Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొమ్మి గ్రామం కు చెందిన యారాం చిన్నమ్మ కు కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్టు తరుపున ఆర్థిక సాయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కొమ్మి గ్రామం కు చెందిన యారాం చిన్నమ్మ కు కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్టు తరుపున ఆర్థిక సాయం

ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం కొమ్మి గ్రామంలోని హరిజనవాడకు చెందిన యారాం చిన్నమ్మ ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న **కోడే వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు చెరుకూరి నవీన్** ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించారు.
ఈ సందర్భంగా చెరుకూరి నవీన్ మాట్లాడుతూ.. పేద, నిరుపేద ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కోడే వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పేద ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా ట్రస్ట్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కొమ్మి గ్రామ కమిటీ అధ్యక్షులు **దేవినేని వెంకటసుబ్బయ్య**, బూత్ ఇన్‌చార్జీలు **చెరుకూరి శేషయ్య, శ్రీను**, **చెరుకూరి వెంకయ్య, కొండలరావు**, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కొమ్మి గ్రామం కు చెందిన యారాం చిన్నమ్మ కు కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్టు తరుపున ఆర్థిక సాయం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *