షలు సీజ్‌

రెట్టింపు డబ్బులు ఇస్తామంటూ ప్రజల నుంచి నగదు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు మార్కాపురం జిల్లా పోలీసుల ప్రెస్‌నోట్‌లో తెలిపారు. కనిగిరి, హెచ్‌.ఎం.పాడు, పి.సి.పాడు, మార్రిపూడి పోలీస్‌స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసుల ప్రకారం.. నిందితులు ప్రజలకు రెట్టింపు డబ్బులు ఇస్తామని నమ్మించి, వారి నుంచి నగదు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బాధితుల నుంచి సేకరించిన మొత్తానికి సంబంధించి బ్యాంక్ లావాదేవీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. స్వాధీనం చేసుకున్నవి 🔹 రూ.13,28,000 నగదు 🔹 బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.31,70,000 🔹 సాఫ్ట్‌వేర్/డిజిటల్ పరికరాలు 🔹 బ్యాంక్‌కు సంబంధించిన రసీదులు, పత్రాలు 🔹 Canon కంపెనీ ప్రింటర్ 🔹 సర్టిఫికెట్లు 🔹 AP37DE5998 నంబర్ గల కారు నిందితులపై BNS 318(4), 316(2) r/w 3(5) సెక్షన్లతో పాటు APPDFE Act-1999 సెక్షన్ 5 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. Video Link: https://www.instagram.com/reel/DeEybXtTfHA/?stkn=Yzd1czVhdXZyZHQ5 Uploaded Video:

జగిత్యాల

బుగ్గారం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం – ఏకగ్రీవ ఎన్నిక మండల అధ్యక్షుడిగా ఏలేశ్వరం గౌరీ శంకర్

బుగ్గారం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం – ఏకగ్రీవ ఎన్నిక మండల అధ్యక్షుడిగా ఏలేశ్వరం గౌరీ శంకర్ బుగ్గారం, అక్టోబర్ 2:. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని శ్రీ ముత్యాల నల్ల పోచమ్మ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో బుగ్గారం మండల ప్రెస్ క్లబ్ (తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఐ జె యూ అనుబంధ) నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా మొగిలిసుదన్ .(ఆంధ్రజ్యోతి), మండల అధ్యక్షులుగా ఏలేశ్వరం గౌరీ శంకర్ (బతుకమ్మ), ప్రధాన కార్యదర్శిగా నక్క చంద్రమౌళి (మనం), ఉపాధ్యక్షులుగా కట్ట రాజేందర్ (సాక్షి డిజిటల్), కండ్లె తిరుపతి (తెలంగాణ శక్తి) సహాయ కార్యదర్శులుగా ముత్యాల సురేష్ (వే టు న్యూస్), కోసరి శ్రీనివాస్ (తెలంగాణ గళం), ప్రచార కార్యదర్శిగా ఎండి అబ్దుల్ రెహమాన్ (తెలంగాణ శక్తి ), కోశాధికారిగా బుక ప్రవీణ్ కుమార్ (ప్రజా జ్యోతి), సలహాదారులుగా సీనియర్ జర్నలిస్ట్ చుక్క గంగారెడ్డి, వోజ్జల రమేష్ (సాక్షి), ఆర్తి శ్రీకాంత్ (ఈనాడు) చినుముల రాజేందర్ (నమస్తే తెలంగాణ) కార్యవర్గ సభ్యులుగా కల్లెం నాగేష్ (వార్త), పల్లెర్ల భూమయ్య (నవశక్తి) పల్లెర్ల వంశీ(ప్రజా దర్బార్), చుక్క విశాల్ (ప్రజా మంటలు) ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్టులందరూ ఐక్యతతో ముందుకు సాగుతూ వృత్తి గౌరవాన్ని కాపాడాలని అన్నారు. మండలంలోని ప్రజా సమస్యలను గుర్తించి వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ప్రజలకు అధికారులకు వారధి గా ఉంటూ ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని బాధ్యతాయుతంగా అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, సభ్యుల సంక్షేమం కోసం సమిష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్‌ను మరింత బలోపేతం చేసి, సభ్యులందరి సహకారంతో ఐక్యతగా ముందుకు సాగుతామని తెలిపారు. అలాగే మండల అభివృద్ధి, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పాత్రికేయులు బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని నూతన కార్యవర్గ సభ్యులు అన్నారు. నూతన కార్యవర్గ సభ్యులకు పలువురు జర్నలిస్టులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుగ్గారం మండలానికి చెందిన జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

