Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

ఆర్ టి సి బహుజన కార్మికుల సంఘం యూనియన్ నాయకులను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలి :టి ఆర్ పి జనగామ జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం, నియోజకవర్గం ఇంచార్జి డాక్టర్ మాచర్ల బిక్షపతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఆర్ టి సి బహుజన కార్మికుల సంఘం యూనియన్ నాయకుల కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించి తీన్మార్ మల్లన్న కు బహుమానం గా ఇవ్వాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం, నియోజకవర్గం ఇంచార్జి…
  • ఈ కార్యక్రమం లో రాష్ట్ర మరియు జిల్లా టి ఆర్ పి నాయకులు అంజాద్ పాషా, గడ్డం కృష్ణ,నరేష్, సతీష్, టి ఆర్ పి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పిట్టల సురేష్, ఆర్ టి సి కార్మికులు,తదితరులు పాల్గొన్నారు

ఆర్ టి సి బహుజన కార్మికుల సంఘం యూనియన్ నాయకుల కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించి తీన్మార్ మల్లన్న కు బహుమానం గా ఇవ్వాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం, నియోజకవర్గం ఇంచార్జి కల్నాల్ డాక్టర్ మాచర్ల బిక్షపతి కోరారు.జనగామ బస్సు డిపోలో ఆర్ టి సి కార్మికులతో కలసి వారు మాట్లాడుతూ కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేయాలి, బహుజన రాజ్యం ఏర్పాటు కై ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరుకుంటూ కార్మికుల సమస్యలు తీరాలంటే, ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు చెల్లించాలంటే మన బహుజన కార్మికులకు ఎల్లవేళలా అందరికి అండగా ఉంటూ మన హక్కుల కొరకు పోరాటం చేసే మహా నాయకుడు మన తీన్మార్ మల్లన్న ను గుర్తు పెట్టుకోవాలి, మీరు ఎదుర్కొనే సమస్యల పరిస్కారం కొరకు తెలంగాణ రాజ్యధికార పార్టీ
ఎల్లపుడు మీరు వెంటే ఉంటుందని జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం తెలిపారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర మరియు జిల్లా టి ఆర్ పి నాయకులు అంజాద్ పాషా, గడ్డం కృష్ణ,నరేష్, సతీష్, టి ఆర్ పి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పిట్టల సురేష్, ఆర్ టి సి కార్మికులు,తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *