Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు: కొత్తపేటలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ వైర్లు.. స్పందించిన ఏఈ, మరియు సిబ్బంది

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
దుత్తలూరు: కొత్తపేటలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ వైర్లు.. స్పందించిన ఏఈ, మరియు సిబ్బంది

వార్త ముఖ్యాంశాలు

  • ​దుత్తలూరు, అక్టోబర్ 6 (పున్నమి): మండలంలోని కొత్తపేట గ్రామం మధ్యలో రాకపోకలకు మరియు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ప్రమాదకర విద్యుత్ వైర్లను విద్యుత్ శాఖ అధికారులు వెంటనే తొలగించి, సమస్యను పరిష్కరించారు.
  • ​గ్రామ మధ్యలో వ్రేలాడుతున్న విద్యుత్ వైర్ల వల్ల ఎప్పుడేం జరుగుతుందోనని స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతూ వచ్చారు.
  • ఈ సమస్యపై స్పందించిన దుత్తలూరు మండల విద్యుత్ శాఖ ఏఈ మరియు వారి సిబ్బంది వెంటనే క్షేత్రస్థాయికి చేరుకున్నారు.

​దుత్తలూరు, అక్టోబర్ 6 (పున్నమి):
మండలంలోని కొత్తపేట గ్రామం మధ్యలో రాకపోకలకు మరియు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ప్రమాదకర విద్యుత్ వైర్లను విద్యుత్ శాఖ అధికారులు వెంటనే తొలగించి, సమస్యను పరిష్కరించారు.
​గ్రామ మధ్యలో వ్రేలాడుతున్న విద్యుత్ వైర్ల వల్ల ఎప్పుడేం జరుగుతుందోనని స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతూ వచ్చారు. ఈ సమస్యపై స్పందించిన దుత్తలూరు మండల విద్యుత్ శాఖ ఏఈ మరియు వారి సిబ్బంది వెంటనే క్షేత్రస్థాయికి చేరుకున్నారు. ప్రమాదకరంగా ఉన్న వైర్లను సరిచేసి, కొత్త లైన్లను ఏర్పాటు చేయడం ద్వారా స్థానికుల భద్రతకు భరోసా కల్పించారు.
​ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా సకాలంలో స్పందించి చర్యలు తీసుకున్న ఏఈ మరియు విద్యుత్ సిబ్బందిని కొత్తపేట గ్రామ ప్రజలు ప్రత్యేకంగా అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *