కొత్తపేటలో ‘శారీపురం మిస్సమ్మ’ నూతన షోరూమ్ ప్రారంభం
ఎల్బీనగర్: కొత్తపేటలో ప్రముఖ వస్త్ర విక్రయ సంస్థ ‘శారీపురం మిస్సమ్మ’ నూతన షోరూమ్‌ను గురువారం ఘనంగా ప్రారంభించారు. విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ సమీపంలో, ఎల్‌బీనగర్ వెళ్లే మార్గంలో నూతన షోరూమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ అన్ని వర్గాల వినియోగదారులకు నాణ్యమైన చీరలను అందుబాటు ధరల్లో అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. షోరూమ్‌లో రూ.199 నుంచి రూ.1,999 వరకు వివిధ రకాల చీరల కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. డైలీ వేర్‌తో పాటు వివిధ సందర్భాలకు అనువైన చీరలను ఏడాది పొడవునా అందుబాటు ధరల్లో అందిస్తున్నట్లు తెలిపారు. దసరా పండుగను పురస్కరించుకుని రూ.5,000 విలువైన కొనుగోలు చేసిన ప్రతి వినియోగదారుడికి సిల్వర్ కాయిన్ ఉచితంగా అందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే కూకట్‌పల్లి, విజయవాడలో బ్రాంచ్‌లు నిర్వహిస్తున్న శారీపురం బై మిస్సమ్మ, తాజాగా కొత్తపేటలో నూతన షోరూమ్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం తెలిపారు.









