Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: గాజుల బాలాజీ. ఎల్లారెడ్డి పేట

రాజన్న సిరిసిల్ల

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇల్లంతకుంట మండలాల విద్యుత్ వినియోదారుల సమస్య ల పరిష్కారానికి ఈనెల 23న శుక్రవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తంగళ్ళపల్లి మండలం మండేపల్లి రోడ్ లోని ఫ్రెండ్స్ క్లబ్ లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సి జి ఆర్ ఎఫ్ 2 ఏర్పాటు చేస్తున్నట్లు చైర్ పర్సన్ కె కిషన్ తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు

రాజన్న సిరిసిల్ల

వేములవాడలో బతుకమ్మ పండుగకు ఏర్పాటు సిద్ధం

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను వేములవాడలో ఘనంగా నిర్వహించేందుకు మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు వేములవాడ పట్టణంలో బతుకమ్మ పండుగ సందర్భంగా ఏర్పాటులను రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ బిజెపి నాయకులు ప్రతాప రామకృష్ణ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు వైస్ చైర్మన్ నరాల శేఖర్ మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ బతుకమ్మ నిమజ్జనోత్సవం విజయవంతంగా నిర్వహించేందుకు సుమారు రూ . 34 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేపట్టినట్టు తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు గ్రామపంచాయతీలో పరిధిలో బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని కోరారు

రాజన్న సిరిసిల్ల

వేములవాడ తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ తాసిల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు గురువారం సాయంత్రం ఆకస్మికంగా దాడి చేసిన ఏసీబీ బృందం కార్యాలయంలోని పలు విభాగాల్లో రికార్డులను నిశ్చితంగా పరిశీలిస్తుంది విశ్వాసనీయ వర్గాల సమాచారం ప్రకారం భూ సంబంధిత పనుల కోసం ఒక వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేసిన వ్యవహారంలో వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తుంది సోదాల నేపథ్యంలో కార్యాలయంలోని సిబ్బందిని బయటకు వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు ప్రధాన దారులు ముసివేసి విచారణ జరుపుతున్నారు ఈ దాడులకు సంబంధించి సేకరించినట్లు సమాచారం ఏసీబీ అధికారులు తెలిపారు

రాజన్న సిరిసిల్ల

BC. ఓవర్సీస్ విద్యానిధి పథకం అక్టోబర్ 31 వరకు ఛాన్స్

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ మహాత్మా జ్యోతిబాపూలే బిసి ఓవర్సీస్ విద్యానిధి పథకం ఆగస్టు సెప్టెంబర్ సెషన్ దరఖాస్తులు గడువును పొడిగించారు బీసీ ఈ బీసీ అభ్యర్థులు అక్టోబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు అని అధికారులు సూచించారు అమెరికా యూకే ఆస్ట్రేలియా కెనడా వంటి దేశాల్లో మాస్టర్ డాక్టరేట్ చేయాలనుకునే వారికి గరిష్టంగా రూ. 20 లక్షల కాలర్ షిప్ ఇస్తారు గ్రాడ్యుయేషన్ లో 60 శాతం మార్కులతో పాటు గ్రాండ్ టోటల్ ఎక్కువగా ఉండాలి

రాజన్న సిరిసిల్ల

భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో భీమేశ్వర స్వామి ఆలయంలో గురువారం భక్తుల సందడి నెలకొంది ఆలయ అర్చకులు వేద పండితులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు స్వామి వారికి ఎంతో ప్రీతి పాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు కుంకుమార్చన పూజలు చేశారు దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని భక్తులు శ్రీ భీమేశ్వర స్వామివారిని భక్తులు భక్తితో నిమగ్నమై స్వామి వారిని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేటట్లు చూడాలని ఆయన పాడిపంటలు సమృద్ధిగా పండాలంటే వర్షాలు కురిసి రైతులకు మెరుగైన ధాన్యం దిగుబడి రావాలని స్వామివారిని వేడుకోవడం జరిగింది

రాజన్న సిరిసిల్ల

ప్రత్యేక ఓటర్ నమోదు శిబిరాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాల నెంబర్ 278. 279. లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ పరిశీలించారు ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ తెలిపారు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో ఈనెల 15 తారీకు నుంచి 16 తారీకు వరకు ప్రత్యేక శిబిరాలు కొనసాగుతాయి ఫారం-6 ద్వారా ఎన్ని దరఖాస్తులు వచ్చాయో ఆరా తీయగా మొత్తం 12 దరఖాస్తులు వచ్చినట్లు బూతులు అధికారి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా నూతన ఓటరు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు

రాజన్న సిరిసిల్ల

నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల ప్రధాన సమస్యలు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల గత 13వ తేదీ నుండి రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని హెల్త్ కార్డులు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీలతో కమిటీలతో కాలయాపన చేస్తున్నాయని నేషనల్ హెల్త్ మిషన్ లను గురించి వారికి న్యాయం చేయడంలో విఫలం అయ్యారని నేషనల్ హెల్త్ మిషన్ జెయింట్ యాక్షన్ కమిటీ రిలే నిరాహార దీక్షకు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మద్దతు తెలుపుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నేషనల్ హెల్త్ మిషన్ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారి సమస్యలను పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు

రాజన్న సిరిసిల్ల

విద్యుత్ కోతలకు నిరసనగా బిజెపి నాయకుల ధర్నా

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ చందుర్తి మండల కేంద్రంలో వ్యవసాయ విద్యుత్ కోతలను నిరసనగా బిజెపి నాయకులు ధర్నా నిర్వహించారు అనంతరం ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు విద్యుత్ కోతల కారణంగా పంటలకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు సాగు కోసం నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సిరికొండ శ్రీనివాస్ మీకినపల్లి విజేందర్ తిరుపతి కార్యకర్తలు నాయకులు విద్యుత్ కోతల సందర్భంగా రైతులు పూర్తిగా పంట నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని రైతులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు

రాజన్న సిరిసిల్ల

వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన నూతన కమిటీ

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడిపల్లి దేవానందం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నందికిషన్ డైరెక్టర్లు ఇమామ్ కంచర్ల రాజు చందు నాయక్ కలిసి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ అభివృద్ధి రైతులకు మెరుగైన సేవలు అందించే అంశాలపై చర్చించినట్లు తెలిపారు ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడిపల్లి దేవానందం వైస్ చైర్మన్ నందికిషన్ మరియు డైరెక్టర్లు రైతులకు మెరుగైన మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు

రాజన్న సిరిసిల్ల

భూ భారత్ కింద భూముల రీ సర్వే ప్రక్రియ

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా భూభారతి కింద భూముల రి సర్వే రైతుల సమక్షంలో చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ ఆదేశించారు బోయినపల్లి మండలం వరద వెళ్లి లో భూభారత్ కింద రోవర్ యంత్రంతో భూముల రీ సర్వే పనులు కొనసాగుతుండగా జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు సర్వే యంత్రంతో వివరాలు ఎలా తీసుకుంటారు పరిశీలించారు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా భూభారతి కింద భూముల రీ సర్వే పనులు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు గ్రామంలో సర్వేపై రైతులకు ముందుగా జిపిఓలు పంచాయతీ కార్యదర్శులు సమాచారం అందించాలని సూచించారు భూముల వివరాలను పూర్తి కచ్చితంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు