Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ప్రతిభకు ప్రోత్సాహం.. విద్యార్థులకు బహుమతుల పంపిణీ!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రతిభకు ప్రోత్సాహం.. విద్యార్థులకు బహుమతుల పంపిణీ!

వార్త ముఖ్యాంశాలు

  • చిట్వేల్‌: విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించి, వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు నిర్వహించిన ‘విద్యా వాహిని’ కార్యక్రమం ఆకట్టుకుంది.
  • చిట్వేల్‌ పీఎం శ్రీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏకలవ్య ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
  • ప్రధానోపాధ్యాయులు బాలరాజు దుర్గరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

చిట్వేల్‌: విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించి, వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు నిర్వహించిన ‘విద్యా వాహిని’ కార్యక్రమం ఆకట్టుకుంది. చిట్వేల్‌ పీఎం శ్రీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏకలవ్య ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రధానోపాధ్యాయులు బాలరాజు దుర్గరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జూనియర్స్‌, సీనియర్స్‌ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన ధార్మిక, జగదీష్‌, రాజేష్‌, సుస్మిత, శ్రీరామ్‌, వైష్ణవి, లావణ్య, హరి శ్రీనివాసులను అభినందించి పురస్కారాలు అందజేశారు. విద్యార్థులు చదువులోనే కాకుండా వివిధ పోటీల్లోనూ పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని ఎంఈఓ ఈశ్వరయ్య సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ ఉపాధ్యాయురాలు సోఫియా, ఎన్‌సీసీ అధికారి పసుపుల రాజశేఖర్‌, స్కౌట్‌ మాస్టర్‌, ఏకలవ్య ఫౌండేషన్‌ ప్రతినిధి నవీన్‌కుమార్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *