ఏటికొప్పాకలో వైఎస్సార్‌సీపీ గ్రామస్థాయి సమావేశం
ఏటికొప్పాక గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి సమావేశం నిర్వహించారు. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు చింతలపాటి రాజాబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి చేతుల మీదుగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు.అనంతరం జడ్పీటీసీ సంధ్య రామును నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని సమావేశంలో ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సంధ్య రాము, మైలారు శ్రీను, కరణం రవి, విసం వాసు, ఉద్దాండం త్రినాథరావు (యూటీఆర్), విసం బంగారుబాబు, విసం శ్రీనివాసు, సెన్నంశెట్టి రాము, దిమిలి రమణబాబు, దేవారపు రమణ, జామి రమణ, విసరపు శ్రీను, పెదపూడి యేసు, బోగుడు గోవింద్, పంచదార్ల బాబ్జి, విసం కాసుబాబు, గొంతుమూర్తి రమణ, కుప్పిన బాబ్జి, శ్రీహరి బాబు, యర్రంశెట్టి వెంకటరమణతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









