వార్త ముఖ్యాంశాలు
- దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటర్ల పేర్ల తొలగింపునకు వ్యతిరేకంగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తిమ్మరాజుపేటలో కాగడాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
- రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కర్రీ అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.
- శంకరరావు, కాంగ్రెస్ పార్టీ యలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జి తనకాల అనంతరావు పాల్గొని మాట్లాడారు.
దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటర్ల పేర్ల తొలగింపునకు వ్యతిరేకంగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తిమ్మరాజుపేటలో కాగడాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కర్రీ అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శంకరరావు, కాంగ్రెస్ పార్టీ యలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జి తనకాల అనంతరావు పాల్గొని మాట్లాడారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ, ప్రతిపక్షాలకు మద్దతుగా ఉన్న ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించారని వారు ఆరోపించారు. ఈ తొలగింపుల్లో పేదలు, కార్మికులు, మైనార్టీలు, వలస కార్మికులు, మహిళలు ప్రభావితమయ్యారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 45 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని ఆరోపిస్తూ, అర్హులందరి ఓటు హక్కును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని కోరారు. ఓటర్ల తొలగింపుపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ కూండ్రపు సోమునాయుడు, తిమ్మరాజుపేట సీపీఎం శాఖ కార్యదర్శి సరిగడం రామనాయుడు, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు బి. రామకుమార్, బి. రంగారావు, ఎస్. రామ్ సదాశివ, జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.