Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Breaking news

జగిత్యాల

బుగ్గారం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం – ఏకగ్రీవ ఎన్నిక మండల అధ్యక్షుడిగా ఏలేశ్వరం గౌరీ శంకర్

బుగ్గారం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం – ఏకగ్రీవ ఎన్నిక మండల అధ్యక్షుడిగా ఏలేశ్వరం గౌరీ శంకర్ బుగ్గారం, అక్టోబర్ 2:. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని శ్రీ ముత్యాల నల్ల పోచమ్మ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో బుగ్గారం మండల ప్రెస్ క్లబ్ (తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఐ జె యూ అనుబంధ) నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా మొగిలిసుదన్ .(ఆంధ్రజ్యోతి), మండల అధ్యక్షులుగా ఏలేశ్వరం గౌరీ శంకర్ (బతుకమ్మ), ప్రధాన కార్యదర్శిగా నక్క చంద్రమౌళి (మనం), ఉపాధ్యక్షులుగా కట్ట రాజేందర్ (సాక్షి డిజిటల్), కండ్లె తిరుపతి (తెలంగాణ శక్తి) సహాయ కార్యదర్శులుగా ముత్యాల సురేష్ (వే టు న్యూస్), కోసరి శ్రీనివాస్ (తెలంగాణ గళం), ప్రచార కార్యదర్శిగా ఎండి అబ్దుల్ రెహమాన్ (తెలంగాణ శక్తి ), కోశాధికారిగా బుక ప్రవీణ్ కుమార్ (ప్రజా జ్యోతి), సలహాదారులుగా సీనియర్ జర్నలిస్ట్ చుక్క గంగారెడ్డి, వోజ్జల రమేష్ (సాక్షి), ఆర్తి శ్రీకాంత్ (ఈనాడు) చినుముల రాజేందర్ (నమస్తే తెలంగాణ) కార్యవర్గ సభ్యులుగా కల్లెం నాగేష్ (వార్త), పల్లెర్ల భూమయ్య (నవశక్తి) పల్లెర్ల వంశీ(ప్రజా దర్బార్), చుక్క విశాల్ (ప్రజా మంటలు) ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్టులందరూ ఐక్యతతో ముందుకు సాగుతూ వృత్తి గౌరవాన్ని కాపాడాలని అన్నారు. మండలంలోని ప్రజా సమస్యలను గుర్తించి వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ప్రజలకు అధికారులకు వారధి గా ఉంటూ ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని బాధ్యతాయుతంగా అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, సభ్యుల సంక్షేమం కోసం సమిష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్‌ను మరింత బలోపేతం చేసి, సభ్యులందరి సహకారంతో ఐక్యతగా ముందుకు సాగుతామని తెలిపారు. అలాగే మండల అభివృద్ధి, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పాత్రికేయులు బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని నూతన కార్యవర్గ సభ్యులు అన్నారు. నూతన కార్యవర్గ సభ్యులకు పలువురు జర్నలిస్టులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుగ్గారం మండలానికి చెందిన జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొత్తపేట MPUP పాఠశాలలో ఏకేగ్రీవంగా SMC ఎన్నికలు : మరోసారి వారే చైర్మన్ గా పచ్చవ వెంగళరత్నం వైస్ చైర్మన్ గా కాకర్ల నాగేష్

దుత్తలూరు, పున్నమి ప్రతినిధి, అక్టోబర్ 1: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం కోతపేట గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పాఠశాల నిర్వహణ కమిటీ (SMC) ఎన్నికలు గురువారం ఏకగ్రీవంగా జరిగాయి. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కమిటీ సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. SMC చైర్మన్ గా పచ్చవ వెంకటరత్నం వైస్ చైర్మన్గా కాకర్ల నాగేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, SMC సభ్యులు నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లకు అభినందనలు తెలిపారు. “పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, గతంలో అన్ని సదుపాయాలు చూశారు గనుక అవకాశం కల్పించినట్లు అందుకే మరోసారి అవకాశం ఇవ్వాలని తల్లిదండ్రుల కోరుతున్నారు ఈ అవకాశం కల్పించేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, SMC సభ్యుల సమన్వయంతో కృషి చేస్తాం. పాఠశాల సమస్యలను పరిష్కరించడంతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాం” అని నూతన SMC చైర్మన్ పచ్చావ వెంగళ రత్న పేర్కొన్నారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధి మరింత ముందుకు సాగాలని పలువురు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, SMC సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

🚌 ఏపీ మహిళలకు శుభవార్త: ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. *కీలక వివరాలు:* 🔹 ప్రస్తుతం పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంది. 🔹 త్వరలోనే *కొత్త ఏసీ బస్సులను కొనుగోలు చేసి* వాటిలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని వర్తింపజేయనున్నారు. 🔹 మహిళల కోసం ప్రత్యేకంగా కొత్త ఏసీ బస్సులు డిపోలకు చేరిన వెంటనే ఈ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి. 🔹 సూపర్ లగ్జరీ, అంతర్రాష్ట్ర, తిరుమల సప్తగిరి బస్సులకు ఈ పథకం వర్తించదు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎమ్మెల్యేను కలిసిన నాయకులు

AP : నెల్లూరు జిల్లా ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మన వెనుకబడిన ప్రాంతమైన సీతారాంపురం మండలం పరిస్థితి గురించి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి తీసుకెళ్లి మనకు కావాల్సిన సాగునీరు, ప్రజలు వలసలు పోకుండా నివారణ పరిస్థితులు వివరించారు, ఎమ్మెల్యే సానుకూలంగా మాట్లాడి వెలుగొండ ఫేస్ టు ద్వారా ఉదయగిరి, సీతారాంపురం మండలాలకు సాగునీరు అందిస్తామన్నారు,

అన్నమయ్య

జర్నలిస్టులపై దాడుల నియంత్రణకు హైపవర్ కమిటీ పునరుద్ధరణ

*జర్నలిస్టులపై దాడులపై ప్రత్యేక కమిటీ పునరుద్ధరణ* జర్నలిస్టులపై జరిగే దాడులు, దౌర్జన్యాల కేసులను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీని ఏపీ ప్రభుత్వం పునరుద్ధరిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీ రెండేళ్ల పాటు కొనసాగనుంది. *కమిటీ సభ్యులు* ▪️హోం మంత్రి – చైర్మన్. ▪️సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి – వైస్ చైర్మన్. ▪️హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ. ▪️సాధారణ పరిపాలన (Poll) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ. ▪️సాధారణ పరిపాలన (I&PR) శాఖ ఎక్స్-ఆఫీషియో సెక్రటరీ. ▪️IGP (Law & Order) ▪️గుర్తింపు పొందిన జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు. ▪️పెద్ద దినపత్రికలు/పీరియాడికల్స్ మేనేజ్‌మెంట్ ప్రతినిధి. ▪️చిన్న, మధ్య తరహా దినపత్రికల సంఘం ప్రతినిధి. ▪️ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం ప్రతినిధి. ▪️ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రతినిధి. ▪️డైరెక్టర్, I&PR – మెంబర్ కన్వీనర్. ▪️అవసరాన్ని బట్టి మరో సభ్యుడిని కో-ఆప్ట్ చేసే అధికారం కూడా డైరెక్టర్, I&PRకు కల్పించారు. *జర్నలిస్టులపై జరిగే దాడులు, దౌర్జన్యాల కేసులను పరిశీలించి, సంబంధిత అంశాలపై చర్యలకు దోహదపడే విధంగా ఈ కమిటీ వ్యవహరిస్తుంది.*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు మండల ప్రజల గ్యాస్ కష్టాలు తీర్చేది ఎవరు? అర్థం కాని పరిస్థితిలో ప్రజలు

దుత్తలూరు మoడలంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వారు చేస్తున్నటువంటి పనులకు దుత్తలూరు మండల ప్రజలు విసిగితే పోతున్నారు పది రోజులకు ఒకసారి మూత వేయడం దానికి మళ్లీ అధికారులు ఆపేశారు అని చెప్పడం వాళ్లు లెటర్ పర్మిషన్ లెటర్ ఇస్తేనే ఓపెన్ చేస్తామని ప్రజలకు తప్పుడు సమాధానం ఇస్తున్నారు దీంతో గ్యాస్ కొరత కోసం ప్రజలు ఎక్కడికి వెళ్లాలో తెలియక అయోమయస్థితిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్యాస్ బుకింగ్ చేసి కూడా ప్రజలు ఎవరిని అడగాలో తెలియక వెనుతిరిగిపోవడం చర్చగా మారింది ఇంతకుముందు కూడా బుక్ చేసి ఉంటే పది రోజులు లోపలే గ్యాస్ తీసుకోవాలని లేకుంటే క్యాన్సిల్ అవుతుందని క్యాన్సల్ చేసిన సందర్భాలు కూడా జరిగాయి కానీ ఇప్పుడు మండల అధికారులు ఇంకా ఎందుకు ఆపమన్నారో తెలియక ప్రజలకి అయోమయంలో ఉన్నారు ఇప్పటికే 670 బుకింగ్స్ పెండింగ్ లో ఉన్నాయి అని తెలియజేశారు వాళ్లలో మీరు ఒకరనేసి ఆగండి లెటర్ ఇచ్చేంతవరకు అని యాజమాన్యం సమాధానమిస్తుంది చూడాలి ఏ అధికారి గ్యాస్ కష్టాలు తీరుస్తారు అని ప్రజలు గుసగుసలాడుతున్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు రెండు మద్యం దుకాణాల్లో చోరీ

దుత్తలూరు మండలంలోని రెండు మద్యం దుకాణాల్లో చోరీ జరిగింది. దుత్తలూరు సెంటర్లో నర్రవాడ మార్గంలోని దుకాణం గోడపై భాగంలో కన్నం వేసి లోపలికి ప్రవేశించిన దుండగులు కొంత నగదు, మద్యం సీసాలు అపహరించారు. నందిపాడు దుకాణంలో రేకులపై ఉన్న కిటికీ ద్వారా ప్రవేశించి మద్యం సీసాలు చోరీ చేశారు. సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాలను పరిశీలించి వివరాలు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మానవత్వం చాటుకున్న నెల్లూరు SP

నవాబుపేట లో హత్యాయత్నానికి గురైన ప్రదీప్ తొలుత నెల్లూరు జీజీహెచ్లో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం బొల్లినేని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అత్యవసర ఆపరేషన్ అవసరమైంది. ప్రదీప్ కుటుంబం నిరుపేద కుటుంబం. వారు ఆపరేషన్ ఖర్చులు భరించేందుకు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ఎస్పీ డా. అజిత వేజెండ్ల రూ.50 వేలు సహాయం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దేశవ్యాప్తంగా సమ్మే కారణంగా 28 నుండి 30 వరకు బ్యాంకులకు సెలవులు తగు జాగ్రత్తలు తీసుకోండి

ప్రియమైన ఖాతాదారులకు, ప్రతిపాదిత దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె కారణంగా 2026 సెప్టెంబర్ 28 నుండి 30 వరకు అవసరమైన బ్యాంకింగ్ సేవలను ముందుగా ప్రణాళిక చేసుకోగలరు. అయితే మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ATM, UPI, బీసీ పాయింట్లు మొదలైనవి యథావిధిగా అందుబాటులో ఉంటాయి. అంటూ ఎస్ఎంఎస్లు చక్కెరలు కొడుతున్నాయి కావున అందరూ బ్యాంకు సేవలను కు సంబంధించి నాకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది