Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: జనగామ

జనగాం

ఆర్ టి సి బహుజన కార్మికుల సంఘం యూనియన్ నాయకులను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలి :టి ఆర్ పి జనగామ జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం, నియోజకవర్గం ఇంచార్జి డాక్టర్ మాచర్ల బిక్షపతి

ఆర్ టి సి బహుజన కార్మికుల సంఘం యూనియన్ నాయకుల కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించి తీన్మార్ మల్లన్న కు బహుమానం గా ఇవ్వాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం, నియోజకవర్గం ఇంచార్జి కల్నాల్ డాక్టర్ మాచర్ల బిక్షపతి కోరారు.జనగామ బస్సు డిపోలో ఆర్ టి సి కార్మికులతో కలసి వారు మాట్లాడుతూ కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేయాలి, బహుజన రాజ్యం ఏర్పాటు కై ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరుకుంటూ కార్మికుల సమస్యలు తీరాలంటే, ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు చెల్లించాలంటే మన బహుజన కార్మికులకు ఎల్లవేళలా అందరికి అండగా ఉంటూ మన హక్కుల కొరకు పోరాటం చేసే మహా నాయకుడు మన తీన్మార్ మల్లన్న ను గుర్తు పెట్టుకోవాలి, మీరు ఎదుర్కొనే సమస్యల పరిస్కారం కొరకు తెలంగాణ రాజ్యధికార పార్టీ ఎల్లపుడు మీరు వెంటే ఉంటుందని జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం తెలిపారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర మరియు జిల్లా టి ఆర్ పి నాయకులు అంజాద్ పాషా, గడ్డం కృష్ణ,నరేష్, సతీష్, టి ఆర్ పి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పిట్టల సురేష్, ఆర్ టి సి కార్మికులు,తదితరులు పాల్గొన్నారు

జనగాం

జనగామ లో భారీ యాత్ర తో భారత్ సంకల్ప సభ విజవంతం : సౌడ రమేష్ బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు ప్రధానమంత్రిగా 12 సంవత్సరములు ప్రజా జీవితంలో 25 సంవత్సరంలో పూర్తి చేసుకున్న సందర్భంగా బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ఆధ్వర్యంలో కామాక్షి ఫంక్షన్ హాల్ లో వికసిత్. భారత్ సంకల్ప సభ నిర్వహించడం జరిగింది.ఎల్ ఈ డి స్క్రీన్ ఏర్పాటు చేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రసంగాన్ని వీక్షించి అనంతరం నెహ్రూ పార్క్ నుండి జనగాం అంబేద్కర్ చౌరస్తా వరకు సేవా జ్యోతి యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు క్రాంతి కిరణ్ రావడం జరిగింది. ఈ సందర్భంగా క్రాంతి కిరణ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ దేశ సంక్షేమం కోసం తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేయడం జరిగిందని దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలిపిన ఘనత మోడీ దని తెలంగాణకు ఎయిమ్స్, ఉమ్మడి వరంగల్ జిల్లా గిరిజన యూనివర్సిటీ వరంగల్ కు ఏర్పోర్ట్, కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రధానంగా జనగామ కు రైల్వే స్టేషన్ కోట్ల రూపాయలతో ఆధునీకర వస్తువులతో నిర్మాణం చేయడం జరిగిందని వారు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో ముందుకు సాగాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాత్ర ప్రముఖ్ వల్ల శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు విద్యాసాగర్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి, శివరాజ్ యాదవ్, ఉడుముల రమేష్, పాకనాటి దామోదర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమారాణి అంజిరెడ్డి నవీన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మారెడ్డి,రంగు రాములు, పల్లె కుమార్ వివిధ మోర్చాల అధ్యక్షులు మండల అధ్యక్షులు బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జనగాం

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కలిపించాలి -కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

*ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించాలి* *కొనుగోలు కేంద్రాలపై కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు* *రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు* —*జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* వానాకాలం (ఖరీఫ్‌) 2026-27 సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులను పకడ్బందీగా కల్పించాలని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అధికారులను ఆదేశించారు. సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లపై రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, డీఆర్డీఓ, తూనికలు కొలతలు, రవాణా, తదితర శాఖల అధికారులతో *అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోంతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 202 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని మౌలిక వసతులను సమకూర్చేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లను నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వివరాలు, రైతులకు అందాల్సిన సేవలు, ధాన్యం నాణ్యతా ప్రమాణాలపై పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. రైతులకు ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే పరిష్కరించేందుకు కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయగా, 1800-425-6605 టోల్‌ ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు. ధాన్యం రవాణా చేసే వాహనాలు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూడాలని, అన్ని వాహనాలకు జీపీఎస్‌ (లేదా) వాహన స్థాన నిర్ధారణ వ్యవస్థ ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షించాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. ధాన్యం నాణ్యతకు సంబంధించిన నాణ్యతా ప్రమాణాలపై రైతులు, కొనుగోలు కేంద్రాల సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. ప్యాడీ క్లీనర్లను సక్రమంగా వినియోగించి, నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన తేమ శాతం నిబంధనల మేరకు ధాన్యాన్ని ఆరబెట్టి నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ట్రక్‌ షీట్‌ నిర్వహణ తప్పనిసరి అని స్పష్టం చేశారు. లారీలో లోడ్‌ చేసిన ధాన్యం బస్తాల సంఖ్య, బరువు, తదితర వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, లోతట్టు ప్రాంతాల్లో కాకుండా సురక్షిత ప్రదేశాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి కేంద్రంలో సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడడంతో పాటు తాగునీరు, నీడ, విద్యుత్‌, తదితర కనీస సౌకర్యాలు కల్పించాలని, అవసరమైన రిజిస్టర్లను నిర్వహించాలని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సరిపడా టార్పాలిన్లు, తేమ కొలిచే యంత్రాలు, తగినన్ని గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ముందస్తుగా టోకెన్లు జారీ చేయాలని, రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా కేటాయించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని, రైతులు పండించిన ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున అంతకుముందే అన్ని సన్నాహాలను పూర్తి చేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ట్రక్కుల్లో లోడింగ్, అన్‌లోడింగ్ చేసేందుకు ఎలాంటి కూలీల సమస్యలు తలెత్తకుండా అవసరమైన సంఖ్యలో కూలీలను ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ధాన్యం నిల్వ, రవాణాకు సంబంధించి ముందస్తుగా క్షేత్రస్థాయిలో పర్యటించి గోదాములను పరిశీలించాలని, వాటి సామర్థ్యాన్ని పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేసి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ భాస్కర్, జిల్లా సివిల్ సప్లై అధికారి సురేష్ రెడ్డి, డీఎం సివిల్ సప్లై హతీరామ్, డీసీఓ కరుణ, ఎల్‌డీఎం ప్రతిభ, తూనికలు కొలతల శాఖ అధికారి ఝాన్సీ, రవాణా, రెవెన్యూ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

జనగాం

అర్హులైన నిరుపేదలందరికి ఇందిరమ్మ ఇళ్ళ ను మంజూరు చేయాలి :కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

*అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలి* *రెండు పడక గదుల ఇళ్ల పరిశీలన ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి* *రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలన చేయాలి* *ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ దరఖాస్తులను వెంటనే పూర్తి చేయాలి* —జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అధికారులను ఆదేశించారు. సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాల పురోగతి, రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపుకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ, పెండింగ్ దరఖాస్తులపై *అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్‌తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపుకు సంబంధించి లబ్ధిదారుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను ఎలాంటి తప్పులకు తావులేకుండా వేగంగా, పారదర్శకంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి న్యాయం జరిగేలా, అనర్హులకు ఇళ్లు మంజూరు కాకుండా నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలన చేయాలన్నారు. మొదటి విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. పాలకుర్తి, జనగామ నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉన్న ఇళ్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలనలో రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం కీలకంగా పరిగణించాలని సూచించారు. కుటుంబంలోని పెద్దలు, వయోజనుల వివరాలను రేషన్ కార్డు ఆధారంగా పరిశీలించడంతో పాటు, కుటుంబంలోని కుమారులు వేర్వేరుగా రేషన్ కార్డులు తీసుకొని, ప్రత్యేకంగా నివసిస్తున్న సందర్భాల్లో వారి అర్హతలను కూడా నిబంధనల ప్రకారం సరిచూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారిని ఆదాయ పరిమితి నిబంధనల ప్రకారం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఆదాయ ధృవీకరణ పత్రాలు ప్రతి సంవత్సరం మారే అవకాశం ఉన్నందున వాటిని తప్పనిసరిగా ధృవీకరించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులకు భూమి, ఇల్లు (లేదా) ఇతర ఆస్తులు ఉన్నాయా అనే విషయాన్ని సంబంధిత ప్రభుత్వ వెబ్‌సైట్ల ద్వారా పరిశీలించాలని ఆదేశించారు. కుటుంబ సభ్యులకు ఇతర ప్రాంతాల్లో ఇళ్లు, భూములు, ఆస్తులు ఉన్నట్లయితే స్థానికంగా విచారణ జరిపి, వాస్తవాలను నిర్ధారించుకోవాలని సూచించారు. చెక్‌లిస్ట్‌లోని వివరాల పరిశీలనతో పాటు, ఏవైనా సందేహాలు ఉన్న సందర్భాల్లో క్షేత్రస్థాయిలో స్థానిక విచారణ చేపట్టాలని తెలిపారు. అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే దరఖాస్తులను ఆమోదించడం (లేదా) తిరస్కరించడం చేయాలని స్పష్టం చేశారు. గుడిసెలకు సంబంధించిన జాబితాను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాస్తవంగా అర్హులైన వారి వివరాలను నమోదు చేయాలని సూచించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ దరఖాస్తులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. అదే విధంగా ఆయా మండలాల పరిధిలో బేస్‌మెంట్ లెవల్, రూఫ్ లెవల్, రూఫ్ కాస్టెడ్ వంటి వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ-ఆఫీస్ విధానాన్ని తప్పనిసరిగా వినియోగిస్తూ, కార్యాలయ ఫైళ్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో నిబంధనల ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ బలరామ రావు, మునిసిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, ఎంపిడిఓలు మహేష్ నాయక్, లావణ్య, ఇతర సంబంధిత అధికారులు, డీఈఈలు, అన్ని మండలాల ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.

జనగాం

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిస్కరించాలి -కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

*ప్ర‌జావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి –జిల్లా క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా* ప్ర‌జావాణిలో వివిధ స‌మ‌స్య‌లతో వచ్చే ప్ర‌జ‌ల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని *జిల్లా క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా* అధికారుల‌ను ఆదేశించారు. సోమ‌వారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వ‌హించిన ప్ర‌జావాణిలో *అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ తో క‌లిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా *(405)* అర్జీలను *క‌లెక్ట‌ర్* స్వీక‌రించారు. వచ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను సంబంధిత శాఖ‌ల అధికారుల‌కు కేటాయిస్తూ, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై తగిన చర్యలు తీసుకొని, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని, పెండింగ్ లో లేకుండా దరఖాస్తులను ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని ఆదేశించారు. *ఈరోజు ప్రజావాణికి వచ్చిన కొన్నింటి దరఖాస్తుల వివరాలిలా ఉన్నాయి* హిమ్మత్ నగర్ గ్రామం, జఫర్గడ్ మండలానికి చెందిన సీహెచ్. అనిత, తనకు పెంకుటిల్లు ఉందని, అది కూలిపోయిందని, ఇందిరమ్మ ఇళ్ల కింద గుర్తించి, ఆర్థిక సహాయం కొరకు మనవి చేస్తూ ద‌రఖాస్తు చేసుకున్నారు. నెల్లుట్ల గ్రామం, లింగాల ఘనపురం మండలానికి చెందిన బండ్రు సారమ్మ, తనకు మూడు ఎకరాల భూమి ఉందని, అందులోని 16 గుంటల భూమి రికార్డులోకి ఎక్కలేదని, ఆ భూమిని రికార్డులోకి ఎక్కించి, పట్టా ఇప్పించగలరని ద‌ర‌ఖాస్తు చేసియున్నారు. నారాయణపురం గ్రామం, బచ్చన్నపేట మండలానికి చెందిన రవీందర్ రెడ్డి, సదాశివపేట, నారాయణపురం మధ్యలో కాలువ తెగిపోయిందని, కాలువ మరమ్మతులు చేయాలని ప్రార్థిస్తూ ఆర్జీ ద్వారా కోరారు. పామ్నూర్ గ్రామం, ఘనపూర్ (స్టేషన్) మండలానికి చెందిన రేష్మా, తన పెంకుటిల్లు కూలిపోయే దశలో ఉందని, చాలా పేద కుటుంబానికి చెందినదని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగలరని కోరుతూ విన‌తిప‌త్రం స‌మ‌ర్పించ‌నైన‌ది. విస్నూర్ గ్రామం, పాలకుర్తి మండలానికి చెందిన ఎం. సుజాత, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించుట కోసం దరఖాస్తును స‌మ‌ర్పించినారు. ఈ ప్ర‌జావాణిలో జెడ్పీ సీఈవో బలరామ రావు, డీఆర్డీఓ భాస్కర్, సీపీఓ చిన కోట్యా నాయక్, వివిధ శాఖ‌ల జిల్లా అధికారులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

జనగాం

జిల్లా కలెక్టర్ నర్మెట మండల కేంద్రం లో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ

విద్యార్థినులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలి *చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు, అనవసర సామగ్రిని వెంటనే తొలగించాలి *విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి* *నర్మెట్ట మండల కేంద్రంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ* *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* విద్యార్థినులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అన్నారు. సోమవారం, జిల్లాలోని నర్మెట్ట మండల కేంద్రంలో గల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల (బాలికలు)ను *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* సందర్శించి, ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినులకు అందుతున్న విద్యా బోధన, పరీక్షల నిర్వహణ, వసతి, భోజనం, పారిశుద్ధ్యం, మౌలిక వసతులు, తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి తరగతి గదిని సందర్శించి, తరగతి గదుల నిర్వహణ, ప్రస్తుతం జరుగుతున్న పరీక్షల విధానం, పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించి, విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు సక్రమంగా నిర్వహించేలా చూడాలని సూచించారు. పాఠశాలలోని వంటశాల గదిని సందర్శించి, విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, మెనూ ప్రకారం తాజా కూరగాయలను వినియోగిస్తూ, నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని ఆదేశించారు. ఆయా సబ్జెక్టులపై విద్యార్థులకు ఉన్న సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేలా బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించాలని, ఇంకా అవసరమైన ఫ్యాన్లు, లైట్లు సమకూర్చాలని సూచించారు. అనంతరం పాఠశాలలోని డార్మిటరీలను పరిశీలించిన *కలెక్టర్*, విద్యార్థినుల వసతి పరిస్థితులను, గదుల పరిశుభ్రతను పర్యవేక్షించారు. పాఠశాలలోని సరకుల నిల్వ గదిని తనిఖీ చేసిన *కలెక్టర్*, అక్కడ నిల్వ చేసిన సరుకులను పరిశీలించారు. అనంతరం భోజనశాలను సందర్శించి, విద్యార్థినులకు అందించే భోజనానికి ఉపయోగించే కూరగాయలు, ఇతర సరుకుల నాణ్యత, నిల్వ విధానాన్ని పరిశీలించారు. కూరగాయలు తాజాగా ఉండేలా, విద్యార్థినులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పాఠశాలలోని మరుగుదొడ్లు, మూత్రశాలలను పరిశీలించిన *కలెక్టర్*, వాటి పరిశుభ్రత, నిర్వహణపై ఆరా తీశారు. విద్యార్థినుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకొని, ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల మైదానం, పరిసరాలను పరిశీలించిన *కలెక్టర్*, పాఠశాల పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చి మొక్కలను తొలగించి, అనవసరంగా నిల్వ ఉంచిన సామగ్రిని వెంటనే తీసివేయాలని ఆదేశించారు. విద్యార్థినులు విద్యనభ్యసించే, నివసించే ప్రదేశం పరిశుభ్రంగా ఉండేలా నిరంతరం పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థినుల విద్యతో పాటు వారి ఆరోగ్యం, భద్రత, వసతి, భోజనం, ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఎంతో ముఖ్యమని *కలెక్టర్* స్పష్టం చేశారు. ఈ తనిఖీలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిష్ట, తహసీల్దార్ వెంకట రామానుజ చారి, సర్పంచ్ శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి నజీర్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

జనగాం

జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ముఖ్య సమావేశం:బనుక శివరాజ్ యాదవ్ మార్కెట్ చైర్మన్

*జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ముఖ్య సమావేశం* ✓ జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్ లో ఉన్న నూతన కార్యాలయం లో AMC పాలకవర్గం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ✓ఈ సందర్భంగా పాలకవర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ✓ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమనగా AMC చైర్మన్ సంతకం లేకుండా సెప్టెంబర్ 2026 కి సంబంధించిన చెక్కులు కేవలం సెక్రటరీ సంతకం చేసి, చైర్మన్ బనుక శివరాజు సంతకం లేకుండా AMC కార్యాలయం లో విధులు నిర్వర్తిస్తున్న వాచ్ మెన్ కె.ఐలయ్య STO ద్వారా చెక్కులు పాస్ చేపించి విషయం తెలుసుకున్న AMC చైర్మన్ సిబ్బందిని నిలదీయగా చైర్మన్ పట్ల దుర్సుగా ప్రవర్తించిన వ్యవహారంలో కె.ఐలయ్య ను వెంటనే సస్పెండ్ చేయాలని ఏఎంసీ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసి డిఎంఓ (DMO) గారికి తీర్మానం పత్రం అందజేయడం జరిగింది. ✓అనంతరం శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ నిరంతరం మా పాలకవర్గం మరియు నేను రైతులకు వ్యాపారులకు అందుబాటులో ఉంటూ ఎక్కడ ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా మా బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది అలాంటిది మాకు తెలియకుండానే మా సంతకం లేకుండానే చెక్కులు దుర్వినియోగం చేసిన అతనిపై మేము ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. ✓గతంలో కూడా అవినీతి పాల్పడిన వారిపై మరియు విధులు సక్రమంగా నిర్వహించని అధికారులు కానీ సిబ్బంది పై ఎప్పటికప్పుడు ఉన్నత అధికారులకు పిర్యాదులు చేసి ఉన్నాము అని కూడా వారు తెలిపారు. ✓అదేవిధంగా వచ్చే సీజన్ లో రైతుల కోసం అన్ని ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది మరియు మార్కెట్ అభివృద్ధి కోసం సాంక్షన్ అయిన పనుల వివరాలు గురించి అధికారులతో వాకప్ చేయడం జరిగింది అని అన్నారు. ✓ఈ కార్యక్రమంలో AMC డైరెక్టర్లు నాగబండి రవీందర్, నీల మోహన్, బుట్ రెడ్డి శ్రీలత రెడ్డి, ఎండి బాష్మియా, నామాల శ్రీనివాస్,తోటకూరి రమేష్, బానోతు బన్సీ నాయక్, శీలం కొండల్ రెడ్డి, పార్ష సిద్దేష్, బండ కుమార్, నాయకులు రాజిరెడ్డి,ప్రభాకర్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జనగాం

వీధి వ్యాపారులకు ముఖ్య ప్రకటన, రోడ్లు ఫుట్పాత్ ల ఆక్రమణ ల కు ముగింపు, సంజయ్ నగర్ మోడల్ మార్కెట్ కు తరలింపు :కమీషనర్