జగిత్యాల

బుగ్గారం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం – ఏకగ్రీవ ఎన్నిక మండల అధ్యక్షుడిగా ఏలేశ్వరం గౌరీ శంకర్

బుగ్గారం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం – ఏకగ్రీవ ఎన్నిక మండల అధ్యక్షుడిగా ఏలేశ్వరం గౌరీ శంకర్ బుగ్గారం, అక్టోబర్ 2:. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని శ్రీ ముత్యాల నల్ల పోచమ్మ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో బుగ్గారం మండల ప్రెస్ క్లబ్ (తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఐ జె యూ అనుబంధ) నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా మొగిలిసుదన్ .(ఆంధ్రజ్యోతి), మండల అధ్యక్షులుగా ఏలేశ్వరం గౌరీ శంకర్ (బతుకమ్మ), ప్రధాన కార్యదర్శిగా నక్క చంద్రమౌళి (మనం), ఉపాధ్యక్షులుగా కట్ట రాజేందర్ (సాక్షి డిజిటల్), కండ్లె తిరుపతి (తెలంగాణ శక్తి) సహాయ కార్యదర్శులుగా ముత్యాల సురేష్ (వే టు న్యూస్), కోసరి శ్రీనివాస్ (తెలంగాణ గళం), ప్రచార కార్యదర్శిగా ఎండి అబ్దుల్ రెహమాన్ (తెలంగాణ శక్తి ), కోశాధికారిగా బుక ప్రవీణ్ కుమార్ (ప్రజా జ్యోతి), సలహాదారులుగా సీనియర్ జర్నలిస్ట్ చుక్క గంగారెడ్డి, వోజ్జల రమేష్ (సాక్షి), ఆర్తి శ్రీకాంత్ (ఈనాడు) చినుముల రాజేందర్ (నమస్తే తెలంగాణ) కార్యవర్గ సభ్యులుగా కల్లెం నాగేష్ (వార్త), పల్లెర్ల భూమయ్య (నవశక్తి) పల్లెర్ల వంశీ(ప్రజా దర్బార్), చుక్క విశాల్ (ప్రజా మంటలు) ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్టులందరూ ఐక్యతతో ముందుకు సాగుతూ వృత్తి గౌరవాన్ని కాపాడాలని అన్నారు. మండలంలోని ప్రజా సమస్యలను గుర్తించి వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ప్రజలకు అధికారులకు వారధి గా ఉంటూ ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని బాధ్యతాయుతంగా అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, సభ్యుల సంక్షేమం కోసం సమిష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్‌ను మరింత బలోపేతం చేసి, సభ్యులందరి సహకారంతో ఐక్యతగా ముందుకు సాగుతామని తెలిపారు. అలాగే మండల అభివృద్ధి, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పాత్రికేయులు బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని నూతన కార్యవర్గ సభ్యులు అన్నారు. నూతన కార్యవర్గ సభ్యులకు పలువురు జర్నలిస్టులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుగ్గారం మండలానికి చెందిన జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొత్తపేట MPUP పాఠశాలలో ఏకేగ్రీవంగా SMC ఎన్నికలు : మరోసారి వారే చైర్మన్ గా పచ్చవ వెంగళరత్నం వైస్ చైర్మన్ గా కాకర్ల నాగేష్

దుత్తలూరు, పున్నమి ప్రతినిధి, అక్టోబర్ 1: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం కోతపేట గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పాఠశాల నిర్వహణ కమిటీ (SMC) ఎన్నికలు గురువారం ఏకగ్రీవంగా జరిగాయి. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కమిటీ సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. SMC చైర్మన్ గా పచ్చవ వెంకటరత్నం వైస్ చైర్మన్గా కాకర్ల నాగేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, SMC సభ్యులు నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లకు అభినందనలు తెలిపారు. “పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, గతంలో అన్ని సదుపాయాలు చూశారు గనుక అవకాశం కల్పించినట్లు అందుకే మరోసారి అవకాశం ఇవ్వాలని తల్లిదండ్రుల కోరుతున్నారు ఈ అవకాశం కల్పించేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, SMC సభ్యుల సమన్వయంతో కృషి చేస్తాం. పాఠశాల సమస్యలను పరిష్కరించడంతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాం” అని నూతన SMC చైర్మన్ పచ్చావ వెంగళ రత్న పేర్కొన్నారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధి మరింత ముందుకు సాగాలని పలువురు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, SMC సభ్యులు తదితరులు పాల్గొన్నారు.