వార్త ముఖ్యాంశాలు
- దుత్తలూరు: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండల విద్యాశాఖ అధికారి–2గా విధులు నిర్వహిస్తున్న నందా వెంగయ్య గుండెపోటుతో మృతి చెందారు.
- బుధవారం ఉదయం తన నివాసంలో ఆయన ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
- దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను వింజమూరు ఆసుపత్రికి తరలించారు.
దుత్తలూరు: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండల విద్యాశాఖ అధికారి–2గా విధులు నిర్వహిస్తున్న నందా వెంగయ్య గుండెపోటుతో మృతి చెందారు.
బుధవారం ఉదయం తన నివాసంలో ఆయన ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను వింజమూరు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు.
నందా వెంగయ్య మృతితో విద్యాశాఖ సిబ్బంది, సహచరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.
వార్తా మూలాలు
- Muraliవార్తా సంస్థ