జనగామ పట్టణ వీధి వ్యాపారులకు ముఖ్య ప్రకటన రోడ్లు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలకు ముగింపు – సంజయ్‌నగర్ మోడల్ మార్కెట్‌కు తరలింపు:మున్సిపల్ కమిషనర్ రాజ శేఖర్ రెడ్డి ——————————————————————— జనగామ పట్టణాన్ని శుభ్రంగా, సుందరంగా, ట్రాఫిక్ ఇబ్బందులు లేని పట్టణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో జనగామ మున్సిపాలిటీ కీలక చర్యలు చేపడుతోందని కమీషనర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, ఫుట్‌పాత్‌లు మరియు ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించే ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వీధి వ్యాపారాలను సంజయ్‌నగర్‌లో నిర్మించిన ఆధునిక మోడల్ మార్కెట్‌కు దశలవారీగా తరలించేందుకు మున్సిపాలిటీ చర్యలు ప్రారంభించిందని మున్సిపల్ సంజయ్‌నగర్ మోడల్ మార్కెట్ ప్రత్యేకతలు: సుమారు ₹7 కోట్ల వ్యయంతో నిర్మించిన సంజయ్‌నగర్ మోడల్ మార్కెట్‌లో వ్యాపారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించబడ్డాయి. – 🏪 కూరగాయల మార్కెట్ – 50 షాపులు – 🥩 నాన్-వెజ్ మార్కెట్ – 65 షాపులు – 💧 తాగునీటి సదుపాయం – ⚡ విద్యుత్ సదుపాయం – 🚻 అవసరమైన పారిశుధ్య సదుపాయాలు – 🚶 ప్రజలకు సౌకర్యవంతమైన మార్కెట్ వాతావరణం – 🛍️ వ్యాపారులు క్రమబద్ధంగా వ్యాపారం చేసుకునే అవకాశం దరఖాస్తుల స్వీకరణ: సంజయ్‌నగర్ మోడల్ మార్కెట్‌లో షాపుల కేటాయింపునకు అర్హత కలిగిన వీధి వ్యాపారుల నుండి దరఖాస్తులు స్వీకరించబడతాయి. దరఖాస్తుల స్వీకరణ తేదీలు: 📅 07-10-2026 నుండి 10-10-2026 వరకు అర్హత కలిగిన వీధి వ్యాపారులు నిర్ణీత గడువులోపు మున్సిపాలిటీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరడమైనది. రోడ్లపై వ్యాపారాలకు స్వస్తి ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రధాన రహదారులు, ఫుట్‌పాత్‌లు మరియు ట్రాఫిక్ ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, పారిశుధ్య సమస్యలు, ప్రజలకు అసౌకర్యం ఏర్పడుతున్నాయి. కాబట్టి వ్యాపారుల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారికి క్రమబద్ధమైన, సురక్షితమైన మరియు అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యామ్నాయ వ్యాపార స్థలాన్ని కల్పించాలనే ఉద్దేశంతో సంజయ్‌నగర్ మోడల్ మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాము. “వ్యాపారుల జీవనోపాధికి రక్షణ – ప్రజలకు మెరుగైన రాకపోకలు – జనగామకు సుందర రూపం” అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అందువల్ల జనగామ పట్టణంలోని వీధి వ్యాపారులు మున్సిపాలిటీ చర్యలకు సహకరించి, సంజయ్‌నగర్ మోడల్ మార్కెట్‌లో తమకు కేటాయించిన షాపుల్లో వ్యాపారాలు నిర్వహించుకోవాలని కోరడమైనది.

జనగాం

కాంగ్రెస్ నాయకులు బిజెపి ప్రభుత్వం ఓటు చోరి కి పాల్పడిందని ఆరోపించడం సిగ్గు చేటు :సౌడ రమేష్ బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు

ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటు చోరీ కి బిజెపి ప్రభుత్వం పాల్పడదని ఆరోపించడం సిగ్గుచేటని దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు ఉందని మొట్టమొదటి ఓటు చోరీ 1947 నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధాని ఎవరు కావాలనే సందర్భంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కు మెజార్టీ ఉంటే ఒక్క ఓటు కూడా మద్దతు లేని నెహ్రూ ప్రధాని అయ్యారని ఆ రోజే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు ఓటు చోరీకి పాల్పడ్డారని అదేవిధంగా 1975 అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ లోక్సభ సభ్యత్వం రద్దు చేసిందని ఆ సమయంలో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని విధించి ప్రజాస్వామ్యవాదులందరినీ జైల్లో నిర్బంధించారని అప్పుడే ప్రజల ఓటు చోరీ జరిగిందని అదేవిధంగా 1983లో భారత్ పౌరసత్వాన్ని సోనియా గాంధీ స్వీకరించారని మరి 1980లో ఢిల్లీలో సోనియా గాంధీ ఓటు వేయడం జరిగిందని మరి 1983లో భారత పౌరసత్వాన్ని స్వీకరించిన సోనియాగాంధీ అంతకంటే ముందు 1980లో ఢిల్లీలో ఓటు ఏ విధంగా వేశారని అప్పుడే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు ఓటు చోరీ చేయడం జరిగిందని ఇవన్నీ చూస్తుంటే దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్లు ఉన్నదని అలాంటప్పుడు కేరళ రాష్ట్రంలో కేరళ ముఖ్యమంత్రి వీడి సతీషన్ సర్ ప్రక్రియ వల్ల బోకస్ కమ్యూనిస్టు ఓట్లు తప్పించడం వల్లనే నేను ముఖ్యమంత్రిని కాగలిగానని చెప్పడం మీరు వినలేదా అని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు అయితే ఒక న్యాయం మిగతా రాష్ట్రాల్లో అయితే ఇంకొక న్యాయం ఎలా వర్తిస్తుందని వారు ప్రశ్నించారు జనగామ జిల్లాలో డిసిసి అధ్యక్షురాలు ఓటు చోరీ జరిగిందాబిజెపి వాళ్లు ఓటు చోరీ చేశారని మాట్లాడుతున్నారని మరి డిసిసి అధ్యక్షురాలు ఇంట్లో ఏమన్నా ఓట్లు గల్లంత అయ్యాయా అని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం బయట దేశాల నుండి అక్రమంగా వచ్చిన పాకిస్తాన్ బంగ్లాదేశ్ రోహింగ్యాల ఓట్లను తప్పకుండా తొలగిస్తుందని దేశంలో అక్రమంగా చొరబడ్డా ఓటు హక్కు పొందిన వారి విషయంలో ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమారాణి రాష్ట్ర నాయకులు బల్ల శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐ లోన్ అంజిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పల్లె కుమార్ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సోమిడి వెంకటరెడ్డి ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు నినావత్ రవి నాయక్ సందీప్ గణేష్ తదితరులు పాల్గొన్నారు

జనగాం

ఛతిస్గాడ్ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జు వెంకట్రావు ను కలిసిన జనగామ బిజెపి నాయకులు

జనగామ కు విచ్చేసిన చతీస్గాడ్ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జు వెంకట్రావు ను మర్యాద పూర్వకంగా కలిసిన బిజెపి నాయకులు: జనగామ జిల్లాకి విచ్చేసిన చత్తీస్గడ్ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జ వెంకట్రావు రావడం జరిగింది వారి కుటుంబ సభ్యులు అయినా అత్తగారు జనగామ వాస్తవ్యులు కావడంతో వారి 11వ రోజు కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది బిజెపి జనగామ జిల్లా పార్టీ నాయకులు జిల్లా ఎన్నికల అధికార ప్రతినిధి పెద్దోజు జగదీష్ చత్తీస్గడ్ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జ వెంకట్రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి జనగామ బిజెపి పార్టీ యొక్క స్థితిగతులను చర్చించుకోవడం జరిగింది బిజెపి పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేసి తెలంగాణలో బిజెపి పార్టీని తీసుకురావాల్సిందిగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి దూసర శివకృష్ణ శ్రీనివాస్ గజ్జి మధు మొదలగువారు*